Previous Page Next Page 
రివర్స్ గేర్ పేజి 2

    పురుషస్వామ్య ప్రపంచంలో స్త్రీని బలహీనురాలిగా చేసినప్పుడు, స్త్రీలు పురుషుల్ని బలహీనులుగా చెయ్యాల్సిన అవసరం వుందని కొంతమంది విద్యాధికులయిన మహిళలే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వినడానికి ఇది ఆశ్చర్యంగా వున్నా, కనబడకుండా విన్పిస్తున్న వాస్తవ కథలెన్నో ఇందుకు నిదర్శనంగా కన్పిస్తున్నాయి.
   
    1981వ సంవత్సరంలో వాల్ స్ట్రీట్ జర్నల్ లో, మల్టీఫుడ్స్ కార్పోరేషన్ కి చెందిన ఎగ్జిక్యూటివ్ ఇలా అంటున్నారు.
   
    To me, the amount of sexual attraction is tremendous. Women dress better. They have more money, They are more visible. Hormones will be hormones.
   
    1981 మార్చిలో గ్లామర్ మ్యాగజైన్ లో ఒక యంగ్ రిసెర్చర్ ఇలా అంటున్నారు-
   
    It's very difficult- spend ten hours a day with the women I work with. Thats' three times what I spend with my wife. The whole system is set up to fortar involvements.
   
    ఈ ఇద్దరి వ్యక్తుల అభిప్రాయాలనూ విశ్లేషిస్తే-Right to Equality చట్ట పరిధిలో మాత్రమే కాకుండా, సామాజికపరంగా కూడా వుండాలని అర్ధమవుతోంది.
   
    ఏ పరిస్థితుల్లో పురుషులు, స్త్రీలను అణచి వుంచుతున్నారు....? ఆర్ధిక స్వావలంబన లేకుండా చేస్తున్నారు....? వంటిటిలోని కన్పించని బానిసత్వం, ఆఫీసుల్లో వినిపించని అరాచకత్వాలకు చట్టాలెక్కడ....? అవి రుజువవుతున్నాయా....? కాకపోవడానికి కారణాలేవిటి?
   
    కొన్నేళ్ళ క్రితం రాజస్థాన్ లో సజీవ దగ్ధత్వానికి గురైన రూప్ కన్వర్ ఆ మూఢ విశ్వాసాన్ని ఎదిరించి, ఒక మగవాడిని ఆ మంటల్లోకి తోసేసి, తను ఎందుకు బయటపడలేకపోయింది?
   
    ఇప్పటికీ ఒక భర్త దగ్గర, ఉన్నతాధికారి దగ్గరా స్త్రీ గొంతెత్తి తన ఆవేదనను ఎందుకు బాహాటంగా వ్యక్తం చేసుకోలేకపోతోంది.
   
    చట్టపరమయిన ఆంక్షలు, సామాజిక పరమయిన అడ్డుగోడలూ స్త్రీకేనా?
   
    తను అనుకున్న దినలో ఒక ప్రేమను పొందడానికి, తన మనసులోని బలీయమయిన ఆకాంక్షకు సామాజిక రూపం ఇచ్చుకోడానికి స్త్రీకి స్వేచ్చలేదా?
   
    ఎప్పుడో పురుషులు చేసిన చట్టం ప్రకారమే ఇప్పటి స్త్రీని శిక్షించడం సబబా.....?
   
    మానసికంగా మానవత్వం అందరికీ ఒకటే అయినప్పుడు, సామాజికమయిన, చట్టపరమైన సమానత్వం ఎందుకు ఒకటి కాకూడదు?
   
    ఇప్పటికీ స్త్రీని సీతతోనూ, అనసూయతోనూ, అరుంధతితోనూ, ద్రౌపతితోనూ పోల్చడం, బానిస మనస్తత్వానీకి ఇంకా ఆమెను అంకితం చేయడానికే కాదా.....?
   
    స్వేచ్చా, స్వాతంత్ర్యాలు నీకున్నాయని, సంప్రదాయపు మూఢాచారాల సంకెళ్ళు త్రెంచుకోమంటూనే, ఇంకో పక్క కన్పించని సంకెళ్ళు వేయడమే కాదా....?
   
    ఫెమినిజమ్ లాంటి ఉద్యమాలకు మగవాళ్ళు బాష్యకర్తలుగా వ్యవహరిస్తూ, ఫెమినిజమ్ లోని 'నిజాన్ని' పక్కదారి పట్టించడానికి కారణమేంటి....?
   
    Relationships between the sexes on the job must be acknowledged and dealt with in light of Today's atmosphere of freedom and equality.
   
    Equality in and out bed is the goal if not the fully realized reality" అని వాదిస్తున్న నేటి తరపు మహిళ ఆర్తిలో వాస్తవం లేదా.....?
   
    పాతికేళ్ళు నుంచి డెబ్బైఏళ్ళు దాటిన ఒక మగవాడు, వయసుతో సంబంధం లేకుండా ఒక స్త్రీ వెనక పడొచ్చు. నిస్సిగ్గుగా తమ కామ ప్రకోపాన్ని వ్యక్తంచేసి, కోరిక తీర్చమని వేధించొచ్చు. ఆ స్త్రీ అందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తే, తన బలంతోను, ధనబలంతోనూ ఆమెను బలవంతంగా 'రేప్' చేసి. పైశాచికంగా ఆనందించొచ్చు. ఆటబొమ్మగా వాడుకుని, ఆడుకుని వదిలివేయొచ్చు.

    చట్టానికి దొరికినా, ఆ మనిషిలోని పశుత్వానికి శిక్ష పడదు. కానీ....
   
    ఒక యువతి, పురుషుడి పట్ల అలా ప్రవర్తిస్తే__
   
    ఒక పురుషుడు, ఒక స్త్రీని 'రేప్' చేస్తే, ఆ రేప్ కు గురైన వ్యక్తినే పెళ్ళి చేసుకోవాలనే సామాజిక సూత్రం కొన్ని ఆదిమవాసుల తెగల్లో ఇప్పటికీ బలమైన సాంఘిక సూత్రంగా వుంది.
   
    కానీ స్త్రీ మానసిక వైరుధ్యాల సంకల్పాలకు, సాంఘిక సూత్రాలు లేవు చట్టాలులేవు.
   
    స్త్రీ మనసును ఆర్ధ్రీభవింపచేసే ప్రేమలోంచి, కొత్త చట్టాలు పుడతాయి. కొన్ని సామాజిక సూత్రాలను నిర్దేశిస్తాయి. అలాంటి సామాజిక సూత్రాల అన్వేషణకు నాంది పలికిన ఓ ఆధునిక యువతి, సాహసానికి, పట్టుదలకు అక్షరబద్ధమే ఈ నవల.
   
                                      *    *    *    *
   
    అసలు కథ ప్రారంభం.
   
    సువిశాలమైన న్యాయస్థానం ప్రాంగణంలో సర్వసాధారణంగా అలముకోవలసిన గంభీరత్వానికి బదులు, గుస గుసలతో కూడుకున్న దిగ్బ్రాంతికరమైన వాతావరణం గూడు కట్టుకుని వుంది.
   
    సరిగ్గా ఉదయం పదకొండుగంటలు అయ్యింది....
   
    తొమ్మిదో నెంబరు కోర్టుహాలు గంట మోగింది.
   
    సరిగ్గా అదే సమయానికి ఇద్దరు న్యాయమూర్తులు కోర్టుహాల్లోకి ప్రవేశించారు.
   
    అందులో ఒకడు మహిళా న్యాయమూర్తి.
   
    విశాలమైన కోర్టు హాలు, చివరలో వున్న పెద్ద టేబుల్ కి వెనుక వైపున వున్న రెండు కుర్చీల్లో ఆ ఇద్దరూ ఆసీనులయ్యారు.

 Previous Page Next Page