Previous Page Next Page 
క్రాస్ రోడ్స్ పేజి 16


    జోహ్రా కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. "ఒకవేళ అలా జరిగినా.... మలుపు తిరిగే వీధి ఇరుగ్గా ఉంటుంది. అది థర్టీ ఫీట్ రోడ్ పైగా అర్ధచంద్రాకారంలో ఇస్కాన్ దిశకేసి వంపు తిరిగి వుంటుంది. రోల్స్ రాయిస్ చాలా పొడవైన కారు ఖచ్చితంగా వాటి వేగం మందగిస్తుంది.
    
    నా ఫైరింగ్ 90 డిగ్రీల కోణంలో ఉంటుంది.
    
    ప్రపంచ దేశాల పోలీసు శాఖల్ని, ప్రజల్ని గజగజ లాడిస్తున్న మాఫియా గ్యాంగ్స్ తెర వెనుక కథ
    
    మాఫియా... సిసిలియన్ సీక్రెట్ క్రిమినల్ సొసైటీ సీక్రెట్ సొసైటీ ఆఫ్ పొలిటికల్ టెర్రరిస్ట్....నేరాల నేపథ్యంతో సభ్యదేశాల చట్టాల్ని, న్యాయ వ్యవస్థనే సవాల్ చేసే సీక్రెటు ఆర్గనైజేషన్... ప్రపంచ వ్యాప్తంగా చట్టవిరుద్దమైన జూదాన్ని, మాదక ద్రవ్యాల అమ్మకాల్ని, గూండాయిజాన్ని, రౌడీయిజాన్ని, స్మగ్లింగ్ ని, కిరాయి హత్యల్ని, తమ ప్రధాన వృత్తిగా చేసుకొని జబర్దస్తీగా చెలామణి అవుతున్న సంఘ విద్రోహక సంస్థ...
    
    MAFIOSO....మాఫియా సంస్థ సభ్యుడు.
    MAFIA....సీక్రెట్ క్రిమినల్ సొసైటీ.
    LACOSANOSTRA....
    
    గేబ్లింగ్, రాకెట్సు ప్రొటెక్షన్, టుబాకో, బూట్ లెగ్గింగ్, హైజాకింగ్, నారోటెక్స్, లోన్ షార్కింగ్, ప్రాస్టిట్యూషన్, అసాసినేషన్స్, మాస్ మార్గర్స్.....ఒకటేమిటి.... ఏవైతే చేయకూడదని సభ్య సమాజం, చట్టాలు శాసిస్తాయో వాటన్నింటిని వెర్రి సాహసంతో, ప్లాన్డ్ గా, ప్రొఫెషనలిజమ్ చేయగల (ప్రపంచ మంతటికి తెలిసిన) సంస్థ ఈ మాఫియా.
    
    మాఫియా.... మాఫియాసో, లాకోసానోస్ట్రా... పేరేదైనా, ఏ భాషలో డానికే పేరు పెట్టుకున్నా దాని కార్యకలాపాలు మాత్రం అవే....
    
    మాఫియా పేరు వింటేనే ప్రపంచ దేశాలు వణికిపోతాయి.
    
    ముఖ్యంగా యూరప్ దేశాల్లో మాఫియా ముఠాలు సమాంతర ప్రభుత్వాల్నే నడపగలుగుతున్నాయి. మరీ అమెరికాలో అయితే ఈ గ్యాంగ్ కొన్నివేల కోట్లు ఆర్జిస్తున్నాయి.
    
    కొన్నిచోట్ల ప్రజల నుంచి పన్నులు వసూళ్ళు చేసి వారికి రక్షణ కల్పిస్తున్నాయి.
    
    మాఫియాలో అన్నిటికి రేట్లుంటాయి.
    
    దండిగా డబ్బున్న వాళ్ళు వాళ్ళతో ఏ పనయినా చేయించుకోవచ్చు.
    
    కాలు విరగ్గొడితే ఇంత, చెయ్యి తీసేస్తే ఇంత, మనిషిని వెంటనే చంపకుండా జీవితాంతం కుళ్ళి ఏడ్చేలా చేసేందుకు ఇంత, చంపితే ఇంత అని రేట్లు నిర్ణయించి పనులు పూర్తి చేస్తుంటారు.
    
    ఈ మాఫియా కేంద్ర స్థానం సిసిలీలో ఉంది. సిసిలీ రాబిన్ హుడ్ గా పేరు పొందిన "సాల్వెటార్ గువెనొ" 1943లో మాఫియా మూమెంట్ కి అంకురార్పణ చేసాడు.
    
    సాల్వెటార్ సిసిలీకి చెందిన ఫాలెర్మో నగరానికి 20 మైళ్ళ దూరంలో "మాంటెలాప్రా" లో 1922లో జన్మించారు.
    
    1943లో ఇటలీలో క్షామం సంభవించింది. బంగాళా దుంపలు, గోధుమలు, మాంసం బ్లాక్ మార్కెట్ లోకి వెళ్ళిపోయాయి.
    
    ఆ పరిస్థితుల్లో గత్యంతరం లేక ఇంట్లో వున్న వస్తువులన్నీ అమ్మి, వచ్చిన డబ్బుతో, బ్లాక్ మార్కెట్ లో ఎక్కువ ధరకి నలుగు గోధుమ బస్తాలను కొన్నాడు సాల్వెటార్.
    
    ఇంటి దగ్గర వారం నుంచి పస్తులుంటున్న తల్లి, చెల్లి, మిగతా కుటుంబ సభ్యులు సాల్వెటార్ తెచ్చే గోధుమల కోసం ఆశగా ఎదురుచూస్తుండగా మాఫియాకి తొలిబీజం పడింది.
    
    సాల్వెటార్ తన యింటికి రెండు ఫర్లాంగుల దూరంలో ఉండగా అతన్ని బ్లాక్ మార్కెటీర్ గా అనుమానించిన ఇటలీ పోలీసులు కనీసం సాల్వెటార్ ని ప్రశ్నించకుండానే, నిజానిజాలు తెలుసుకోకుండానే, గోధుమ బస్తాలున్న గుర్రపు బగ్గీమీద విచక్షణా రహితంగా కాల్పులు జరపటం ప్రారంభించారు.
    
    ఓ ప్రక్క ఇంటిదగ్గర ఆకలితో అలమటించి పోతున్న తన కుటుంబ సభ్యులు, కళ్ళెదుట తనను అన్యాయంగా అనుమానించిన పోలీసులు.... కొద్ది క్షణాలు సాల్వెటార్ దిక్కుతోచక నిల్చుండిపోయాడు.
    
    ఆపైన హీరుకొని పోలీసులకేదో చెప్పేందుకు ప్రయత్నించాడు. అయినా పోలీసులు సాల్వెటార్ కి వివరణ ఇచ్చుకొనే అవకాశం ఇవ్వకుండా కాల్పులు కొనసాగించటంతో సాల్వెటార్ ఆగ్రహోదక్షుడై అందుబాటులో ఉన్న ఆయుధాలతో ఎదురుదాడి ప్రారంభించాడు మొండిగా.
    
    ఆ పోరాటంలో సాల్వెటార్ చేతికి ఒక రైఫిల్ అందటంతో ఎదురు కాల్పులు జరిపి ఒక పోలీసును చంపి కొండల్లోకి పారిపోయాడు.
    
    మధ్యధరా సముద్రంలో ఇటలీకి అతి సమీపాన ఉన్న సిసిలీ ద్వీపం పర్వత శ్రేణుల మయం. ఆ పర్వత శ్రేణుల మయం. ఆ పర్వతశ్రేణుల్లో ఉన్న సహజసిద్దమైన గుహల్లో సాల్వెటార్ తల దాచుకున్నాడు.
    
    అప్పుడు సాల్వెటార్ కి 21 సంవత్సరాలు. సాల్వెటార్ ప్రతిఘటనకు తీవ్రంగా స్పందించిన ఇటలీ ప్రభుత్వం అతడ్ని 'ఔట్ లా' గుర్తించి అతడి ఫోటోలను దేశంలోని అన్ని పోలీసు స్టేషన్స్ లో ప్రదర్సనకు పెట్టి, అతడ్ని వాంటెడ్ లిస్టులోకి చేర్చారు.
    
    పర్వత శ్రేణుల్లోకి పారిపోయిన సాల్వెటార్ పోలీసులకు చిక్కి మరణించటం ఇష్టంలేక తన తొలి ప్రతిఘటననే తన వృత్తిగా చేసుకొని మెరుపు దాడులు కొనసాగించటం ఆరంభించాడు.
    
    బడా వ్యాపారులను, బ్లాక్ మార్కెటీర్లను కొల్లగొట్టి వచ్చిన ధనాన్ని తిండిగింజల్ని పేదలకు పంచి పెట్టసాగాడు.
    
    దేశంలోని యువకులు కొందరు సాల్వెటార్ ఉద్యమం పట్ల ఆకర్షితులై అతనికి అండగా చేరిపోయారు.    
    
    అతని ఉద్యమానికి ప్రజల సానుభూతి, అండదండలు లభించసాగాయి.
    
    దాంతో హడాలిపోయిన ఇటలీ ప్రభుత్వం సాల్వెటార్ ని ప్రమాదకరమైన డెకాయిట్ గా గుర్తించింది.
    
    సాల్వెటార్ తన పనులను బడా వ్యాపారుల్ని కొల్లగొట్టటానికేకాక, అమాయకుల్ని, పేద ప్రజల్ని పీడించే రౌడీమూకల్ని, ప్రభుత్వాధికారులను చీల్చి చెండాడే పరిధికి విస్తరించుకుపోయాడు.
    
    1943లో సిసిలీ, ఇటలీ దేశం నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా రూపాంతరం చేయాలని ఆశించే వేర్పాటు వాదులతో చేతులు కలిపాడు.

 Previous Page Next Page