Previous Page Next Page 
నవ్వితే నవ్ రత్నాలు - 1 పేజి 19

     అప్పుడు ఆ స్కూటరిస్టు దృష్టి రోడ్డుమధ్యలో నిలబడి ఉన్న బస్సుమీద పడింది.
    "నేను లైనుకి కాస్త ఇవతల వచ్చి మళ్లీ సెకనులోపల అవతలకి వెళ్లిపోయినా నన్ను పట్టుకున్నారే...మరి ఆ బస్సు రోడ్డుమధ్య ట్రాఫిక్ కి అలా అడ్డంగా ఉన్నా మీ ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోరేం?" తెలివిగా ప్రశ్నించాడు స్కూటరిస్టు.
    "ఏం ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావ్?... మేం ఆర్టీసి బస్సులుగానీ, గేదెలూ, ఆవులూ, దున్నపోతులూ, ఎద్దులుగానీ రోడ్డు మధ్య నిల్చుంటే పట్టించుకొనే పట్టించుకోం... ఆర్టీసి బస్సులు రాంగ్ సైడ్ వెళ్లినా పట్టించుకోం... అది మా ఇష్టం... అడగడానికి నువ్వెవరు?... ఛల్... ఇరవై అయిదు రూపాయలు చలాన్ కట్టు..." స్కూటరిస్టు కాలర్ పట్టుకుని అడిగాడు కానిస్టేబుల్.
    "చలాన్ కట్టక తప్పదా?" దీనంగా అడిగాడు స్కూటరిస్టు.
    "ఎక్కువ మాట్లాడితే యాభైరూపాయలు కట్టాల్సి వస్తుంది... ఆ... లేకపోతే నా జేబుకి పదిరూపాయలు కట్టు... వదిలేస్తా... హిహి..."
    స్కూటరిస్టు కానిస్టేబుల్ పదిరూపాయలు ఇచ్చి "హమ్మయ్య" అనుకుంటూ అక్కడినుండి బయటపడ్డాడు.
    ఇక్కడ... సిటీబస్సులో పెద్ద గొడవ జరుగుతూ ఉంది. టిక్కెట్ ఇవ్వాల్సిందే అని కండక్టర్ తో గొడవ పెట్టుకున్న అతన్ని అందరూ తలవాచేలా చివాట్లు పెట్టారు.
    బస్సులోని ఒకబ్బాయ్ "అమ్మోయ్... అమ్మోయ్... ఆయన తల్చూడు... ఎంత లావుందో... హి... హిహి..." అని నవ్వేసరికి అతనికి భయం పట్టుకుంది. అతను బస్సులోని జనం అందరికీ ఓసారి చేతులెత్తి దణ్ణం పెట్టి "ఇంక నన్ను తిట్టకండి బాబూ..." అని బస్సు దిగి కండక్టర్ కీచక్ రావుకి సారీ చెప్పి ఇంక జీవితంలో ఏ కండక్టర్నీ టిక్కెట్ అడగనని ఒట్టేసి కీచక్ రావుని బస్సులోనికి తీస్కోచ్చాడు.
    "రహ్హయిట్." బెల్ కొడ్తూ కీచక్ రావు గట్టిగా రంకేవేశాడు.
    బస్సు  వయొలెంటుగాఒక్క కుదుపు ఇచ్చి ముందుకు దూకింది.
     మళ్లీ బస్సులో నిలబడ్డ జనం మొత్తం మొదట వెనక్కి విరుచుకుని ....ఆ తర్వాత రెండు కాళ్ళు పైకెగరేసి కిందపడ్డారు. ఆ తర్వాత విసుక్కుంటూ లేచి బట్టలకంటిన దుమ్ము దులుపుకున్నారు. కూర్చున్న వాళ్ళు మాత్రం ముక్కుతూ మూల్గుతూ నొసళ్ళు రుద్దుకున్నారు.
         కండక్టర్  కీచక్ రావు బస్సులో అటు ఇటు తిరుగుతూ వీలుకుదిరిన వీలుకుదిరిన  ఆడాళ్ళందరినీ ఒంటిని రాస్కుంటూ తిరుగుతున్నాడు.
       ఒక అమ్మాయికి మాత్రం కాస్త అతిగా తన ఒంటిని రుద్ది ఆ తర్వాత ఆమె పిర్ర మీద గట్టిగా గిల్లేశాడు.
      "ఏం?... కొవేక్కిందా?...అంటూ అరిచింది మండిపడ్డ ఆ అమ్మాయి.
      "అర్రె ఇస్కీ... బస్సులోరష్ గా ఉంటే తగలకుండా పోవాలంటే ఎట్లా....అంత  సుఖంగా పోవాలంటే ఆటోలో  పోమ్మా.... అర్రేయ్ రాముడూ బస్సప్రా బయ్..."గట్టిగా అరిచాడు కండక్టర్ కీచక్ రావు.
      డ్రైవర్ రాముడు   ఠక్కున సడన్ బ్రేక్ వేసిబస్సాపేశాడు. అంతే ...నిల్చున్న వాళ్ళంతా ధనేలున కిందపడి తర్వాత లేచి నిలబడి కండక్టర్ కి కోపం తెప్పించిన ఆ అమ్మాయిని తలవాచేలా చివాట్లు పెట్టసాగారు ...కండక్టర్ కి ఇరిటేషన్ కలిగించినందుకు..ఆ అమ్మాయిపకపకా నవ్వింది.
      "తిట్టండి..ఇంకా బాగా తిట్టండి...నాకే మంచిదోచ్....అసలే మా ఆయన నాతో అంటుంటాడు నా బుర్రకాయ పీచు తీసిన కొబ్బరికాయ్ లా చిన్నదిగా ఉంటుంది ...మీరిట్టా తలవాచేలా తిడ్తేనాకే లక్కీ...హిహిహి...
నేనెంత లక్కినో...హి"అంది సంబరంగా చప్పట్లు కొడ్తూ.
     "చాల్లెవయ్యా...ఇప్పుడునీ తలకాయ్ ఎట్టా ఉందో చూస్కో...కల్లుకుండలా  వాచిపాయింది..." బుగ్గలు నొక్కుకుంటూ అంది ఓ ముసలావిడ.
                      ఆ అమ్మాయి నాలుక కొరుక్కొన చెంపలేస్కుని కండక్టర్ కి సారీ చెప్పింది.బస్సు మళ్ళీబయలుదేరింది. కాస్సేపయ్యాక కండక్టర్ కి మరో చిలిపి ఊహ కలిగింది. పాసిజర్లనందరిని ఒక్కసారిగా ఏడిపిస్తేనో?
         అంతే....'ఒర్రేయ్ రాముడూ....బస్సప్రా బయ్...నేను అందర్కీ టిక్కెట్లు ఇస్కూ చెయ్యాలి!"అని అరిచాడు.
     బస్సాగిపాయింది...దాదాపు ఇరవై నిమిషాలు. కండక్టర్  కీచక్ రావుతృప్తిగా నిల్చున్నాడు.               
                                                   *         *        *               
                                             లవ్  మ్యారేజ్

        నాగమణి ఈజీ చైర్లో పడుకుని నవల చదువుకుంటున్న  తండ్రి దగ్గరికి పిల్లిలా అడుగులు వేస్కుంటూ వచ్చింది.
        పరంధామయ్య  సీరియస్ గా నవల చదవటంలో  మునుగిపోయాడు.
       నాగమణి "మ్యావ్..."అంది.
     పరంధామయ్య నవలలోంచి తలెత్తకుండానే ఈజీ చైర్ పక్కనే ఉన్న చెప్పొకటినాగమణి మీదకి విసిరాడు. అది ఆమె మోకాలుకి  తగిలింది.
      నాగమణి  "హయ్యో!..."అంది విస్మయంగా.
    అంతలోనే లోపల్నుండి అప్పడాల కర్రొకటి రివ్వున వచ్చి నాగమణి టెంకి మీద తగిలింది.
     "హబ్బా!..."అంటూ బాధగా అరిచింది నాగమణి.
     ఆ అరుపుకి పరంధామయ్య కంగారుగా తలెత్తి చూశాడు. లోపలి నుండి నాగమణి తల్లి శాంతమ్మ కూడా పరిగేత్తుకు వచ్చింది.
      "ఎందుకలా అరిచావ్ ?..."అంటూ ఆశ్చర్యంగా కూతుర్ని ప్రశ్నించారు ఇద్దరూ.
      అరవక?...." నాన్నేమో నా మీదకి చెప్పిసిరారు- నువ్వేమో అప్పడాల కర్రతో  నా తల బొప్పి     కట్టించావ్!" ఉక్రోషంగా అంది నాగమణి .
     "అరే..మేము విసిరినవి నీకు తగిలాయా?...మేము ఇంట్లోకి పిల్లి వస్తుందని వాటిని విసిరాము " అన్నారు ఇద్దరూ.
     "పిల్లా ... పిల్లెక్కడిది?... అంది నాగమణి బుర్ర మీద బొడిపెని తడుముకుంటూ.

 Previous Page Next Page