Previous Page Next Page 
అమ్మో! అమ్మాయిలు పేజి 19

    ఇంతెందుకు కన్య- కుమారిలో దాసరి అంటాడు కన్య కయినా కుమారికయినా శాంతం భూషణం అన్నాడండి."

    అబ్బులు అడ్డు తగిలి " ఒరేయ్ కర్ణ! దాసరి ఆ మాట అనలేదు, అసలో మాట.." అంటూ ఏదో చెప్పబోయాడు.

    వెంటనే వ్యాకర్ణ కోపంతో తాటిచెట్టు ప్రమాణాన లేచి" అబ్బూ! ఆ మాట దాసరి గాకపోతే మరో గడుసరి అన్నాడు సరా! పోనీ సోగ్గాడులో జయచిత్రతో రామానాయుడు ఏమాన్నాడు?

    ఆడపిల్లకు కోపం కూడదు అన్నాడా? లేదా? ఆలుమగల్లో హలం..." అబ్బులు చటుక్కున వ్యాకర్ణ నోరు మూశాడు.

    మూసి," మావాడు నోరు తెరిస్తే మనిషి కాదండి" అన్నాడు.

    జయచిత్ర యింక నవ్వపుకోలేక పడిపడి నవ్వింది. నవ్వాపుకోలేక గదిలోంచి నోళ్లు బైటికెళ్ళి పోయింది.

    జయచిత్ర బైటికెళ్ళిందని ప్రస్తుతం తిరిగిరాదనీ రూడీ చేసుకుని వ్యాకర్ణ, అబ్బులు నోళ్లు తెరిచారు.

    " మనం పిచ్చిపిచ్చిగా వాగరాదు. బహు డెంజరు " అన్నాడు వ్యాకర్ణ.

    " నాకుకాదు పిచ్చివాగుడు. ఎక్కువయింది నీకు. జయచిత్రను చూసిం తరువాత నీ వళ్లు నీకు తెలియటం లేదురా.

    సమయానికి నే ఆదుకోబట్టి సరిపోయింది.లేకపోతే మళ్ళీ టులెట్ బోర్డ్ వెతుకుతూ వీధిని పడే వాళ్ళం నీ..." గదిలో కోస్తున్న మాసిన లూజు లాల్చిని చూసి నోరు మూసుకున్నాడు అబ్బులు.

    " నా పేరు దార్మరాజు." అంటూ లోపలికొచ్చాడు లూజు లాల్చీ.

    " ఎవరికోసం వచ్చారండి?" అన్నాడు వ్యాకర్ణ.

    " మేముండేదా? కుడినుండి ఎదమకుమ్తిరిగి మళ్ళీ కుడికి తిరిగితే వచ్చే వాటాలో మేముంటున్నాము. మి పేరు?" అన్నాడు ధర్మరాజు.

    ఒరేయ్, కుంతిపుత్రా కర్ణా! యీయన మి ధర్నరాజురా! నే అనుకున్నాను. బమగారి పేరు ద్రౌపతి కదా! ధర్మరాజం టే అని... పొరపడి వెంటనే గ్రహించాను.ఈ ధర్మరాజు చెమిటి మాలోకం అని... ఏంచేద్దాం?" అన్నాడు అబ్బులు.

    " ఏం చేద్దామంటే యేం చెపుతాను? ఏదో ఒకటి చేద్దాం" అన్నాడు వ్యాకర్ణ.

    వీళ్ళు మాట్లాడుకుంటున్నది ఏమిటో వినపడని ధర్మరాజు " మి పేర్లు బాగున్నాయి అబ్బాయిలూ! నాకు పేర్లు పెట్టి పిలవటం యిష్టంలేదు. అబ్బాయీ అంటాను.

    అలా పిలిపించుకోవటం మికూ యిష్టమా? సంతోషం సంతోషం." అన్నాడు బోలెడు సంతోషంతో.

    అబ్బులు, వ్యాకర్ణ ముఖముఖాలు చూసుకుని ఆపై ధర్మరాజు ముఖం చూశారు.

    " ఇంటివాళ్ళు మికు దూరపు బంధువులా? ఆహా ఏం లేదు. మిరు ఈ ఇంటికి రాంగానే బామ్మగారు జయచిత్రమ్మ వచ్చి మాట్లాడటం చూసి అనుకున్నాను" అన్నాడు ధర్మరాజు.

    " బందువులు కాదండి" మర్యాదగ చెప్పాడు అబ్బులు.

    " అద్ అది సంగతి. బంధువులు కాబట్టే ఆ ఆది... ఆ ఇది..." అన్నాడు ధర్మారాజు.

    " ఈయనెక్కడ దొరికాడురా మనకి?" విసుక్కున్నాడు వ్యాకర్ణ.

    " అదేంటిరా అబ్బాయ్! అప్పుడే మర్చిపోయావా? జయచిత్ర చెప్పలా? తూర్పునుంచి పడమరకి తిరిగి ఆపై ఎడం వైపు తిరిగితే చెమిటి మారాజు తగులుతాడు జిడ్డు అని?"

    " లెట్రిన్ కెళ్ళే రూట్ లో వుందా! బాత్ రూం కెళ్ళే రూట్ లోవుందా, ఈయనగారి కొంప?"

    " ఆయన్నే అడుగు."

    " సరాసరి నోరు విప్పకపోతేనే ఈయన అరగంట మాట్లాడుతున్నాడు. నోరు తెరిస్తే ఈ మహానుభావుడు యిక్కడ నుంచి కదలడు. అన్నింటికి మనం చిరాగ్గా ముఖం పెడదాము. వెళ్ళిపోతాడు."

   

 Previous Page Next Page