సక్స్ స్
-సూర్యదేవర రామ్ మోహన్ రావు
SUCCESS CAN BE ACHIEVED ONLY THROUGH REPEATED FAILURES, AND INTROSPECTION.
-siochiro Honda
JAPAN
న్యూడిల్లీ: మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంట అయింది.
రాష్టపతి భవనంలోని దర్బారు హాలు, దేశ, విదేశీ ప్రముఖులతో , పారిశ్రామిక వేత్తలతో, ఎందరో సెలబ్రటిలతో రాజకీయ నాయకులతో , సిని ప్రముఖులతో , వివిధ తమ్గాలకు చెందిన మేధావి వర్గాలతో కళకళ్ళాడుతోంది.
అంతటా కొత్త ఉత్సాహం ...చిరునవ్వులు ... పరామర్శలు ....పలకరింపులు....ఉద్వేగం .. ఉద్రిక్తత ....మరికొన్ని నిమిషాల్లో , కొత్త ప్రధానీ , తన మంత్రి వర్గ సహచరుల జాబితాను ప్రకటించనున్నారు.
మంత్రి వర్గ ప్రమనోత్సవ కార్యక్రమాన్ని దేశ్ వ్యాప్తంగా రిలే చెయ్యడానికి దూరదర్శన్ సిబ్బంది ఆఘ మేఘాల మీద ఏర్పాట్లు చేశారు.
దూరదర్శన్ ఏర్పాటు చేసిన ఆర్క్ ల్తెట్ల వెలుగుల్లో దర్భారు హాలు, వేండిపూత పూసినట్లు మెరిసిపోతోంది.
అంతవరకూ దేశాన్ని పాలించిన వామ పక్షాల కూటమిలో, ప్రధానీ పదవి కోసం తలెత్తిన వివాదం వాళ్ళ, ఆ కూటమి మెజార్టి కోల్పోవటంతో నెలరోజుల క్రితం , దేశంలో మధ్యతరం ఎన్నికలు జరిగాయి.
ఆ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టి అధికారంలో కొచ్చింది.
రాష్టపతి హుందాగా లోనికి అడుగు పెట్టటంతో దర్భారు హాలు నిశ్శబ్దాన్ని ఆశ్రయించింది. ఆ పక్కన దర్జాగా చిరునవ్వులు చిందిస్తున్న ప్రధాని.....
రాష్టపతి , ఎత్తయిన సింహసనమ్మిద ఆఫిసులయ్యారు. ఆయనకు కొంచెం దూరములో ప్రధానీ....పక్కన ప్రధానీ కార్యాలయ ఉన్నతాధికారులు, చేతుల్లో ప్తేల్స్ తో నుంచున్నారు.
డెబ్బయి యేళ్ళ ప్రధానీ గుంభనమ్తెన వ్యక్తి- ఆరితేరిన రాజకీయ కురువృద్దుదయన, అందుకే మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయో అనుహ్యంగా ఉంది.
అతి సన్నిహితులక్కూడా తెలియకుండా రహస్యంగా ఉంచాడయన.
అంతవరకూ పవర్ లాబీల్లో నలిగిన ఊహాగానాలు , పటాపంచల్తేపోయే క్షణమది.
రాష్టపతి భవన బయట....మంత్రి పదవులు వరించి , విచ్చేసే తమ నాయకులకు భారి ఎత్తున ఆహ్వానం పలికేందుకు వేల సంఖ్యలో గుమిగూడిన జనం.
బయట, లోపలా___
ఎక్కడా, అవామ్చానియ సంఘటనలు జరక్కుండా, కట్టుదిట్టమ్తెన పొలిసు పహరా....
రాష్టపతి భావనంప్తెన నిఘకళ్ళతో తిరుగుతున్న హేతికాప్టర్....
రాష్టపతి అనుమతితో ,అంతవరకూ తన చేతిలో వున్న ప్తేల్ ను తన కార్య దర్శికి అందజేశారు ప్రధానీ.
ఆ ప్తేల్ ను తీసుకొని, ఆ కార్యదర్శి మందుకు నడిచాడు.
* * *
సరిగ్గా 12-05 నిమిషాలు......
అశోకా ఇంటర్నేషనల్ హొటల్ లోని సూట్ నెం.116 ముందున్న లాంజ్ లో కొంతమంది ప్రముఖ వ్యక్తులు గుస, గుసగా ఏవో చర్చించుకుంటున్నారు.
అందరి కళ్ళల్లో ఆత్రుత....ఆ కళ్ళు సూట్ డోర్ వేపు మాటి, మాటికి చూస్తున్నాయి.
సూట్ లోపల, విశాలమ్తేన బెడ్ రూంలో___
డేస్సింగ్ టేబిల్ ఎదురుగా చురకత్తిలాంటి మీసాల్ని, దువ్వెనతో దువ్వుకొని, టై నాట్ ని సర్దుకుని , నిలువెత్తు అద్దంలో తనని తాను మరొకసారి చూసుకున్నారాయన.
ఆయన....
వాసిరెడ్డి హరికృష్ణమనాయుడు.
అరడుగుల, రెండంగుళాల హరికృష్టమనయాడు పసిడి పూత పూసిన, పాలరాతి విగ్రహంలా ఉన్నారు....దృడమ్తెన శరీరం....మేలిదిరిగిన కండరాలు ,విశాలమ్తేన కళ్ళు....పొడవాటి ముక్కు....
నీలం రంగు కోతులో మిలమిలా మెరిసిపోతున్నాడయన.
గత పదిహేనేళ్ళుగా భారత దేశపు బిజినెస్ వరల్డ్ లో ది గ్రేట్ డిక్టేటర్ అని అనిపించుకున్న హరికృష్ణమనాయుడు__
పుట్టింది రాయలసీమలోని ఓ కుగ్రామంలో, సెటిల్తెంది మద్రాసులో....సివిల్ కాంట్రాక్టర్ గా జీవితాన్ని ప్రారంభించిన హరికృష్ణమనాయుడు, ఇరాక్ కాంట్రాక్టరుగా మద్రాసులో తన ఎంప్తేర్ ని బిల్దఫ్ చేసారు. మద్రాస్ కేంద్రంగా చేసుకొని, ఆంద్రా , ఒరిస్సా , వేస్త బెంగాల్, మహారాష్టలో ఎన్నో బిజినేస్సుల్ని స్దాపించాడు.
ఆయన పట్టిందల్లా బంగారమ్తెంది .....చేపట్టిన బిజినెస్ కోట్లకు అధిపతిని చేసింది.
మొన్నటి వరకూ ఆయన కింగ్ మేకర్.....
కానీ నేడు .....దేశంలో అత్యధిక మెజార్టి ఆరులక్షల ఓట్ల ఆదిక్య తతో గెలిచినా పార్టి ...ఏం ,పి.... మరి రేపు.....? మరొక క్షణం తర్వాత__