ఆమె ప్రశ్న పెదవులమాటునుంచి బయటకు రావడమైతే వచ్చిందిగాని విపరీతమైన ఆ హొరుగాలిలో, కెరటాల పెనుభీభత్సంలో ఆమె నోటినుంచి వెలువడిన మాటలు అతని చెవివరకురాలేదు. ఆమె భావాలను అర్ధంచేసుకున్న వాడిలా తంబి హెడ్ లైట్ అన్ చేశాడు.
కొన్ని వందల వేళ వెలుగు కిరణాలు ఒకటయి చీకటిని దహించి వేస్తున్నా అనుభూతికి లోనయింది.
కావ్య దగ్గరకివస్తూ అన్నాడు_
"మేడమ్! హొల్దాలు పరుస్తారు. జాగ్రత్తగా లోపలకూర్చోండి. డిసీజ్ డేంజరస్ జోన్, అలవాటు లేకపోతే అలల తాకిడికి పడిపోగలరు__"
అతడు అడిగిన విషయమై పట్టించుకోకుండా అన్నది__ "ఆ కనిపిస్తున్న లైట్లేమిటి" అని!
"అవన్ని షిప్స్,తీరానికి అయిదు_పది కిలోమీటర్ల దూరానవున్నాయి. ఆ షిప్స్ లోని లోడ్ ని అన్ లోడ్ చేసి తీరానికి తీసుకోస్తుంటారు. రాత్రివేళల్లో మా బోటివాళ్ళు బోటుల్లో వెళ్ళి స్మగుల్ద్ గూడ్స్ తీసుకోస్తుటాం. మమ్మల్ని పట్టుకోవడానికి కస్టమ్స్ వారు గస్తీ తిరుగుతుంటారు. స్మగ్లర్స్ బావుతులకి లైట్స్ వేయరు లైట్స్ వేయరు లైట్స్ తో వస్తున్న బోట్సుతో వస్తున్నబోట్సుతో స్మగుల్డ్స్ గూడ్సు వుండవు జాగ్రత్తగా గమనిస్తే సముద్రం మీద ఒకటి రెండు చోట్ల తిరుగుతున్నా లైట్స్ కనిపిస్తుంటాయి అవి కస్టమ్స్ శాఖవారివి__" అంటూ ఆమెకు హొల్దాలుపరిచే ప్రయత్నంలో నిమగ్నమయ్యాడు తంబి.
నీటిలో మొసలి ఎంతటి బలవంతురాలో, సముద్రంలో స్మగ్లర్స్ అంతటి బలవంతులు. ప్రజసందోహం ఎక్కువుగా వున్నభూమిపైన శాంతిభద్రతలు కాపాడటం ప్రభుత్వానికి ముఖ్యంగాని సముద్రంలో జరిగే విద్రోహచర్యలు ప్రభుత్వానికి ముఖ్యంగాడు. జాతి సమగ్రతకు, దేశభద్రకు ప్రమాదం వాటిల్లి టేనే ప్రభిఉత్వం తీక్షణంగా పరిశీలిస్తుంది. భూమిపై ప్రజల ధనమాన ప్రాణ రక్షణకు ప్రాధాన్యత యిస్తుంది. ఏ ప్రభుత్వమైన....ప్రజాజీవనం స్తంభించదు. అంతకుమించి దేశానికి మూడువైపులవున్నా సముద్రంమీద మున్నూట అరువది అయిదురోజులు_రాజుకున్న ఇరవై నాల్గంటలు కాపలా కాయడం అసాధ్యం. శత్రువులు సముద్రం మీదగా రాకుండా, ఏ విధమైన విద్రోహ చర్యలు జరపకుండా మాత్రమె గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సముద్రం మీదుగా దొంగా రవాణా జరగకుండా ప్రభుత్వం తీసుకునే జాగ్రత్తలు నామాత్రంగా వుంటాయి. కస్టమ్స్ అధికారులు తీరంవెంబడి జీపుల్లోను, మరపడవుల్లో సముద్రంమీద మెరుపుదాడులుజరుపుతారు. కనీ వారు రైడింగ్ కి బయలుదేరడానికి ముందే ఆ సమాచారం స్మగ్లర్లకు అందుకుంది. స్మగ్లర్లు బలవంతుడయితే, ఆ ఏరియా వదిలి మిగతా ప్రాంతాలలో కస్టమ్స్ వారుదాడులు నిర్వహిస్తారు. అదే,స్మగ్లర్లు అంత ప్రముఖవ్యక్తి కాని పక్షంలో కస్టమ్స్ వారున్న ప్రదేశాన్ని విడిచిపెట్టి మిగిలిన రేవుల్లో స్మగ్లర్స్ తమ కార్యాకలాపాలు నిర్వహిస్తారు. సముద్రంమీద స్మగ్లర్స్__ కస్టమ్స్ వారుదాడులు పాము_ ముంగిసుల పోరాటంలా వుంటుంది. ఓడనుంచి స్మగ్లర్స్ గూడ్స్ తీసుకుని మరవడలో'జెట్టి' ని అడ్డుకోవచ్చు. సర్వ సాధారణంగా సముద్రంమీద కూడా కస్టమ్స్ వారు దాడి చేస్తున్నప్పుడు వారికి అందకుండా తప్పించుకోవడం లేదా తక్కువ విలువగల సరుకు వుండే సరుకుని సముద్రంలోకి నెట్టివేయడం జరుగుతుంది. కాని 'జెట్టి' విలువయినది అయిన పక్షంలో కస్టమ్స్ వారితో ప్రచున్న పోరాటానికి దిగుతాడు. ఎదురు కాల్పులు జరుపుతాడు. తమ బావుతుతో కస్టమ్స్ వారి బోటున డీకొన్న సంఘటనలు కూడా కొన్ని వున్నాయి. 1976 సేక్టంబర్26న బొంబాయి హార్బర్ లో జరిగిన కస్టమ్స్ వారి బోటు ప్రమాదం ఈ కోవకే చెందింది.స్మగ్లర్స్ తమ సంకేత స్థలాన్ని చేరుకున్నా గుడ్డిగా తీరాన్ని చేరుకోరు. స్మగ్లర్స్ కి నీటిలో వున్నా బలం నేల మెడకు వస్తే వుండదు. ఆ ప్రాతంలో కస్టమ్స్ వారు లేరని 'కోడ్ మెసేజెస్' ద్వారా నిర్దారణ చేసుకున్న తర్వాతనే వారు తీరానికి వస్తారు. లేకుంటే అక్కడ్నుంచి మరొక ప్రదేశానికి తరలి వెళతారు. ఆ రెండోవా స్థలం దగ్గర కూడా కస్టమ్స్ అధికారులు వుంటే తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోతారు. పగల్లాచేపలు పడుతూ కాలక్షేపం చేస్తారు. తిరిగి మరుసటి రాత్రికి తమ ప్రయత్నాలు ప్రారంభిస్తారు 'జెట్టి' సముద్రంలో ఉన్నంతవరకు మహా బలవంతుడు. వారిపై దాడిచేసే ప్రయత్నం మాత్రం కస్టమ్స్ వారుయ్ చేయరు.
సైరన్ మోతతో ఓ వెలుగురేఖ తమ బోటువైపు చొచ్చుకు రావడం,తంబి కేకపెట్టడం కావ్య గమనించింది. తంబి కేకకు ప్రతిస్పందనగా తమ భోటు కూడా వచ్చి తమ బోటు ప్రక్కగా ఆగింది. ఆ బోటులో ఓ లైటు వృత్తాకారంలో తిరుగుతోంది. పేంటు, షర్ట్ టక్చేసుకుని, తలకు టోఫీ ధరించి యూనిఫాంలో నున్న వ్యక్తులు ఇద్దరు తమ బోటులోనుంచి తంబి. వారు ఆ పడవ లోపలకి పరిశీలనగా చూసి కావ్యవైపు చూస్తూ ఏదో ప్రశ్నించారు. తంబి ఏం సమాధానం చెప్పాడోగాని, కొద్ది నిమిషాల తర్వాత తంబి ఇచ్చిన బాటిల్స్ తీసుకుని తమ పడవలోకి వెళ్ళిపోయారు. కస్టమ్స్ వారి పడవ వెళ్ళిపోవడంతో తంబి తమ పడవ ఇంజను స్టార్టు చేయించాడు. తనకు తెలియని, తాను చూడని వింత ప్రపంచాన్ని దర్శిస్తోంది. రైలులో ప్రయాణించింది, విమానంలో ప్రయాణించింది గని అప్పటివరకు సముద్రయానం చేయలేదు. అందుకే వింత అనుభూతికి లోనయింది. క్రమక్రమంగా అలలతాకిడి సద్దుమణిగి, ఆ నీళ్ళలో ఫైవ్ స్టార్ట్ హొటల్ వంటి ఓడ దగ్గరవడం ప్రారంభించింది. ఓడ దగ్గరవు తున్న కొద్దీ తామెంత చిన్న పడవలో ప్రయాణిస్తున్నదీ అర్దమైంది. ఆ ఓడ దగ్గరకు వెళ్ళాలని మనసులో ఎక్కడో ఓ మూల చిన్న ఆశ చిగురించింది. కాని ఆ ఓడకు దూరంగా తమ లాంచీని మరలించడంతో 'అహం' అడ్డొచ్చి తనను తాను నిగ్రహించుకుంది కావ్య.
* * * *