ఇంకేదో చెప్పబోయింది ముక్తనంద.
చెప్పనివ్వలేదు రవిచంద్ర.
"లాయరు గారు.....చాలా తెలివితేటల్తో నూరిపోసిన మాటల్ని చిలకలా చెప్తే సరిపోదు. నేను పాలిటిక్స్ లోకి వెళుతూన్నాను. మన బిజినెస్ ను లిని చూసుకోవాలని డాడి నీతో చెప్పారా? చెప్పారని, డాడి ఇష్టం అదని, నువ్వు చెప్పేస్తే సరిపోతుందనుకున్నవా.....నో....కుదరదు....ఇది నువ్వూ లాయరూ ఆడుతున్న డ్రామా నాకు తెలుసు. దేనికైనా సాక్ష్యం కావాలి." పెద్ద గొంతుతో అన్నాడు రవిచంద్ర.
లాయర్ సూర్యసాగర్ ఆ మాటలకూ ముందుకొచ్చి అందుకున్నాడు.
"చూడండి....రవిచంద్ర.....మీ డాడి ....మీ చేల్లెలతో అన్నమాట లకే మీకు సాక్ష్యం కావాల్సివచ్చినపుడు....ఇంతపెద్ద ప్రాసర్టి, మీకు చెందా లంటే....మీరు చైర్మన్ కావాలనుకుంటే, నోటి మాటలవల్ల ఎలా కుదురుతుందో చెప్పండి....మీకు ముందే చెప్పాను. మీ డాడి వీలునామా కావాలని లేదంటే ఆస్తి చెరిసగం అవుతుందే తప్పు ఎ ఒక్కరికో చెందదు... తెగేసి చెప్పాడు సూర్యసాగర్.
రవిచంద్ర పెద్దగా, పిచ్చిగా నవ్వాడు.
"ఆడపిల్లకు ఆస్తిలో సమాన వాటానా? మీరు కొత్తగా ఈ చట్టాన్ని కనిపెట్టార.....?" హేళనగా అన్నాడు రవిచంద్ర.
"నువ్విలా అడ్డు తగులుతావని తెలుసు-అలాగే ఇక్కడున్న కొందరికి, ఆడపిల్లకి ఆస్తి హక్కేమీటని అనుమానం రావచ్చు. అందుకే కోర్ట్ నుంచి దిన్ని తెచ్చా_ చదువుతాను వినండి...." అంటూ సూర్యసాగర్ లోంచి ఒక కాగితాన్ని బయటకు తిసి చదవటం ప్రారంభించాడు.
ఆస్తి హక్కు అన్నది మగపిల్లలకు పుట్టుకతోనే వస్తుంది.అయితే ఆడపిల్లలకు మాత్రం చాలా కాలం ఆస్తి ప్తె ఎలాంటి హక్కులూ హందూ కుంటుంబాలకు చెందినంత వరకూ ఆస్తి హక్కు హిందూ లను అనుసరించి వస్తుంది.
హిందూ లాలో రెండు పద్దతులున్నాయి. ఒకటి దయబాగ్ స్కూల్ పద్ధతి, రెండోది మిథాక్షర స్కూల్ పద్ధతి. దయబగ్ స్కూల్ పద్దతిని ఎక్కువగా బెంగాల్ లో అనుసరిస్తూ వుంటారు. అందుకే దీనిని బెంగాల్ స్కూలు పడతి అని కూడా అంటారు, మన దేశంలోని మిగతా అన్ని ప్రాంతాలవారు మితాక్షర స్కూలు పద్దతినే అనుసరిస్తూ ఉంటారు. ఈ పద్ధతి కాలక్రమేనా ఎన్నో ఉప పద్దతులు కూడా చోటు చేసుకున్నాయి.
ప్రతి హిందూ అవిభక్త కుంటుంబాన్ని కుటుంబంలోని స్త్రి పురుష సభ్యులతో కలిపి ఒక ఉమ్మడి కుటుంబంగానే పరిగణిస్తారు. అయితే పూర్వికుల ఆస్తి ప్తే హక్కు మాత్రం మగపిల్లలకే నాలుగుతరాల వరకు సంక్రమిస్తూ వుండేది అంటే ఇక పూర్వికుని ఆస్తిప్తె అతనికి, అతని కొడుక్కి, మనుమడికి, మునిమనుమడికి కూడా సమిష్టిగా వారసత్వపు హక్కు లభిస్తుందన్న మాట. ఈ సమిష్టి వారసత్వపు హక్కు, పుట్టుక తోనే సంక్రమిస్తుంది. సమిష్టి వారసుల పుట్టుకను బట్టి, మరణాన్ని బట్టి ఒక్కొక్క వారసుని వాటాలో హెచ్చుతగ్గులు సంభవిస్తూవుంటాయి.
ఈ వారసులలో ఎవరయినా ఒకరు చనిపోతే అతని వాటాప్తె ఉన్న హక్కు మిగిలిఉన్న వారసులకు లభిస్తుంది.
1937వ సంవత్సరం వరకు ఉమ్మడి కుటుంబంలోని ఆస్తిప్తె స్త్రీలకు ఎట్టి హక్కు ఉండేది కాదు. మొదటిసారిగా హిందూ మహిళలకు కూడా ఆస్తి హక్కు కల్పిస్తూ ఓ చట్టాన్ని 1937వ సంవత్సరంలో చేశారు "హిందూ వుమెన్స్ ర్తెట్ టు ప్రాపర్టీ ఆక్ట్ - 1937" అన్న యీ చట్టం 1937వ సంవత్సరం ఏప్రిల్ నెల 14వ తారికునుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం భర్త గతించిన భార్యకు , అంతకు ముందే వితంతువు అయిన కోడలుకు, అలాంటి పరిస్ధితిలోనే వున్న మనుమని భార్యకు కూడా పూర్వికుల ఆస్తి ప్తె మగవారికి మల్లేనే హక్కు లభిస్తుంది. అయితే కొన్ని షరతులప్తె....
ఆ షరతులేమిటంటే యిలా సంక్రమించిన ఆస్తిని ఈ మహిళలు అనుభవించవచ్చు కానీ దానిని విక్రయించేందుకుగాని, యితరత్ర వినియోగించేదుకుగాని విరికేట్టి హక్కూ వుండదు. విరి మర్నానంతరం విరి వాటా కూడా కుటుంబంలోని యితర మగ సభ్యులకు చేరిపోతుంది. సంపూర్ణమైన హక్కులు అభించని ఈ చట్టం కేవలం కంటి తడుపు చర్యగా భాసించిందె తప్పు- స్త్రి లకు సరియ్తెన న్యాయాన్ని కల్పించలేకపోయింది. 1956వ సంవత్సరం జూన్ నెల 17వ తారికు వరకు యీ పరిస్ధితే కొనసాగింది. సరిగ్గా ఆ రోజే హిందూ స్త్రీలు స్ధితిగతులను కాస్త మెరుగు పరిచిన "హిందూ సక్సేషణ్ ఆక్ట్ 1956 అమలులోకి వచ్చింది.
1956 వ సంవత్సరంలో అమలులోకి వచ్చిన హిందూ సక్సేషన్ ఆక్ట్ హిందువులకు , భౌద్ధమతస్ద్గులకు ,జై నులకు, సిక్కులకు వర్తిస్తుంది. ఈ ఆక్ట్ లోని 14 వ సెక్షన్ ప్రకారం స్త్రీలకు సంపూర్ణమ్తెన ఆస్తి హక్కులు లభించాయి. ఈ చట్టం అమలులోకి వచ్చిన నాటికి గాని అంతకు ముందు కానీ స్త్రీలకు పరిమిత హక్కులు లభించిన ఆస్తిప్తె వారికి ఈ చట్టం తర్వాత సర్వహక్కులూ లభించాయి. కానీ వీలునామా వాళ్ళ కానీ, గిప్టు రూపంలోకానీ లేదా కోర్టు తీర్పు ప్రకారంకానీ స్త్రీలకు పరిమిత హక్కు లభించిన సందర్భాలలో మాత్రం-ఆ పరిమితులే వర్తిస్తాయి తప్పు- సంపూర్ణమైన హక్కులు లభించవు.
అయినప్పటికీ అమలులోకి వచ్చేసరికి మాత్రం సహజంగానే స్త్రీలు అడ్డంకులు ఎదురుకాకపోలేదు. కానీ ద్తేర్యంగా వాటిని ఎదుర్కొని కోర్టుల కెళ్ళిన స్త్రీలకు అనుకూలంగా తీర్పులు వెలువడటం చాలా సందర్భాలలో జరిగింది.
1974వ సంవత్సరంలో సుప్రీంకోర్టుకు వచ్చిన ఓ కేసులో ధనకౌర్ అనే ఆమె హోండూ సక్సేషన్ ఆకట్ రాకపూర్వమే భర్త మరణం ద్వారా తనకు వచ్చిన ఆస్తిని తన కుమార్తెకు బహుకరించింది. ఈ బహుకరణ చెల్లదని ధనకౌర్ కు సదరు ఆస్తిని అనుభవించే హక్కే కానీ విక్రయించటం కానీ, యితరులకు ఇవ్వటం కానీ చేసే హక్కు లేదంటూ దయాసింగ్ అనే వారసుడు కోర్టులో కేసు వేశాడు. హిందూ సక్సేషన్ ఆక్ట్ సెక్షన్ ప్రకారం ధనకౌర్ కు ఆ ఆస్తి ప్తె అన్ని హక్కులూ లభించాయని- కాబట్టి ఆస్తిని తన కుమార్తెకు బహుకరించటం చట్ట సమ్మతమే సంటూ సుప్రిం కోర్టు సంచలనాత్మక మైన తీర్పు యిచ్చింది. కోర్టుకి వచ్చిన అనేక కేసులలో యిటువంటి తీర్పులే వెలువడ్డాయి.