చూడండి....రవిచంద్ర నాయుడుగారూ, ఈ ఆస్తికి మీరే వారసులవుతారు___నిజమే....కానీ మీ తండ్రిగారి ప్రాపర్టీమీద, కంపెనిమీద మీ కెంత అధికారం ఉందో, మీ చెల్లి ముక్తానంద దేవి గారికి కూడా అంతే హక్కుంది.... అవునంటారా ....కాదంటారా....." రవిచంద్ర ముఖంలోకి చూస్తూ సూటిగా ప్రశ్నించాడాయన.
అవుననాలో, కాదనలో అర్ధం కాలేదు. రవిచంద్రకు.
"అయితే ఏవంటారు...."చికాగ్గా అన్నాడు రవిచంద్ర.
"కంపెని చట్టం ప్రకారం గాని, కుటుంబ చట్టం ప్రకారం గాని.... మిమ్మల్ని మీరు ఈ ప్రాపర్టికి , ఈ కంపెనీలకు అధిపతిగా ప్రకటించు కోవడం కుదరదు...మీ ఎక్తెక చెల్లి ముక్తానందదేవి గారు ఒప్పుకున్నా, ఇది కుదరదు..."మళ్ళి అన్నాడాయన.
మరెలా.....కుదురుతుందంటారు...." వ్యంగ్యంగా అన్నాడు రవి చంద్ర.
"మీ తండ్రిగారి వీలునామ ఉంటేనే తప్పు, మీకు అధికారం రాదు. అంతవరకూ మీరు చిన్న చెక్కుమీద కూడా సంతకం చెయ్యడానికి పనికి రారు."
ఆ మాటకు రవిచంద్రకు, రావిచంద్రతోపాటు, రఘునాద్ ,పుష్పక్ తదితర రవిచంద్ర వర్గానికి కోపం వచ్చింది.
రఘునాద్ గబగబా సూర్యసాగర్ ముందుకొచ్చాడు.
"లీగల్ ఫార్మలిటిస్ అని మీరు ఆలస్యం చేసారనుకోండి.... కంపెనీల్లో ఎక్కడ ఏం జరుగుతుందో అర్ధం కానీ పరిస్ధితి ఏర్పడుతుంది ఎలాగూ, ఇవాళ కాకపోయినా రేప్తేనా ,ఈ ఎంపయిర్ బాధ్యతలు స్వికరించాల్సిన వ్యక్తి రవిచంద్ర ఫామిలి లాయర్ గా మీరు చొరవ తీసుకుంటే, గౌవంగా ఉంటుంది" అన్నాడు రఘునాద్.
రఘునాద్ గురించి తెలుసు సూర్యసాగర్ కి నిన్నటి వరకూ కన్పంచని రఘునాద్ ఆకస్మాత్తుగా ఎందుకు పెద్దరికం వహిస్తున్నాడో అర్ధం కాలేదు సూర్యసాగర్ కి___చటుక్కున కోపం వచ్చింది ఆయనకు.
"చూడండి....రంఘినాద్ గారూ....ఇది కేవలం .... హరికృష్ణమనాయుడుగారి కుటుంబ సమస్య ఇవాళ కాకపోయినా రేప్తేనా ....ఈ ఎంప్తెర్ బాధ్యతలు స్వీకరించాల్సిన వ్యక్తి రవిచంద్ర అని....మీరు ఏక పక్షంగా ఎలా అంటున్నారో నాకర్ధం కావడం లేదు. ఈ మాట ముక్తానందదేవి అంటే....విలువుంటుంది తప్పు, మీలాంటి వాళ్ళంటే విలువుండదు."
సూర్యసాగర్ సూటిగా అనేసరికి , రఘినాద్ ముఖం వెలవెల బోయింది. గుటకలు మింగుతూ కోపాన్ని అణచుకుంటూ రవిచంద్ర వేపు చూసాడు.
ఆ చూపులోని సందేశాన్ని అందుకున్నాడు రవిచంద్ర.
"ఓకే....లాయరుగారూ.....నా చెల్లెలు ముక్తానంద అంగీకరించడమే మిక్కావాలి.....అంతే కదా...ఇట్స్ ఎ మాటర్ ఆఫ్ టూ మినిట్స్ జాబ్....ఏం ముక్తా....చెప్పు....నువ్వు మన ఫామిలి లాయర్ గారి డౌట్ తెర్చేస్తే బావుంటుంది.
చెల్లెలు ముక్త కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు రవిచంద్ర.
అందరికళ్ళూ ముక్తమీదే ఉన్నాయి.
ముక్త చూపు మాత్రం లాయర్ సూర్యసాగర్ వేపుంది.
ముక్త ఏం చెప్తుంది!
,ఉక్త చెప్పిందానిమిదే మొత్తం ముక్త భావిష్యత్తు , కుతుంబ్ పరువు, ప్రతిష్టలు ఆధారపడున్నాయి. అనాదికారికంగా న్తెనా,ఈ ఆస్తి ని స్వంతం చేసుకుంటే రవిచంద్ర ఏం చేస్తాడో , లాయర్ సూర్యసాగర్ కే కాదు. అక్కడున్న బంధువులకు కూడా తెలుసు. అక్కడ కొద్ది క్షణాలు నిశ్శబ్దం అలుముకుంది.
"నే....ముక్తా ...అన్నగా .... నామీద , నీకు నమ్మకం లేదా..... చెప్పు....నిర్భయంగా ని నిర్ణయన్నీ చెప్పు...." లాలిస్తున్నట్లుగా అన్నాడు రావిచంద్ర తను లాయర్ సూర్యసాగర్ కు బదులుగా ముందుగా ముక్తతో మాట్లాడి ఉంటే బావుండేదనిపించింది రవిచంద్రకు.
అక్కడున్న బందు మిత్రులకు ఆ వివాదం ఆ సమయంలోనే రేయిజ్ అవ్వటం బాధగా అనిపించింది.
సాయంత్రం ఐదు గంటలకు శవ దహనం అయిపోతే__అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఆ వివాదం మొదలయింది....
"ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్ అధినేత స్వర్గీయ రామనాద్ గోయంకా కుటుంబంలోనూ ఇలాంటి కలహాలే చోటు చేసుకున్నాయి. రామనాద్ గోయంకాకి ముగ్గురు కూతుర్లు -ఒక కొడుకు కొడుకు అకాల మరనానికి గురయ్యాడు. కొడుక్కి తిరికి ముగ్గురు కూతుర్లు పుట్టారు.
అప్పటినుంచి రామనాద్ గోయంకాకి__కోడల్తెన సరోజ గోయం కాకి మనస్పర్ధలు ప్రారంభమయ్యాయి. తన మామగారు కూతుర్లు మీద- కూతుర్లు సంతానం మీద మక్కువ చూపిస్తున్నారని ఆమె అభియోగం__ అది చిలికి చిలికి గాలివానగా మారగా__రామనాద్ గోయంకా కోపగించు కొని చిన్న కూతురు కొడుక్తేనా వివేక ఖ్తే తానుని దత్తత తీసుకొని (మన వాడ్ని) వివేక గోయంకాగా పేరు మార్చి అధికారం అప్పగించారు.
దాంతో ఇంకో కూతురు కొడుకైనా మనోజ్ కుమార్ సంతాలి యా అడ్డం తిరిగి పోయాడు. ఒక వేపు కోడలు సరోజ గోయంకా___ మరో పక్క మనోజ్ కుమార్ సంతాలియా ___ఇంకో పక్క వివేక గోయంకా కత్తులు సూరుకుంటున్నారు.
రామనాద్ గోయంకా చనిపోయాక ఆ వివాదం మరింత పెద్దద్తే కుంటుంబంలో తుఫానే చెలరేగింది. అదిప్పటికి కొనసాగుతూనే ఉంది .
ఇలాంటి పెద్దకుటుంబాల్లో ఇలాంటి కలహాలు తప్పవేమోనని పిస్తోంది....ఒక దూరపు బంధువు పక్కనున్న మిత్రులతో అన్నాడు చిన్నగా.
"నిజమే....లేదంటే....శవ దహనం అయిన మూడు గంటలకే ఇలా ఆస్తి కోసం తారసిల్లు తారా ?" అని మరోకరన్నారు.
"టాటా కుటుంబంలో వివాదం చెలరేగాలేదూ? టిస్కోని యాబై ఎండ్లగా సమర్ధవంతంగా నిర్వహిస్తూ, గోప్స అభివృద్ధిని సాధించిన, టిస్కో చైర్ మెన్ రాస్సి మోడిని (స్టిల్ మెన్ ) ఆ పదవిలోంచి తొలిగించా లని జే.ఆర్.డి దత్తపుత్రుడు రతన్ టాటా ప్రయత్నించలేదు..... కుదరక పోయేసరికి టాటా సన్స్ బోర్డ్ మీటింగ్ పేటి, 75 సంవత్సరాలు వయస్సు దాటినా వారు చ్తేర్మన్ పదవిలో ఉండరాదని తీర్మానించారు దాంతో రాస్సిమోడి త్వరలో పదవిలోంచి దిగాబోతున్నారు...."అని ఒకరన్నారు.