ఈ విధంగా హిందూ సక్సెషన్ ఆకట్ హిందూ వారసత్వపు చట్టంలో విప్లవాత్మకమైన మార్పులను- అందునా మహిళలకు అనుకూలమ్తెన మార్పు లను తీసుకొచ్చిందని చెప్పవచ్చు.
"హిందూ సక్సేషన్ ఆక్ట్-1956" ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంవారు 1988వ సంవత్సరం ఆక్ట్ 13 ప్రకారం కొన్ని సవరణలను జోడించి కుమార్తెలకు మరింత ప్రయిజనకంరంగా వుండేటట్లు చేశారు. ఈ సవరణం వాళ్ళ ఆడపిల్లలకు కూడా ప్రయోజనకంరంగా వుండేటట్లు చేశారు. ఈ సవరణల వల్ల ఆడపిల్లలకు కూడా మగపిల్లలతో సమానంగా ఆస్తి హక్కులు లభించాయి.
ఈ సవరణలవల్ల ఆస్తిపై ఆడపిల్లలకు మల్లేనే పుట్టుక తోనే ఆస్తి హక్కు లభించినట్లయింది. అంతేగాక సదరు ఆస్తిపై మగపిల్లలకు వుండేటటువంటి హక్కులన్నీ ఆడపిల్లలకు కూడా సంక్రమించాయి.
ఇపుడు అవిభక్త హిందూ కుటుంబంలో ఆస్తి పంపకాలు జరుగుతున్నప్పుడు కూతుళ్ళకు కూడా కొడుకులతో సమానంగా వాటా ఇవ్వాల్సిందే. ఒకవేళ ఆ సమయానికి కూతురు చనిపోయివున్నట్లయితే -ఆమె సంతానానికి ఆ ఆస్తి సంక్రమిస్తుంది. ఒక వేళ ఆమె సంతానం కూడా చనిపోతే వారి సంతానానికి ఆ ఆస్తిప్తె హక్కు లభిస్తుంది. ఈ విధంగా అసలు వారితో కలిపి మూడు తరాల మహిళలకు అవిభక్త కుటుంబంలోని ఆస్తిపై హక్కు లభించినట్లయింది. ఒకవేళ ఆస్తి సంపకంయింకా జరగకుండానే కుమార్తె మరణించినప్పటికి కూడా ఆస్తిపై ఆమెకు గల హక్కు చెక్కు చెదరదు. ఆమె వాటా తాలూకు ఆస్తి ఆమె సంతానానికి వస్తుంది. ఇదే ఈ ఏమేండు మెంటులోని విశిష్టత.
అయితే ఈ సవరణవల్ల లభించిన హక్కులు 5-9-85 నాటికి పెళ్ళికాని కుమార్తెలకు రైలకు మాత్రమే లభిస్తాయి.
మొత్తంమీద "హిందూ సక్సేషన్ ఆకట్ 1956" దానకి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంవారు జోడించారు ఈ సవరణలవల్ల స్త్రీలకు పురుషులతో సమానమైన హక్కులు లభించాయి.
హిందూ చట్ట ప్రకారం ఆస్తి రెండు రకాలు. ఒకటి సమిష్టి కుటుంబ ఆస్తి అంటే:
తండ్రి, తాత ముత్తాత-ఇలా పూర్వికుల నుంచి ఒక హిందుపుకు సంక్రమించిన ఆస్తిపాస్తులు.
కుటుంబంలోని ఇతర సభ్యులతో కలిసి, అంటే తండ్రి కొడుకులు లేదా అన్నదమ్ములు కలిసి ఉమ్మడిగా చేసిన వ్యాపారం, ఇతర కార్యకలా పాలవల్ల వచ్చ్సిన ఆదాయంతో సమకూర్చుకున్న ఆస్తులు.
సొంతంగా సంపాదించినదే అయినప్పటికీ స్వచ్చందంగా తన ప్రత్యేక హక్కును వదులుకుని కుటుంబమంతటి కోసం సమర్పించిన ఆస్తులు ఇటువంటి ఆస్తులను ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఆధారంగా ఉమ్మడి ప్రయోజనం కోసం దాఖలు చేసినట్లు గుర్తించాలి.
పైన చెప్పకున్నవన్ని సమిష్టి కుటుంబ ఆస్తులుగా సరిగానిస్తారు. ఈ ఆస్తులప్తె తండ్రి జీవించి ఉండగా కూడా కొడుకు, కూతుళ్ళకు సమాన హక్కు ఉంటుంది. 1986 ఎ.పి ఏమేండ్ టు సక్సేషన్ యాక్ట్ 13 ప్రకారం కూతురికి కూడా కొడుకులతోపాటు ఆస్తిలో సమాన భాగం అభిస్తుంది. అయితే 1985 సెప్టెంబర్ 5 నాటికి ఆమె అవివాహిత కావాలి.
తండ్రి స్వార్జిత ఆస్తిలో మాత్రం ఆయన జీవించి ఉండగా కొడుకులకి గాని, కూతుళ్ళకు గాని ఎటువంటి హక్కు ఉండదు. తండ్రి తన ఇష్టం ప్రకారం ఆ ఆస్తిని అమ్ముకోవచ్చు కానుకగా ఇవ్వవచ్చు లేదా ద్వారా తన అభిష్ట ప్రకారం వినియోగించవచ్చు.
ఎ విధమ్తెన విల్లూ రాయకుండా మరణించినట్లయితే చట్టప్రకారం అతని స్వార్జితం, పిత్రార్జితం రెంటిలోనూ హక్కు ఉంటుంది. ఇద్దరికీ చేరి సగం ఆస్తి లభిస్తుంది.
చదవటం ఆపాడు ఒక్క క్షణం సూర్యసాగర్.
అంత పండ్బందిగా తయారయి వస్తాడని ఊహించని రవిచంద్ర వర్గం డిఫ్ షాక్ కి లోనయింది.
"1985 ముందు పెళ్ళికాని ఆడపిల్లలు-తమ పుట్టింట్లో హీనంగా- స్యూనతభావంతో బత్కనక్కర్లేదు. అన్నలకో తమ్ముళ్ళకో లొంగి ఉండనఖ్కర్లేదు.
అన్నలు తమ్ముళ్ళు వ్యాపారంచేసి సంపాదిస్తూ అక్కలముందు, చెల్లెల్లముందు ఫోజు కొట్టటం ఆహం ప్రదర్శించటం చేస్తుంటారు- వాళ్ళ బతుకు, వీళ్ళు కోర్టుకు వెళ్ళినంతవరకే అని వాళ్ళకు తెలిదు పాపం.
అన్నదమ్ములు వ్యాపారం చేసేది ఎవరు సంపాదించిన ఆస్తి మీద...? తాత, తండ్రి సంపాదించిన ఆస్తి మీదే అయితే ఆడపిల్లలకు సమాన హక్కు ఖచ్చితంగా ఉంది.
అన్నదమ్ములు తమక్తే తాము సంపాదించుకున్న దానిమీద, వాళ్ళ భార్యలు తెచ్చిన దానిమీద ఆడపిల్లలకు హక్కుండదు.
అయితే ఈ మధ్య కొందరు అతి తెలివి తేటలు ప్రదర్శిస్తున్నారు- తండ్రి చేసిన అప్పాలున్నాయి గదా అని, అప్పుడు ఆస్తి- అప్ప సమానంగా పంచుకోవాలి. ఆ అప్పాలు న్యాయంగా చేసిన నిజమ్తెన అప్పలాయి ఉండాలి. ఆడపిల్లలకు ఆస్తి హక్కుని హరించాటానికి చూపించే దొంగ అప్పలాయి ఉండకూడదు.
అన్నదమ్ముల ఆధ్వర్యంలో కుటుంబ వ్యాపారం నడిచేప్పడు- అన్నదమ్ముల అసమర్ధతవల్ల వ్యాపారంలో నష్టం వస్తున్నా ఆడపిల్లలు అడ్డంతిరిగి- వాళ్ళని తప్పించవచ్చు. మా అన్నదమ్ముల అసమర్ధతకు ఆడపిల్లలమైన మేమందుకు బలికావాలని కోర్ట్ ద్వారా నే నిలదీసి అడగవచ్చు.
అప్పలు తీర్చగలిగే అవకాశం ఉందికూడా తీర్చకుండా వాటి నాలాగే ఉంచేస్తే, ఆడపిల్లలు ఆస్తి హక్కుమీదకు రారని కొందరు ఈ మధ్య అతి తెలివి తేటలు ప్రదర్శిస్తున్నారు.