Previous Page Next Page 
స్టార్ వార్స్ పేజి 22

    "అల అడగటం మర్చిపోయి చాల రోజులయింది."

    "అదేం..."

    "అదంతే" అని, "ఇంతకీ మీ పేరేమిటి?" అనడిగాడు.

    సమాధానంగా టక్కున నవ్వింది.

    "ఓహొ అదా మీ పేరు_" ఆమె పేరేమిటో తెలిసినవాడిలా అన్నాడు.

    "అదా అంటే...." ఈ పర్యాయం ఆమె భ్రుకటి ముడిపడింది.

    "లాస్య...."

    "కాదు కావ్య..."

    "నవ్య..." ఆ ప్రయత్నంగా అన్నాడు.

    "నవ్యా...?" రెట్టించిందామె.

    "అవును మా ఇంటి ప్రక్కవాళ్ళమ్మాయి పేరు 'నవ్య' పాపాయి దివ్యంగా వుండేది. నీ పేరేమిటమ్మా అంటే 'నెయ్య' అనేది. న ఎదుటనున్నది ఈ 'కావ్య' ఆ 'నవ్య' అయితే ఎంత బాగుండేది...!" స్వగతంగా అనుకుంటూన్నట్టే పైకి అన్నాడు.

    "నవ్య న్యూమరాలజీ ప్రకారం మంచిదికాదు. న్యూమరాలజీ నమ్మేవారెవరూ 'నవ్య' అన్న పేరు పెట్టారు. 'కావ్య' అని పెడతారు.

    ఇహా ఆ సంభాషణ అతడికి రుచించినట్లు లేదు. వేరే సంభాషణ ప్రారంభిచాడు. అలాగాక ఆ సంభాషణే పొడిగించి వుంటే ఈ కధమరో చిత్రమైన మలుపు తిరిగి వుండేది.

    "అవునూ, ముఖంమీద ఆ గాటేమిటి?"
 
    "ప్రతివారికీ అరచేతితో ఫేట్ లైన్ అనేది వుంటుంది. కాని బ్లడీ బీచ్ లో, రైల్వే ప్లాట్ ఫారమ్స్ మీద, దేవాలయాల మెట్ల మీద ఎంగిలి మేతుయ్కులు తిని, పచ్చినెత్తురు తాగుతూ బ్రతికే నాలాంటి వాళ్ళకు ఫేట్ లైన్ ముఖంమీద వుంటుంది. దట్సాల్ " అని సమాధాన మిచ్చిన తంబి స్మృతిపథంలో  గతం మెదిలింది.

    గాంగ్ వర్ష అతి భయంకరమైనవి.

    మాఫియా ఎంతటి పటిష్టమైనది అంటే అమెరికావంటి దేశంలో ప్రెసిడెంట్ గర్ల్ ప్రెండ్ ఎడా ప్తేడ్ సన్ తప్పిపోయాడు. ఆమెకు అమెరికన్  ప్రేసిండెంట్ తోనేకాక, మాఫియా లీడర్ తో కూడా పడకగది పరిచయం వుండి. తప్పిపోయిన పెంపుడు కొడుకుకోసం ఆమె అమెరికా అద్యుక్షుణ్ణిసాయం కోరింది. ఫలితంగా ఫోలీసు యంత్రాగాన్ని అప్రమత్తంచేయడం జరిగింది. టి.వి ప్రకటనలు గుప్పించటం జరిగింది. అయినా ఫలితం లేకపోవడంతో యిదేవిషయాన్ని మాఫియా కింగ్ దృష్టికి తీసుకెళ్ళిందామె. అంతే!! రెండే రెండు గంటల్లో ఆ పిల్లవాడు ఆమె దగ్గర వున్నాడు.

    మాఫియా ప్రాబల్యాన్ని ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయి.

    ఫోలీసు యంత్రంగం దీనికొక చిట్కా కనిపెట్టింది. మాఫియా సహకారం లేనిదే అరాచక శక్తుల్ని అరికట్టడం అసంభవం... మాఫియాతో ముఖాముఖీ  పోరాటానికిదికి తమ ప్రాణాలు పోగొట్టికోవడం అవివేకం అన్న నిర్ణయానికి వచ్చారు. మాఫియాని కంట్రోల్  చేయడానికి మాఫియ వర్గాల సకకారాన్ని తీసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఇందులో భాగంగా ఒక వర్గంలోనివార్ని చంపి ఆ పనిచేసింది రెండోవర్గం వారు అన్న అభిప్రాయం కలిగేలా చేయడం ప్రారంభిస్తారు. దీని కోసం పోలీసులే హత్యలు, దోపిడీలు, చేశారు. ఫలితంగా మాఫియ వర్గాల మధ్య వైరుధ్యం చేలరేగింది. ఒకర్నొకరు అంతం చేసుకోవడానికిరంగంలోకి దిగారు. స్ట్రీట్ వార్స్ ప్రారంభమయ్యాయి.

    ఆ చనిపోతున్న వారెవరో... ద్వ్మ్సమవుతున్న ఆ షాపులు, ఇల్లు,ఎవరివో పోలీసులకి తెలుసు. అయినా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడం ప్రారంభించారు. ఇదే సూత్రాన్ని బొంబాయి ఫోలీసులు  కూడా అనిసరించారు.        
    పోలీసుల ఎత్తుగడకి తమవాళ్ళు చిత్తయిపోవడం.... మాఫియా పెద్దల్ని కలచివేసింది. ఇండియన్ కరెన్సీ విలువని, మార్కెట్లో గోల్డ్ సిల్వర్ రేటుని కంట్రోల్ చేస్ది ఈ మాఫియా లీడర్లె! రాజీవ్ గాందీ పారిశ్రామిక పథకం ప్రకారం కంప్యూటర్స్ వాడకం పెచ్చుపెరిగింది.

        ఈ కంప్యూటర్స్ తయారీకి సిల్వర్ అచ్వసరం వుండి. ఒకానొక దశలో సోల్వర్ రేటు గోల్డు రేటుని అధికమించే పరిష్టితి ఏర్పడింది. ఇదే జరిగితే ఇంటర్నేషనల్స్ మార్కెట్ లో రూపాయి విలువ మరింత అద్వాన్నమవుతుమ్ది. ఎక్స్ పోర్ట్... ఇమ్పావుర్టు పాలసీకి అనుగుణంగా గోల్డు, సిల్వర్ దిగుమతి చేసుకోవాలి. కాని సిల్వర్ నెస్సిసటీ ఎక్కువుగా వున్నా అ సమయంలో ఇండియన్ కంప్యూటర్స్ యుగంలోకి వెళ్ళాడానికి దోహదపడింది. ఈ మాఫియ గ్రూపులే! స్మగుల్టు గోల్డు క్వామ్తితి ఇండియన్ గోల్డు మార్కెట్ ని... ఇండియన్ ఎకానమీని డిసైడ్ చేస్తంది!! ఆంద్రప్రదేశ్ రాష్ట్రా రాజధానిలో మతకలహాలు ఎందుకు, ఎలా చెలరేగుతున్నాయో అందరీకి తెలిసిన విషయమయినా ఏ విధంగా వాటిని అరికట్ట లేకపోతున్నారో అదే విధంగా ఇండియన్ మాఫియా గ్రూప్స్ ని అంత మోదించడానికి ప్రజా ప్రతినిధులు ఏ ప్రయత్నమూ చేయడంలేదు.

    పోలీస్ యంత్రాంగం మాత్రం తనను తము కాపాడుకోవడానికి అమెరికన్ పోలీసులు ప్రయోగించిన చిత్కానే ప్రయోగించారు. ఫ్గాలిటంగా మాఫియా అండర్ వరల్డు లో గ్యాంగ్ వార్స్ ప్రారంభమయ్యాయి. అడ్రస్ తెలియని శవాల సంఖ్య అధికమయింది. ఈ సందర్బంములోనే మాఫియా పెద్దలంతా ఒకటయ్యారు. గ్యాంగ్ వార్స్ అరికట్టడానికి మాఫియా గ్రూపుల మధ్య సఖ్యత కుదర్చడానికి సుదీర్ఘ చర్చలు జరిపారు. చివరకు టేరటరీస్ ప్రాతిపదికగా ఓ నిర్ణయానికి వచ్చారు. ఒక ప్రాంతంలోకి వారు రెండవ ప్రాంతానికి వెళ్ళకూడదు... వెళ్ళినా అక్కడి విశాలలో జైక్యం కల్పించుకోకూడదు. ఒకవేళ అటువంటి అవసరం ఏర్పడితే ఆ ప్రాంతంలోకి మాఫియ లీదర్నీ సంప్రదించాలి అతడు ఆ పని తనవారి చేత జైక్యం చేసుకోవడంగాని, గ్యాంగ్ వర్ష అరవడంగాని జరగదు. ఈ ఒడంబడిక అందరికి అమోదమయింది. ఒక్కొక్క ప్రాంతానికి ఒఅక్కావుక్క గ్యాంగ్ వెలిసింది. అ ఏరియాలోని వారు ప్రత్యేకించి స్లమ్ డ్వేలర్స్ తమ అవసరాలకు ఈ గ్యాంగ్ లీడర్ల దగ్గరకు రావడం ప్రారంభించారు. రేషన్, వాటర్ దగ్గర్నుంచీ అన్నీ వీరికి సక్రమగా చూసే బాధ్యత ఈ గ్యాంగ్ దయింది. సిల్లీ తగాదాలను పోలీసు స్టేషన్ లకి వెళ్ళడం మానేశారు. ఎవరికీ ఏ అవసరం వచ్చినా... అన్ని వేళలా ఆదుకోవడానికి ఈ గ్యాంగ్ సిద్దం! ఆకలితో చచ్చేవారు దాదాపుగా లేరనే చెప్పాలి. పోలీసు స్టేషన్ లో నిర్భంధాలు లేవు. కోర్టుకి వెళ్లవలసిన అవసరం లేదు. ఇందుకు ప్రతిగా ఆ ప్రాంతంలో నివసించేవారు తను రాబడినిబట్టి నేలకు కొంత మొత్తాన్ని రౌడీ మాములుగా చెల్లించమని వచ్చేది. దీనిలో కొంతభాగం పోలీసులకు ముట్టజెప్పావారు. పర్యవసానంగా అ గ్యాంగ్ కి వ్యతిరేకంగా పోలీసు రిపోర్టు యిచ్చేవారుగాని, ఆ కేసుని రికార్డు చేసుకునేవారుగాని లేరు. నం కా వస్తే ఆ గ్యమ్గు కి ఆ పేటలో ఓ చినన్ దుకాణం వుంటుంది. కాని అసలు వ్యాపారం వేరు.
 

 Previous Page Next Page