(బలమైన ఇనుప తలుపు. బహుశా చెరసాల తలుపు కన్నా బలమైనది. యంత్రాలుంటాయిగా మరి. మనుష్యుల కంటే యంత్రాలే ముఖ్యమైనవి, విలువైనవి కనకనే ఆ తలుపుకి తాళాలు) కొంచెం వయస్సు మీరిన యూనియన్ మెంబరువస్తాడు.
అతడంటాడు వెళ్ళిపొండి. ఉంటె ప్రమాదం. తతిమ్మావి అప్పుడే సాధీనమయాయి. మరీ దురుసుతనం కూడదు. వెళ్ళి మిగిలిన వాళ్ళతో మాట్లాడుదాం . ఏం ఏమంటారు?
జవాబు లేదు. అతనే వెళ్ళిపోతాడు.
అయిదు నిమిషాల తర్వాత యువ కార్మికులు ఒక కిటికీ బద్దలు చేసి లోనికి వెళ్ళి లోపలి నుంచి ఎలెక్ట్రిక్ దారాన్ని పని చేయిస్తారు. దారం తెరచుకుంటుంది.
అరుపులు, చప్పట్లు, ఎర్ర జెండా , దురుసుతనం కూడదు!
తొమ్మిది గంటలు.
సాదీనం చేసుకొని కార్మికులు కచ్చితమైన కార్యక్రమం ప్రారంభిస్తారు.
అది సోమవారం . 70 లక్షలకు పైగా వర్కర్లు సమ్మె చేస్తున్నారు . దేశం స్తంభించి పోయింది ఒక రోజు . ఒకే ఒక్క రోజు మనం పని మానేస్తే అంత మందీ కలిసిపని మానేస్తే, అప్పుడు లోకానికి బోధపడుతుంది. స్పష్టంగా భూమ్యాకర్షణ శక్తి లాగ, చక్రాలను నడిపించేది మనం మాత్రమే అని, మనం లేకపోతే చక్రాలాగి పోతాయని.
విమానాలేగరవు. ఓడలు కదలవు. రైళ్ళు నడవవు. పరిశ్రమలు బందు. కానీ అన్నీ సజీవం. సంసిద్ధం. ఒక కొత్త వ్యవస్థని మళ్ళీ ప్రారంభించడానికి సిద్దం.
దేశానికి రక్తం అనదగ్గ విద్యుచ్చక్తి , గ్యాస్, ఇంకా కుటుంబాల సరఫరా అవుతున్నాయి.
ప్రజాజీవితం ఆగిపోకూడదు కాబట్టి కొళాయిలకి నీరందుతోంది. విద్యుత్తుదీపాలని వెలిగిస్తోంది. పొయ్యి రాజడానికి గ్యాస్ పనిచేస్తోంది.
చరిత్ర మాత్రమే మారాలి.
కాని, యూనియన్ల పట్టు మాత్రం ఇంకా గట్టిగానే ఉంది. టీచర్లూ, స్టూడెంట్లూ ఒకరి నుండి ఒకరు నేర్చుకుంటున్నారు. వర్కర్లు నేర్చుకోవాదానికి సాయపడుతున్నారు.
కాని యూనియన్ల వలయం కరిగించరానిది, విరిగించరానిది.
బ్యాంకుల తలుపులు మూసుకుంటున్నాయి. రాజకీయ నాయకుల కళ్ళు మూసుకుంటున్నాయి. ప్రజల చేతిలో డబ్బు రాను రాను తగ్గుతోంది. స్నేహితుల సమాఖ్య హెచ్చుతోంది. పురుగులు హడావుడి తను కార్లలో దూరి అర్ధం లేని పనులు సాగిస్తాయి. తమ ఒంటరితనపు తాపత్రయాలతోనూ భయలతోనూ, పారిస్ శకటాలతో క్రిక్కిరిసిపోయింది. బ్రహ్నదమైన ఒకే ఒక ట్రాఫిక్ స్తంభన. మొత్తం మీద అంతా ఒక ఇనుప ముద్దగా గడ్డకడుతుంది.
శవవాహకులు సమ్మె చేశారు. చచ్చిపోయినవాళ్ళు కూడా నవయుగం కోసం ఎదురుచూస్తున్నారు. షాప్ గర్స్ హటాత్తుగా తమ జీతం చాలా తక్కువనీ, తమ కాళ్ళు చాలా అలసిపోయాయని గ్రహిస్తారు. గొలుసు షాపుల్ని ఆక్రమిస్తాయి.
నటీనటులు కూడా రంగం మీది కొస్తారు.
నేషనల్ లైబ్రరీ వద్ద జనం రద్దీ, స్థలం చాలదు.
పుస్తకాలలోంచి ఒకాయన పైకొచ్చి దరఖాస్తు తాయారు చెద్దామంటాడు.
మ్యూడాస్ వద్ద జ్యోతి శాస్త్రజ్ఞులు సమ్మె చేస్తున్నారు. డబ్బు కోసం కాదు, ఇంకా ఇంకా నక్షత్రాల కోసం.
డబ్బు గిరాకీ పెరిగిపోతోంది. బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ కరెన్సీ నోట్లు అచ్చు వెయ్యడం మానేసింది. బ్యాంకు గుమస్తాలకి కూడా తేళ్ళు కుట్టినట్టుంది. వాళ్ళూ సమ్మె చేస్తున్నారు. బ్యాంకుల వద్ద చాలా కొద్ది కౌంటర్లు తెరిచి ఉంటాయి. క్యూలు మాత్రం పోడుగాటివి. అయితే పారిస్ కి, పట్టణలకీ ప్రతిదినం ఆహారం అందుతోంది. పరిసర గ్రామాల వారు హృదయపూర్వకంగా పంపుతున్న తిండి దినుసుల్ని ఆకొన్న పట్టణాలకు భారీ దళారులు చేరవేస్తాయి.
చెత్తను తుడిచేవాళ్ళు లేరు. ఉత్తరాలందడం లేదు
విభేదాలు, సారూప్యాలూ పైకి తేలుతున్నాయి. ముసుగులు తొలగినపాత అలవాట్లిప్పుడు పచ్చి మాంసం ముద్దలు.
(ఒక మిత్రుడు , లైసీంద్యార్ది. ప్రతి సాయంత్రం ఇంటికి ఫోన్ చేసి, బెంగ పెట్టుకోవద్దని తల్లి దండ్రులకు తెలియజేస్తాడు. తనకి గాయాలు తగలలేదనీ, విప్లవం భేషుగ్గా సాగుతోందని చెబుతాడు....)
సమ్మె, ఫ్యాక్టరీల పనిచేసే స్థలాల ఆక్రమణ .
అన్నీ తిండి, హుందాతనం, ప్రజాసామ్యం కోసం.
తిండి కోసం మాత్రమే అంటుంది సి.జి.టి. (కమ్యునిస్టు కార్మిక సంఘం)
తిండికీ, హుదతనానికి అంటుంది సి,యుఫ్. డి.తి. (కేధలిక్ కార్మిక సంఘం) సమాజనిర్మాణంలో కొత్త మార్పు అవసరమని సూచన ప్రాయంగా అంగీకరిస్తుంది.
దేవతలూ, వారి చుట్టూ మూగిన నక్షత్ర కూటాలూ, ఉద్యమమూ- ఇవి ప్రజాసామ్యం కోసమే అంటాయి. ఔను కార్మికులూ పాల్గొనే ప్రత్యేక్ష ప్రజాస్వామ్యం.
కార్మికులకమిటీలు, కార్మిక కౌన్సిళ్ళు.
కార్యాచరణ కమిటీలు, స్థానిక కౌన్సిళ్ళు.
అట్టడుగుల నుంచి పనిచేస్తున్నాయవి. సమాజం లోపల, ప్యాక్తరీల లోపల.
సి.జి.టి. హడలిపోయింది.
అబద్దాలకీ, మోసాలకీ, అవమానలకీ , బెదరింపులకీ పూనుకుంది.
పిడివాదం ఉపయోగిస్తుంది. డబ్బునే అంటి పెట్టుకొండి. తిండి, తిండి, తిండి మాత్రమే.
జాత్యాహంకారం, జాతీయత విద్యార్ధులు, లేష్టిస్టులు, ప్రమాదకారులు, ప్రభుత్వమూ, విదేశరాజ్యాలూ, పరాయి వాళ్ళు వీళ్ళకి డబ్బిస్తున్నారు.
అది వర్గ ద్వేషాన్ని రెచ్చగొడుతుంది. విద్యార్ధులు, ధనికవర్గాల బిడ్డలు. కాని రోజురోజుకి వలయం బలహీనమవుతుంది.
కార్మిక వర్గ ప్రాంతాలు 19 వ శతాబ్దంలోకి ఉరుకుతాయి. వీధుల్లో బిస్టోలు- అరుగు మీద అమ్మే స్థానికపు షాపులు - చరిత్రకి అటవిడుపు.
మధ్యతరగతులది అస్పష్టపుమసక దృష్టి, కొంతమంది తమ పనుల్లోకి పోతారు. కొందరు కార్యాచరణ కమిటీలలో చేరుతారు. కొందరు ఇళ్ళల్లో నే తలుపులు బిడాయించుకొని కూర్చుంటారు. ఉష్ట్రపక్షులు.
పెళుసైన పరికరాలతో వాళ్ళ పిల్లలు నూతనాకాశాలు నిర్మిస్తున్నారు.
కొంతమంది ఒక కొత్త విశ్వవిద్యాలయాన్ని మాత్రమే నిర్మిస్తున్నారు. పోలీసుల ప్రవేశాన్ని సాధ్యమయిన దుర్గం. ఏ అధికారమూ తన పట్టుదలను బలవంతంగా రుద్దలేని చోటు.