మాదల వెంకట్రామయ్యకి తేరుకోవడానికి రెండు నిమిషాల పట్టింది.
"యస్ డాడీ.... నా కొచ్చిన ఇన్ ఫర్మేషన్ కరెక్ట్" తండ్రి ముఖంలోకి తదేకంగా చూస్తూ అన్నాడు మనోహర్.
జీరో వాల్డు బెడ్ లైటు నీలు వెలుతురు అతడి ఆరోగ్యమయినచెంప మీద అందంతో విషాదం మిలితమైనట్టు జీరాడుతోంది. ఇప్పుడు మాదల వెంకట్రామయ్య తమన ఎదురుగావున్న మనోహర్ గురించిగాని, అతడు చెప్పిన విషయం గురించిగాని ఆలోచించకు లేదు.
అతడి ఆలోచనలోని వ్యక్తీ కావ్య.
ఆడపిల్ల ఒంటరిగా సముద్రంమీదకు వెళ్ళిందంటే ఎన్ని గట్స్ వుండి తీరాలి.
ఆమె సముద్రం మీదకు వెళ్ళి ఏదో అద్భుతం సాదిస్తుందన్న నమ్మకం అతడికి లేదు. కాని అంతటి ధైర్యసాహసాలున్న అమ్మాయి రేపటిరోజున చేతులు కట్టుకుని కూర్చోదు__ మేడలో మూడుముళ్ళు వేయించుకొని జీవితంలో రాజీ పడదు. తనకి గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. ఆమె జీవితం ఓ అందమైన కధగా మారకుండా ఓ ముగింపు ఇవ్వాలి.
ఆ ముగింపు ఎలా వుండాలి? అని ఆలోచించసాగాడు ఏం.వి.అయ్య.
సరిగ్గా అదే సమయంలో__
పూజామందిరంలో విగ్రహం ముందు వెండిప్రమిదలో దీపం ఉజ్వలంగా వెలుగుతోంది. వడయారు కంఠం నెమ్మదిగా మంత్రాలు గొణుగుతోంది.
తన ఒక్కగానొక్క కూతురు ఇమ్తరిగా సముద్రం మీదకి వెళ్ళిందన్న భయంలేదుగాని, మాదాల వెంకట్రామయ్య ఆమెకు ఏ అపకారం చేస్తాడోనన్న భీతిమాత్రం లేకపోలేదు. దేవుని సాన్నిధ్యంలో వున్నా, జపమాలలోని పూసలు తిరుగుతున్నా మనసంతా ఎక్కడో వుండి_ అశాంతితో అలమటిస్తోంది.
* * * *
సముద్రం తీరానికి ఎంత అల్లకల్లోలంగా వుందో, తీరంనుంచి పది కిలోమీటర్లు లోపలకి వెళ్ళేసరికి అంత ప్రశాంతంగా వుండి. ఇంజన్ ఆఫ్ చేశారు. గాలిపాటుకి తేరచాప ఎత్తండంతో బోటు ముందుకు దూసుకుపోతుంది. చుట్టూ ఎటు చూసినా నీటిమయం. పైన ఆకాశం, బోటులో క్రింది దుప్పటి పరుచుకుని వెల్లకిలా పడుకున్న తంబికి ఏమీ తోచలేదు కాబోలు మౌత్ హిర్మోనిమీద ఓ పాట పాడుతున్నాడు. అతడిలో కూడా వచ్చిన వారిద్దరూ ఆ బోటులోనే ఓ మూలచేరి విస్కీబాటిల్ ఓపెన్ చేశారు. ఆ బోటులో తాము ముగ్గురు కాక ఓ ఆడపిల్ల కూడా వున్నదని మర్చిపోయి నట్ట్లున్నారు.తంబి. తన్మయత్వంతో పాటలు పాడుకుంటున్నాడు.
ఓ కిరాయిగుండా__
డబ్బుకోసం ఏ పనయినా చేసే ఓ మానావాకారం__
ఆ విధంగా అంత చక్కగా పాటలు పడటం ఆమెను విస్మయపరిచింది. ఆ ప్రయత్నంగా అతడివైపు అడుగులేసింది.
పొడవాటి నీడమీదకు పాకడంతో అతడి పాట ఆగింది.
నెమ్మదిగా కళ్ళు విప్పాడు.
కళ్ళమీదనుంచి రెప్పలు నెమ్మదిగా పైకి వెళుతూవుంటే, రంగా స్థలంమీద తేరపైకి లేచినట్లు ఆమె ధరించిన పాదాలు, ఆపైన పొడవాటి తెల్లని కాళ్ళు, ఆపైన అరటి బోదెంల్లాంటి తోడలు, ఆ తొడలపై తాటి జీబుల్లాంటి హాఫ్ ఫ్యమ్టు, ఆపైన ఫ్యాంటులోకి జొప్పించిన బనియను_ వంపు తిరిగిన నడుము, ఆపైన గాండీవంలా ముందుకీ చొచ్చు కొచ్చినఛాతి _ఇవి కాదు అతడు చూస్తున్నది, చల్లటిగాలి సున్నిత స్పర్శకి రిలాక్సింగ్ గా వున్నా ఆమె మొహాన్ని చూస్తున్నాడు.
గుండ్రని ఆ మొహంలో అమాయకత్వం తోనికిసలాడుతోంది, ఆమె కళ్ళు అరవచ్చిన ముద్దా మందారాల్ల వున్నాయి. పెదవులు లోటస్ స్పురణకు తెస్తున్నాయి. ఆమెలో ఏదో కనిపించని నాజూకుతనం, మృదుత్వం అతడ్ని ఆకట్టుకుంటోంది.
ఆమె విద్యాధికురాలు_ అంతకు మించిన ఐశ్వర్యవంతురాలు, అయితే అయివుండవచ్చు గాని అవేమీ అతడ్ని ఆకట్టుకోలేదు. ఆమెలో అన్నిటిమించిన పెద్ద అలంకారం 'స్రీత్వం' అతడ్ని ఆకట్టుకుంది.
ఆమె ముఖం స్వచ్చంగా అమాయకంగా కనబడుతోంది.
అతడి జీవితానికి మరణమే చివరది_ ఆఖరి అధ్యాయంలో వుందికాని ఆమెకి దఎయమే జీవితం. ఆమె జీవితానికి కమాలేగాని పిల్ స్టాపు లేవు.
ఆ నిశబ్దంలోనుంచి ఓ సంనతిస్వరం వినిపించింది_ అది కావ్యాది
తన కాళ్ళ ముందు కదలాడుతున్న మెరుపుతీగే వంపు సొంపుల్నుంచి సంస్కారయుతంగా దృష్టిని ప్రక్కకి మరల్చాడు.
ఆమె తెల్లటి శరీరంమీద మరింత తెల్లగా మెరుస్తున్న వెన్నెలను చూసే స్థితిలో లేడతను. అంతకు కొద్ది క్షణాల క్రితం గొప్పగా అనిపించిన భావాలు ఇప్పుడు ఏమీ అనిపించడంలేదు.
"అపెశారేం..." గాలికి ఎగురుతున్న ముంగురుల్ని సవరించుకుంటూ అతడి ప్రక్కనే కూర్చుందామె!
అదే మరొకరయితే, మరొక సందర్బంలో ఆమె అయినాసరే పెద్దగా పట్టించుకునేవాడు కాదు. కాని చాలా తక్కువ మాటలతో ఎక్కువ భావాన్ని స్పురించెట్టు ఆమె మాట్లాడిన మాట, చివరకి ఆమె కూర్చున్న భంగిమలో నున్నఅవునూ ఠీవి అతడ్ని అదోరకమైన సంభ్రంలో పడేసింది.
పులికన్నా ప్రమాదకరమైన వ్యక్తితో తాను ఒంటరిగా పరాయణ చేస్తున్నానన్న భావన ఆమెకు లేదు.
"అవునూ... నేను పని చెప్పగానే 'ఓ.కే.' అన్నావు నాకు ప్రత్యర్దులు ఎవరయినా వున్నారేమోనని ఎందుకు అడగలేదు?" తిరిగి రెట్టించిందామె.