Previous Page Next Page 
సక్స్ స్ పేజి 17



    "ఆయన వీలునామా రాయకపోతే...."

    "పిత్రార్జితమైన ఆస్తిలో సగభాగం మాత్రమే నికోస్తుంది....అంతే...."

    "ఈ ఆస్తినాది. ఈ ఎంప్తెర్  నాది....ఇందులో సగభాగం, పావుభాగాల ప్రశ్నేలేదు....న గురించి మీకు తెలుసు__అనుకున్నదాన్ని ఎలా సాధించాలో నాకు తెలుసు...ముక్తాకి మొత్తం  కట్టబెట్టాలని మీ కుట్ర...ముక్తని గుప్పిట్లో పెట్టుకొని....మొత్తం  నడిపించాలని మీ ఆశ....కుదరదు....అలాంటి ఆలోచన మానుకోండి.... మీరు  కోపరేట్ చేసినా, చెయ్యక పోయినా....ఈ క్షణం నుంచి మానుకోండి....మీరు  కోపరేట్  చేసినా, చెయ్యక  పోయినా.... ఈ క్షణం  నుంచి వారసుడ్ని నేను.....మా ప్రయత్నానికి  మీరు అడ్డురాకుండా ఉంటే ...చాలా  మంచిది...." విసురుగా ఆ గదిలోంచి బయటికొచ్చాడు రవిచంద్ర.

    ఆవేనక బయటికొచ్చాడు సూర్యసాగర్.

    __అప్పటికే బయట హడావుడిగా వుంది.

    దానిక్కారణం.....

    హరికృష్ణమనాయుడికి శ్రద్దాంజలి  ఘటించడానికి ప్రధాని స్వయంగా వచ్చారు.

    ప్రభుత్వమే స్వయంగా అధికారి లంచానాలన్ని చేపట్టింది.

    పెద్ద ఊరేగింపు__అప్పటికే స్పృహతప్పిపడిపోయింది ముక్తానంద.

    శవ దహన  కార్యక్రమం  పూర్తయింది.

    అప్పటికి సాయంత్రం  అయిదు  గంటలైంది.

    వచ్చిన అతిధులు, చుట్టాలు.....పార్టి ప్రముఖులతో  హరికృష్ణమనాయుడు నివాసం నిండిపోయింది.

    ముక్తని అందరూ పరామర్శిస్తున్నారు___

    తనగదిలో రాదునాద్, పుష్పక్ , తదిత మిత్రులతో సంప్రదింపులు  జరిపి, గదిలోంచి మెట్లుదిగి హల్లోకొచ్చాడు రవిచంద్ర.


    అక్కడ ఓ పక్కగా ముక్త , మేనత్త వసుంధరాదేవి ,లాయర్  సూర్యసాగర్ ఉన్నారు. అక్కడక్కడ గుంపులు, గుంపులుగా జనం.

    ఇదే మంచి సమయం,

    "చూడండి ప్రెండ్స్....." ఆ మాటకు తల్తెత్తిచూసింది ముక్త ఏ౪ సమయంలో తమను పరామర్శించడానికి  వచ్చినవారికి రవిచంద్ర ధాంక్స్  చెప్తున్నాడేమో అనుకుంది__

    రవిచంద్ర యుద్దభేరి మోగిస్తున్నాడని అర్ధంమ్తెది సూర్యసాగర్ కి.  తన కర్తవ్యం  చటుక్కున  గుర్తుకొచ్చింది. గబగబా ముక్త దగ్గర కెళ్ళాడు.

    "రవిచంద్ర, ఏదో ప్రపోజ్ చెయ్యడానికి సిద్దంగా  ఉన్నాడు.... నువ్వేం ఒప్పకోవద్దు...."అన్నాడు మెల్లగా ఆమె చెవిలో.

    లాయర్  చెప్తున్నామాటలు ఆమెకేం అర్ధం కాలేదు.

    ఆమెకు అర్ధంయ్యేటట్టుగా చెప్పడానికి  సమయంలేదు.

    "చూడండి ప్రెండ్స్ ...ఎలాంటి దారుణమ్తెన పరిస్ధితిలో  మాడాడి    చనిపోయారో మీకు తెలుసు....మమ్మల్ని పరామర్శించడానికోచ్చ్చి, మాతో పాటు మాదుఃఖాన్ని పంచుకున్న మీకు  మా కుటుంబం తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను...

    ఇదే సందర్భంగా___

    ఒక ముఖ్యమ్తెన విషయాన్ని ప్రకటించడం....అనివార్యంగాభావిస్తున్నాను.

    మానాన్నగారు తన ఆర్గన్తే  జేషన్స్ ని ఎంత సమర్ధంవంతంగా నిర్వహించారో మీకందరికి తెలుసు. ఒక్క నిమిషానికి ఒక్కకోటి వ్యాపారం  మా ఏంప్తేరి లో జరుగుతుంది అడలాగే  కంటిన్యూ  కాకపోతే  వేలాదిసిబ్బంది రోడ్డున  పడతారు. లక్షలాది శేర  హొల్డర్స్  మట్టిగొట్టుకుపోతారు. కనుక  భారమ్తెనా, మానాన్నగారి బాధ్యతల్ని నా భుజాలమీద  విధి తప్పక వేసుకుంటున్నాను.

    మాడాడి... హరికృష్ణమనాయుడుగు సారధ్యంలో ఇన్నాళ్ళూ నడిచిన నాయుడు ఎస్స్ ట్స్, నాయుడు కంపెనీస్ మొత్తం నిర్వహణ  బాధ్యతను నేను, ఈ క్షణం నుంచి చేపడుతున్నానని, నాయుడు గ్రూపాఫ్ కంపెనీస్ అన్నిటికి ఏఎ క్షణంనుంచి చ్తేర్మన్ గా పదవి  బాధ్యతల్ని  చేపడుతున్నానని తెలియజేస్తున్నాను.....మా బ్యాంకర్లకు మావ్యాపార భాగస్వామ్యులైన మిత్రులకు, లీగల్  మేటర్స్  పూర్తయిన వెంటనే అధికారికంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే లిగర్  మేటర్స్  పూర్తయ్యేవరకూ  బ్యాంకు అధికారులు నాతో  సహకరిస్తారని ఆశిస్తాను." దూరంగా  నుంచునివింటున్న ఇద్దరు ముగ్గురు బ్యాంకు అధికారులవ్తెపు చూస్తూ అన్నాడు రవిచంద్ర.

    పుష్పక్ తదితర మిత్రుల చప్పట్లు కొట్టారు....

     రవిచంద్ర నెమ్మదిగా నడుచుకుంటూ లాయర్ సూర్యసాగర్ ముక్త మధ్యకు వచ్చాడు.

    "లీగల్ ఫార్మాలిటిస్ అన్ని....మా ఫామిలిలాయర్  సూర్యసాగర్  గారిని  చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాను.... అలాగే మా చెల్లెలు ముక్త విషయంలో పూర్తి బాధ్యత  వహిస్తానని, అందరికి  తెలియజేస్తున్నాను...."

    రవిచంద్ర ఎత్తుగడ  అర్ధమైపోయింది  సూర్యసాగర్ కి. జాగ్రత్తగా తమచేత కమిట్   చేయించడానికి పూనుకున్నాడు.

    వెంటనే ఏం మాట్లాడాలో  అర్ధం కాలేదాయనకు. ఇంతతోందరగా శవాదహనం వెంటనే, ఈ విషయాన్నీ ,రవిచంద్ర  పట్టిచుకుంటాడని అనుకోలేదు సూర్యసాగర్.

    ఆయన లాయర్ బ్రెయిన్ చురుకుగా ఆలోచిస్తోంది.

    ముక్తకేం తోచలేదు__నిస్సహాయంగా  సూర్యసాగర్ వేపు  చూసింది. తనను ముందుగా ఆయన ఎందుకు హేచ్చారించాడో ఇపుడర్దమ్తెంది కానీ తన అన్న రవిచంద్ర ఇపుడేందుకు తొందరపడుతున్నాడో అర్ధంకాలేదు.

    తనే మాత్రం మౌనంగాఉన్న , రవిచంద్ర  అందరిముందూ చెప్పిన  దానికి కమిట్  అయిపోయినట్టు  లెఖ్ఖ అందుకే ఎ మాత్రం ఆలస్యంచెయ్యకుండా, గొంతు సర్దుకుని__

    పక్కనే ఉన్న ముక్త వేవు, రవిచంద్ర వేపు, మిగతా బంధువుల వేపు చూస్తూ__

 Previous Page Next Page