వారిలో అత్యుత్తములు భవిష్యత్తులో జీవిస్తున్నారు. జరోగ్రతలో బావి ప్రపంచాన్ని నిర్మిస్తున్నారు.
కార్మికులు, నిత్యావసరాలు, సాఫీగా సరఫరా కావడానికి తోడ్పడుతున్నందువల్ల నే దేశామింకా కుళ్లి పోలేదన్న గ్రహింపు క్రమక్రమంగా రూపుదాల్చుతోంది.
ఘనతంతా తమదే అంటాయి కార్మికసంఘాలు, ఇక పార్టీ ! అప్పటికి అంతర్ధానమైన ప్రభుత్వానికే సమస్తమూ సమర్పించి, ఒక చిన్న వాటా మాత్రం అడగడానికి సిద్దం.
పత్రికలు తమ పని తాము చేసుకున్నాయి, అబద్దాలాడడం.
ఇంకా బూర్జువా భయాలు మిగిలిపోయిన వారిలో ఆ భయాలను సజీవంగా నిలబెడతాయి. ఛాయా మాత్రంగా మిగిలిన పార్లమెంటు గురించి ప్రసంగిస్తాయి.
రైతుల్లో చాలా అసంతృప్తి ఉంది. వారిలో ఒక భాగం ఉద్యమంలో చేరుతుంది.
అసంఖ్యాకులకు గట్టి పునాదులున్నాయి. కాని ఆకాశం ఎంతో దూరంలో లేదు.
కొందరు కార్మికులలో చేరుతారు. నంటెస్ వద్ద మొట్టమొదటి ప్రజా పట్టణం దధ్యం కావచ్చు. ఇతర చోట్ల జనసంచారం లేని రహదార్ల మీద బంగళా దుంపలు విసరొచ్చు.
పెట్రోలుకి కరువొచ్చి మాయమవుతుంది.
అధీకారుల దీర్ఘ హస్తం.
పెట్రోలు లేదు. కొత్త వైశాల్యాన్నీ , కాలూనుకునే కొత్త మెట్లనీ, గెలుచుకొంటున్న ఉద్యమానికి రాకపోకలు ఇబ్బంది ఏర్పడింది.
అదీ ఒకందుకు మంచిదే. అధిక బలవంతమైన బూర్జువా వర్గం. ఇప్పుడు జడిసిపోయి తమ సామాన్ల పెట్టెల్లో కరెన్సీ కట్టల్ని కుక్కుకొని పారిపోవడానికి వీల్లేదు.
పల్లె ప్రాంతాల ఇళ్ళలో కిటికీలు, తలుపులు మూసుకొని తాత ముత్తాల నాటి వెండి సామాగ్రి కాపాడుకుంటూ తలదాచుకుంటారు.
పాపం మార్కు తాతయ్య , చెత్త సాహిత్యపు రుచి తెలిసినవాడు, కొన్ని ప్రాధమిక వాస్తవాలు, బైటి కోస్తుంటే గుర్తించినవాడు. ఖంగుమనే మాటల్లో ఆ సంగతి చెప్పనే చెప్పాడు. " బూర్జువాజీ అంతరించిపోతుంది" అని! జోలా వర్ణించిన బూర్జువాజీ , పిచ్చేత్తిన ప్రజలుచీల్చి చెండాడిన షాపుకీపర్లు, అత్మలకీ, ప్యాక్టరీలకీ కామాందులైన వాళ్ళు , అజ్ఞానంతో కుదించినవాళ్ళు , ఆస్తులార్జించినవాళ్ళు, సరుకుల్ని జాగ్రత్త పెట్టె నీతివేత్తలు - అంతా హరించుకుపోతారు.
కంప్యూటర్లనీ, ఆదాయ వ్యయపట్టేలనీ, కంపెనీ గ్రాపులనీ దిగవిడిచిపోతారు. గందరగోళంలో పడ్డ వాళ్ళని అసమర్ధంగా పరిపాలించే కాగితపు పీలికలు అవి ఇన్నాళ్ళూ.
లేక్కలేనన్నీ కాఫీ కప్పుల మధ్య, ఒక వంద ఉజలరాత్రులలో బాల్జాక్ సృష్టించిన బూర్జువాజీ ఇప్పుడు తన పాత రూపానికొక నీడ మాత్రమే.
యువతరానికి చెందిన టేక్నిషియన్లూ, సైంటిస్టూలు, తమ కొలతబద్దల నెత్తి ఇప్పటికి నూరేళ్ళ వయస్సు కలిగిన పిడికిలి బిగింపును ఉత్సాహంతో అనుకరిస్తారు. నలగని తెల్లకోట్లతో, గజిబిజి మనస్సులతో, "నిర్ణయించే ' హక్కుకావాలనీ , తమ టెస్టు ట్యూబులన్ప్ప్, తమ జీవితాలనూ, తామే కొనసాగించుకోవాలనీ కోరతారు. అల్పులు, అల్పమనుస్కులు, కొద్దిపాటి ఆస్తులున్నవారు- ఆదైన భయంతో , గర్వంతో నిలబెట్టుకున్నవారు. వాళ్ళే ఆహారాన్ని దొంగచాటుగా కూడా బెడతారు. ఎదురుతిరిగే జాతిలో చీమలు.
ఇక - ఎంగిలి కంచంలో మిగిలిన పిప్పి.
ఆశల్లేని, అర్ధం చేసుకోలేని అట్టడుగు దరిద్రులు, జేబురుమాలంతా పొలానికి,పాతబడ్డ ఉద్యోగానికి కట్టుబడ్డవాళ్ళు; ఈ లోకపు అభాగ్యుల పాలిటి నల్లమందైన "మనరాజుగారి కొసం - మనదేశం కోసం ' అనే మార్పులేని మంత్రానికి కట్టుబడ్డ వాళ్ళు; ఆస్తి హక్కుకీ, దాని నరక సరూపాలయిన సొంతపొలం, సొంతయిల్లు, పదిలమైన ఉద్యోగం, ఆదివారాల్లో ధరించడానికి నల్లసూటు, చెడిపోని కూతుళ్ళు, మప్పితమైన కొడుకులు (వీళ్ళే సైనికులూ, రక్షక భటులూ అయేవాళ్ళు) మొదలైనవాటికి కట్టుబడ్డవాళ్ళు. అంధకార ప్రదేశాలు అక్కడ పెరిగిన పిల్లలు పెద్దవాళ్ళయాక పోలీసు భటులవుతారు.
ముందుకు పరిగెత్తండి కామ్రేడ్స్
పాత ప్రపంచం మీ వెనకాలుంది.
(కమ్యూన్ గోడ మీద)
అప్పుడే పదిరోజుల సౌఖ్యం
(సోర్బాన్)
గంటగంతకీ , షిప్టు షిప్తుకీ (ఆకమిత ఫ్యాక్టరీల వర్కర్లు అనుభవం వల్ల తెలుసుకున్నారు. "షిప్టుజాగారాలు " నాలుగు గంటలకు మించనవి) రోజు రోజుకీ కుంచం నిండుతోంది. నాంటేస్ లో విద్యార్ధులు, వర్కర్లూ, రైతులూ చేతులు కలిపారు. ఎర్రజెండాలు వేసుకొని ట్రాక్టర్ల మీద రైతులు పట్టణంలోకి ప్రవేశిస్తాయి. కార్యాచరణ కమిటీలు సమ్మె కమిటీలు కలిసి ప్రజల కౌన్సిళ్ళవుతాయి.
పశుగ్రాసం తయారు చేసే ప్యాక్టారీలూ, పాల ఫ్యాక్టరీలూ మళ్ళీ తెరిచారు. ఆహారపు ధరలను, కౌన్సిళ్ళు అదుపులో ఉంచుతాయి. చేతులకు ఎర్రపట్టీలు కట్టుకున్న కుటుంబాలను , షాపుల్నీ తనిఖీ చేస్తారు. కనీసపు ధరల్ని ఆహారం సరఫరా బాధ్యతను కౌన్సిళ్ళు తామే తీసుకుంటాయి. ఒక కొత్త అధికారం జన్మించింది.
నాంటేస్ లో, కేయెస్ లో, సెయింట్ ఇషియస్ లో కొన్ని వందల మంది కిరాయి భటులతో తమ ప్రధాన కార్యాలయంలో నిర్భందితులైన పోలీసు అధికారులు ఆఖరి టెలిఫోన్ కోసం ఎదురుచూస్తారు. కార్మికులు స్వాధీనం చేసుకున్న కొన్ని ముద్రాక్షరశాలలు సోర్భాన్ కరపత్రాలను అచ్చువేస్తాయి.
సగం మంది నీలికాలరు వర్కర్లూ , సగం మంది తెల్ల కాలరూ వర్కర్లూ ఉన్న ఫాక్టరీలలో (ఉభయులూ సమ్మె చేస్తున్నవారే) సమిష్టిగా పరిశ్రమ నడపడం గురించి, ఎందు నిమిత్తం నడపాలనే విషయం గురించి మాటలు సాగుతున్నాయి. ఎలక్ట్రానిక్ సామాగ్రి తయారు చేసే ఒక ఫ్యాక్టరీ ఇప్పుడు కామ్రేడ్స్ కోసం వాకీ- టాకీలు తయారు చేస్తోంది.
అయితే ఫాక్టరీలు ఒకే పజిల్ కిచెందిన వివిధ భాగాలు మాత్రమే . చాలా ఫ్యాక్టరీలు ఒక వస్తువుకు కావాల్సిన వివిధ భాగాలను తయారుచేసేవి. తమ శక్తిని గుర్తించిన కార్మికులున్న ఈ ఫ్యాక్టరీలో ఎక్కువ భాగం ప్రస్తుతానికి నిరుపయోగం. కొత్త వర్గాలేర్పడుతున్న ఈ ఉషః కాలానికి అవి అవసరమైనవి.
కార్మికునికి అత్యంత పురాతన శాపమైన పని విభజన ఇప్పుడతనికి ప్రబల శత్రువు అయింది. ఉత్పత్తి విధానమూ, సాంకేతిక యింత్రాలు, యేర్పాటయిన పద్దతీ, వివిధ ప్రాంతాలలో వాటి పంపకమూ, కార్మికుని నూతన సజీవ అవసరాలకు సరిపడనివి.
సి.యుఫ్. డి,టి. జంకుగా తన పాత్ర నిర్వహిస్తుంది.
సి,జి.టి, పోలీసు పాత్ర నిర్వహిస్తోంది.
నిత్య జీవితావసరపు సరీసులలో పనిచేసే కార్మికుల మీద సి.జి.టి. కి ఇంకా గట్టి పట్టు లేకపోలేదు. సంవత్సరాల పొడుగునా అది నిశ్శబ్దంగా నిర్మించిన కంచు కోటలు; రైల్వే కార్మికులు, గని పనివారు, తపాల ఆఫీసు వర్కర్లు, అందరి కన్నా ముఖ్యంగా విద్యుచ్చక్తి , గ్యాస్ వర్కర్లు , ప్రపంచం తన చుట్టూ ఉన్న ప్రపంచం కూలిపోతున్నా, అది ఆ కోట గోడల్ని పట్టుకొని వేలాడుతోంది.