అప్పుడు ఆడపిల్లలు కోర్ట్ ని అర్ధిస్తే కోర్ట్ రిజిస్టార్ ని పంపిస్తుంది వ్యవహారాల్ని చూడమని.
అన్నదమ్ములు మూర్ఖత్వానికి, అహానికి అసమర్ధతకు ఆడపిల్ల లెందుకు బలికావాలి? నాలుగు లక్షల అప్పచూపించి అన్నదమ్ములు భయపడితే- నలబైలక్షల ఆస్తుల్ని ఆడపిల్లలు తెలివితక్కువగా పదులుకోకూడదు.
ఆస్తులమ్మి అప్పలు తీర్చిపెట్టమని కోర్ట్ ని ఆర్దిస్తే సరి-
అసలు ఆడపిల్లలే పిరికిగా, తామేదో అన్నదమ్ముల దయ దాక్షిన్యాల మీద బతుకుతున్నట్లు ఫిలవ్వబట్టే ఇవన్ని- ఒక్క నోటిసిస్తె ఆస్తి బద్దలయిపోతుంది. వ్యక్తులకన్నా న్యాయస్ధానం, చట్టం గొప్పవి అర్ధమయిందా మిస్టర్ రవిచంద్ర.....
అయితే ఆ ఆస్తి అంతా మీ నాన్నగారు సంపాదించుకున్నది. ఫిలునామా ద్వారా మొత్తం ఎ ఒకరికో చెందేలా రాసేహక్కు మీ నాన్న కుంటుంది.
అలా రాయనప్పడే ఆస్తులు చేసిసగం- వీలునామా రాసారో-లేదో ముందు తెలుసుకోవాలి. అదన్నమాట విషయం...." నింపాదిగా అన్నాడు సూర్యసాగర్.
"ఫామిలి లాయర్ గా వీలునామా విషయం మీకే తెలియాలి. ఆ వీలునామా విషయం మీకు తెలియకపోతే.....హరికృష్ణమనాయుడి కొడుకుగా , ముక్తాకు అన్నగా , పెద్దవాడిగా .....వ్యాపారాల్ని నిర్వహించే బాధ్యతల్ని నేను తీసుకోవటంలో తప్పులేదనుకుంటాను....."
"అందుకు మీ చెల్లెలు ఒప్పుకోవాలి. ఇంత చెప్పినా- చట్టం గురించి చదివి వినిపించినా అర్ధంకాలేదా? మగపిల్లలు, ఆడపిల్లల మీద జాలిపడే రోజులుపోయాయి ఆడపిల్లలు మగపిల్లలు, మీద జాలిపడి వదిలేస్తే నే మగపిల్లలు బతికిపోతారు. అందుకే ఇకనుంచి ఎవర్తెనా సరే__ మగపిల్లలు-తమ అక్కల దగర, చెల్లెల దగ్గర పొగరుగా వ్యవహరించకుండా,అహం భావం ప్రదర్శించకుండా ఉంటే మంచిది లేదంటే చచ్చి ఊరుకుంటారు...." తనకు రవిచంద్ర చేసిన అవమానాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ అన్నాడు సూర్యసాగర్.
"వీలునామా విషయం ఎలా తేలాలి? ఎప్పుడు తేలాలి? రవిచంద్ర పొగరుగానే అడిగాడు.
"వీలునామా విషయం ఎలా తేలాలి? ఎప్పుడు తేలాలి? రవిచంద్ర పోగారుగానే అడిగాడు.
"వీలునామా విషయం తెల్సుకోవడం కోసం, కొంత సమయం కావాలి. అంతవరకూ ఆగండి...." అన్నాడు సూర్యసాగర్.
"మాడాడి....వీలునామా రాయలేదు నాకా విషయం తెలుసు.... మీరు కొంత టైమ్ ఎందుకడుగుతున్నారో నాకు తెలుసు. దొంగ వీలునామలు ఇక్కడ చెల్లవు. ముక్తకు ఆస్తి కట్టబెట్టడానికి మీరు చేస్తున్న కుట్ర కూడా నాకర్ధమ్తెంది. ఎవ్వరేమానుకున్నా, ఏం జరిగినా....అందరి ఎదుటా చెప్తున్నాను.
ఇవ్వాల్టి నుంచి ఈ ఆస్తికి వారసుడ్ని నేను...."
ప్రకటించేసాడు రవిచంద్ర.
"ఫామిలి లాయర్ గానేనొప్పకొను...." పెద్ద స్వరంతో అన్నాడు సూర్యసాగర్.
"మీరోప్పకోకపోతే....ప్రపంచంలో ప్రళయంమేం రాదు...." వ్యంగ్యంగా అన్నాడు రవిచంద్ర.
"ముక్త కూడా ఒప్పుకోదు...." గంభీరంగా ప్రకటించారు లాయర్ సూర్యసాగర్.
"చెప్పు....నువ్వు ఒప్పకోవా ....నేను నీ అన్నని...."
రవిచంద్ర గురించి అక్కడున్న చాలామంది కుటుంబ సభ్యులకు తెలుసు. అందుకే కుటుంబం వ్యవహారంలో తల దూర్చడం ఇష్టం లేక, నెమ్మదిగా పక్కకు తప్పకుంటున్నారు.
"నువ్వు నా అన్నవనే విషయం....నికిప్పడు గుర్తుకొచ్చినట్టుంది.
ఇడోంట్ ఎక్సప్ట్ యువర్ ప్రపోజల్ ....దట్సాల్ ...." గబగబా అనేసి, మేడమెట్లు ఎక్కుతోంది ముక్తానంద.
ముక్త అంత ద్తేర్యంగా , తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని అనుకోలేదు సూర్యసాగర్ అందుకే ఆయన మనసు ఆనందంతో నిండిపోయింది. ముక్త మాటకు, తల తీసేసినట్టయింది రవిచంద్రకు.
ఈ క్షణంలో, ఇంతమంది ముందు, తనని తాను రుజువు చేసుకోక పోతే, తన ప్రెస్టేజ్ పోయినట్టే లెక్క!
ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు రవిచంద్ర-ముఖంలో రంగులు మారిపోయాయి.
"ముక్తా...." పెద్దపులిలా గర్జించాడు రవిచంద్ర.
మెట్లెక్కుతున్న ముక్త, ఆ అరుపుకి ఆగి, తలతిప్పి చూసింది. రవిచంద్ర పరుగు, పరుగున మేట్లేక్కి ముక్త చెయ్యి పట్టుకున్నాడు.
"రెస్పెక్టడ్ ప్రెండ్స్ ....ఇది మా ఆస్తి వ్యవహారం ....కుటుంబ వ్యవహారం.....ఇందులో ఎ ఒక్కరూ....జోక్యం చేసుకోడానికి వీల్లేదు.... మిస్టర్ లాయర్ .....మొదట్నించి మీరు.....మా కుటుంబంలో కలతలు సృష్టిస్తూనే వచ్చారు. ఇప్పుడు ....ఇంత కష్ట సమయంలో కూడా, ముక్తాకు నాకూ మధ్య అంతులేని అగాధాన్ని సృష్టించారు.
నాకు డబ్బు ముఖ్యం....ప్రాపర్టీ ముఖ్యం.....నా ఆస్తిని నేనెలా రక్షించుకోవాలో నాకు తెలుసు.
ముక్తా! ఈ ఇంటికి, ఈ ఆస్తికి నీకూ సంబంధంలేదు. ఈ క్షణం నుంచి నాయుడూ గ్రూపాఫ్ కంపెనీకి చైర్మాన్ని నేను మర్యాదగా నా ఇంటినీ వదిలిపెట్టి వెళ్ళిపో....." ఉరుముతూ అన్నాడు రవిచంద్ర రవిచంద్ర, అంతకు తెగిస్తాడని ఊహించలేదు లాయర్ సూర్యసాగర్ .లేక పోతే ముక్తాకు పోలిస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసేవాడు.
ముందుకొచ్చి సూర్యసాగర్ ఏదో చెప్పబోయాడు.
"యూ షటఫ్...మిస్టర్ సూర్యసాగర్ ...." బలంగా చేత్తో ముందుకి తోసేసాడు రవిచంద్ర ఊహించని పరిణామానికి బిత్తర పోయాడు సూర్యసాగర్ రవిచంద్ర విసురుగా తోసేయడంతో, నిలదొక్కు కోడానికి ప్రయత్నించాడు కానీ కుదరలేదు- మెట్లమీద పడిపోయాడు. మెట్లమీద మ్రాన్పడి నిలబడిపోయింది. ముక్తనంద.