అదే సమయానికి ప్రజలు సాల్వెటార్ ని రాబిన్ హుడ్ గా గుర్తించి, ఆ విధంగా పిలవటం, ప్రస్తుతించటం ఆరంభించారు.
సాల్వెటార్ తను కొల్లగొట్టిన ధనాన్ని కొంత పేదలకు పంచిపెట్టి, మిగతాదంతా వేర్పాటువాద ఉద్యమానికి వెచ్చించసాగాడు.
(ఇదంతా ఇటలీ అధీనంలో ఉన్న సిసిలీ ఐలాండ్ లోనే జరిగింది.) సిసిలీ ఏర్పాటు ఉద్యమంలో 'గస్పరె పిస్కియోట్ట' అనే అతను సాల్వెటార్ కి కుడిభుజంగా వ్యవహరించేవాడు.
ఇటలీ పోలీసులు, సీక్రెట్ ఇంటిలిజెంట్ డిపార్ట్ మెంట్ సాల్వెటార్ ని పట్టుకొనేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్న రోజులవి.
పిస్కియోట్ట సాల్వెటార్ కి లెఫ్టినెంట్ గా పనిచేసేవాడు. సాల్వెటార్ అతడ్ని అత్యంత విశ్వాసపాత్రుడిగా గుర్తించాడు.
డబ్బుకు, ప్రలోభాలకు లోనయిన పిస్కియోట్ట సాల్వెటార్ రహస్య స్థావరం గురించి ఇటలీ పోలీసులకు సమాచారం అందించాడు.
ఆ సమాచారం ఆధారంగా, 5.7.1950న "కాసెల్ వెట్రనో" అనేచోట సాల్వెటార్ ని అరెస్టు చేయటం జరిగింది.
చివరకు సాల్వెటార్ తన ప్రాణ స్నేహితుడిగా భావించిన పిస్కియోట్టా చేతుల్లోనే ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు.
సాల్వెటార్ ని పిస్కియోట్టా నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేసాడు.
సాల్వెటార్ మరణించిన తరువాత వందలాది అతడి అనుచరులు దిక్కులేని వాళ్ళయిపోయారు.
మరికొన్నాళ్ళకు వాళ్ళు దొంగతనాలు, దోపిడీలు, హత్యలు చేయటం మొదలెట్టారు.
క్రమంగా సంఘ విద్రోహకచర్యల్ని, చట్ట వ్యతిరేక చర్యల్నే తమ వృత్తిగా ఎంచుకున్నారు.
వీరిని కూడా ఇటలీ ప్రభుత్వం అరెస్టు చేసి ఖైదీ చేసింది.
ఆ తరువాత అమెరికాకి చెందిన సి.ఐ.ఏ. ఏజెంట్స్ సిసిలీకి చెందిన 'ఫావిగ్నా' ఐలెండ్ లోకి రహస్యంగా ప్రవేశించి అక్కడ జైళ్ళలో ఉన్న సాల్వెటార్ అనుచరుల్ని విడిపించారు. అనుచరులు ఎవరికై వారే ముఠాలని ఏర్పాటు చేసుకొని అంచలంచెలుగా ఎదిగిపోయారు.
ఒకప్పుడు తమకు విముక్తి కలిగించిన అమెరికాలో ఈ మాఫియా ముఠాలు తన స్థానాల్ని సుస్థిరం చేసుకున్నాయి.
అమెరికాలో ఈ మాఫియా గ్యాంగ్ లు సాగిస్తున్న స్వైర విహారాన్ని ఎవరూ అడ్డుకోలేక పోతున్నారు.
హత్యలు, దోపిడీలు, వీళ్ళకు నీళ్ళప్రాయం చివరకు అమెరికా పరిస్థితి కొరివితో తలను గోక్కున్నట్లయి పోయింది.
ప్రస్తుతం అమెరికాలో కొన్నివేల కోట్ల వ్యాపారం ఈ మాఫియా ముఠా చేతుల్లో నడుస్తోంది. ప్రపంచ దేశాల్లో విడుదలయ్యే ప్రతి మిల్లీ గ్రాము మాదక ద్రవ్యం వెనుకా మాఫియా గ్యాంగ్స్ హస్తం ఉంది.
సాల్వెటార్ కు సంబంధించిన బంధువులు అనేక మాఫియా గ్యాంగులకు లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. అక్కడ మాఫియా నాయకత్వం వంశపారం పర్యంగా వస్తోంది.
సాల్వెటార్ జ్ఞాపకార్ధం సిసిలీ ప్రజలు మాంటేలోప్ వద్ద ఒక పెద్ద టవర్ ని నిర్మించారు
ఇటలీలో రాజకీయ అస్థిరత్వాన్ని, అరాచకత్వాన్ని సృష్టించి అది బలహీనపడిన స్థితిలో, ఆ దేశాన్ని తన గ్రిప్ లో తెచ్చుకోవాలనే దుష్ట ఆలోచనతోనే అమెరికా అలా చేసింది.
ఆ విధంగా విడుదలయిన సాల్వెటార్ బుక్ మౌంట్ లోప్ లోని సాల్వెటార్ టవర్ ని సందర్శించే లక్షలాది సందర్సకుల సంతకాలతో నిండిపోయింది.
మనం అల్లూరి సీతారామరాజుని ఎంతగా గౌరవించి, పూజిస్తామో అంతగా సిసిలీ ప్రజలు సాల్వెటార్ ని ఆరాధిస్తారు.
సాల్వెటార్ ఉద్యమం వెర్రితలలు వేసి ప్రమాదకరమైన మాఫియా ముఠాలుగా ఏర్పడటానికి ఇటలీ ప్రభుత్వపు బాధ్యత ఎంత ఉందో, అమెరికా సి.ఐ.ఎ. బాధ్యత కూడా అంతే ఉంది.
అంతర్జాతీయ వేదికలపై అగ్రరాజ్యంగా గొప్పలు చెప్పుకొనే అమెరికా తను స్వార్ధంతో చేసిన తప్పుకు ఈనాడు శిక్ష అనుభవిస్తోంది. ప్రపంచ దేశాల పోలీసు శాఖలన్నిటి కన్నా సమర్ధవంతంగా పనిచేసే అమెరికన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేషన్ శాఖ కూడా మాఫియా ముఠాల ప్రమాదకరమైన కదలికల్ని అరికట్టలేక పోతోంది.
-రచయిత
......................................................................................................................................................
"మూవింగ్ టార్గెట్ వేగం ముఫ్ఫైకి మించే అవకాశం లేదు. దానికి సిద్దపడే ఉన్నాను." జోహ్రా అంత నమ్మకంగా చెప్పేసరికి ఖలీల్ వెంటనే ఏం మాట్లాడలేకపోయాడు.
టాక్సీ విక్టరీ కోర్టు అపార్టుమెంట్సు ముందాగింది.
ఇద్దరూ అప్పటివరకు పార్సీలో మాట్లాడుకోవటంతో డ్రైవర్ వార్ని ఏమాత్రం సందేహించకుండా విక్టరీ కోర్టు అపార్టుమెంట్సు ముందు దింపేశాడు.
* * * * *
సమయం 5.30 ఎ.యమ్.
జోహ్రా ఖలీల్ తో అపార్టుమెంట్సు టెర్రస్ పైకి వెళ్ళాడు. తన వెంట తెచ్చుకున్న బ్రీఫ్ లోంచి బైనాక్యులర్స్ బయటకు తీసాడు.
పిట్టగోడ దగ్గరకు వెళ్ళాడు.
అంధేరి నుండి జుహుకి సాగిపోయే రోడ్ ని తేరిపార చూసాడు.
అది రూటు నెంబర్ 2.
రూట్ నెంబర్ టూ స్పష్టంగా కనిపిస్తోంది.
జోహ్రా దిక్కుని మార్చి బైనాక్యులర్ ని పేస్ చేసి దేవానంద్ ఇంటిని, ఆ ఇంటి దగ్గరే మలుపు తిరిగే రూటు నెంబర్ టూని, ఎత్తుగా కనిపిస్తున్న దేవానంద్ ఇంటి ఆవరణలో చెట్టుని చూశాడు.
ఆ తరువాత బైనాక్యులర్ లోంచి అలాగే చూస్తూ నెమ్మదిగా కదల సాగాడు.
సిగ్నల్ మెన్ సరిగ్గా ఎక్కడ నిల్చోవలసింది డిసైడ్ చేసేందుకే అలా చేస్తున్నాడని ఖలీల్ గ్రహించాడు.