నెలరోజులు గడిచింతర్వాత ఓ రోజున సంగమేశ్వరరావు అర్జుంటుగా మాయింటికొచ్చేడు. ఒచ్చీ రావడంతోటే గబగబా నాలుగూ అనేశాడు. నిప్పుతొక్కిన కోతిలా-
" రామానాధం గాడికి ఉద్యోగం వచ్చింది. నాకంటే వాడు జూనియర్. పైగా ఫూల్. అయినాసరే వాడికే ఉద్యోగం యిచ్చేరు పశుపతిగారు .అప్పుడే వారం రోజులైపోయింది గూడాను."
" నే నడిగితే ఖాళీల్లేవని చెప్పేడే మరి."
"లేపోతే, ఉన్నాయని చెబ్తారేమిటండీ! మిరు మరీను."
" డాన్స్ మాస్టరు సోమయాజుల్లేరండీ" వాళ్ళతమ్ముడు. సోమయాజులు పశుపతిగా రమ్మయికి డాన్స్ నేర్పుతున్నాడు గదా! ఆపరిచయంలో ఆయగారేమో ఈ ఫూల్ గాడికి ఉద్యోగం వేయించేశాడు?" అన్నాడు కసిగా.
నేనున్నాను. నేను నాటకాలవీ రాస్తాను. నా నాటకమొకటి ఆమధ్య పశుపతిగారికి కావలసి ఒచ్చింది. ఆ రకంగా నాకూ ఆయన్తో పరియచమున్నట్టేగా. కానీ నాకున్న పరిచయంతో ఈసుబ్బుదికి నేను ఉద్యోగం వేయించలేకపోయేను. అంటే, మొత్తానికి అర్ధమేమిటి? ఆ డాన్స్ మాస్టరు సోమయాజులు ముందు ఈ నాటకాల రచయిత తీసికట్టన్నమాట. ఇదీ,టూకీగా సంగమేశ్వరరావు గుండెల్లోని అభిప్రాయం,
దీనికి నేనేం బాధ పళ్ళేదు. సంగమేశ్వరరావు వెళ్ళి పోయింతర్వాత నిట్టూర్చేను. అంత పరపతీ , అంత హోదా గల పశుపతిగారు చిన్న విషయంలో అబద్దమెందుకు చెప్పాలని మాత్రం బాధపడిపోయేను. పశుపతిగారికి నేను సోమయాజులుకంటే ముందునుంచీ తెలుసు. అయన్లా నాట్యాలు నేర్పలేకపోయినా నేనూ ఆయన్లా ఒక కళా కారుడ్నే? పశుపతిగారి విలువల్ని గ్రహించే ముందొచ్చిన నన్ను కొట్టి పారేసి వెనకొచ్చిన ఆ సోమయాజుల్ని గౌరవించడమనే విషయంలో చింతించేను, ఆనాటినుంచీ పశుపతిగారిమిద విరోధం పెట్టుకోవలసి వచ్చింది.
ఈ కథ ముఖ్యంగాపశుపతిగారూ, సంగమేశ్వరరావూ, నేనూల మధ్యింతవరకూ జరిగింది. నాకు మా వూళ్ళో ప్రాణం సైతం ధారపోసే మిత్రుడు మూర్తి వున్నాడు. అతన్నింత వరకూ ఈకధలో పరిచయం చేయలేదు. మూర్తి గూడా కధలురాసే కుర్రాడు. మే మెల్లప్పుడూ కలిసే తిరుగుతుంటాం.
వోనా డతనింటికి వెళ్ళేను. అతనప్పుడు చాలా తొందరగా ఉన్నాడు. నన్ను చూస్తూనే;
" రా గూరూ! రా! నీ కోసమే చూస్తున్నాను. లేకపోతే ఈవేళకబస్టాండులో వుండవలసిన పని" అన్నాడు.
" ఏమిటో విశేషం?"
" మీవిశ్వమన్నయ్య వస్తున్నాడు. ఉత్తరం రాసేడు. రేపు సాయంత్రం టవు్ హాల్లో మిటింగేదో ఉన్నదట. అదవ్వగానే రాత్రికి మా పల్లెటూరు వెళ్ళిపోవాలి. ఈ వార్త మా వాళ్ళకి చెప్పెందుకు వెడుతున్నాను."
మూర్తి మావూరివాడే అని చెప్పాలి. చదువూ, ఉద్యోగం రెండూ ఈ వూళ్ళోనే. వాళ్ళ సొంతవూరుమా వూరుకి పదిమైళ్ళలోవున్న పల్లెటూర.అక్కడే యిల్లూ, పొలం గట్రా వున్నాయి. వారానికో తడవ అక్కడికి వెళ్ళి వస్తూంటా డతను.
మూర్తిని బస్సెక్కించి ఇంటి మొహం పట్టేను. దార్లో మూర్తి వాళ్ళన్నయ్య జ్ఞాపకాని కొచ్చేడు.
ఈ భూమ్మిగమంచి 'టేలెంట్' వున్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ప్రతిభా దొడ్డమ్మగా రబ్బాయి ఈ విశ్వం. ఆనర్సు పూర్తయింతర్వాత మద్రాసు వెళ్ళిపోయి సినీమాల్లో చేరేడు.నాలుగైదేళ్ళు ప్రముఖ దర్శకుల దగ్గిర పన్జేసి మొన్నీ మధ్యనే విడుదలైన వో తెలుగు సినీమాకి డైరక్టరయ్యేడు. దాన్లో చాలామంది కొత్తవాళ్ళు నటించేరు. ఆ సినీమాలో ఆకర్షణలు చాలా ఉన్నాయి. పత్రికలు ఆ సినీమాని ఆకాశాని కెత్తాశాయి.
అందుచేత విశ్వం ప్రఖ్యాతి నలుదిశలా ఈనాడు వ్యాపించింది. ఈ సినీమా నాలుగోవారం ఆడుతూండగానే మరో రెండు సినీమాలకి దర్శకుడుగా నియమింపబడినట్లు పత్రికైనా రాణిస్తాడనే ధర్మసూత్రం ఈ విశ్వం ద్వారా నిజమైంది.
ఆ సాయంత్రం నాకేం తోడలేదు. మూర్తి ఇంట్లో లేడు. పురమందిరానికి వెళ్ళేడని చెప్పేరు.హోటల్లో యింత కాఫీతాగి నేనూ టవున్ హాలువేపు వెళ్ళేను.
మా వూళ్ళో వున్న ' పట్టణ యువజన సంఘం' చాలా చక్కగా పన్జేస్తోంది. తగ్గవాళ్ళకి సన్మానాలూ, అప్పుడప్పుడు సాంస్కృతిక కార్యకలాపాలు నెలకోతడవైనా ఏర్పాటు చేయడంతో మా వూరి జనాభా రిలాక్సవుతోంటుంది.
నేనొస్తున్న రోడ్డుమీద, రోడ్డుకి అడ్డంగా పెద్ద పెద్ద అట్టలు కట్టి వుంచేరు. వాటిపైన అభివందనాలూ ' విశ్వానికి స్వాగతమని' ఇంతింతక్షరాల్తో రాసేరు. కొన్ని అట్టల పైన అభివందనాలూ వున్నాయి.
టౌన్ హాలుదగ్గిర గుంపుల గుంపులు గావున్నారు. గ్రామఫోన్ రికార్డులు మార్మోగుతున్నాయి. ఆ పాటలన్నీ విశ్వం సినీమాలోనివే కావడం ఒక ప్రత్యేకత! మధ్యమధ్య రికార్డులు ఆపి టౌన్ హాల్లోచేరిన ప్రేక్షక సమూహాన్ని నిశ్శబ్దంగా వుండాలని ఎవరో కీచుగొంతులో హెచ్చరిస్తున్నారు.
నేనిక్కడ కాసేపు నించుని తిరిగి వెళ్ళబోయేను. అప్పుడు మూర్తికనిపించేడు.
" బలేవాడివిగూరూ!" ఇంతలేటా" అన్నాడు.
" నేనిక్కడికి రావాలని రాలేదు. ఏంతో చకవచ్చేను"
" తగ్గువోయ్! మి ఆఫీసుకి కబురంపేను. చేరలేదూ?"
" లేదే?"
" ఫర్లేదు.ఆ నీకోసం సీటుచేను."
నేనతన్తోపాటు లోపలికెళ్ళేను.రెండోవరసలో మధ్యగా రెండుకుర్చీలు ఖాళీగా వున్నాయి. తిన్నగా అక్కడికేవెళ్ళి కూర్చున్నాము. మేమెళ్ళికూర్చున్న క్షణమేవిశ్వమొచ్చినట్లు మైకులవో ఎవరో చెప్పేరు.ఆయనా మొహం చూచిగూడా పలుకరించేలేదు. నేనూ తలదించేను.
సరిగ్గా ఆయన కుడివేపున మూడుకుర్చీలు ఖాళీగావున్నాయి.
సభ ప్రార్థనతో ప్రారంభమయింది. 'వందేమాతరం' పాడినమ్మాయి పాటపూర్తయితర్వాత (ఫర్లేదు. బాగానే పాడింది. వినయంగా చేతులు జోడించి విశ్వానికీ నమస్కరించింది.
సంఘ కార్యదర్శి విశ్వాన్ని సభికులకు పరిచయం చేశాడు, అదైనతర్వాత విశ్వం కాసేపు మాట్లాడేడు. ఈ సినిమాప్రపంచంలో తానెన్నికష్టా లెదుర్కొని ఈ స్థితికొచ్చేడో చెప్పేడు (వొంటికి మల్లెపూవులు తగలడంకూడా గొప్ప కష్టమేనా అనిపించింది నాకప్పుడు.) ఆంధ్ర ప్రేక్షకులు తనపట్ల చూపుతూన్న ఆదరాభిమానాలు శ్లాఘనీయమన్నాడు. కళలకు ఆటపట్టైన మావూళ్ళో తనకీరకవైన అభినందన సభ ఏర్పాటు చేయడం ముదావహమనీ అన్నాడు. ( అప్పుడు సభలో కరతాళధ్వనులు మిన్నుముట్టాయి) తదనంతరం ఉపన్యాసం ముగించి కూర్చున్నాడు.
సంఘధ్యక్షుల పాలూ ముగిసేయి. అవి జరుగుతూండగా విశ్వం తనకిచ్చిన పూలదండని ముక్కుదగ్గిరిగా వుంచుకుని ఏదో ఆలోచిస్తున్నట్టు కన్పించేడు.