Previous Page Next Page 
సక్స్ స్ పేజి 19



    "సంజీయ్ గాంధీ చనిపోయాక ఆస్తిలో సమాన వాటా కోసం మేనకాగాంధీ, అత్త ఇందిరాగాంధీ  మీద యుద్దాన్ని ప్రకట్టించిందంటారు. బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, రక్తసంబంధం, ప్రేమ__అంతా బూటకమనిపిస్తుంది__ఈ వివాదాల్ని చూస్తుంటే....."

    అని ఒకరు__

    చిన్నసైజ్ ఆడిటోరియమ్ అంత ఉన్న  ఆ హల్లో గంభీరమ్తెన నిశ్శబ్దం పేరుకుంది.

    ముక్తనంద ఏమంటుంది? అని అటు రవిచంద్రేకాదు___ఇటు వసుంధరాదేవి ,లాయర్ సూర్యసాగర్ -మిగతా బంధుమిత్రులు కూడా ఊపిరి బిగపట్టి ఎదురు చూస్తున్నారు.

    ఒక్క క్షణం భారంగా గడిచి పోతుంది.

    అప్పడే ఆ క్షణానే  ముక్తానంద తన అభిప్రాయం  చెప్పకుండా ఉంటే బావుండని సూర్యసాగర్  ఉద్దేశం.

    ఆ ఉద్దేశాన్ని  ఎలా తెలియ  పర్చాలి అందరిలో....? అలా చేస్తే ఆమెను తను  ప్రభావితం  చేసినట్లు భివిస్తారు....?ఎలా....?ఎలా....?

    అప్పుడు స్పురించిందో ఐడియా....

    వెంటనే వసుంధరాదేవి వేపు చూసి సంజ్ఞ చెసాడు, దాన్ని క్షణాల్లో అర్ధం చేసుకున్న వసుంధరాదేవి మెల్లగా  ముక్తనంద వద్దకు వెళ్ళి సముదాయిస్తున్నట్లుగా__

    "చెప్పమ్మా....ని అభిప్రాయం చెప్పు" అందరికి వినిపించేలా అని-"అరగంట టైమడుగు___సూర్యసాగర్ గారితో చర్చిచాక ఒక నిర్ణయానికిరా" అని తలవంచుకొని, తన పెదాల కదలికను దాచిపెడుతూ చిన్నగా  అంది.

    ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న కన్నా తండ్రి దహన సంస్కారం పూర్తయి మూడు గంటలు  కూడా కాకుండానే ఆ వివాదం తలెత్తటం ఆమెకు బాధగా ఉంది.

    తన తండ్రి తరువాత తను బాగా గౌరవించేది మేనత్త  వసుంధరా దేవిని__లాయర్ సూర్య సాగర్  అందుకే మేనత్త  మాటని  గౌరవించా  లనుకుంది.

    తన అన్న ప్రక్కన ఉన్నవార్ని చూసి  తనకు ఏదో అనుమానంగా కూడా ఉంది.

    "నాకో అరగంట టైమ్ కావాలి"  అని అంది ముక్తానంద పెద్దేగా.

    దాంతో కలవరపడిపోయాడు రవిచంద్ర.

    అది న్యాయ సమ్మెతమె__ ఆలోచించుకొనే చెప్పనివ్వండని అక్క డున్న  చాలామంది  అభిప్రాయపడటంతో __విధి లేక సరే అన్నాడు రవిచంద్ర.

    ముక్తానంద లోపలకు వెళ్తూ మేనత్తని, సూర్యసాగర్ ని లోపలకు రమ్మని సంగ్న్ చేసింది.

    అది చూసి రవిచంద్ర షాక్ తిన్నాడు.

    ఇకిప్పాడు తన చేల్లెలికేదో సూరిపోస్తారా యిద్దరు అని అనుకున్న రవిచంద్ర__

    "నివు తీసుకొనే నిర్ణయం  నిద్తే ఉండాలి__మరొకరి ప్రమేయం  ఎందుకు....?" అంటూ అడ్డు తగిలాడు రావిచంద్ర.

    "ఫామిలి లాయర్ తో సంప్రదించుకొనే హక్కు ని చేల్లెలికుంది కోట్లతో వ్యవహారం ....పరువు ప్రతిష్టలకు  సంబంధించిన వ్యవహారం ఇది.ఎవరితో సంప్రదించావద్దనే హక్కు నీకు లేదు...." వసుంధరా దేవిఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అంది.

    "అవును....ఆమె ఇష్టమొచ్చిన వారితో సంప్రదించుకోవచ్చు. అక్కడున్న నలుగురు అనడంతో రవిచంద్ర నోరుకట్టేసినట్లయిపోయింది.

    సరిగ్గా అరగంటకు తన గదిలోంచి బయటకొచ్చింది ముక్తానంద

    ఏం నిర్ణయం తీసుకుందని అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తూండగా__నోరూ విప్పింది ముక్తానంద.

    "నువ్వొక్కడివె నాన్నగారు వదిలేసి  వెళ్ళిన వ్యాపారాన్ని నిర్వహించటానికి నేను అంగీకరించటం లేదు ఇందులో నాకూ సమన వాటా హక్కు ఉంది." అంది  గంభిరంగా.

    వసుంధరాదేవి__సూర్యసాగర్ మొఖాలప్తే వెలుగు....

    రవిచంద్ర వర్గం, బాంబు మీద కాలేసినట్లు ఉలిక్కిపడ్డాడు.

    లాయర్, తన మేనత్త ముక్తనందకు నూరిపోసినట్లు రవి చంద్రకు  అర్ధమ్తెపోయింది. అతని ముఖం అవమానంతో ఎర్రబడింది.

    ముఖ్యంగా తన ప్రెండ్స్ ముందే తన చెల్లెలు తనకు అడ్డం తిరగటాన్ని జీర్ణించుకోలేకపోయాడు రవిచంద్ర అసలా  ప్రస్తావన  అప్పుడు  తీసుకొచ్చి ఉండవలసింది కాదేమో....విడిగా తన చెల్లెల్ని కలిసి లాలించి, బుజ్జగించి  ఉంటే  పనయిపోయుండేదేమో.....ఎస్ ఖచ్చింతంగా అలా చేసుంటే పని జరిగిపోయేది.

    లాలించి, బుజ్జగించకపోయినా, ముక్తానంద తన అన్నకు  అడ్డు వచ్చేది కాదు- తలకొరివి పెట్టవలసిన కొడుకు లాభపడేదేప్పుడు....? తండ్రి శవం ఇంట్లో  ఉండగానే కదా_అని తన అన్న బ్లాక్  మెయిల్  చేయటాన్ని  లాయరు ద్వారా తెలుసుకున్న ముక్తనంద మనస్సు విరిగిపోయి కసిగా అడ్డం తిరిగిందని రవిచంద్రకెలా తెలుస్తుంది.

    "నేను  ఏం.బి.ఎ చదివింది పెళ్ళి చేసుకుని , వెళ్ళిపోడానిక్కాదు. మా తండ్రిగారు ఇన్నాళ్ళూ నిర్వహించిన  బాధ్యతల్ని  నిర్వగించడానికి .... తన తర్వాత ఈ ప్రాపర్టిని చూసుకొనే బాధ్యతని నాకే  అప్పగించాలని  ఆయనకు కోరికగా  ఉండేది....ఆ విషయమై ఆయన, నాతో చాలాసార్లు  చర్చించారు కూడా... ఎలక్షన్లలో ఆయన  పాల్గొనే సందర్భంలో కూడా నేను పాలిటిక్స్ లోకి వెళుతూన్నాను...నువ్వు మన బిజినెస్స్ ల్ని  చూసుకో వాలి...." అని ఒకసారి నాతో అన్నారు.

 Previous Page Next Page