Previous Page Next Page 
అశ్వభారతం పేజి 24


    పది నిమిషాల తరువాత వచ్చాడు జాకీ.

    ఆ వెనుకే ట్రైనర్ కూడా వచ్చాడు.

    ప్రపంచంలోని అవమానం, జెలసీ, కోపం అంతా యజ్ఞభూపతి ముఖంలో కనిపించాయి ఆ ట్రైనర్ కి, జాకీకి.

    అందుకే భయంగా బిక్కుబిక్కుమంటూ నిల్చుండిపోయారే తప్ప మాట్లాడలేకపోయారు.

    "ఎలా జరిగింది?" గర్జించినట్లున్నాయి యజ్ఞభూపతి మాటలు. స్కాండ్రర్ చాల సెన్సిటివ్. దాని జాతిలక్షణం ప్రకారం గెలప్పింగ్ లోనే దాని స్పీడ్ ని పికప్ చేసుకోవాలి. కాని దాన్ని జాకీ అకారణంగా కావాలనే రాంగ్ పార్టులో హిప్ చేసుంటాడు. దాంతో స్కాండ్రర్ ఇరిటేట్ అయిపోయి 150 గజాల దగ్గర మొరాయించింది. అప్పుడు గమనించాను నేను-దాన్ని జాకీ కావాలనే బాగా పరిగెత్తుతున్న స్కాండ్రర్ కి కోపం తెప్పించాడు అవి, ఆ తరువాత దాని గేలప్పింగ్ లో మార్పు వచ్చింది. అది నేను గమనిస్తున్నంతలో శశాంక గుర్రం హఠాత్తుగా పుల్ గేలప్ అందుకుంది" భయం భయంగానే చెప్పాడు ఆ జాకీ.

    భూపతి సీరియస్ గా చూసాడు జాకీవేపు.

    "అందుకే నా గుర్రాన్ని భరత్ గుర్రం మీదకు దూకించాను.

    "ప్రయోజనం...." వశిష్ట అడిగాడు.

    "అప్పటికి పరిస్థితి దాదాపు చేయిదాటిపోయినట్లుగా అనిపించింది.

    భరత్ గుర్రం పిప్ పోస్టుకి దాదాపుగా దగ్గరయింది. పై పెచ్చు భరత్ చాలా తెలివిగలవాడు. అతని రైడింగ్ విధానాన్ని బట్టిచూస్తే చాలా గొప్ప టెక్నికల్ ట్రైనర్ దగ్గర శిక్షణ పొందినట్లుగా అనిపించింది. స్కాండ్రర్ ఎప్పుడైతే మొరాయించిందో దాన్ని క్షణంలో వెయ్యోవంతులో గమనించ గలిగాడు. ఆ వెంటనే తన గుర్రాన్ని హిప్ చేసాడు. అది మెరుపు వేగాన్ని అందుకుంది. అప్పుడిక నేను చేయగలిగింది ఒక్కటే_భరత్ ను గుర్రంమీంచి పడగొట్టడం. ఏధిక్స్ కి విరుద్ధమైనా మీ సొమ్ము తిన్నవాడ్ని కనుక ఆ పనికి సిద్ధపడ్డాను."

    "గుర్రాన్నే అడ్డుకొనవచ్చుగా" వశిష్ట ప్రశ్నించాడు. ఆ వేగంలో వెళ్తున్న భరత్ గుర్రాన్ని థర్డు ప్లేస్ లో ఉన్న నేను ఢీ కొట్టడం సాధ్యం కాదు. అది గెలవటం ఖాయం. అందుకే భరత్ ని దానిమీంచి పడగొడితే గుర్రం విన్ పోస్టు దాటినా ప్రయోజనం ఉండదు. అది నేను చేయగలిగితే భరత్ క్రిందపడటం, భరత్ గుర్రం విన్ పోస్టు దాటడం జరుగుతుంది. జాకీ లేకుండా గుర్రం ఫస్టులో విన్ పోస్టు దాటినా రూల్ ప్రకారం గెలిచినట్లు కాదు. అప్పుడిక కాదనుకున్నా సెకండ్ లో ఉన్న స్కాండ్రర్ గెలిచి తీరుతుంది__"

    "మరెందుకు ఆ పని చేయలేక పోయావు?"

    యజ్ఞభూపతికి ఇంకా కోపం తగ్గలేదు.

    "చేసాను కాని....చెప్పానుగా భరత్ చాలా తెలివిగలవాడు. ఇలాంటిదేదో జరగవచ్చని ఊహించి ఉంటాడు. నేను కొట్టిన దెబ్బకి అతను జారిపడాలి. కాని బలవంతాన బిగబట్టి మరీ కూర్చున్నాడు. విన్ పోస్టు దాటాక ఆ విసురికి జారిపడ్డాడు.

    "నీవింకా గట్టిగా ఢీ కొట్టవలసింది."

    "కొట్టవచ్చు కాని నలుగురు దృష్టిలో పడితే ఆ రేస్ ని క్లబ్ ఎత్తి వేయవచ్చు లేదా రూల్స్ ని అతిక్రమించినందుకుగాను నన్ను సస్పెండ్ చేసి ఉండేవారు.

    "జాకీ చెప్పే ప్రతిమాట శ్రద్ధగా వింటున్న భూపతికి జాకీ తీసుకున్న రిస్కు అర్ధమయిపోయింది.

    "వెరీగుడ్" అంటూ వశిష్ట వేపు చూసాడు భూపతి.

    "వశిష్ట ఓ పాతికవేలు తీసి సగం సగం ఆ జాకీకి, ట్రైనర్ కి ఇచ్చాడు.

    "జాగ్రత్తగా ఉండండి. ఈ విషయాలేవీ బయటకు పొక్కకూడదు" అన్నాడు. భూపతికి నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు.

    ఇంకా ఆలోచనల్లోంచి, అవమానం నుంచీ తేరుకొని భూపతి వేపు చూస్తూ ఆజ్యంపోసాడు వశిష్ట__

    "దీనివెనుక శశాంక బుర్రకంటే, అతని దగ్గర ఈ మధ్యనే చేరిన యజ్ఞభూపతికి ఇంకా కోపం తగ్గలేదు. శుక్రాచార్య అనే కురువృద్ధుడు బుర్రే ఉపయోగపడినట్లు అనిపిస్తోంది. ఈ శుక్రాచార్య అనే అతను అమోఘమైన తెలివితేటలున్నవాడని. అపర చాణక్యుడని తెలిసింది. అలాంటి వాడికి చంద్రగుప్తుడు లాంటి మరో కుర్రాడు దొరికాడు. అతనే భరత్....అశ్వభరత్....శశాంక కొత్త జాకీ.

    పచార్లు చేస్తూన్న భూపతి వశిష్ట చివరి మాటలు విని ఠక్కున ఆగిపోయాడు.

    భరత్....అశ్వభరత్ పేరుండటం ఆశ్చర్యంకాదు. అని అశ్వభరత్ అని ఉండటం ఆశ్చర్యమనిపించింది. అప్పట్లో నాకు...." గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు తెచ్చుకొనే ప్రయత్నంలో ఉన్నాడు.

    "అప్పట్లో....అంటే....ఎప్పట్లో....? ఎక్కడా? ఎలా?" వశిష్ట అడిగాడు ఆతృతగా.

    భూపతి మరలా పచార్లు మొదలెట్టాడు. ఆలోచిస్తున్నాడు. పది నిముషాలు మౌనంగా గడిచాయి. ఠక్కున ఆగిపోయాడు భూపతి.

    "అనంత్ దగ్గర....మన రాయల్ కింగ్ ని అనంత్ ట్రైనింగ్ సెంటర్ ని పంపించిన సందర్భంలో ఓసారి పూనా వెళ్ళాను. అప్పుడు అక్కడ ఈ పేరే....అశ్వభరత్ అన్నది వినిపించింది. వీటన్నిటికన్నా అనంత్ గతంలో ఎవ్వరికీ ఇవ్వనంత మంచి ట్రైనింగ్ ఆ కుర్రాడికి ఇవ్వటం కూడా ఆశ్చర్యం కలిగించింది. అతనే ఇతను అయి ఉండాలి. ఏది ఏమైనా అతని గురించి వెంటనే ఎంక్వైరీ చేయ్...." భూపతి చెప్పటం ఆపి సోఫాలో కూర్చుని షాంపైనో బాటిల్ ఓపెన్ చేసాడు.

    "మీ వూహ కరక్టు కావచ్చు. ఎందుకంటే అతని స్కిల్ చూసిన మనకే ఆశ్చర్యమేసింది. అంటే ఆటను తప్పక అనంత్ దగ్గర ట్రైనింగ్ పొంది ఉండాలి.

    "అదే అదే కనుక్కో."

    "కాని లాభం....శుక్రాచార్య అంటే ఇతనికి ఎనలేని గౌరవాభిమానాలు. శుక్రాచార్యకు శశాంకతో ఏవో పనులున్నాయి. అవేమిటో మనకింకా తెలియలేదు. అతను అనంత్ శిష్యుడే అయినా శుక్రాచార్యను వదలకపోవచ్చు. కనుక మీరు ఆలోచిస్తున్నట్లుగా అనంత్ ద్వారా భరత్ ని మన జాకీని చేసుకోవాలన్నా సాధ్యంకాకపోవచ్చు.

    ఓ గదిలో కూర్చుని కొన్నివేల మైళ్ళు ముందుకువెళ్ళి ఆలోచించగల వశిష్ట అంటే భూపతికి గొప్ప గురి.

    తనకు మాత్రమే తెల్సిన ఓ క్లూ వశిష్టకు అందిస్తే దానిమీద ఆధారపడి ఏదైనా ప్లాన్ వేయవచ్చనిపించింది భూపతికి.

    "మన రాయల కింగ్ ని చంపించే ప్రయత్నంలో సుదర్శన్ ని రంగంలోకి దింపారు శశాంక. ఆ సందర్భంలోనే ఇటీవల అనంత్ మీద ఎటాక్ కూడా జరిగింది...."

    భూపతి అన్న పైమాటల మిగతా అర్ధం గ్రహించగలిగాడు వశిష్ట.

    ముందు ఆశ్చర్యపోయాడు.

    "అనంతమీద శశాంక మనుష్యుల ఎటాక్ అది. అతని ప్రియశిష్యుడైన భరత్ కి తెలియకపోదు. తెలిసీ భరత్ శశాంకకే జాకీ అయ్యాడంటే....?!"

    "గురువు ద్వారా సెంట్ మెంటల్ గా భరత్ ని దెబ్బతీస్తే....

    "లాభంలేదు సార్....ఈమాత్రం మనం ఊహించగలమని వారూ ఊహించగలరు. ఏదో మాస్టర్ ప్లాన్ వేస్తే తప్ప ఇది బయటపడదు. ఎక్కడో ఏదో పెద్ద మెలిక వుందనిపిస్తోంది.

    అది పెద్ద మెలిక అయితే మాత్రం మనం ఓ పని చేయాలి. అసలు శశాంక తేజదత్త ఎక్కడివాడు? తల్లిదండ్రులు ఎవరు? మార్వాడి వంశంలో పుట్టినా తెలుగువాడిలా ఎలా కనిపిస్తున్నాడు. తెలుగు అంత సాఫీగా ఎలా మాట్లాడుతున్నాడు....? తెలుగుతనం అతనిలో ఎందుకు కనిపిస్తోంది....? ఇవి కూడా ఎంక్వయిరీ చేయించు" అన్నాడు భూపతి దీర్ఘంగా ఆలోచిస్తూ.

    వశిష్ట ఉలిక్కిపడ్డాడు ఓ క్షణం. అంతలోనే తేరుకున్నాడు. "అవన్ని మనకనవసరమేమో...."

    "ఏవీ....?"

    "శశాంక తేజదత్త వంశ పూర్వపరాలు....మనకు కావలసింది ఈ శుక్రాచార్య ఎవరు....? అశ్వభరత్ ఎవరు....? వీరిద్దరి మధ్య వున్న సంబంధం....? వీరికి శశాంకకి వున్న సంబంధం....? అన్నిటికీమించి శశాంక కొడుకు ఎవర్నో మర్డర్ చేశాడు, ఎందుకు? అతను ఆ మర్డర్ చేసేందుకు అతన్ని ఎవరో ప్రవోక్ చేసినట్లుగా శశాంక అనుమానించాడు. మొదట ఆ అనుమానం ఎవరిమీదా రాలేదు కాని ఆ తరువాత అది మీమీదకు వచ్చింది. దానిక్కారణం__మీ గుర్రపుపిల్లల్ని తన మనిషి సుదర్శన్ కాజేసాడని, దివ్యతేజ ద్వారా రాయల్ కింగ్ ఫోటోని ఆ సుదర్శన్ కాజేసాడని, అప్పటినుండి దాన్ని షూట్ చేసేందుకు తన మనిషి ప్రయత్నిస్తున్నాడని__ఇవన్ని దృష్టిలో పెట్టుకొనే పగతో మీరే విశ్వదత్తను ప్రవోక్ చేసారని ఆలోచిస్తున్నాడు. అతని ఆలోచనలకి ఈ లాజిక్ చాలు...."

    విసురుగా తలెత్తాడు భూపతి.

    కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా వున్నాయి.

    ఆ పరిస్థితిలో భూపతిని చూసిన వశిష్ట ఒకింత కంగారుపడ్డాడు.

    "అసలు రాయల కింగ్ ని ఫోటో తీసిందెవరు...., ఆ ఫోటో మోతీ దగ్గరకు ఎలా వచ్చింది...."

    ఈ వివరాలు కనుక్కునే సందర్భంలోనే మీరు మోతీని చంపించారు. అప్పుడు అక్కడ అనంత్ కూడా వున్నాడని చెప్పారు. అనంత్ ని కనుక్కుంటే ఆ ఫోటోగ్రాఫర్ ఎవరన్నది తెలియవచ్చు."

    "నాకంతా అయోమయంగా వుంది."

    "ప్రస్తుతానికి నాకు అంతే__ఎక్కడో ఏదో మెలిక__ఆ మెలిక అడుగున చిన్న కదలిక. ఆ కదలిక పెద్దదయ్యే సూచన కానస్తోంది. తొందరలోనే ఈ మిస్టరీని బయటకు లాగుతాను...."

    "అవి తరువాత, మోసాన్ని మోసంతోనే ఢీకొందాం, ఈ సీజన్ లో హెచ్ ఆర్.పి.కి వచ్చే__గుర్రాలు వాటి వివరాలు- విన్నింగ్ ఛాన్సెస్_వాటి ఓనర్స్_ ట్రైనర్స్_ జాకీలు_ ఈ లిస్టు వెంటనే నాకందించు. అప్పుడిక నేను మొదలెడతాను డ్రామా. అర్ధమైందా....?

    అర్ధమైందన్నట్లుగా తలూపాడు వశిష్ట. వశిష్టకు చాలా ఆనందంగా వుంది_ ఈ చిన్న చిన్న డ్రామాల్ని మ్రింగేసే పెద్ద మాస్టర్ డ్రామా బాగా నడుస్తున్నందుకు, త్వరలోనే ఇది పాకాన పడేలా చేయగలిగితే చాలనుకున్నాడు మనసులో నీరసంగా. పడుకొని వున్న భరత్ దగ్గరకు వచ్చింది వచ్చింది త్రివేణి. డాక్టర్ ఎప్పుడు డిస్సార్జి చేస్తున్నారు_? అడిగాడు భుజాలు ఎగరేస్తూ భరత్. 

 Previous Page Next Page