Previous Page Next Page 
అనురాగ జలధి పేజి 19

    శ్రీకర్ ముఖం గంభీరంగా మారిపోయింది.
    "అని భ్రమపడుతున్నావ్ జ్యోతీ! అలా అనుకోవడంలో నీ తప్పులేదు. ఎందుకంటే నీవు డబ్బులో పుట్టి, డబ్బులో పెరిగావు. ఆల్ రైట్ నీతో వాడనెందుకు - చెప్పు. ఎక్కడకు వెళదాం - భార్య మనస్తత్వం తెలుసుగాబట్టి వాదించినా ఆమె మొండితనం విడనాడదని నవ్వుతూ మాట మార్చేశాడు శ్రీకర్.
    పిక్చర్ కెళదాం పదండి-" మామూలుగా అయిపోతూ అన్నది జ్యోతి.
    పిక్చర్ కే? బోర్ నేనురాలేను. అలా చల్లగాలికి ఏటివేపు వెళితే బావుంటుంది. ఏమంటావ్?" అన్నాడు ఆమె చెంతచేరి.
    "వీల్లేదు. పిక్చర్ కెళదామనుకున్నాను" మొండిగా అన్నది.
    "రేపు వెళ్ళవచ్చులే...ఈ పూటకు ఏటివేపు వెళదాం ప్లీజ్ జ్యోతీ!" బ్రతిమాలేట్లుగా అడిగాడు.
    "దూరం జరగండి చీరనలిగిపోతుంది_" అని ముందుకు వస్తున్న అతన్ని దూరంగా నెట్టింది. శ్రీకర్ చిన్నబోయాడు మరేమీ లేదు.
    "ఆల్ రైట్! యెవరో ఒకరు రాజీపడాలిగా పద వెళదాం అని పిక్చర్ కు బయల్దేరాడు శ్రీకర్. జ్యోతి గర్వంగా నవ్వి అతనివెంట కదిలింది.
    ఆమె నవ్వు చూసి "జ్యోతీ! నీవు చాలా మొండిదానివి. నీమాటే నెగ్గించుకోవాలని చూస్తావుగానీ భర్త మాటను మన్నించాలని, భర్తను గౌరవించాలని అనుకోవు నీలా నేను అభిమానపడితే మనం సంసారం చేయలేము విభిన్న మనస్థత్వాలు ఎప్పుడూ నేను రాజీకి రావడమేగాని నీవు నన్ను అర్ధంచేసుకోలేవు. నాలో సహనం, ఓపికవున్నంతకాలం నిన్ను గెలిపిస్తూనేవుంటాను అని అనుకున్నాడు శ్రీకర్ మనసులో తల్లిని, నాయనమ్మను కోల్పోయిన జ్యోతిని బాధ పెట్టాలని వుండదు అతనికి. అందుకే రాజీపడతాడు ఎప్పుడూ.
                                       20
    ఆ రోజు ఉదయం శ్రీకర్ హాల్లో కూర్చుని వీక్లీ చదువుతున్నాడు. నౌకరువచ్చి "ఎవరో దిక్కు లేనివాళ్ళట బాబూ! ధర్మంచేయమని ఒకటే గొడవ పెడుతున్నారు. యెంత చెప్పినా వాళ్ళూ వినిపించుకోవడంలేదు" అని చెప్పాడు.
    "ఎక్కడున్నారు వాళ్ళు?"
    "బయట గేటుదగ్గ్రరున్నారు బాబూ _"
    "ఇలా రమ్మని చెప్పు" అని అన్నాడు శ్రీకర్.
    నౌకరు వెళ్ళి వాళ్ళను లోనికి తీసుకువచ్చాడు. ఓ నలభైఏళ్ళ స్త్రీ, నలుగురు పిల్లలు, బిక్కు బిక్కుమంటూ హాల్లోకి వచ్చారు వాళ్ళ చూపుల్లో దైన్యం గూడుకట్టుకొని వుంది. లేమితనంతో, ఆకలి బాధతో బాధపడుతున్నట్లు, వాళ్ళ ఆకారాలే చెపుతున్నాయ్.
    "ఏం కావాలమ్మా మీకు?" సౌమ్యంగా అడిగాడు శ్రీకర్.
    ఆమె బదులు పలకలేదు. దుఃఖం పొర్లుకురాగా కొంగు నోట్లో పెట్టుకుంది. ఆమె పరిస్థితిని చూస్తూంటే జాలికలగసాగింది. చూస్తుంటే బిచ్చగత్తెలా లేదు కలిగిన కుటుంబంలోంచి వచ్చినట్లుంది.
    "మాట్లాడమ్మా! ఎవరు మీరు?"
    "మాది అవనిగడ్డ బాబూ...తుఫాన్ వలన ఆస్థిపాస్తులు పోయాయి. నా భర్తపోయారు. మిగిలిన నేనూ నా బిడ్డలు. చావలేక బ్రతకలేక ఇలా వీధులవెంట పడాల్సిన దుస్థితి సంభవించింది" వెక్కిళ్ళమధ్య దీనంగా చెప్పిందావిడ.
    ఆమె కథ విన్న శ్రీకర్ గుండెలు జాలితో ద్రవించాయి.
    మొన్న తుఫాన్ లో ఎందరో దగాపడ్డారు.వాళ్ళలో ఆమె కుటుంబం కూడా-భర్తను పోగొట్టుకుని, గతిలేక పిల్లల్ని వెంటేసుకుని వచ్చింది. యెంతటి దయనీయమైన పరిస్థితి!
    శ్రీకర్ మరేమీ ఆలోచించలేదు. జేబులోంచి పర్సు తీసాడు.
    "దీనితో మీ కష్టాలు తీరవని తెలుసు. కొన్నాళ్ళపాటు పిల్లలకు తిండి పెట్టవచ్చు తీసుకో..." అని తన పాకెట్ మనీలోంచి వందరూపాయలు తీసి యివ్వబోయాడు.
    ఇంతలో జ్యోతి మెట్లుదిగి వచ్చింది. వాళ్ళను చూసి ముఖం చిట్లించింది.
    "ఎవరు వీళ్ళు _ యెందుకు డబ్బిస్తున్నారు?"
    శ్రీకర్ వాళ్ళ దీన పరిస్థితి చెప్పాడు. జ్యోతి మండిపడింది.
    "బావుంది. ఇలాంటి వాళ్ళు దేశంలో చాలామంది వున్నారు. అందర్నీ మనం ఉద్దరించగలమా? ఓ పదిచేతిలో పెట్టి ముందీ దరిద్రాన్ని బయటకు పంపండి" అసహ్యించుకుంటూ అన్నది.
    భార్య అలా వాళ్ళను చులకనచేసి మాట్లాడ్డం నచ్చలేదతనికి.
    "తప్పు జ్యోతీ! అన్నీ సక్రమంగా వుంటే వాళ్ళు మాత్రం యెందుకు భిక్షమెత్తుకుంటారు? ఇలాంటి వాళ్ళను అసహ్యించుకోవటం మానవత్వం అనిపించుకోదు" అని వాళ్ళవేపు తిరిగి "మీరు పట్టుకెళ్ళండి" అని వంద రూపాయలు యిచ్చేసాడు.
    ఆమె దాన్ని అందుకుని నమస్కరించి పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్ళిపోయింది.
    జ్యోతి నిప్పులు చెరుగుతూ పోట్లాటకు సిద్ధంగా వున్నది.
    భార్యను చూచి నవ్వాడు శ్రీకర్. నెమ్మదిగా కౌగిలిలోకి తీసుకుని ఆమెకోపాన్ని తగ్గించాలని ప్రయత్నించాడు. కానీ, ఆమెమాత్రం అతన్ని దగ్గరకు రానీయలేదు. తీవ్రంగా చూసింది అతనివంక.
    "దానం చేయడం పెద్దపని కాదు-"
    "అంటే?" అతని భృకుటి ముడిపడింది అనుమానాస్పదంగా.
    "ఈ రూపాయి సంపాదించగలిగినపుడు అర్ధరూపాయి కాకపోతే ముప్పావలా కూడా దానం చేయవచ్చు. మీకు డబ్బు విలువ తెలియదు కాబట్టే ఆ ముష్టిముండకు వంద రూపాయలు తగలేశారు."
    ఆ మాటలు ములుకుల్లా గుచ్చుకున్నాయ్ శ్రీకర్ హృదయంలో.
    "ఎవరు ఫంక్షన్ అని పొగిడితే ఆడంబరంకోసం రెండువేల రూపాయలు ధర్మం చేసింది తను. దిక్కులేక తుపాను వలన భర్తను, అయిన వాళ్ళను పోగొట్టుకుని వచ్చిన ఓ అభాగ్యురాలికి వందరూపాయలు ఇవ్వటం వేస్టా?"
    జ్యోతి ఎందుకిలా మూర్ఖంగా మాట్లాడుతుంది?
    తనకు డబ్బు విలువ తెలియదా?
    సంపాదించగలిగినప్పుడు అంటే...తను సంపాదించడంలేదు అనేగా?
    యెంత అహంకారం? అతని హృదయంలో మంటలు రేగాయ్.
    "జ్యోతీ! నువ్వు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావ్. వంద రూపాయలు మనకు యెక్కడ ఖర్చు కావు చెప్పు. దానివలన ఓ పేదకుటుంబం నాల్గురోజులు కడుపునిండా తినగలుగుతారు. ఈ చిన్న విషయానికి నీవింత బాధపడతావనుకోలేదు" నొచ్చుకుంటూ అన్నాడు శ్రీకర్.      శ్రీకర్ ముఖం గంభీరంగా మారిపోయింది.

    "జ్యోతీ! నువ్వు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావ్. వంద రూపాయలు మనకు యెక్కడ ఖర్చు కావు చెప్పు. దానివలన ఓ పేదకుటుంబం నాల్గురోజులు కడుపునిండా తినగలుగుతారు. ఈ చిన్న విషయానికి నీవింత బాధపడతావనుకోలేదు" నొచ్చుకుంటూ అన్నాడు శ్రీకర్.  

 Previous Page Next Page