నవ్వడం ఆపి, తదేకంగా ఆమె మొహంలోకి చూశాడు రాజేందర్. 'నీకెన్నేళ్ళు డార్లింగ్?"
"తొమ్మిదేళ్ళు" అంది స్మిత.
సినీతార శాలిని కలగజేసుకుంటూ మొదటిసారిగా మాట్లాడింది. "చిన్నపిల్లవయినా పెద్దపెద్ద మాటలు మాట్లాడేస్తున్నావ్! బాలనటిగా పనికివస్తావు పాపా! సినిమాల్లోకి వస్తావా?" అంది.
"పెద్దవాళ్ళమయి ఉండి చిన్నతనపు మాటలు మాట్లాడటం కంటే ఇదే నయమనుకుంటాను" అని, "నీ పేరేమిటి డార్లింగ్?" అని స్మితని అడిగాడు రాజేందర్.
"స్మిత!"
"మే గాడ్ బ్లెస్ యూ బేబీ! నీలాంటివాళ్ళు ఇంకా చాలామంది పుట్టాలి. అప్పుడు గానీ, నా భాషా, నా మతం, నా రాష్ట్రం, నా ఊరు, నా పేట అని ఎక్కడికక్కడ అసహ్యంగా కొట్టుకు చస్తూ, ఐకమత్యం అనేది లేని మనుషులుంటే ఈదేశం బాగుపడదు" అన్నాడు మనస్ఫూర్తిగా. తర్వాత దీర్ఘమైన ఆలోచనలో పడిపోయాడు.

అప్పటిదాకా చదువుతున్న మేగజైను సీటు కవర్లో పెట్టేసి, తన హ్యాండ్ బ్యాగులో నుంచి పిల్లల మేగజైన్ ఒకటి బయటికి తీసింది స్మిత. అందులోని గళ్ళ నుడికట్టును సాల్వ్ చెయ్యడం మొదలెట్టింది.
అడ్డంగా మొదటిపదం. దానికి ఆధారం 'గాల్లో ఎగిరేదే అయినా పక్షి కాదు.'
ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా వెంటనే రాసేసింది స్మిత "ఏరో ప్లేన్"
"దాన్ని మొదటిసారిగా తయారు చేసింది ఎవరు? నిలువూ అడ్డం ఒకే అక్షరంతో కలుస్తాయి."
"అర్విల్లీరైట్, విల్బర్ట్ రైట్" అని చకచకా రాసేసింది.
పజిల్ కూడా విమానాల గురించే కావడం తనకి ఎగ్జయిటింగ్ గా ఉంది.
ధ్వనికంటే ఎక్కువ వేగంతో పయనించే విమానం ఏది?
"సూపర్ సోనిక్ జెట్!" అంది స్మిత పైకే. ఆపుకోలేనంత ఉత్సాహంగా ఉంది తనకి. ముందు సీట్లో కూర్చుని ఉన్న శతృఘ్న వైపు ఒంగింది. సూపర్ సోనిక్ జెట్ విమానం ఫ్రెంచి వాళ్ళూ, ఇంగ్లీషువాళ్ళూ కలిసి తయారుచేశారు కదు అంకుల్? లేకపోతే ఫ్రెంచివాళ్ళూ, అమెరికన్సూనా? ఇంగ్లీషువాళ్ళే అనుకుంటాను. ఫ్రెంచివాళ్ళు ఆ విమానాన్ని 'కంకార్డు' అని ఒత్తి పలికితే, ఇంగ్లీషువాళ్ళు 'కంకార్డు' అని తేల్చి పలుకుతారు. అవునా అంకుల్?"
ఊరికే తల పంకించాడు శతృఘ్న. ఆ అమ్మాయిం ఆటలు అతని చెవికి ఎక్కలేదు. అతను తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. పైలట్లు కూర్చునే కాక్ పిట్ కీ, పాసెంజెర్స్ కాబిన్ కి మధ్య ఉండే తలుపు మూసి ఉందా? తెరిచే ఉందా? ఇక్కడి నుంచి కనపడటంలేదు. తలుపు తెరిచే ఉంటే, తను సులభంగా లోపలికి వెళ్ళిపోయి, రివాల్వర్ తో పైలట్లను బెదిరించి విమానాన్ని లొంగదీసుకోవచ్చు.
తలుపులు మూసి ఉంటే కొంచెం కష్టమే!
ట్రేలలో డ్రింక్స్ పెట్టుకుని పాసెంజర్స్ కి సర్వ్ చెయ్యడానికి వస్తున్నారు హోస్టెస్ లూ, స్టివార్ట్ లూ.
శతృఘ్నకి ఒక ఆలోచన వచ్చింది. ఎయిర్ బస్ లో టాయిలెట్స్ ముందు భాగంలో ఒకటి, వెనక భాగంలో ఒకటీ ఉంటాయి.
టాయిలెట్ కి వెళ్ళే వంకతో కాక్ పిట్ దాకా వెళ్ళి తలుపు తెరిచి ఉందోలేదో చూడవచ్చు.
కానీ -
తను సీట్లోనుంచి లేవగానే సుజాత అరిస్తే?
కొద్దిగా వెనక్కి తిరిగి, పెదిమల కొసనుంచి మాట్లాడుతూ ఇక్బాల్ తో అన్నాడు శతృఘ్న. "కాసేపు నువ్వు నా సీట్లో కూర్చో!" అన్నాడతను లేస్తూ.
అర్థం అయింది ఇక్బాల్ కి. లేచి శతృఘ్న సీట్లో కూర్చున్నాడు.
ఇదంతా ఆశ్చర్యంగా చూస్తోంది స్మిత.
"ఏమయింది అంకుల్?"
"ఏంలేదు! ఏంలేదు!" అన్నాడు ఇక్బాల్. 'ఇది పిల్లకాదు, పిడుగు' అని మనసులోనే తిట్టుకుంటూ.
స్మిత లేచి నిలబడి, సుజాతని అనుమానంగా చూసింది. అప్పుడే కళ్ళు కొద్దిగా తెరిచింది సుజాత.
"అక్కా! ఆర్ యూ ఆల్ రైట్?" అంది స్మిత.
ఏదో చెప్పడానికి నోరు తెరిచింది సుజాత. వెంటనే ఆమె భుజానికి ఏదో గుచ్చుకున్నట్లయింది.
తక్షణం నోరు మూసేసుకుని, "ఏమీలేదు" అన్నట్లు తల అడ్డంగా ఆడించింది సుజాత. ఆమె మొహానికంతా చెమట పట్టేసింది.
సీట్లో కూర్చుని, మళ్ళీ క్రాస్ వర్డు పజిల్ తీసింది స్మిత.
"ఆకాశంలో అనుకోకుండా అప్పుడప్పుడు జరిగేదేమిటి?"
ఆ అమ్మాయికి వెంటనే జవాబు స్పురించలేదు. ఇది ఏమిటా అని పెదిమలు కొరుక్కుంటూ ఆలోచిస్తూంటే, సమాధానంలా వినబడింది శతృఘ్న గొంతు.
"ఇది హైజాక్!" అన్నాడు శతృఘ్న సుడిగాలిలా కాక్ పిట్ లోకి చొచ్చుకు పోతూ. కాక్ పిట్ తలుపు తెరిచే ఉంది. కొద్దిసేపటి క్రితం పైలట్లకు డ్రింక్స్ సర్వు చేసిన అనుపమ బయటికి రాగానే డోరు మూసెయ్యడం అశ్రద్ధ చేసింది. అందుకని అతని పని సులువయింది.
అతని గొంతు వినబడగానే ఇక్బాల్, విక్టరు కూడా లేచి నిలబడ్డారు. ఇక్బాల్ చేతిలో ఒక కర్చీఫ్ ఉంది. దాన్లోనుంచి గుండ్రంగా, బంతుల్లా కనబడుతున్నాయి ఏవో.
"ఇందులో గ్రేనేడ్స్ ఉన్నాయి! ఎవరన్నా వెధవ్వేషాలు వెయ్యడానికి ప్రయత్నిస్తే ఈ బాంబులతో విమానాన్ని పేల్చేస్తాము! మేము ప్రాణాలకు తెగించిన వాళ్ళం!" అన్నాడు ఇక్బాల్.అప్పటిదాకా చదువుతున్న మేగజైను సీటు కవర్లో పెట్టేసి, తన హ్యాండ్ బ్యాగులో నుంచి పిల్లల మేగజైన్ ఒకటి బయటికి తీసింది స్మిత. అందులోని గళ్ళ నుడికట్టును సాల్వ్ చెయ్యడం మొదలెట్టింది.
అడ్డంగా మొదటిపదం. దానికి ఆధారం 'గాల్లో ఎగిరేదే అయినా పక్షి కాదు.'
ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా వెంటనే రాసేసింది స్మిత "ఏరో ప్లేన్"
"దాన్ని మొదటిసారిగా తయారు చేసింది ఎవరు? నిలువూ అడ్డం ఒకే అక్షరంతో కలుస్తాయి."
"అర్విల్లీరైట్, విల్బర్ట్ రైట్" అని చకచకా రాసేసింది.
పజిల్ కూడా విమానాల గురించే కావడం తనకి ఎగ్జయిటింగ్ గా ఉంది.
ధ్వనికంటే ఎక్కువ వేగంతో పయనించే విమానం ఏది?
"సూపర్ సోనిక్ జెట్!" అంది స్మిత పైకే. ఆపుకోలేనంత ఉత్సాహంగా ఉంది తనకి. ముందు సీట్లో కూర్చుని ఉన్న శతృఘ్న వైపు ఒంగింది. సూపర్ సోనిక్ జెట్ విమానం ఫ్రెంచి వాళ్ళూ, ఇంగ్లీషువాళ్ళూ కలిసి తయారుచేశారు కదు అంకుల్? లేకపోతే ఫ్రెంచివాళ్ళూ, అమెరికన్సూనా? ఇంగ్లీషువాళ్ళే అనుకుంటాను. ఫ్రెంచివాళ్ళు ఆ విమానాన్ని 'కంకార్డు' అని ఒత్తి పలికితే, ఇంగ్లీషువాళ్ళు 'కంకార్డు' అని తేల్చి పలుకుతారు. అవునా అంకుల్?"
ఊరికే తల పంకించాడు శతృఘ్న. ఆ అమ్మాయిం ఆటలు అతని చెవికి ఎక్కలేదు. అతను తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. పైలట్లు కూర్చునే కాక్ పిట్ కీ, పాసెంజెర్స్ కాబిన్ కి మధ్య ఉండే తలుపు మూసి ఉందా? తెరిచే ఉందా? ఇక్కడి నుంచి కనపడటంలేదు. తలుపు తెరిచే ఉంటే, తను సులభంగా లోపలికి వెళ్ళిపోయి, రివాల్వర్ తో పైలట్లను బెదిరించి విమానాన్ని లొంగదీసుకోవచ్చు.
తలుపులు మూసి ఉంటే కొంచెం కష్టమే!
ట్రేలలో డ్రింక్స్ పెట్టుకుని పాసెంజర్స్ కి సర్వ్ చెయ్యడానికి వస్తున్నారు హోస్టెస్ లూ, స్టివార్ట్ లూ.
శతృఘ్నకి ఒక ఆలోచన వచ్చింది. ఎయిర్ బస్ లో టాయిలెట్స్ ముందు భాగంలో ఒకటి, వెనక భాగంలో ఒకటీ ఉంటాయి.
టాయిలెట్ కి వెళ్ళే వంకతో కాక్ పిట్ దాకా వెళ్ళి తలుపు తెరిచి ఉందోలేదో చూడవచ్చు.
కానీ -
తను సీట్లోనుంచి లేవగానే సుజాత అరిస్తే?
కొద్దిగా వెనక్కి తిరిగి, పెదిమల కొసనుంచి మాట్లాడుతూ ఇక్బాల్ తో అన్నాడు శతృఘ్న. "కాసేపు నువ్వు నా సీట్లో కూర్చో!" అన్నాడతను లేస్తూ.
అర్థం అయింది ఇక్బాల్ కి. లేచి శతృఘ్న సీట్లో కూర్చున్నాడు.
ఇదంతా ఆశ్చర్యంగా చూస్తోంది స్మిత.
"ఏమయింది అంకుల్?"
"ఏంలేదు! ఏంలేదు!" అన్నాడు ఇక్బాల్. 'ఇది పిల్లకాదు, పిడుగు' అని మనసులోనే తిట్టుకుంటూ.
స్మిత లేచి నిలబడి, సుజాతని అనుమానంగా చూసింది. అప్పుడే కళ్ళు కొద్దిగా తెరిచింది సుజాత.
"అక్కా! ఆర్ యూ ఆల్ రైట్?" అంది స్మిత.
ఏదో చెప్పడానికి నోరు తెరిచింది సుజాత. వెంటనే ఆమె భుజానికి ఏదో గుచ్చుకున్నట్లయింది.
తక్షణం నోరు మూసేసుకుని, "ఏమీలేదు" అన్నట్లు తల అడ్డంగా ఆడించింది సుజాత. ఆమె మొహానికంతా చెమట పట్టేసింది.
సీట్లో కూర్చుని, మళ్ళీ క్రాస్ వర్డు పజిల్ తీసింది స్మిత.
"ఆకాశంలో అనుకోకుండా అప్పుడప్పుడు జరిగేదేమిటి?"
ఆ అమ్మాయికి వెంటనే జవాబు స్పురించలేదు. ఇది ఏమిటా అని పెదిమలు కొరుక్కుంటూ ఆలోచిస్తూంటే, సమాధానంలా వినబడింది శతృఘ్న గొంతు.
"ఇది హైజాక్!" అన్నాడు శతృఘ్న సుడిగాలిలా కాక్ పిట్ లోకి చొచ్చుకు పోతూ. కాక్ పిట్ తలుపు తెరిచే ఉంది. కొద్దిసేపటి క్రితం పైలట్లకు డ్రింక్స్ సర్వు చేసిన అనుపమ బయటికి రాగానే డోరు మూసెయ్యడం అశ్రద్ధ చేసింది. అందుకని అతని పని సులువయింది.
అతని గొంతు వినబడగానే ఇక్బాల్, విక్టరు కూడా లేచి నిలబడ్డారు. ఇక్బాల్ చేతిలో ఒక కర్చీఫ్ ఉంది. దాన్లోనుంచి గుండ్రంగా, బంతుల్లా కనబడుతున్నాయి ఏవో.
"ఇందులో గ్రేనేడ్స్ ఉన్నాయి! ఎవరన్నా వెధవ్వేషాలు వెయ్యడానికి ప్రయత్నిస్తే ఈ బాంబులతో విమానాన్ని పేల్చేస్తాము! మేము ప్రాణాలకు తెగించిన వాళ్ళం!" అన్నాడు ఇక్బాల్.