Previous Page Next Page 
నవ్వితే నవ్ రత్నాలు - 1 పేజి 18


    ఆ పద్దతి ఏమిటంటే...
    వీర్రాఘవులు గోళ్లు కొరికినప్పుడల్లా శిక్షగా అతని చేత ఏదైనా వీక్లీలోని క్రైం కం సస్పెన్స్ కం హారర్ కం సెక్స్ కం వయొలెన్స్ కం ఇన్ ఫర్మేటివ్ సీరియల్ బలవంతంగా కూర్చోబెట్టి చదివించేది మీనాక్షి.
    సీరియల్ చదువుతున్నప్పుడు ఎలుకల మందు తిన్న ఎలుకలా వీర్రాఘవులు బాధతో గిలగిల్లాడిపోయేవాడు పాపం.
    గోళ్లు కొరికితే పెళ్లాం ఎక్కడ క్రైం కం సస్పెన్స్ కం హారర్... కం... సీరియల్ చదివిస్తుందోనన్న భయంతో గోళ్లు కొరకడం మానేశాడు వీర్రాఘవులు.
                               *   *   *
                            కండక్టర్ కీచక్ రావు
   
      ఆ పద్దతి ఏమిటంటే...
    వీర్రాఘవులు గోళ్లు కొరికినప్పుడల్లా శిక్షగా అతని చేత ఏదైనా వీక్లీలోని క్రైం కం సస్పెన్స్ కం హారర్ కం సెక్స్ కం వయొలెన్స్ కం ఇన్ ఫర్మేటివ్ సీరియల్ బలవంతంగా కూర్చోబెట్టి చదివించేది మీనాక్షి.
    సీరియల్ చదువుతున్నప్పుడు ఎలుకల మందు తిన్న ఎలుకలా వీర్రాఘవులు బాధతో గిలగిల్లాడిపోయేవాడు పాపం.
    గోళ్లు కొరికితే పెళ్లాం ఎక్కడ క్రైం కం సస్పెన్స్ కం హారర్... కం... సీరియల్ చదివిస్తుందోనన్న భయంతో గోళ్లు కొరకడం మానేశాడు వీర్రాఘవులు.
  కండక్టర్ కీచక్ రావు డ్యూటీకి బయలుదేరాడు.
    "నేను వెళ్లొస్తానేవ్... వీత్తలు పేస్కో..." భార్యకి చెప్పి ఓసారి పిర్రమీద చిన్నదెబ్బేసి వీధిలో పడ్డాడు. నాలుగడుగులు వేశాడోలేదో అతనికి ఇద్దరు వయసులో ఉన్న అమ్మాయిలు ఎదరుపడ్డారు. వాళ్లని దాటుకుని వెళ్ళేప్పుడు కీచక్ రావు అతి లాఘవంగా వాళ్లపక్కనుండి వెళ్తూ సర్రున ఒకమ్మాయికేసి ఒళ్లు రుద్దుకుని హుషారుగా ముందుకు అడుగులు వేశాడు.
    ఆ ఒళ్ళు రుద్దించుకున్న అమ్మాయికి ఒళ్లు మండిపోయి "యూ..." అంటూ కాలికున్న చెప్పులేపింది. పక్కనున్న అమ్మాయి తన స్నేహితురాలిని వారించింది.
    "ఏమిటి నువ్వు చేస్తుంది?... అతనేవరనుకున్నావ్? అంది.
    "ఏం?... ఈ ఏరియా అంతటికి గొప్ప రౌడీయా?" చెప్పు  తీసినమ్మాయ్ భయం భయంగా అడిగింది. మొదటి అమ్మాయ్ ఫక్కున నవ్వింది.
    "నీ భయం మంటెట్టా... అతను రౌడీకాదూ... రాజకీయ నాయకుడు అంతకంటే కాదు... అతను ఆర్టీసీ కండక్టర్ ...పాపం ... సిటీ బస్సులో ఆడాళ్లని రాస్కుంటూ వెళ్లడం వాళ్లకి అలవాటు కదా ... అందుకని నిన్ను అట్లా రాస్కుంటూపోయాడు..."
    అది విన్న రెండో అమ్మాయి కాలికి చెప్పు తొడిగేస్కుని కిలకిలా నవ్వింది.
    "ఆర్టీసీ కండక్టరా!... అలా చెప్పు. పాపం అలవాటు కొద్దీ అలా చేసి ఉంటాడ్లే..." క్షమించేస్తూ అంది. ఆ ఇద్దరు అమ్మాయిలా ముందుకు కదిలారు.కీచక్ రావు అప్పటికే చాలా ముందుకు వెళ్లిపోయాడు. అతనికి వాళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి తెలీనే తెలీదు... ఆ రాస్కుంటూ పోవడం ఏమిటో... తన హుషారేంటో ...తన లోకం ఏమిటో తనదే... కీచక్ రావు ఆర్టీసీ బస్ డిపోవైపు అడుగులు వేశాడు.
                              *   *   *
    "రహైట్..." గట్టిగా కేకవేశాడు కీచక్ రావు. బస్సు ఒక్క కుదుపు ఇచ్చి, నిల్చున్న వాళ్లనంతా కిందికి పడేసి ముందుకు కదిలింది. ఆ కుదుపుకి కూర్చున్న వాళ్లనొసళ్లు ముందు సీటు కమ్మీలకు కొట్టుకుని ఠపఠపా శబ్దం వచ్చి డ్రైవర్ చెవులకు ఇంపుగా తోచింది.
    "టిక్కెట్...టిక్కెట్..."కీచక్ రావు ముందుకు కదిలాడు. అందరూ డబ్బులు ఇస్తుంటే కీచక్ రావు తిరిగి వాళ్ల చేతిలో పావలానో, పదిపైసలో, అయిదు పైసలో ఇలా తనకి తోచింది పెట్టి మిగిలిన డబ్బులు భుజానికి తగిలించుకుని ఉన్న తోలు సంచిలో వేస్కుంటున్నాడు.
    కీచక్ రావు కంటికి కాస్త బాగున్న అమ్మాయి కనిపించింది. అంతే... ఆ పక్కనుండి ఈ పక్కకి వచ్చేసి ఆ అమ్మాయి ఒంటికేసి తన ఒంటిని పరపరా రుద్ది ఆ తర్వాత ఆ అమ్మాయి మోహంలో మొహం పెట్టి "టిక్కెట్...హిహి...టిక్కెట్" అన్నాడు.
    ఆ అమ్మాయి లోలోపల తిట్టుకుంటూ కండక్టర్ కి రూపాయి నోటు అందిస్తూ "హిమాయత్ నగర్" అంది.
    కండక్టర్ ఆమె చేతిలోని రూపాయినోటుని అందుకోడాని కోసం ఆమె మోచేతి దగ్గర పట్టుకుని అక్కడినుండి తన చేతిని మెల్లగా అరచేయిదాకా జార్చి ఆ తర్వాత నోటు అందుకుని ఆమెకి టిక్కెట్ ఇచ్చాడు. తర్వాత ఓ వెకిలి నవ్వు ఆ అమ్మాయి మొహాన పారేసి ఆ అమ్మాయి పక్కనున్న అతన్ని "టిక్కెట్" అని అడిగాడు. అతను కీచక్ రావుకి డబ్బులిచ్చి తను ఎక్కడికి వెళ్లాలో చెప్పాడు.కీచక్ రావు అతని చేతిలో పావలా పెట్టి మిగతా చిల్లర బ్యాగ్ తలో వేస్కుని ముందుకు కదలబోయాడు.
    "టిక్కెట్ ఇవ్వలేదేం?..." కండక్టర్ కీచక్ రావుని ఆపి అడిగాడు అతను.
    "టిక్కెట్టా... పావలా ఇచ్చగా?" క్రూరంగా చూస్తూ అన్నాడు కీచక్ రావు.
    "నాకు నీ పావలా ఏం అక్కర్లేదు... నాకు టిక్కెట్టు ఇవ్వు... అతను కూడా కోపంగా అన్నాడు కీచక్ రావు చేతిలో అతను ఇచ్చిన పావలాని పెట్టేస్తూ.
    "అర్రె... నీవ్ వెళ్లేచోటికి చేరేది ముఖ్యమా, టిక్కెట్ ముఖ్యమా?" గట్టిగా అరిచాడు కీచక్ రావు.
    "రెండూ ముఖ్యమే" అన్నాడతను. నేను ఇప్పుడే ఈ అమ్మాయికి టిక్కెట్ ఇచ్చా... అంటే ఇంకో పదిమందికి టిక్కెట్ ఇవ్వను. మళ్ళీ ఒక్క టిక్కెట్ ఇచ్చిన తర్వాత పదిమందికి టిక్కెట్ ఇవ్వను. అందుకని నీకు టిక్కెట్ ఇవ్వను... ఏం చేస్తావో చేస్కో..." అని అడుగు ముందుకు వేయబోయాడు కండక్టర్ కీచక్ రావు.
    కండక్టర్ ముందుకు పోకుండా చెయ్యి అడ్డుపెట్టాడు అతను.
    "నువ్వు టిక్కెట్ ఇచ్చి తీరాల్సిందే!"
    కీచక్ రావుకి చెప్పలేనంత ఇరిటేషన్ పుట్టింది. వెంటనే బస్సు బెల్ కొట్టి "అర్రెయ్ రాముడూ... బస్సాప్రా బయ్" అంటూ గట్టిగా అరిచాడు. డ్రైవర్ రాముడు రోడ్డు మధ్యలో ట్రాఫిక్ కి అడ్డంగా బస్సాపేశాడు. కండక్టర్ బస్సు దిగేసి పుట్ పాత్ మీద నిలబడి అటూ ఇటూ దిక్కులు చూడసాగాడు. అప్పుడే అటుగా ఒక స్కూటరిస్టు సైకిలు వాడు అడొస్తే వాడిని తప్పించడానికి రోడ్డు మధ్యలో గీసిన ట్రాఫిక్ లైనుకి ఒక సెంటీమీటర్ ఇవతలగా వస్తే ట్రాఫిక్ పోలీసు అతన్ని పట్టేస్కున్నాడు.
    "రాంగ్ సైడొస్తున్నావ్... చలాన్ కట్టు..." అన్నాడు స్కూటరిస్టుని బరబరా ప్రక్కకి లాక్కెళ్ళిపోతూ.
    "అదేంటయ్యా అలా పట్టుకుంటావ్? సైకిలిస్టు అడ్డొస్తే తప్పించడానికి కాస్త ఇటొచ్చి.. అయినా వెంటనే అటెళ్లిపోయాను కదా?" మొత్తుకున్నాడు స్కూటరిస్టు.
    "అదంతా నాకు తెలీదు... సైకిలోడు అడ్డొస్తే అది వాడి తప్పు... వాడికి స్కూటర్ గుద్దించేసి నువ్వెళ్లిపోవాల్సింది... అంతేకానీ రాంగ్ సైడ్ ఎందుకొచ్చావ్? కట్టు ఇరవై అయిదు రూపాయలు చలాన్"

 Previous Page Next Page