Previous Page Next Page 
ఉద్యోగం పేజి 23

ఇక నేను లేచి వెళ్ళిపోడానికి సిద్ధపడ్డాను. మూర్తి బలవంతం చేసి కూర్చోపెట్టేడు.
ప్రముఖులంటూ వొచ్చింతర్వాత వారి యొక్క ' చేవ్రాలు' కోసం అనేకమంది సామాన్య మైన మనుషులు తహతహ లాడటం మామూలే .అప్పుడా నాడు అయిదారుగురు కాలేజీ విద్యార్ధులు ముందువరసకివొచ్చేరు.ఆటో  గ్రాఫ్ పుస్తకాలు పుచ్చుకుని. విశ్వానికి ఇలాటి అభిమానులే ముఖ్యమని. నా ఉద్దేశం .పశుపతి మొహంలో రంగులుమారు తున్నట్టు పిసిగట్టాను. విశ్వం వాళ్ళకి సంతకాలు చేస్తూండగా పశుపతి వెర్రెత్తిన మనిషిలా ఖంగారుగాఅటూ  యిటూ చూసేడు. నాట్యం మధ్యలో యిలా  అనవసరంగా ,వొచ్చిన ప్రతివాడికీ సంతకాలు పెట్టడం అతనికీ నచ్చలేదు. నాట్యకళలో చేయించిన రెండు నెలల 'కృషి' వృధా అవడం సుతరామూ యిష్టంలేదు.  అందుచేత వొచ్చిన  మనుషులకి సంతకాలైన పిదప పశుపతి లేచివెళ్ళి గేటుదగ్గిరున్న పోలీసుతో  యేదో చెప్పి వొచ్చి కూర్చున్నాడు. మరింతె.అట్నుంచి ఓ పిట్టగూడా సంతకాలు నిమిత్తంయిటు రానివ్వలేదూ పోలీసు.
' మధురానగరి' చాలా సేపటికిగాని పూర్తిగాలేదు! తర్వాత  ఏదో జానపద నృత్యమని మైకులో   'చదివేరు.'
పశుపతి డ్రింకుల  తెప్పించేడు. ముందుగా విశ్వానికో డ్రింకు యిచ్చేడు.
ఇక్కడ విశ్వం విజృంభించేడు. కుర్రవాళ్ళెంత తెలివిగలవాళ్ళో చేతుల్లో నిరూపించేడు తనికచ్చిన డ్రింకుని గబిక్కిన, వెనక్కి తిరిగి మూర్తికిచ్చేడు.అతనూ , నేనూ యిద్దరము తెల్లబోయేను.అంత వరకూ పటా పంచలయ్యింది.
" తాగారామనం పదినిమిషాల్లో బయలుదేరి వెళ్ళి పోదాం. పిన్నివాళ్ళు యెదురు చూస్తూంటారు కాబోలు.  వీరు మూర్తని మా తమ్ముడండీ."
పశుపతిగారి చేతిలో ని రెండో డ్రింకుతీసుకుని నాకిస్తూ నన్నూ పరిచయం చేశాడు.
" రావుగారని కథలు రాస్తూంటారు."
పశుపతి చేతిలో  వున్న మూడోడ్రింకు తాను పుచ్చుకున్నాడు! పశుపతీలో గొప్ప చలనం కలిగింది. నా లిక్కరుచుకుని తలబాదుకుంటూ అన్నాడు.
"అయ్యమ్యో! రావుగారు! రావుగారు, నాకు తెలీపోవడమేమిటండీ బాబాయ్! వార్నాకు బాగా తెలుసు. మిరు ఆయన్నాకు పరిచయం చేస్తుంటే నాతల కొట్టేసినంత పనయింది. వారేమిటీ . నాకు తెలీకపోవడమేమిటి? బలే  వారేమేమిరు. (పుమరుక్తి గమనించలేదు) వెనగ్గా కూచున్నారా  స్వామి! ఇలారండి. వొచ్చిక్కడ కూర్చొండి ముందు" అంటూ తను లేచి నించున్నాడు.
పశుపతి మిద జాలి కలిగింది. కానీ మేము ముందు వరసలోకి వెళ్ళలేదు.  పశుపతే వెనక్కి తిరిగి మాతో మాట్లాడేడు, ఆయన చాలా విషయాలు కొత్తగా చెబుతున్నట్టు చెప్పేడు. వాళ్ళమ్మాయి నటన, వాళ్ళమ్మాయి చదువు, వాళ్ళమ్మాయి పెంకితనం- అల్లరీను.అయితే యివన్నీ విశ్వానికి చెప్పాలనే ప్రయత్నంలో  మమ్మల్ని అడ్డుగా వాడు కున్న ఆయన చాతుర్యం గణనీయమే!
జనపద నృత్యం. మేం ముగ్గురం  లేచి నించున్నాము. మమ్మల్ని బయట వరకూ సాగనంపేరు సెక్రటరీ , ప్రెసి డెంటూ , ధియేటరు   ఓనరూ, ఉత్తమ నటూడూ వగైరాలూ. పశుపతి మాత్రం నన్ను కొంచెం అవతలగా తీసికెళ్ళి అడిగేడు.
" రేపు విశ్వంగారు యిక్కడే వుంటారా?"
" ఇక్కడేమో తెలీదు గానీ వాళ్ళ పల్లెటూర్లో వుంటారు."
" చూద్దాం"
" అమ్మమ్మ మిరా మాటనకూడదు. నేను రేపు దయం ఎనిమిదంటే ఎనిమిది గంటలకి యింటి కొస్తాను."
"సర్లెండీ"
" అన్నట్టు,అబ్బాయి పేరేమిటన్నారూ సంగమా కుటుంబమా?"
" సంగమేశ్వరరావు!"
" ఆ! సంగమేశ్వరావునీ మీ యింటికి రమ్మనండి. ఉద్యోగం వేయించేద్దాం. అదిగో మిమ్మల్ని విశ్వనాథం గారు పిలుస్తున్నారు.  వొస్తానండి."
ఉదయం యేడున్నర కే సంగమేశ్వరరావు మా  ఇంటి కొచ్చేడు.  నాముందు కూర్చున్నాడు. నేను విషయం చెప్పేను.  అతను  విని అనందంగా అన్నాడు.
" మికు తెలీదుగానండి. మికు చాలా పరువుంది. లేకపోతే ఆ పశుపతిగారు ఓ పట్టాన మి మాట వినే వారనా?"
సంగమేశ్వరరావు లౌక్యాన్ని నేను మెచ్చుకోలేక పోయేను. ఈ సంగమేశ్వరరావు, వెంకట్రావు ఇద్దరూ కలిసి నా ప్రాణం తినేశారు. నాకప్పుడు కోడిపందేలు గుర్తుకొచ్చేయి. పందెపు కోడిలా నన్ను బరిమిదకి వొదిలేరు. ఎవర్నీ నమ్మకూడదు!
పశుపతిగారి కారు వారన్న టైముకి ఏ పావుగంట ముందే వొచ్చేసింది. ఆయనంత దూరాన్నుంచే నవ్వుమొహంతో గబగబా వొచ్చేశారు చేతులూపుకుంటూ.
మాయింట్లో చాలా అందమైన కుర్చీలు రెండే వున్నాయి. సంగమేశ్వరరావు కొకటీ, నేనొకటీ వాడుకుంటే పశుపతి గారెక్కడ కూర్చుంటారనే విషయం ఆలోచిస్తూ  నించున్నాను.అప్పుడు నాకో పాత కుర్చీ గూడా వున్నట్టు జ్ఞాపకం వొచ్చింది. ఆ జ్ఞాపకానికి వెంటనే నొచ్చుకున్నాను.

                                                       - ఆంధ్ర  సచిత్ర వారపత్రిక 9-9-68

 Previous Page Next Page