Previous Page Next Page 
అమ్మో! అమ్మాయిలు పేజి 20

    " లెస్స పలికితివి కర్ణా!"

    " బామ్మాగారేమవుతుంది మికు?" అని అడిగాడు ధర్మరాజు.


    " బామ్మాగారే" అన్నాడు అబ్బులు భూతద్దాలల్లోంచి బోలెడు కోపంతో చూస్తూ.

    " అలా చెప్పరా అబ్బాయీ! సాక్షాత్తూ మి బామ్మకి తోడికోడలి చెల్లెలన్న మాట" అన్నాడు ధర్మరాజు .

    " ఈయన పెళ్లాం ఈయనతో ఎలా కాపురం చేస్తున్నదిరా?"

    " ఈయన్నడిగే బదులు ఈయన పెళ్లాన్ని అడుగుదాము. బాత్ రూమ్ కెళ్ళినప్పుడు.

    " ఆవిడకి చెముడు లేదు. నీ తాట వలిచేస్తుంది."

    " పోనీ ఈయన్నే అడుగుదాము."

    " అడిగి చూడు."

    వీళ్ళ దోవన వీళ్ళు మాట్లాడుకుంటూంటే ధర్మరాజు అడిగేది అడిగేస్తున్నాడు.

    తన ప్రశ్నలకి జవాబిస్తున్నారానుకుని సంతోషపడి వినయ విధేయతలు మి వద్ద బాగా వున్నాయి అబ్బాయిలూ! మంచి లక్షణం" అన్నాడు.

    " ఇదీ నయమేనురోయ్ అబ్బూ! ఈయనకి వినపడి చావకపోగా, వినపడినట్లు ప్రశ్నకి సమాధానం చెప్పుకుని వూరుకుంటున్నాడు ఏమిటీ? ఏమిటీ? అని వినపడ్డదాకా వేధించటం లేదు.

    " నిజమేనురోయ్" అంటూ ఒప్పేసుకున్నాడు అబ్బులు.

    " మిరు చదివేది ఏమిటోయ్?" ధర్నరాజు గారి ప్రశ్న.

    " వాడు సెక్స్, నేను క్రైమ్ ."

    " అదే మంచిదోయ్! ఐ. ఏ ఏస్. పరీక్ష పాస్ కావాలంటే మాటలా? రాత్రింబవళ్ళు బాగా చదువుకోండి."

    " రామచంద్ర..." అన్నాడు వ్యాకర్ణ.

    " ప్రభో" అని పూర్తి చేశాడు అబ్బులు.

    జిడ్డు ధర్మరాజు ప్రశ్నలు యింకా పూర్తికాలేదు.

    " మి స్వగ్రామం ఏదీ?" అన్నాడు.

    " అదేలెండి" అన్నాడు అబ్బులు.

    " అలాగే! మి అమ్మా నాన్నగారలు అక్కడే వుంటారా?"

    " అంతేలేండి."

    " ఆయనేం చేస్తున్నారో!"

    " అదీ అంతేలెండి."

    " ఆదాయం బాగా వస్తుందనుకుంటాను!"

    " ఇదీ అంతే లేండి."

    ఇహ నవ్వాపుకోలేక నవ్వేశాడు వ్యాకరణ.

    వ్యాకర్ణ నవ్విం తరువాత అంతవరకు నవ్వు బిగపట్టు కున్న అబ్బులు నవ్వాడు.

    వీళ్ళిద్దరూ నవవ్తం చూసి ఆ నవ్వటం తన్ని చూస్తేనే వచ్చిందనే అనుమానం వచ్చి ధర్నరాజు ముఖం ముడుచుకుని మళ్ళీ వచ్చి కలుస్తానబ్బాయిలూ?" అని చెప్పి లేచి వెళ్ళి పోయాడు విసుగ్గా.

    ధర్మరాజు అటు వెళ్ళగానే " జిడ్డు వదిలే వుపాయం తెలిసింది రోయ్. అబ్బూ!" అన్నాడు వ్యాకర్ణ.

    అబ్బులు కళ్ళజోడు సవరించుకుని " ఏమ్తిరా కర్ణా! ఆ మహా అస్త్రం!" అని  నవ్వాపేసి సీరియస్ గా అడిగాడు.

    " ఏముంది సింపుల్. ధర్మరాజు ముఖాన నవ్వేయటమే! బస్, జిడ్డు జారుకుంటుంది" అవ్వదు వ్యాకర్ణ.

    " మన నవ్వు చూసి యిది వీళ్ళ అలవాటసుకుని బంకలా పట్టుకు వదలకపోతే?" అబ్బులు అనుమానం వ్యక్తం చేశాడు.

    " ఏడుద్దాం జాయింట్ గ."

    " ఇదీ అలవాటయిపోతే!"

    " తన్నుకు చద్దాం."

    " నీ మూతిపళ్ళు రాలగొడతాను."

 Previous Page Next Page