Previous Page Next Page 
అమ్మో! అమ్మాయిలు పేజి 24

    " ఏం లేదురా అబ్బాయిలూ? నేను ఎల్లుండి ఊరికెళుతున్నాను. అదే మా వాడి దగ్గరకు.

    మా చిత్రమ్మతల్లిని రావే అంటే పరీక్షలు దగ్గరపడుతున్నాయి రానంది.

    నేను నాలుగు రోజులుండి వస్తాను. మిరు ఓ కంట మా చిత్రను చూస్తూ వుండిండి.

    ' నాకేం భయం. ఇండియాలో జనాభాలా మనింటి నిండా జనం వున్నారు' అని అది నా మీద ఎగురుతుంది.

    కాలు నొచ్చేను, చెయ్యి నొచ్చేను . మనిషికి మనిషి సాయం కావాలి కదా? ఏమంటారు?"

    " మిరు చెప్పటం మేము కాదంటమూనా? మిరు ఊరెందుకెళుతున్నారు?" అని వ్యాకరణ అడగగా,

    బామ్మగారు ఏం చెబుతుందోనని అబ్బులు భూతద్దాలు సవరించుకుని చెవులు రిక్కించాడు.

    " నే యిప్పుడు వూరెళ్ళటమూ ఎందుకూ అంటే..." అని అంతటిలో ఆపి_

    ఓసారి ముళ్ళకిరీటం సరిచేసుకుని, " మా చిత్రమ్మ తల్లి..." అంటూ ప్రారంభించి మాట పూర్తిచేయక ముందే ఆపేసింది.

    కారణం జయచిత్ర ఎప్పుడొచ్చిందోగాని గుమ్మంలో నుంచిని " నానమ్మా!" అంటూ పెద్దగా గావుకేక వేసింది.

    " నువ్వుటే చిత్రా! భడవకానా ఏమిటా గావుకేక! హడిలిపోయాను. చిన్నగా పిలవలేవూ?" అంటూ బామ్మగారు  ముద్దుగా కోప్పడింది.

    " ఎక్కడ కూర్చుంటే అక్కడే. అవతల నా ఫ్రెండ్స్ వచ్చారు. మి నాన్నమ్మేది అని అడుగుతున్నారు పద పద" అంది జయచిత్ర.

    " మిరు వుదయమే చెప్పాల్సింది మి బర్త్డేడే అని. ప్రజంటేషన్ ఏమయినా తెచ్చి ముందుగా అందించేవాళ్ళం" అన్న డు వ్యాకర్ణ.

    " ఏం తెచ్చేవారు? పాలపీకా? గిలక్కాయా?"

    అబ్బులు, వ్యాకర్ణ ఉలిక్కపడి ముఖముఖాలు చూసుకున్నారు.

    " ఈ పిల్ల మనం మాట్లాడుకున్నది విన్న దేమోరోయ్ మన అద్దెకొంప మునిగింది" అనుకున్నారు.

    " మళ్ళీ వస్తాం నాయనా?" అని బామ్మగారు లేచింది.

    గబుక్కున గుర్తొచ్చింది వ్యాకర్ణకి. " మిరిందాకా ఊరెందుకెళ్ళుతున్నారో చెప్పబోతూ ఆగిపొయ్యారు బామ్మగారూ " అన్నాడు.

    " మా చిత్రమ్మతల్లి..." బామ్మగారు మళ్ళీ మొదలు పెట్టింది.

    " నాన్నమ్మా!" అంటూ జయచిత్ర అడ్డు తగిలింది కంగారుపడుతూ.

    " తర్వాత మాట్లాడుకోవచ్చు తొందరగా పద" అని వ్యాకర్ణ నమిలి మింగేసేటట్లు చూసింది.

    వ్యాకర్ణ అబ్బులి భూతద్దాల్లో తన చూపులు దాచుకున్నాడు.

    " అదేమిటే చిత్రా?" అంటున్న బామ్మగారిని వారించి__

    " మికూ పనిలేదు నన్నమ్మకీ పనిలేదు. నానమ్మ ఎందుకూరికెళుతుందో మి కెందుకండీ?" అని గుర్రుమని చూసింది జయచిత్ర.

    " ఊరికె" అన్నాడు అబ్భులు.

    " సంతోషం" అని వ్యంగంగా అని బామ్మగారి చెయ్యిపుచ్చుకు లాక్కెళ్ళింది జయచిత్ర.

    " అబ్బులు. ఈ పిల్ల పెల్ల కాదురా తుఫాను" అన్నాడు అబ్బులు.

    " అయితేనేం బాగుంటుంది" అన్నాడు వ్యాకర్ణ.

    " ఉత్తపిల్ల కాదు. పులిపిల్ల."

    " అయితేనేం బాగుంటుంది."

    " బాగుంటే సరా? వినయం, విధేయతా అక్కర్లా? మన మాటలు వినే వుంటుంది. ఎప్పుడో మన భరతం పడుతుంది.

    వల్ల బామ్మని చూడు ఎలా తరుముకెళ్ళిందో? ఊరి కెళుతున్నానని బామ్మగారు చెప్పబట్టేకదా?


 

 Previous Page Next Page