Previous Page Next Page 
సక్స్ స్ పేజి 15



    "అంత అర్జేంటా....ముందు జరగాల్సిన పనులు చూద్దాం...." నెమ్మదిగా అన్నాడాయన__రవిచంద్ర కళ్ళలో నీళ్ళు లేకపోవడం చూసి ఆశ్చర్యపోతూ.

    "జరగాల్సిన పనులు జరుగుతాయి___మిరోక్కరిదేకాదు ఆ బాధ్యత. హరికృష్ణ మనాయుడు కొడుకుని నేను"  ఉక్రోషంగా అన్నాడు రవిచంద్ర.

    ఆ మాటకు జావాబివ్వలేదు సూర్యసాగర్__షాక్ తిన్నాడు___అతనలా  ఆ సమయంలో  ప్రవర్తిస్తాడని ఊహించక.

    "ఒక్కసారి ఆఫీసు రూంకి రండి...."

    హాలుకి అనుకుని , కుడి పక్కగా  ఉన్న ఆఫీసు రూమ్ వేపు నడుస్తూ అన్నాడు రవిచంద్ర.

    సూర్యసాగర్ గదిలోకి అడుగు పెట్టగానే గది తలుపులు దగ్గరగా వేశాడు రవిచంద్ర.

    కంటేదుట కన్నా తండ్రి శవం కనిపిస్తుంటే అంత నిబ్బరంగా ఎ కొడుక్తేనా ఉండగాలాడా.....? సూర్యసాగర్ కేం అర్ధం కాలేదు

    "టైం లేదు....పాయింట్ లోకోచ్చేస్తున్నాను....మంచిగానో, చెడ్డగానో డాడి శకం  ముగిసిపోయింది మనమెంతగా బాధపడ్డ ఆయన తిరిగి రారు.  ప్రస్తుతం... మా బంధువులు ....కావాల్సినవాళ్లు...నాయుడు ఎస్టేట్స్ కు చేదింన అధికారులు  బ్యాంకు  అధికారులు, అందరూ  ఉన్నారు. మళ్ళి అందరూ  దొరకడం కష్టం మా ఫామిలి లాయర్ గా  ....ఈ టైమ్ లోనే....మా డాడికి వారసుడిగా నన్ను ఎనౌన్స్ చేస్తే బాగుంటుంది."

    తండ్రి శవం కదలకండానే, రవిచంద్ర ఇలాంటి ప్రసక్తి తెస్తాడని ఊహించలేదు లాయర్ సూర్యసాగర్ ___ అందుకే డిఫ్ షాక్ కి లోనయ్యాడు.

    "ఇప్పడది అంత అవసరమా...." నెమ్మదిగా అన్నాడాయన తేరుకుంటూ.

    "మికవసరం.....కాకపోవచ్చు....నాకవసరం.....మనకంపెనిల్లో కొన్ని  గంటల్లో ఎంత బిజినెస్ జరుగుతుందో మీకు తెలుసు. స్తేనింగ్ అధారిటి లేకపోవడం వాళ్ళ, ఎన్ని ప్తేల్ పెండింగ్ లో ఉంటాయో ,మీకు తెలుసు. అందుకే."

    "నేను ఎనౌన్స్ చేస్తే ....నువ్వు వారసుడిగా అయిపోతావ... పవర్స్  అన్ని వచ్చేస్తాయంటావా...." నిస్తాణగా అక్కడే కూలబడిపోతూ అన్నాడు.

    "ఎందుకు రావు....మీరు  మా డాడి పర్సనల్ లాయర్....లీగల్ మేటర్స్ నెమ్మదిగా చూసుకోవచ్చ్చు. ముందు నాయుడు కంపెనిస్ కి  నన్ను చ్తేర్మన్ గా ఎనౌన్స్ చెయ్యండి."

    ఓ వేపు నుంచి ప్రమాదం  తరుముకోస్తున్నట్లుగా ఆరాట పడిపోతూన్న  రవిచంద్రని చూసి  తొలిసారిగా  అసహ్యించుకున్నాడుసూర్య సాగర్.

    అతను  చెడ్డవాడని___తండ్రికి తగ్గ కొడుకు కదని, ఎప్పటినుంచో తెల్సినా, క్షమించుకుంటూ వచ్చిన సూర్యసాగర్  ఆక్షణాన క్షమించలేక పోయాడు.

    అది తగిన సమయం  కాదని ఆగాడే కానీ___ లేదంటే చెప్పుతో  చెంప,ఈ చెంపా వాయించేవాడే.

    తండ్రి శవం కదలక ముందే ఆస్తుల వ్యవహారం  తేలాలనుకునే కొడుకుల్ని__తల్లిని, తోడబుట్టిన అక్కచేల్లెల్ని బజారున పడేసయిన ఆస్తి పాస్తుల్ని  దక్కించుకోవాలనుకొనే స్వార్ధపరుల్ని__

    తల్లి చనిపోతే__నగలు కాజేసే కోడళ్ళన్నీ-తల్లిదండ్రులిద్దరూపోతే వారి శవాలముందే, చెల్లెల్లాకు కట్నం  పేరుతో  కొద్దిగా  బిక్షంవేసి ఇంట్లోంచి వాళ్ళని తరిమేసి  ఆస్తిని  ముక్కలు చేసుకు  పంచుకొనే అన్న  దమ్ముల్ని ఆ క్షణానే పిట్టల్లాకాల్చి పడేయాలనిపించింది.సూర్యసాగర్ కళ్ళు ఆగ్రావేశాలతో ఏరుపెక్కాయి. కోపోద్రేకాలతో ఆయన ఊగిపోతోంది.

    ఉత్తచేతులతో తన జీవితాన్ని ఆరంభించి-రాత్రింబవళ్ళు  తన సుఖ సౌఖ్యల్ని, మీ కోసం త్యాగం చేసి, ఒక్క తరంలో వందల పారిశ్రామిక సౌధాన్ని కొన్ని వేళ మందికి జీవనోపాధి చూపించిన మహానుభావుడు-ఒక్కసారికే కేంద్ర హొంమంత్రి స్ధాయికి ఎదిగి తన బందువర్గాలకు సమాజంలో ప్రతిష్టని చేకూర్చిన మహనీయుడు అర్ధం తరపు చావు చస్తే-కనిసం ని కళ్ళలో తడయినా లేకపోవటం ఆయన చేసుకున్న దౌర్భాగ్యం కాక మరేమిటి? ఉన్నది ఇద్దరు_కంటికి మంటికీ ఎకదారంగా విలపిస్తున్నచెల్లెల్ని ఒడార్చవలసిన వాడివి - తండ్రికి కోరివిపెట్టి  ఎంతో భక్తిశ్రద్దలతో కర్మకాండని నిర్వహించవలసిన వాడివి__ ఈ సమయంలో ఇలా ప్రవర్తిచటం-అతి  జుగుప్సాకరమ్తెనది__హెయ మ్తెనది..." అసహ్యించుకుంటూఆవేశంతో అన్నాడు సూర్యసాగర్.

    రవిచంద్రకు ఆ మాటలతో  పట్టరానికోపం వచ్చినా-పని కావాల్సి ఉన్నందుకు తమాయించుకున్నాడు.

    "బాధపడితే_ఏడిస్తే చచ్చిన వాళ్ళు  తిరిగోస్తారా....?" తెలివిగా రిటార్ట్ ఇచ్చాననుకున్నాడు రవిచంద్ర.

    "తూ....ని బ్రతుకు చెడ.....సిగ్గులేకుండా బోడి వేదాంతాన్ని వెల్ల గాక్కుతున్నావా? ఇది చెప్పవలసింది నాకుకాదు. ని చెల్లెలికి- ఆమెకి చెప్పి ఒదార్చాలి.

    ఏడ్చే వాళ్ళంతా ,ఏడిస్తే తిరిగోస్తాడనే ఏడవటం లేదురా మూర్ఖడా.. ఆ మాత్రం  వాళ్ళకి తేలిక బాధపడటంలేదురా దోర్భాగ్యుడా.....మానవత్వంరా  అది- ప్రనాలున్న మనుష్యులంరా  మనం-ప్రాణంలేని యంత్రాలం కాదు....వెళ్ళు.... ఇప్పటిక్తేనా సిగ్గుతెచ్చుకొని వెళ్ళి ని చెల్లెల్ని ఓదార్చు  ఇదార్చి మనిషివనిపించుకో __మనిషి వనిపించుకొనే ఈ ఆఖరి అవకాశాన్ని చేజార్చుకోకు.  తరువాత జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడుస్తావ్__

    ఆ మహానుభావుడికి ఉన్న వారసులు మీ ఇద్దరే -ఈ ఆస్తి పాస్తులు మీకు చెందక ఎవరికీ చందుతాయి....? ఇప్పడే ఎందుకింత ఆరాటపడి పోతున్నావ్...?


    ఒక్కటాలోచించు-నువ్విప్పుడు చేస్తున్న నిచమైన పనుల్ని మీ నాన్న తన వయసు లో చేసుంటే-నువ్విప్పుడురైల్వేప్లాట్  పారమ్ మీద ముష్టేత్తుకుంటుండేవాడివి. 

 Previous Page Next Page