" ఆ జిడ్డు వదిలింది. నువ్వు జిడ్డులా దాపురించావ్."
ఇంకేం మాట్లాడటానికి టాపిక్ లేక నవ్వి నోరు మూసుకున్నారు.
బామ్మాగారింట్లో అబ్బులు వ్యాకర్ణ చేరి వారం అయింది.
ఈ వారంలో ఆ కాంపౌండ్ లో వున్న అన్ని కుటుంబాల ఫార్స్ చూశారు.
కాకాకీమం వుపయోగించి బామ్మాగారి వద్ద మరింత చనువు సంపాదించి మరింత బుద్దిమంతు లనిపించుకున్నారు. బామ్మాగారి కధాకమామిషూ తెల్సుకున్నారు.
బామ్మాగారికి ఒక్కడే కొడుకు. ఆ కొడుక్కి ఒక్కతే కూతురు. ఆ కూతురే బామ్మగారి మనుమరాలు జయచిత్ర.
బామ్మగారికి పల్లెటూరిలో ఓ యిల్లుంది.
యిక్కడిది కాక జయచిత్ర తల్లి తండ్రి పల్లెటూరిలో ఆ యింట్లో వుంటే జయచిత్ర చదువుకోసం తోడుగా బామ్మగారు ఈ బస్తీలో యీ యింట్లో వుంది.
బామ్మగారికి తోడుకోసం- బ్రతుకు తెరువు సాధనాలలో కొంపని ముక్కలు ముక్కలుచేసి అద్దెల కివ్వటం మామూలుగా జరుగుతున్న కధే కాబట్టి బామ్మగారు ఉన్న కొంపని ముక్కలు చేసి అద్దెల కిచ్చారు, ఇదీ కధ.
ఓ రోజు జయచిత్ర పుట్టినరోజు వచ్చింది.
జయచిత్ర అన్ని వాటాల్లో వాళ్ళకి స్వీట్లు పంచి పెట్టింది. జయచిత్ర కిష్టం లేదు. బామ్మగారు బాధపడతారని స్వీట్స్ పంచిపెట్టడం వరకే పరిమితి చేసింది.
స్వీట్స్ తీసుకుని వ్యాకర్ణ అబ్బులు వున్న గదిలోకి వచ్చింది.
బస్ కీలు, దండేలు కట్ డ్రాయిరు ధరించి తీస్తున్న వ్యాకర్ణ, అబ్బులు జయచిత్రను చూస్తూనే గబుక్కున లుంగీ కట్టుకొచ్చారు.
రాణి సమయంలో వాచానేమో అని నిజంగా సిగ్గు పడింది. జయచిత్ర అడుగులో అడుగేసుకుంటూ లోపలికొచ్చిచెరి రెండు స్వీట్స్ యిచ్చింది.
అబ్బులు కాసేపు అఆలోచించి కనుక్కున్నానన్నట్లు గాలిలో ఓ చిటికేసి, " ఆ... తెలిసింది. తెలిసింది. పెద్ద మనిషయినప్పుడు, పేరంటమప్పుడు, పెళ్ళికూతుర్ని చేసినప్పుడు..." అంటూ యింకా ఏదో గుర్తుచేసుకు చెప్పబోయాడు అబ్బులు.
వ్యాకర్ణ అబ్బుల్ని జబ్బ గిల్లాడు " ఇంకా వేసేయ్యి. శీర్షాసనం వద్దురా అంటే రెండుసార్లు వేసావు. తెలివి మితిమించిపోయింది" అంటూ కోప్పడ్డాడు.
" నీవేం ఆసనం అఘెరించలేదుగా! నీ తెలివి చూపి స్వత్స్ ఎందుకిచ్చారో చెప్పు" అన్నాడు అబ్బులు.
" జయచిత్రగారినే అడిగితే పోలా?" అన్నాడు వ్యాకర్ణ తెలివిగా.
" ఇదా నీ తెలివి నీ మొఖంలా వుంది" కసురుకున్నాడు అబ్బులు.
" నా ముఖానికేం కవచకుండలాలు తప్ప దేనికి లోటు లేదు" ఎన్. టి. రామారావు చక్రధారి సినిమా తీసేటప్పుడు కాకిచేత కబురంపినా కర్ణుని పాత్ర వెయ్యడానికి పరుగేతుకెళ్ళే వాడిని.
ఈ అబ్బునాధానికి మూతిమిద పళ్ళున్నాయి. మాటకు ముందు పళ్ళికిలిస్తాడు. మిరు నమ్మండి నమ్మక పొండి జయచిత్రగారూ! నా చిన్నప్పుడు మా వూళ్ళో హరిశ్చంద్ర నాటకం వేశారు.
నాటకంలో బాలకర్ణుడిగా నన్నే పెట్టుకున్నారు. అదేంటి మిరూ నవ్వూతున్నారు?" అన్నాడు వ్యాకర్ణ.
" శీర్షాసనం వేసి అబ్బుగారు, శీర్షాసనం వెయ్యక మిరు, ఎందుకులెండి చెపితే మిరు బాధపడతారు" అంటూ నవ్వింది జయచిత్ర.