Previous Page Next Page 
సక్స్ స్ పేజి 16


    తండ్రి ఆస్తికోసం ఎగబడటం కాదురా కొడుకులకి, కూతుర్లకు కావలసింది- తమ తండ్రి తమ కోసం  ఎన్ని సుఖాల్ని త్యాగంచేసాడు.... ఎంత పరిశ్రమించాడని అర్ధం చేసుకోవటం కావాలిరా అప్రాచ్యుడా ...చేత నైతేతే తండ్రి  తన జీవితకాలం వెచ్చించి సంపాదిందిన పరువు ప్రతిష్టల్ని  నిలబెట్టుకోగలగాలి-ఇంకా చేతనైతే  వాటిని పెంచగలగాలి.


    వెళ్ళు....వెళ్ళు...వెళ్ళి ని చెల్లెల్ని ఓదార్చు, ని ఆరాటం, ఆత్రుత  నాకు తెలుసు- నీకు పోటిగా  మరో వారసురాలుందనే ని భయం.

    లేదంటే ని చెల్లెల్ని పిక పిసికి  చంపేయ్ ...అప్పడు నీకు తిరుగుండదు______" చిదరించుకున్నట్లుగా అన్నాడు సూర్యసాగర్.

    పట్టరాని  ఆగ్రహవేశాలతో రవిచంద్ర పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కళ్ళు రక్తం చిమ్ముతున్నట్లుగా మారిపోయయి.

    "యూ...." అంటూ సూర్య సాగర్ కాలర్ ని పట్టుకొన్నాడు అనుకోకుండా రవిచంద్ర.

    దంతో నిర్ఘాంతపోయాడు సూర్యసాగర్.

    "పెద్దవాడ్నని- మీ నాన్నగారికి అంతరంగికుడ్నిని-ఆప్తుడినని కూడా చూడకుండా -కాలర్  పట్టుకుంటావా? చిన్నంతరం-పెద్దతరం లేకుండా ప్రవర్తిస్తావా రాస్కెల్ ....ఇప్పడే నిన్ను పోలీసులకు పట్టించగలను.

    నాకు జరిగిన ఈ అవమానాన్ని అంత తేలిగ్గా మర్చిపోను-మర్యాదగా కలర్ వదులు- లేదంటే నువ్వు నామీద మర్డర్  ఎటేమ్ట్ చేసావని 30/సెక్షన్ కింద బొక్కలోకి నేట్టించేస్తాను. నేను  లీడింగ్ లాయర్ని- అనామకుడ్ని కాదు" పెద్దగా  రంకెలేస్తున్నట్లుగా అనటంతో, ఒకింత జంకిన రవిచంద్ర కాలర్  వదిలేసాడు.

    అనవసరంగా తొందరపడ్డానా? ఒక్క క్షణం చింతించాడు రవి చంద్ర, తన ఆవేశాన్ని తిట్టుకున్నాడు.

    "సారి....అంకుల్" అన్నాడు రవిచంద్ర కోపాన్ని దిగమ్రింగు కుంటూ.

    అయిన శాంతించలేదు సూర్యసాగర్.

    కానప్పటికే తమ వాగ్వివాదం బయట వారికి వినిపించిందేమో....కొందరూ అటుగా వస్తున్నట్లు చప్పన గ్రహించాడు సూర్యసాగర్ దాంతో తెచ్చిపెట్టుకున్న సౌమ్యంతో__

    "మీ  ప్రాపర్టీ....లక్షా రెండు లక్షలలో కాదు....కోట్ల ఆస్తి....కంపెని లీగల్ ఎడ్వయిజర్ తో మాట్లాడాలి....బోర్డాఫ్ డ్తె రెక్టర్స్ మీటింగ్ జరగాలి. అందుకు ముందు.....మీ డాడి వీలునామా ఎద్తేనా రాసారేమో వేరిప్తే చేయాలి. ఇట్స్ టెక్ టైమ్....యూ నో దట్" అన్నాడు అప్పటికా ఘర్షణని ఆపేయాలని.

    "నేను చెప్తున్నాను కదా....ఫార్మాలిటిస్ పాయింట్ తర్వాత చూసుకుందవని....నేను  కాకుండా ....ఇంకేవర్తేనా ఉన్నారనా...మీ ఉద్దేశ్యం..." కోపంగా అడిగాడు రవిచంద్ర.

    "మీ చెల్లెలు ముక్త లేదా" దిగ్ర్భాంతిగా చూస్తూ అన్నాడు.

    ఆ మాటకు నవ్వాడు రవిచంద్ర పెద్దగా.
   
    "నాయుడు కంపెనీకి  అది చ్తేర్మన్ అవుతుందా? దానికంత కెపాసిటి ఉందా... ఎం.బి.ఏ.....చదివినంత మాత్రాన....ఎడ్మినిస్టేషన్ వస్తుందటారా....? మా చెల్లి గురించి, ఆలోచించాల్సింది మీరు కాదు నేను.... అర్ధమ్తెందా....?

    "మీ చెల్లికి నువ్వేం చేస్తావ్...."

    "మంచి సంబందం చూసి, పెళ్ళి చేసి....పంపుతాను...డాడి ఉన్నా అదే చేసేవారు..."

    "అలా అడ్డు తొలగించుకుందామనా......?"

    "బాగా అర్ధం చేసుకున్నారు." సర్ క్కాస్టిగ్గా నవ్వుతూ అన్నాడు రవిచంద్ర.

    "నీకు నేను సహకరించకపోతే....?"

    "నా తండ్రికి నేను తలకొరివి పెట్టాను. ఇంటికి పెద్దకొడుకు లాభపడేది__ లాభాపడవలసింది, తండ్రి తల కొరివి  దగ్గరే గదా....?" పరోక్షంగా బ్లాక్ మెయిల్ చేసాడు.

    పట్టరాని అసహ్యంతో పక్కకి తిరిగి ఉమ్మేసాడు సూర్యసాగర్ .

    "మీరేం చేసినా నాకు మా నాన్న ఆస్తి మొత్తం కావాలి. నామీద  ఉమ్మేసినా తడుచుకుపోగాలను-నాకు ఆస్తి ముఖ్యం"

    "నీకు సిగ్గుగా లేదూ?"

    "అదుంటే విలాసవంతమైన జీవితాన్ని కొనుక్కోవచ్చు? కోరుకున్నది పొందవచ్చు? కోండమీద కోతిని దించవచ్చు? ఎస్ అనుకుంటే  చెప్పండి- ఆ మార్గమేదో  చూపించండి-ఈ వాదన మానేస్తాను."

    సూర్యసాగర్ కేం చేయాలో తోచలేదు.

    ఇప్పటికిప్పడే వీడ్ని ఘాట్  చేసి  పడేస్తే....? అప్పుడు ఒక దుర్మార్గుడ్తెన కొడుకు పోతాడే తప్పు నాయుడిగారి కుటుంబ పరువు ప్రతిష్టలు రోడ్డున పడతాయి.

    తానిప్పుడు తమాయించుకోవాలి.

    తెలివిగా కర్మకాండ జరిగేలా చూడాలి.

    అది తన కనీస బాధ్యత ఆ ఆలోచన వస్తూనే అతి బలవంతం మీద తనని తను  నిగ్రహించుకున్నాడు సూర్యసాగర్.

    "నేను చ్తేర్మాన్ని అయితే....మిమ్మల్ని మరచి పోతాననుకోన్నారా...." గొంతు తిగ్గిస్తూ అన్నాడు రవిచంద్ర.

    "అంటే..."

    "తెలియనట్టు మాట్లాడకండి....మనలో మనకెందుకంకుల్....మీ  కెంత కావాలో చెప్పండి మూడో కంటి వాడికి తెలిదు....ఇప్పడే చెక్కు  రాసిస్తాను...."జేబులోంచి చేక్కుబుక్ తీస్తూ అన్నాడు రవిచంద్ర.

    "ఆ చేక్కుమీద ని సంతకం చెల్లుతుందా.....

    "మీరు ఊ అంటే చెల్లుతుంది. నాకా పాయింట్ తెలుసు....అందుకే..."

    "నాకూ, మీ డాడికున్న  స్నేహం గురించి నీకు తెలుసు...చివరి సమయంలో దగ్గరుండి కూడా, హరికృష్ణను రక్షించుకోలేక పోయాననే నాబాధ . నాకు నువ్వెంతో ,మీ చేల్లికూడా  అంతే.... మీ డాడి వీలు నామా చూస్తేనే తప్పు నేనేం చెయ్యలేను....." చెప్పాడాయన.    

 Previous Page Next Page