జార్జివైపు గర్వంగా చూసి నవ్వాడు.
ఆయన నుంచి చూపు మరల్చకుండానే "గోవిందూ! బాటిల్స్ టేబుల్ మీద పెట్టు" అని ఆర్డరేశాడు.
కానీ బాటిల్స్ పెట్టినట్టు సౌండ్స్ వినిపించలేదు.
శర్మకు ఏదో అనుమానం గుండెల్ని పట్టేసినట్లయింది.
గోవిందువైపు చూశాడు. పాపం అతను ఏం చెప్పాలో తెలియక నీళ్ళు నములుతున్నాడు.
"ఏమైంది! విస్కీబాటిల్స్ ఎక్కడ?" కంగారుగా అడిగాడు.
"తేలేదండీ" గోవిందు బాధపడిపోతూ చెప్పాడు.
"ఎందువల్ల?"
"ఏం చేయనండీ? సంచి కనబడలేదు. దాన్ని వెదుకుతున్నాను."
శర్మ ఠక్కున తలదించుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడూ ఆయన అమెరికన్స్ ముందే కాదు ఇండియన్స్ ముందూ తలెత్తలేదు.
* * * * *
కీర్తి పగలబడి నవ్వుతోంది.
అంటే ఒక షరతులోని ఒకటీ బై మూడోవంతు షరతు పోయిందన్నమాట. ఇంకా రెండు సార్లు కీర్తిని నవ్వించగలగాలి.
"ఇది మరో మినీ కథ" అని చెప్పుకుపోయాను.
బ్రహ్మానందం ఎట్టకేలకు ఓ రోజు మేనత్త వూరికి బయల్దేరాడు. ఇంతకాలం ఆ వూరికి అతను వెళ్ళకపోవడానికి కారణం అది తమిళనాడులో వుండడమే. అతనికి బొత్తిగా తమిళం రాదు. ఆ గ్రామం పేరు అత్తిపట్టు. మద్రాసుకు ఇరవై కిలోమీటర్లు.
ఎప్పుడైనా బయల్దేరినా వాళ్ళ నాన్న అడ్డుకునేవాడు. "నువ్వు ముందే వెర్రిమాలోకం. తమిళనాడంతా మోసం. అక్కడ కెళ్ళి నువు పల్టీ కొట్టకుండా రావడం జరగని పని. ఉన్న డబ్బులు వూడగొట్టుకుని ఎలా రావాలో తెలీక నానా కష్టాలు పడతావు" అని గుక్క తిప్పుకోకుండా కొడుక్కు చెప్పేవాడు. దాంతో బ్రహ్మానందం ఎప్పటికప్పుడు మేనత్త వూరు ప్రోగ్రాం వాయిదావేస్తూ వచ్చాడు.
అతని నాన్న చెప్పింది కూడా నిజమే. అతను చాలా అమాయకుడు. లోకజ్ఞానం చాలా తక్కువ. మొన్నటివరకు అతనికి పిలల్లెలా పుడతారో తెలిసేది కాదు. ఆడపిల్ల నోట్లోంచి వూడిపడతారని చెబితే అదే నమ్మాడు. ఈ మధ్యనే వాళ్ళ పాలేరు పుట్టుక గురించి డిటైల్డ్ గా చెబితే "ఓహ్! ఇంత తతంగం వుందా?" అని ఆశ్చర్యపోయాడు. అతన్ని ఏ విషయానికైనా కన్విన్స్ చేయడం చాలా సులభం.
ఆడపిల్లల చెస్ట్ ఎందుకంత ఎత్తుగా వుంటుందో తెలుసా...? కాలేజీకి వెళుతూ అక్కడ పుస్తకాలు ఆనించుకుంటే కింద పడిపోకుండా పట్టుకోసం భగవంతుడు వాటిని సృష్టించాడని ఎవరైనా వాదిస్తే చాలా ఈజీగా నమ్మేస్తాడు. "మరి చదువుకోని ఆడపిల్లలకు కూడా అక్కడ వుబ్బుగా వుంటాయే అని తిరిగి ప్రశ్నించాడు."
"యేయ్! స్టాఫ్ దట్ నాన్సెన్స్" అని కీర్తి గద్దించడంతో కథ ఆపాను.
"ఏమిటి? నీ ఇష్టంగా పేట్రేగిపోతున్నావ్? మన షరతు గుర్తుందికదా. ద్వంద్వార్థాల..."
నేను అడ్డు తగిలాను. "ఇది ద్వంద్వార్థం కాదు. స్ట్రయిట్ గా వుండే అర్థమే. అందునా బ్రహ్మానందం క్యారెక్టర్ అర్థం కావడానికి కొన్ని ఉదాహరణలు మాత్రం చెబుతున్నాను అపార్థం చేసుకోకు."
"సరే కాణీ" అయిష్టంగానే తల ఆడించింది కీర్తి.
"అలాంటి బ్రహ్మానందం అత్తిపట్టుకు వెళ్లాడు. రెండు రోజులపాటు కబుర్లతోనే గడిచింది కాలం. మూడోరోజు బోర్ కొడుతుంటే మీంజూరుకు బయల్దేరాడు.
అదో చిన్న టౌన్. సాయంకాలం అలా బజార్లో తిరుగుతున్నాడు. ఓ దగ్గర చిన్న హోటల్ లాంటిది కనిపించింది. లోపల ఎవరూ లేరు. వెళ్ళి బెంచీమీద కూర్చుని ఏమేమి వున్నాయో అడిగాడు. ఓనర్ కమ్ సర్వర్ గా వున్న వ్యక్తి ఏదేదో చెప్పాడు. చివరగా అన్న సేమియా ఉప్మా తెమ్మన్నాడు.
ఆ వ్యక్తి లోపలికెళ్ళి ప్లేటులో ఉప్మా తెచ్చి పెట్టాడు.
దాన్ని చూస్తూనే బ్రహ్మానందం బోలెడంత ఆశ్చర్యపోయాడు. అందులో సేమియా మచ్చుకైనా ఒక పోచ కూడా కనిపించలేదు.
ఓనర్ కమ్ సర్వర్ ను పిలిచాడు.
"సేమియా ఉప్మా అన్నావ్. ఇందులో సేమియా కనిపించడమే లేదు" అడిగాడు బ్రహ్మానందం.
అతడు విసుగ్గా ముఖం పెట్టి "పేరులో వుండేదంతా ప్లేటులోకి రమ్మంటే వచ్చునా? ఏందబ్బా! నువు తెలుగువాడివిగా వున్నావు. అంత మాత్రం తెలివి లేదా ఏమి. మనం "బెంగుళూరు వంకాయ" అని అంటాము. అందులో బెంగుళూరు వుంటుందా ఏమి? పేరు అలా పెడతాము" అని లుంగీ బిగించుకుని క్యాష్ బాక్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు.
బ్రహ్మానందానికి అతను చెప్పింది సహేతుకంగా అనిపించింది.
కీర్తి అచ్చు పావురాయి రెక్కలు టపటపా లాడించినట్లు నవ్వింది.
"మరి ఒక షరతు రద్దయిపోయినట్టేనా" ఆశగా అడిగాను.
"అదెలా బాబూ! ఇంకోసారి నవ్వించాలి."
"ఇప్పుడు రెండు కథలకు సరిపడా నవ్వావు."
"అదేం కుదరదు. మూడోసారి నవ్వించాలి."
మూడో కథలోకి నేను దిగబడ్డాను.
"రొంపిచెర్లలో సూరయ్య, సూరమ్మ అనే దంపతులుండే వాళ్ళు. వాళ్ళిద్దరూ ఆ పల్లెటూర్లో వుండబట్టి సరిపోయిందిగానీ లేకుంటే ఈ పాటికి గిన్నీస్ బుక్కులోకి ఎక్కుండేవాళ్లు..."
"ఎందుకూ?" కీర్తి క్యూరియాసిటీతో అడిగింది.
"లోభి గుణంలో."
"సరే ! సరే ! చెప్పు."
ఒకసారి సూరయ్య తన బంధువులబ్బాయి పెళ్ళికి వెళ్ళవలసి వచ్చింది. ఆ ఊరికి పది కిలోమీటర్ల దూరంలో వుండే పట్నంలో పెళ్ళి. తెల్లవారుజామున ముహూర్తం. బస్సులో వెళితే ఛార్జీ దండగని కాలి నడకన వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు సూరయ్య. మొగుడి భేషైన ఐడియా చూసి జన్మ జన్మలకూ తనకు ఇలాంటి మొగుడ్నే ఇవ్వమని సూరమ్మ దేవుళ్ళను మొక్కుకుంది.
ఉదయం పెళ్ళికనుక సూరయ్య అర్థరాత్రే నిద్రలేచాడు. బట్టలేసుకుని బయల్దేరాడు. దాదాపు ఐదు కిలోమీటర్లు వచ్చేశాడు. సరిగా అప్పుడు సూరయ్యకు ఓ అనుమానం బయల్దేరింది..."
"ఏమిటది?" కీర్తి కాస్తంత ముందుకు వంగి అడిగింది.
నా చూపు తన లోనెక్ జాకెట్ లో చిక్కుకుంది. ఇంటికి వెళ్ళే బెల్ ఎప్పుడు కొడతారా అని ఆతృతగా బయటకు తొంగిచూస్తూ క్లాసులో కూర్చున్న తుంటరి అబ్బాయిల్లా కొద్దిగా పైకి కనిపిస్తున్న వక్షద్వయం.
కీర్తి నా చూపులను పసిగట్టి కొరకొరా చూసింది. బలవంతంగా నా చూపుని అక్కడి నుంచి లాక్కొని కళ్ళల్లో దోపుకున్నాను. కథను తిరిగి ప్రారంభించాను.
"సూరయ్య అనుమానం ఏమిటంటే తను బట్టలేసుకోవడానికి వెలిగించుకున్న కిరోసిన్ దీపాన్ని తిరిగి ఆర్పి వేశానా లేదా అన్నది. తను ఆర్పకుండా వచ్చేసుంటే ఉదయం తన భార్య కనుక్కునే వరకు ఎంత కిరసనాయిలు కాలిపోతుందో లెక్కకట్టాడు. ఆ నష్టాన్ని తలుచుకుంటుంటే అడుగు ముందుకు పడడంలేదు.