Previous Page Next Page 
ఉద్యోగం పేజి 22

ఉపన్యాసాలు పూర్తయిన తర్వాత విశ్వంతో పాటు వక్తలూ వేదికదిగి కిందికొచ్చేశారు.
తర్వాత  వినోదకార్యక్రమాలు. అవి ప్రారంభించే ముందు నా ముందువరసలోవున్న కుర్చీల్లో జరిగిన కొన్ని తమాషాలు రాస్తాను.
విశ్వం వేదిక దిగొచ్చి పశుపతిగారి కవతలగావున్న మూడో కుర్చీలో కూర్చున్నాడు. రెండో దాన్లో సంఘథ్య క్షులు పశుపతిగారిపక్కనే కార్యదర్సీను.ఇది సీను. కానీ, పశుపతిగారికీవరస నచ్చినట్లులేదు. సంఘ కార్యదర్సితో ఏదో మెల్లిగా చాలాసేపు మాటాడేరు. ఆమిదట కొన్ని ఒడంబడికలేవో జరిగివుంటాయి. అందుచేత కార్యదర్శి పశుపతిగారి కూర్చీలోకి వచ్చేడు. దరిమిలా అధ్యక్షుడు.అప్పుడు విశ్వం ఎడంపక్క కుర్చీ ఖాళీ అయ్యింది దాన్లో కెళ్ళికూర్చున్నాడు పశుపతి.అతని ఆరాటం నాకు చిరాకనిపించింది.
పశుపతి విశ్వానికి ఎడంపక్క కుర్చీలో కూర్చున్నాడన్న మాటేగానీ, విశ్వానికవతల కుడిపక్కన కూర్చున్న మరో మనిషి మిద కొపమొచ్చి వుండాలి. ఎంచాతంటే ఆమనిషి విశ్వాన్ని జలగలా పట్టుకుని విడిచిపెట్టడంలేదు. తెగ మాటాడేస్తున్నాడు. మొహమాటంకొద్దీ విశ్వం తలూపు తున్నాడు.
పశుపతి ఓతడవ అవతలమనిషి వేపు మిర్రునచూచేడు. అది గమనించలేదామానవుడు. తరువాత కార్యదర్శిని కళ్ళతో ఏదో హెచ్చరించేడు. అప్పుడాకార్యదర్సి తనసీట్లో నుంచి లేచి వెళ్ళి  వినయంగా  విశ్వం ముందు నించుని ఏదో చెప్పాడు .తన పక్కనే బాంబేలో  వేలినట్టు ఉలిక్కిపడి ఎడంవేపు చూసేడు విశ్వం.
అప్పుడు పశుపతి రెండుచేతులూ  జోడించి వెకిలిగా నవ్వేశాడు. ఆనక విశ్వం రెండుచేతులూ పుచ్చుకున్నాడు. ఈ లోగా కార్యదర్శి  విశ్వానికి కుడిపక్కన కూర్చున్న జలగని అక్కడనించి  లేవవలసిందిగా అభ్యర్థించి, అతనికి తను లేచొచ్చినకుర్చీ చూపించేడు. జలగ లేచి కార్యదర్శి ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంది.
ఈజలగ మొన్నా మధ్య ఒక చిన్ని పరిషత్తులో ఉత్తమనటుడి బహుమతి పుచ్చుకున్నవైనం నా పక్కసీట్లో మనిషి చెప్పగా  విని ఆశ్చర్యపోయేను.
విశ్వాన్ని జలగ విడిచిపెట్టినా పశుపతి  వడిచిపెట్టలేదు. నవ్వేస్తూ కుర్చీని కుదిపేస్తూ ఏదో వల్లించి చెబుతున్నాడు. విశ్వం తన పూలదండని  వాసనచూస్తూ వినీవినట్లు వింటున్నాడు.
" మరో అయిదు నిమిషాల్లో  ' మధురానగిరికి ప్రారంభమవుతుంది. కుమారి శకుంతలా పశుపతి తమ నాట్యకేశలాన్ని సహృదయులైన ప్రేక్షక మాశయులకు పరిచయం చేస్తారు అని ఎవరో కాగితం మ్మిద రాసి చదివినట్టు  మైకులో చెప్పారు.
ఈ హెచ్చరిక విన్న జనాభా కెలావున్న దోగాని నేనదిరి చచ్చేను. పశుపతిగారి వ్యూహాన్ని మెచ్చుకోక తప్పిందికాదు
నా పక్కకుర్చీలోని మూర్తి బెల్లకొట్టిన రాయిలా కూర్చున్నవాడిని చేత్తో కుదిపాను. కదిలి అన్నాడు.
" శకుంతలంటే సైకిలువాలా కదూ గురూ!"
" ఎక్జాక్బిలీ. కొంచెం నీముందు చూడు. అసలైన నాట్యం యిక్కడే జరుగుతోంది" అన్నాను పశుపతిని చూపిస్తూ.
అటువేపు చూచి  మెల్లిగా నవ్వేశాడు. నాట్యం ప్రారంభమయ్యే ముందు ఓ మనిషి వరసకుర్చీల దగ్గిర అటూ ఇటూ నాలుగైదుసార్లు తిరగడం గమనించేను.ఇంటర్వెల్లో చేగోడి, బజ్జీ, టీ అమ్ముకునే కుర్రాళ్ళని మరిపించే డతను. అతను చాలాసార్లు విశ్వందృష్టి నాకర్షించుకునేందుకు ప్రయత్నం చేసేడుకాని, ఫలించలేదు. చివరికి విసుగెత్తి వెనక వరస కుర్చీల్లో కి చేరుకున్నాడు.
"ఫలనా ధియేటరు ప్పొప్రయిటరు"  అన్నాడు.
"  సినీమాలో వేషం కోసమూ వొచ్చాడు?"
" అయ్యే ఉంటుంది. మొన్నా మధ్య ఒకడొక్కు సినీ మాలో రెండు నిమిషాలపాటు వీపు వాయించుకున్నాడు. ఇప్పుడు మరో ఛాన్స్ కోసం చూస్తున్నాడు. ఈ తడవ గూడా యే వింజామరం లాటిది పుచ్చుకోడమో మొహాన్న కొడతారంతే!"
అయిదు నిముషాలు గడిచినా నాట్యం ప్రారంభం కానేలేదు ఉన్నట్టుండి పశుపతి గ్రీన్ రూం వేపు పరుగెత్తేడు. కాసేపట్లో పశుపతి శకుంతలని వెంటబెట్టుకొచ్చేడు మొదటి  వరసకుర్చీల దగ్గిరికి. ఆ అమ్మాయి తండ్రితో వొస్తున్నప్పుడు కెమేరాల్లో ఫ్లాష్ లు గబగబా వెలిగేయి.
ఆ అమ్మాయి యింటిదగ్గర కంటే ఇక్కడంత అందంగా లేదు. సైకిలు తొక్కుతున్నప్పుడు చాలా అందంగా వుండేది ఇప్పుడు అందంగా లేకపోయినా బరువుగా వున్నది.  ఏవో చాలా అలంకారాలూ చేసేరు. నేను నాట్యాలు చాలా చూసేను. ఇన్ని అలంకారాలతో మెరిసిపోతూ " చల్లలమ్మ బోదు-" అనెవ్వరూ యెప్పుడూ యెక్కడా నాట్యం చేయలేదు మిదు మిక్కిలి  ఆ అలంకారాలన్నీ గూడా కలిపిపెద్ద సైజు వికృతతాన్ని అక్కడ ప్రదర్శింస్తున్నట్టు నా కనిపించింది. అందుచేత శకుంతల నా స్థితిలో చూచినప్పుడు నేను చాలా సిగ్గుపడిపోయేను.
తండ్రి కోరినట్టు శకుంతల విశ్వానికి పాదాభివందనం చేసింది. రెండు ఫ్లాష్ లు చిటిక్ చిటిక్ మని మెరిసేయి.అంత వరకూ బాగానే వున్నది రెండు నెలలు ( సరిగ్గా నేను లెక్క వేయలేదు. ఉజ్జాయింపుగా  అన్నాను.) శిక్షణతో మొదటి సారి కాలికి  అందెలు కట్టి  వేదిక ఎక్కినాట్యం చేయడమనే గొప్ప విద్యకీ ఒక ప్రఖ్యాత దర్శకుని ఆశీస్సులందుకోడంలో అనౌచిత్యం  కన్పించదు. కానీ , పశుపతి ఓ వెండి కప్పు విశ్వం చేతికచ్చి, ఆ కప్పుని శకుంతల కివ్వమని చెప్పి, వెనువెంటనే ఫ్లాష్ లు మెరిపింపజేసే ప్రయత్నంలో వ్యాపారం దాగి వుంటుంది. ఇదే  నాకు నచ్చలేదు. నాట్యం చూడక మునుపే బహుమతీ ప్రదనమని (అదీ శకుంతల వాళ్ళ సొమ్మె!)సంప్రదాయాన్ని వ్యాపార రహస్యమని నేనంటారు. ఈ కార్యక్రమాన్ని యావత్తూ ఫోటోల్లో  నింపడం దారుణమనీ అంటాను.
దాంతో విశ్వంమ్మీద నాకు కించిత్తు కోపమూ వొచ్చింది. కానీ, అతను పశుపతి గారడిలో మునిగిపోయిన కుర్ర దర్శకుడు. సినీమాల్లో పాత్రలనైతే అతనిష్టం వొచ్చి నట్టు మార్చుకోగలడుగానీ జీవితంలో పశుపతుల నేం చేయలేడు.
శకుంతల వెళ్ళిపోయింది. పశుపతి విశ్వం పక్కన జాగ్రత్తగా కూర్చుని సిగరెట్టు ముట్టించేడు. విశ్వంతో కాసేపేదో మాట్లాడేడు. తెర తొలగడంతో మాటలాపేశాడు.
'మధురానగం' ప్రారంభమయ్యింది.
నాట్యాలు చూడటమైతే  జరిగింది. కానీ వాటిని విమర్శించేంత స్తోమత నాకులేదు. అయినా సరే శకుంతల  చేస్తు న్నది ఏవన్ డాన్సంటే నేనొప్పుకోను. సోమయాజులు తలూపుతూ పాడుతున్నదానికీ , శకుంతల ఆంగికాభినయానికి పొత్తే లేదు. ఎవరిష్టమొచ్చినట్లు వారుపాడుతున్నారు, చేస్తున్నారు. శకుంతల నేర్చుకున్న విద్య యింకా ప్రారంభదశలోనే ఉన్నదని చెప్పాలి.

 Previous Page Next Page