Read more!
Next Page 
రాక్షసీ...! నీ పేరు రాజకీయమా? పేజి 1

                                 


                           రాక్షసీ...! నీ పేరు రాజకీయమా?

                                                                 ----ఆదివిష్ణు

 

                       
    
    
    "కథేనా?"
    "కాదు. నవల"
    "నవల రాసేవా? దేని గురించి రాసేవ్?"
    "రాజకీయం."
    "నీకు రాజకీయాల్లో ప్రవేశముందా?"
    "లేదు"
    "ప్రవేశం లేకుండానే రాసేవా కథ?"    
    "కథకాదు, నవల."
    "సరే నవలే అనుకో. ప్రవేశం లేకుండానే రాసేవా అంటున్నాను."
    "నవల రాయడంలో ప్రవేశముంది."
    "రాజకీయంలో లేదంటివిగా."
    "అందుకే రాశాను."
    "అంటే ప్రవేశం సంపాయించుకుందికా?"
    "నువ్వేమనుకుంటే నాకేం?"
    "హీరో వున్నాడా?"
    "ఉన్నాడట. దేవుడు."
    "వాడి పేరు దేవుడా?"
    "దేవుడు. దేవుడే!"
    "ఎలా వుంటాడు?"
    "నీలాగ నాలాగా వుండడు."
    "మరి......?"
    "అందర్లాగా వుంటాడు."
    "నువ్వు చూసేవా?"
    "చూడాలనుకునే రాసేను."
    "కామెడీనా? ట్రాజెడీనా? సెటైరా? సెక్సా?"
    "అన్నీను."
    "కల్పితమా?"
    "ప్రవేశం లేదు గనక కల్పితమే. కేవలం కల్పితం. ఇందలి స్థల : పురాణమూ. అక్కడి పాత్రలూ, వాటి పేరులూ, హోదాలూ, పదవులూ, చుట్టరికాలూ, పలుకరింపులూ అన్నీ అంతా కల్పితమే!"
    "కథ పేరేమిటన్నావ్?"
    "కథకాదు నవల."
    "అదేలేవోయ్. నవల పేరేమిటి?"
    "రాక్షసీ, నీ పేరు రాజకీయమా? వర్ధిల్లు!"
    "వేదాంతం రాయి, తొరగా పైకొస్తావ్."
    "దానికింకా టైముందిగా ముందు నవల విను."
    "కానివ్వు."
    "తిమ్మాపురం....."
    "శుభమంటూ అదేం పేరు!"
    "దయచేసి నన్నాపకు. నేను చదువుకు పోతాను. నువ్వు వింటూ వుండు. కెనై ప్రొసీడ్ నౌ!"
    "ప్రొసీడ్!"
    
                                          *    *    *

Next Page