Previous Page Next Page 
రెక్కలు విప్పిన రివల్యూషన్ పేజి 16


    భూమిబద్దలై పెద్దవీ, చిన్నవీ పగుళ్ళు, పొగలు, నిప్పురవలు, సలసల మరిగే జలాలు, అగ్నిపరతం పేలుడు పైపెచ్చు యిప్పుడు గట్టిగాలేదు. పారిస్ లో రాకపోకలు స్తంభించాయి. అక్కడ గుండె కొట్టుకోవడంఆగిపోయింది.
    మూలుగుతూ దేశమనే యంత్రంనిలిచిపోతోంది. విధ్యుచ్చక్తి, గ్యాస్ వచ్చేశాంమనం.
    రేడియో, టెలివిజన్ టెక్నీషియన్లలో, జర్నలిస్టులలో అలజడి.
    కారణం వాళ్ళ అంతరాత్మలు.
    జర్మనీలో ఉంచిన ఫ్రెంచి సేనలకు తాఖీదులు వెళ్ళాయి.
    డిగోల్ మరలి వచ్చాడు.
    ఇరవై లక్షల మందికి పైగా సమ్మె చేస్తున్నారు.
    అది ఆదివారం ఉదయం.
    డిగోల్ కునోరు పెగిలింది. మాటలుదొరికాయి. 'సంస్కరణలకిసిద్దం, కుక్కల గత్తరకిససేమిరా.'
    బలాంకూవద్ద ఒక ప్రదర్శనం.
    మిగిలిన ఆఖరి అధికారులు (సి.జి.టి.) ప్రజలకు అన్నమూ, వినోదమూ అందజేస్తామంటారు.
    సోర్భాన్, సెన్సియర్ ప్రజలకు ఇన్ఫర్మేషన్ యిచ్చే మంత్రివర్గ కార్యాలయాలయ్యాయి.
    ఫాక్టరీలలోనూ, రాష్ట్రాలలోనూ పంచిపెట్టడానికి కరపత్రాలూ తయారుచేస్తున్నాయని.
    నగ్నంగా, స్పష్టంగా, మితంగా 300 మాటలు అంతే.
    కార్మికులు వస్తారు. విద్యార్ధులతో తమ కష్ట సుఖాలు చర్చిస్తారు.
    ఒకపాఠం తయారు చేస్తారు. చర్చిస్తారు. అచ్చువేస్తారు. పంపిస్తారు. వాటిమీద తమ సహచరుల అభిప్రాయాలను కనుక్కొని కార్మికులు తిరిగివచ్చి చెబుతారు.
    పాఠాన్ని పునర్లింఖించడం జరుగుతుంది.
    విశ్వవిద్యాలయమే ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీయే విశ్వవిద్యాలయం.
    లలితకళల కార్యాలయంవద్ద పోస్టర్లు. విషయాన్ని వర్కర్లు సూచిస్తారు. ఆర్టు విద్యార్ధులు బొమ్మల్నిగీస్తారు. (ఆర్టిస్టులు కారు వీళ్ళు అందరూ విప్లవాన్ని చదువుకుంటూన్న విధ్యార్ధులు.) గ్రాఫిక్ తరగతులకి చెందిన వాళ్ళు. వోటు దారా ఏం అచ్చువెయ్యడానికి తగినవో నిర్ణయమవుతుంది.
    సాంస్కృతిక విప్లవం జయించింది.
    కార్యాచరణకమిటీలు, ఒక భౌగోళికప్రాంతంలో, ఒక పట్టానపువార్డులలో, స్టూడెంట్ వర్కర్ల పరస్పర సంబంధపు కమిటీలు ఫాక్టరీలలో, వృత్తులలో, ఆఫీసులో కార్యాచరణ సంఘాలు. "ప్రజాధికారపు" పసిగుడ్లు ప్రత్యక్షప్రజాస్వామ్యపు ప్రకటనవాహనాలు.
    దేవదూతలకీపాటికి తెలిసిపోతుంది-పతనమైనపాత ప్రభుత్వానికి మిగిలిందొక్క పోలీసులే అని. పరిమిత చర్యలకి పోలీసులు. ప్రదర్శనచర్యలకు సైన్యం. ఇవి గాక మహా మిగిలితే ప్రచార సాధనాలు. (పత్రికలూ, రేడియో, టెలివిజన్.) మొదటి రెండూబొత్తిగా పనికి రాకుండా పోయాయి. రెండూ నమ్మదగ్గవి కావు. ఇక మూడోదాన్ని ఓడించడానికి కరపత్రాలూ, పోస్టర్లూ, కార్యాచరణసంఘాలూ ఉన్నాయి. ప్రజలంతావాటిలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు.
    ఇక మిగిలిన అసలు శక్తి సి.జి.టి. (దీనితో బాటు ఇష్టం లేకపోయినాసి.యఫ్.డి.టి.) దీన్ని ఓడించాలంటేదీని చుట్టూ అల్లినమంత్ర వలయాన్నిభేదించాలి.
    కొంతమంది మిలిటెంట్ స్టూడెంట్లు వర్కర్లు టీచర్లచుట్టూ, ప్రజల్లో కొంతభాగం చుట్టూ యిప్పుడు ఉద్యమం రూపుదాలుస్తోంది. దీని తక్షణ కర్తవ్యం సమ్మెల్ని, ఫాక్టరీల ఆక్రమణలనీ విస్తరించడం, దృఢ పరచడం, రాజకీయ చైతన్యం కలిగించడం. దీనిప్రధాన శత్రువులు సి.జి.టి., కమ్యూనిస్టు పార్టీలు.
    దీనిలో మున్ముందు చేరగలమిత్రులు ఫాక్టరీ వర్కర్లు-ఓంప్రథమంగా.
    కానిమార్క్సు నవు  తెప్పించేటంతగా రైటు. బాగా పారిశ్రామికాభివృద్ధి జరిగిన దేశాల్లో పెట్టుబడి, లేదా పెట్టుబడి మీద ఆధిపత్యం, తదారానిర్ణయాలు చేసే అధికారం చాలా కొద్దిమందిచేతుల్లోనే ఉంటుంది.
    ఎవరునిర్ణయిస్తారు -ఏది, ఎలాగ, ఎవరికోసం, ఎందు నిమిత్తం ఉత్పత్తి చెయ్యడమనేది?
    ఫాక్టరీలలోని కార్మికులే కాదు, అత్యున్నతమైన వృత్తులలోకూడా జీవనోపాధికి పాటుపడేవాళ్ళతో సహా, వాళ్ళెంత ఉన్నతులైనా ఈ నిర్ణయాధికారం లేనివాళ్ళే. ఈ అర్ధంలో వీళ్ళంతమందీ పెట్టుబడిదారీ సమాజమనే, బూర్జువా రాజ్యమనేబ్రహ్మాండమైన ఫాక్టరీలో కార్మికులే. అందరూ దోపిడీకి గురి అవుతున్నవారే. కార్మికులు పేదవాళ్ళు. కాని మిగిలిన వాళ్ళూ అంతే. ఎంచేతనంటే ఇతరుల ఆజ్ఞమేరకు పని చేస్తారు కాబట్టి. ప్రత్యక్ష చర్య (సమ్మెలు), ప్రత్యక్ష ప్రజాసామ్యం(పని యొక్క లక్ష్యాన్నీ, సభావాన్నీ మార్చేకమిటీలుగా మార్గాలసమ్మె కమిటీలు) వీళ్ళని ఆకర్షిస్తుంది.
    సైంటిస్టులు మొదలుకొని సివిల్ సరెంట్లదాకా అందరూ ఈ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొంటారు. రెండో మిత్రుడు. అక్కడ సి.జి.టి. వలయాన్నీ, మనస్సులనీ బిగించదు. అలా చేసేది పాతపరిస్థితి మాత్రమే. ఇది వీళ్ళు కనిపెట్టిన కొత్త విషయం. పేదవాళ్ళకి విరుద్దంగా మేం బాగాబతుకుతున్నామనీ, ఏవో అధికారాలు మాకున్నాయనీ భ్రమ పడడం ఈనాటిది కాదు. చాలాపాతది.    

                              14
    
    ఆఖరి సంస్కరణవాది ప్రేగులతో.
    ఆఖరి పెట్టుబడిదారులను ఉరి తీసినప్పుడే.
    మానవజాతి సుఖపడుతుంది.
    "కాండార్సేవిద్యాలయం)
    సిట్రోయన్:కాన్సె న్ట్రేషన్ క్యాంపులఫాక్టరీ.
    గుమ్మందగ్గర నల్లనియూనిఫారాలు ధరించినరక్షకులు. లోనికి వెళ్ళేముందు తనిఖీ. (విప్లవ సాహిత్యంకోసం.) బెదిరింపులు యూనియన్లలో చురుగ్గా పని చేసినవాళ్ళ మీద పగ తీర్చుకునేచర్యలు. ఉత్పత్తిలైను మీద ఒక బుడతకీచు. ఒక ఫ్రెంచివాడు, ఒక ఉత్తరాఫ్రికావాడు, ఒక యుగోస్లావ్. మళ్ళీ ఒక బుడతకీచు. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడటానికి వీల్లేకుండా వాళ్ళవెనుక, కాపలాదార్లు.
    అందరికీగుర్తింపు కార్డులు - అడిగిన వెంటనే చూపించడానికి. లైను చివరనిసిట్రోయన్ కారు - మంత్రులువాడే కారు. దాని ఆకారాం, శైలి, సభావం, అంతా దాన్నితయారుచేసిన ప్రపంచానికి నిదర్శనం. దేషించదగ్గ కారు. భయంకరమైనదాని ధీమా (చప్పుడు చెయ్యకుండా జారుతుందది) ప్రజల్లో హడలుపుట్టించడానికే ఉద్దేశించబడింది.
    సోమవారం ఉదయం 5.45
    ఫాక్టరీపోలీసులప్పుడే లోపల ప్రవేశించారుప్:గార్డులు, ఇన్ స్పెక్టర్లు, ఛోటా అధికారులు.
    ఆరింటికి కార్మికులు వస్తారు. వాళ్ళులోనికి వెళితే సమ్మె లేదన్నమాట. లోపల వాళ్ళు ఒక కుటుంబం. సమ్మెకికాపలాదార్లు కావాలి. కార్మికులందుకు సాహసించలేరు.
    అలా చేస్తే ఆ తర్వాత బర్తరపు విద్యార్ధులు కూడా వచ్చారు. వాళ్ళూ, కార్మికులలోని మిలిటెంట్లూ అడ్డుగొడుగా ఏర్పడతారు. గుంపులు.
    లౌడ్ స్పీకర్"ఇవాళ సమ్మె చెయ్యవలసిందిగా కోరుతున్నాం. వెయ్యి ఫ్రాంకులకోసం, పని హామీకోసం (పగతీర్చుకోవడం ఉండదు) అరవయ్యేళ్ళకి పింఛను ..... ....." వీరిలో నలభైశాతం అరబ్బులూ, స్పెయిన్ దేశీయులూ, భూతకాలపుతెగింపు. అంతకన్న కొంత మెరుగైన వర్తమానకాలపు నరకం.
    విద్యార్ధులేమిటి చదువుతున్నారు? ఔను. అన్నిటితో బాటు స్పానిష్ భాష కూడా.
    "ట్రాబజడోర్స్ టోడోస్ యూనిడోస్......" కంపెనీ ట్రక్కులుమనుషులు అలమందల్నిదించుతున్నాయి.
    వింటున్నారు వాళ్ళు. తమభాషని వింటున్నారు.
    బూడిదరంగుయూనిఫారాల అధికారులు తమకి మచ్చికైన కార్మికులకోసం చూస్తారు. ఒక సైడు గేటులోంచి జారుకొమ్మని మౌనంగా సంజ్ఞ చేస్తారు. వాళ్ళువెళ్ళరు. మొత్తానికి కార్మికులంతా అక్కడే ఉంటారు. పంచిన కర పత్రాలను చదువుతూంటారు.
    ఏడుగంటలు.
    బలంపుంజుకున్నారు కాబట్టి ఫాక్టరీలోకి ప్రవేశిస్తారు. గార్డులు అద్దాల పంజరాలలోతలదాచుకుంటారు. అయినా బిడియం, అనిశ్చితతం.
    శతాబ్ధాలబుగ్గి దులిపెయ్యాలి. దరిద్రం, నిస్సహాయత, విధి. పేదవాళ్ళెప్పుడూ పేదవాళ్ళుగానే ఉంటారు. బలవంతులు బలవంతులుగానే చాలా మందికి తమ వెనుకటి మురికిపేటలు జ్ఞాపకం వస్తాయి. తమ తమ సదేశాలకు పంపించేస్తారనే భయం ఒకటి.
    ఎనిమిదిగంటలు దాదాపుగా.
    ఇదివరకే ఆక్రమించిన దగ్గర్లోని బ్రాంచి ఫాక్టరీ నుంచి క్రమబద్దంగా అడుగులు వేస్తూ యువకార్మికులు వస్తారు. పాట .
    "బెర్కోహంతకుడు -(ఫాక్టరీ యజమాని) అడుగులు వేస్తూనేలోనికి ప్రవేశిస్తారు. తతిమ్మావాళ్ళు వెంబడే వస్తారు. మెయిన్ గేటు వద్ద ఎర్ర జెండా ఒక్కొక్కటిగా వర్కుషాపుల్నిఆక్రమిస్తారు. యువకుల వర్కుషాపుగూటెన్ బర్గ్ ఇంకాతాళం వేసి ఉంది. ఒక విద్యార్ధితో ఒక యువకార్మికుడు: "దాన్ని జైలు అని ఎందుకంటున్నామో తెలుసా? తలుపువేపుచూడు ...."

 Previous Page Next Page