లాయర్ గారూ...." ముందుకెళ్ళబోయింది- అడ్డుకున్నాడు రవిచంద్ర.
"ముక్తా ఐసియూ గెటవుట్ ప్రమ్ మై హౌస్ ..." రెట్టించి అన్నాడు రవిచంద్ర.
"బాబూ....రవి...."మేనత్త వసుంధరాదేవి ముందుకు రాబోయింది.
"నకన్యాయం జరుగుతుంటే....నేనూరుకోను. నన్ను, నేను ఎలా రక్షించుకోవాలో నాకు తెల్సు ......ముక్త మర్యాద నువ్వు బయటికెళ్ళక పోతే నిన్నేల్లా పంపించాలో నాకు తెలుసు...."అంటూ ఆమె జుత్తు పట్టుకుని, మెట్లమించి లాక్కుంటూ బయటికి తీసికెళ్ళి , పోర్టికోలో వదిలేసాడు.
"నువ్వూ నీ లాయరూ....ఏం చేసుకుంటారో చేసుకోండి...." విసురుగా లోనికోచ్చి-
లాయర్ సూర్యసాగర్ మేడమీద చేయివేసి, బయటకు తోసేసాడు రవిచంద్ర.
అంతా నిశ్శబ్దం....స్మశాన నిశ్శబ్ధం.....గంభీరమ్తెన నిశ్శబ్దం అలుముకుందక్కడ.
ఆ గొడవలో తలదూర్చడం, ఇష్టంకాని వ్యక్తులు కొంతమంది అప్పటికే చల్లగా జారుకున్నారు.
వసుంధరాదేవి రవిచంద్రతో ఏదో చెప్పబోయింది. విన్పించుకోలేదు. గబగబా మేట్లేక్కేసాడు రవిచంద్ర.
అతని వెనకే నడిచారు రఘునాద్ -పుష్పక్ మరికొంతమంది మిత్రులు , మరో పది నిమిషాల తర్వాత , ఇళ్ళంతా ఖాళిగా అయిపోయింది.
పోర్టికోలో శిలా విగ్రహంలా నిలబడిపోయింది ముక్తానంద తన అన్న అంతకు తెగిస్తాడని ఊహించలేదు ముక్తానంద. వసుంధరా దేవికి ఏం చెయ్యాలో తోచక, ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది.
ఆ ఇంటిలోంచి బయటికొస్తూ, చివరి సారిగా ఆ ఇంటిని చూసింది ముక్తా మరెప్పుడూ జీవితంలో అ ఇంటిలో అడుగు పెట్టకూడదని నిర్ణయించుకొంది.
ముక్తని అనుసరించాడు లాయర్ సూర్యసాగర్ అవమానభారంతో!
* * *
ముక్తకు జరిగిన అవమానానికి ముక్తకంటే ఎక్కువ బాధపడుతున్నాడు సూర్యసాగర్.
తండ్రి మరణ దుఃఖం ఒకపక్క రెండోపక్క అన్న పరాభవం.
చిన్న అవమానాన్ని కూడా సహించలేని వ్యక్తిత్వం ముక్తది__ రెండు రోజులపాటు మనిషి కాలేకపోయింది ముక్త.
ఆమె మానసికంగా కోలుకునెంత వరకూ, ఆమెను డిస్టిబ్ చేయదలచుకోలేదు సూర్యసాగర్.
అంతవరకూ సూర్యసాగర్ గెస్ట్ హౌస్ లో ఉన్నన ముక్త మూడో రోజునాడు అహమ్మదాబాద్ వెళ్ళిపోవడానికి సిద్దమ్తెపోయింది.
ఎక్కడికమ్మా....ముక్తా ....ప్రయాణం...." అడిగాడు సూర్యసాగర్.
"అంతా అయిపోయింది అంకుల్. డాడి చనిపోయాక గాని, అన్నయ్య నిజస్వరూపం నాకర్ధం కాలేదు. నాకు బతకడనికి కోట్లు అక్కర్లేదు ఎవరి మీదా ఆధారపడకుండా, నేను బతగ్గలను....అంకుల్ ....ఆ దైర్యం నాకుంది..."ముక్తలో అంత నైరాశ్యం ఎప్పడూ చూడలేదు సూర్యసాగర్.
"నువ్వింత బెలవని నేనేనప్పడూ అనుకోలేదమ్మ..."
"మరి"
"నికన్యాయం చేస్తోంది నిజానికి నీ తోడబుట్టినవాడు కాదు. ఏయే శక్తులు అతన్నలా ఆడిస్తున్నాయో నాకు తెలుసు. తను చేస్తున్న తప్పు లకు, తను త్వరలోనే శిక్షననుభావిస్తాడు. ఆ విషయం నాకు తెలుసు .....నువ్వు గనక, ఇప్పుడు చేతులు కట్టుకుని , నీ దారిన నువ్వు పోతే....నీగ్గాని మీ అన్నకుగాని, ఒక్క ప్తెసా మిగలదు. బాగా ఆలోచించు....నేను వెంటనే వ్యాపారాల్ని సమర్ధవంతంగా కొనసాగించకపోతే వేలాది సిబ్బంది రోడ్డున పడతారు__లక్షలాది షర్ హొల్దర్స్ మట్టిగొట్టుకు పోతారని అన్న అన్నాడు గుర్తుందా...? అతనన్నది నిజమే- కానీ అతను ఆ మాటల్ని నిజాయితీతో అనలేదు- ఆస్తిని చేజిక్కించుకునెందుకు, నలుగుర్ని కన్ విన్స్ చేసేందుకన్నాడు.
కానీ నువ్వు నిజాయితిగా ఆ బాధ్యతల్ని తీసుకోవాలి.
మీకు మీనాన్నగారు యాభ్తే ఎకరాలపొలం మాత్రమే వదిలి వెళ్ళారానుకో , మీ వివాదంలోపడి ఆస పొలం బోడుపడితే మీ ఇద్దరికే నష్టం.
కనిక్కడ-అలాకాదు.
సమస్య ఇప్పుడు మీ ఇద్దరికీ సంబదించిదికాదు- సామాజికమ్తెనది.
మీ నాన్నగారు తన సిబ్బందినీ కన్నా బిడ్డల్లా చూసుకొనేవారు-షేర్ హొల్దర్స్ లో అపారమ్తెన నమ్మకాన్ని పొందగలిగారు.
మీ అన్న ఆ బాధ్యతల్ని తీసుకుంటే సిబ్బంది రోడ్డున- పడతారు- హొల్డర్స్ మీ నాన్నగార్ని దుమ్మె త్తిపోస్తారు. ఎందుకంటే మీ అన్నకు విలాసంగా బతకటం తప్పు బాధ్యత తెలిదు- అతని పక్కనున్న వారని చూసావా? ఎందుకు వాళ్ళు మీ అన్నపక్కకు చేరారంటావ్.....మీ నాన్న గారు డిస్ మిస్ చేసిన రఘునాద్ ఇప్పుడు మీ అన్న పక్కకు చేరాడు. ఏమిటి విటర్ధం.....?
మీ అన్నకు వాటా ఇవ్వొద్దని నేననటం లేదు- అతను సర్తేన మార్గంలో పడ్డాక- బాధ్యత తెలుసుకున్నాక ఇవ్వు.
లేదంటే మీ కుటుంబ పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోతాయి. ముఖ్యంగా మీనాన్నగారి పరువు ప్రతిష్టలు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రా...." సూర్యసాగర్ చేస్తాడు ఓపిగ్గా.
అయితే...నన్నేం...చెయ్యమంటారు....డబ్బుకోసం....అన్నయ్యలా.... నిస్సిగ్గుగా మంచి మర్యాదా మరిచిపోమంటారా....?
"లేదమ్మా....మంచి, మర్యాద మర్చిపోవద్దు. కానీ మాడాడి పేరు? నిలబెట్టాలి.... మీ డాడి ఏంపైర్ కి నువ్వు చ్తేర్మన్ వీ కావలి. నీ యుద్ధం....అన్నయ్యతో కాదు ఆదర్శంతో ఎ పరిస్ధితుల్లో మీ డాడి హత్య చేయబడ్డారో ఒక్కసారి గుర్తుంచుకో ఆ హంతకుల్ని అలా స్వేచ్చగా వదిలేస్తామా, చెప్పు...."