Previous Page Next Page 
అమ్మో! అమ్మాయిలు పేజి 22

    అబ్బులు, వ్యాకర్ణ నీరు కారిపోతూ నంచున్నారు. " ఈ పిల్ల మరీ ముఖం మిద నవ్వేస్తుంది. బొత్తిగా మేనర్స్ తెలియదు" అని మనసులో తిట్టుకున్నాడు అబ్బులు.

    " జయచిత్ర గడుగ్గాయి ఓసారి అల్లరి చేయాలి" అని వ్యాకర్ణ మనసులో మండిపడ్డాడు జయచిత్ర మిద.

    వెంటనే చిరునవ్వు చెమటపట్టిన ముఖాన పులుముకుని పొగడ్త పాటాల్లో పదహారో అధ్యాయానికి వెళ్లారు.

    " ఏంటో, జయచిత్రగారు ఈ రోజు పదమూడేళ్ళ కన్యలా వున్నారు" అన్నాడు వ్యాకర్ణ.

    " మరే" అంటూ తల తాటించి భూతద్దాల సవరించుకున్నాడు అబ్బులు.

    " స్వీట్స్ చాలా తియ్యగా వున్నాయి."

    " మరే, జయచిత్రగారి లాగానే."

    " కోపంగా చూస్తున్నా అందంగా వున్నారు."

    " వున్నారు."

    " ఎందుకని?"

    " ఏమో?"

    జయచిత్ర మధ్యలో కలుగ చేసుకుంది. " నే వెళుతున్నాను. మిరిద్దరూ యిలా వాదులాడుకుంటూ వుండండి.

    ఈరోజు స్వీట్స్ పంచిపెట్టడానికి కారణం నా బర్త్ డే" అంటూ పారిపోయింది అక్కడినుంచి.

    " బర్త్ డేయా?" నోరు తెరిచాడు వ్యాకర్ణ.

    " అంటే పుట్టినరోజా?" తల తడుముకున్నాడు అబ్బులు.

    " రెండూ ఒకటే."

    " తెలుసు."

    " ఏం తెలుసు?"

    " రెండూ ఒకటే అని జయచిత్ర బర్త్ డే అని..."

    " అఘోరించావ్. ముందే చెప్పి ఏడ్వకూడదూ?"

    " ఏడ్వోచ్చు, నా బర్త్ డే నాడు ఏడుస్తారా అని పాత చెప్పు తీస్తుంది."

    " పాయింటే, యిప్పుడేం చేద్దాం!"

    " ఏదయినా ప్రజంటేషన్ కొని యిద్దాము."

    " ఏం ప్రజెంటేషను?"

    " పాలపీక."

    " తిసెయ్యి."

    " పోనీ గిలక్కాయ."

    " అదీ తిసెయ్యి."

    " రెండు జడల సీత బొమ్మ."

    " వద్దు, వద్దు, అజీర్తి."

    " పళ్లు  రాలకొడతాను ఏది చెప్పినా పనికిరాదంటా వేమిటిరా?"

    " జయచిత్ర పాలుతాగే పాపాయిటరా! పాలపీకలు చీరపీకలుటరా యిచ్చేది? బుద్ధుందా లేదా? వుంటే అదేమ చేస్తున్నది? గడ్డి తింటున్నదా? మనసంటూ వున్నదా? ఉంటే అదేమ చేస్తున్నది? మేత మేయటానికి వెళ్ళిందా" అంటూ వ్యాకర్ణ కోపగించుకున్నాడు.

    అబ్బులు భూతద్దాల కళ్ళజోడులోంచి వ్యాకర్ణని ఎగాదిగా చూసి " కధ చాలాదూరం పోయింది" అన్నాడు.

    తెల్లబోయాడు వ్యాకర్ణ. "కదా! ఏం కధ, దూరం పోవటం ఏమిటి? ఏమా కధ? ఏమిటా మాటలు? మనసులో ఒకటి పెట్టుకుని పైకి మరొకటి అఘోరించకు. చెప్పేదేదో ముక్కుసూటిగా చెప్పి తగలడు" అంటూ మరోసారి గయ్యి మన్నాడు.

    " బర్త్ డే అంటే పుట్టిన రోజు. అంటే పుట్టినప్పుడే పుట్టినరోజు అంటారు. అంతే..."

    " ఈ అంటే మరొకసారి అంటే మాట సాగదీశా వంటే చంపేస్తాను. పాతేస్తాను."

    " ఛీ_ ఛీ _ ఈ మధ్య నా నోట్లోంచి ఏ మాట వచ్చినా చంపేస్తాను. నరికేస్తాను అంటున్నావు. ఇదంతా ఆ జయచిత్రమ్మ తల్లిని చూసింతరువాత పుట్టింది నీకు.

 

 Previous Page Next Page