"వచ్చినందుకు కృతజ్ఞత.......ఐకమత్యానికి అభినందన. దయచేసి రెచ్చగొట్టే చర్యలు మానండి. గేట్లదగ్గరికి పోకండి. ఎంచేతనంటే యజమాన్లు. దాన్నొక సాకుగ తీసుకొని పోలీసులను పిలుస్తారు.
నింపాదిగా, పట్టుదలగా లారీకి ఇరువైపులా వాళ్ళుసాగిపోతారు.
ఫాక్టరీలోహపు గేట్లు గడియలు వేసి ఉన్నాయి. సి.జి.టి. వల్ల కిటికీల వద్ద కమ్ములు; లోపలకమ్ముల వెనుకకార్మికులు ఆక్రమించిందీవాళ్ళే. ఖైదీలూ వాళ్ళే. ఎర్రజెండాలు.
స్టూడెంట్లు జెండాలూపుతారు. వర్కర్లు జవాబుగా జెండాలూపుతారు. స్టూడెంట్లు ఇంటర్నేషనల్ గీతం పాడడం ప్ర్రారంభిస్తారు. వర్కర్లు కలుస్తారు.
లయాను బద్దంగా పాడతారు. "వర్కర్లకె ఫాక్టరీలు."
పాటను ప్రతిధనించే చౌకు.
ఫాక్టరీ పైభాగం నుండి ఒక ఒంటరిగొంతు: "స్టూడెంట్లకే సోర్బాన్."
జెరికోగోడలు.
పైభాగంలో మరికొన్ని గొంతుకలు. మరికొన్నిపై కప్పులనుండి అదేపాట.
నిశ్శబ్దం.
ఒక స్టూడెంట్ గొంతుక, పాటలా; "వర్కర్లకే సోర్బాన్."
తాడుమీదుగా దిగుతోందొక బాల్చీ అందులో బీరు సీసాలు, సిగరెట్లు, కరపత్రాలు.
కటకటాలకిటికీలోంచి ఒండొరులతో మాట్లాడుతారు. ప్రేమికులు కావడానికింకా ఈడు చాలదు.
మాంటేగుకుటుంబం, కాప్యులేట్ కుటుంబం బలవంతులు, అన్నిటికీ సమర్ధులు బద్దశత్రువులు అయినా కుట్రలలోతోడు దొంగలు. వేరేగేట్ల వద్ద కలుసుకోవడం మరింత కష్టం. బయటనిలుచున్నా కాపలాదార్లుమటుకు పార్టీ మెంబర్లు సి.జి.టి. 'మెంబర్లు నోళ్ళు తెరవని బాపతు.
13
విప్లవభావాలంటూ ఏమీ లేవు.
ఉన్నవల్లా విప్లవ కృత్యాలు.
(నాన్ టెర్)
రెనో, నార్త్ సౌత్ ఏవియేషన్, బెర్లియే, రోడియాసెటా. తిరుగుబాటుళ భూగర్భశాస్త్రంపోల్చుకోదగ్గ పద్దతిలో సాగుతుంది. కొండనుంచి ప్రవహించేసెలయేరు పొంగులువారి, దారి చేసుకుని ఒక వరదగా, తర్వాత ఒక నదిగామారుతుంది.
ఓపికగాతయారు చేసిన అల్లికపని, దాని ప్రధాన రేఖలు రాష్ట్రాల పోలీసు కార్యాలయాలలోనూ, యూనియన్ ఆఫీసుల్లోనూ బాగా తెలిసినవే. అదే శ్రద్ధతో, జాగ్రత్తతో తయారు చేసిన మ్యాపులు 1936 నుండి.
గీతతరాత గీత. ఇక్కడో దిద్దుబాటు అక్కడో నల్లరంగు.
పోలీసు మెడల్ సంపాదించిన మనిషి ఆఫీసు డస్కులోని అడుగు డ్రాయరులో మ్యాపులు. పార్టీ కేంద్ర కమిటీలో స్థానమున్న మనిషివద్దకూడా అవే మ్యాపులు.
భద్రంగా తాళం వేసి.
సమ్మెలుఫరవాలేదు. సమ్మెలుజరగావలసిందే. అంత పట్టించుకోనక్కరలేని చిన్నజబ్బులు. కొద్దిగా టెంపరేచరు. స్థానికపుకొట్లాటలు. సర్దుబాట్లు.
"ఫ్యాక్టరీల ఆక్రమణ ప్రమాదకరం" అదో ఎదిరింపు ఒక బెదిరింపు. యంత్రాలని నాశనంచేస్తామని కార్మికులు బెదిరించవచ్చు. ఆ బెదిరింపు వల్లనే సాయుధ జోక్యాన్ని నిరోధించడం జరుగుతుంది.
ఫాక్టరీలను చేజిక్కించుకున్నారు. అవి వారి ఆస్తి కాకపోవడమేవారి బలం. యంత్రాలూ, పెట్టుబడీ, ఇతరుల ఆస్తీ, ఇతరుల అజమాయిషీలో ఉన్నవి ఇప్పుడు వారి సాదీనంలోనికి వచ్చాయి. వాటిని ధంసం చేస్తామని బెదిరిస్తే శత్రువు బెదిరిపోతాడు. కాని ధంసం చేసేస్తే అది ఆత్మహత్యాతోసమానం.
మార్గాంతరం మరోటి ఉంది. యంత్రాలను పకడ్బందీగా అట్టేపెట్టుకోవడం. రెండోదశకి సన్నాహాలు చెయ్యడం. ఆఖరిదశ వీదిమెట్లకార్మికుల సహాయంతో తామే యంత్రాలను నడిపించవచ్చు. సాధారణ సమ్మెకు పిలుపివడంలేదని సి.జి.టి. సెంట్రల్ కమిటీస్పష్టం చేసింది. సి.యఫ్.డి.టి. కూడా అలాగే చేయకతప్పదు.
పులిమీద సారీ. కార్మికుల గుంపుల్ని పోగుచేసుకుని పెద్దసైజు పోరాటం సాగించటం. కార్మికుల దరిద్రాన్ని ఆధారం చేసుకుని, దాన్నేలంచంగా, ఆయిధంగా చేసుకుని, 10 శాతం జీతపు హెచ్చింపు అడగడం. ఆ మాత్రపు డబ్బు అందరికీ అవసరమే. అందుకుతరతరగా బేరంసాగించడానికి సిద్దంకావడం-ఒక సెక్షన్ తరాత ఒకటిగా.
తమ ప్రమేయం లేకుండా, తమకి వ్యతిరేకంగా జరిగిన ఫ్యాక్టరీళ ఆక్రమణ నిజంగానే తమకి ప్రాణాంతకం. పులి మీద సారీ చెయ్యకతప్పదు.
ఇప్పుడు దేశం ఊపిరి బిగపట్టుకుని వేచివుంది. సమ్మెలువిధిగా విస్తరిల్లక తప్పదు. (ఫాక్టరీల ఆక్రమణకూడా.)
సోర్బాన్ మొదలైన విశ్వవిద్యాలయాలన్నీ నూతన భావాలఫాక్టరీలయాయి. సాలీడుదారం మారింది సాలీడుగూడుగా వెండి గూళ్ళుఫాక్టరీలవుతున్నాయి.
పారిస్ లో ఆనందం, కలవరం.
విద్యార్ధుల, టీచర్ల సంఘాలు రేడియో, టెలివిజన్ భవనాల ముందుప్రదర్శన చేయాలని నిర్ణయించారు. ఆకాశాన్ని దాచేసేప్లాస్టుక్ కప్పులు గల భవనాలం.
సి.జి.టి. (కార్మిక సంఘం), పి.సి. (కమ్యూనిస్ట్ పార్టీ) రెచ్చిపోయి, ఎదిరింపులకుదిగాయి.
మిలిటెంట్లుటెలివిజన్. రేడియో భవనాలను ఆక్రమించ గలరనేది స్పష్టమే. (తగ్గిపోతున్న ప్రభుత్వాధికారపు ఇంకా మిగిలిపోయిన ఆఖరిఆయుధాలు ఈ ప్రచారసాధనాలు) కాదంటే కాల్చండని పోలీసులకి ఉత్తరువులియ్యాలి. (ఇస్తారా? ఇవగలరా? గవర్నమెంటుకి శక్యమా అది? ఇచ్చారా అంటేమాత్రం ....)
విద్యార్ధుల, టీచర్ల సంఘం వెనక్కితగ్గవలసి వచ్చింది.
ప్రధాని డిగోల్ ను పిలుస్తాడు. రుమేనియా నుంచితిరిగి రమ్మని బతిమాలుతాడు.
ఒక సి.ఆర్.యస్. సైన్యందళం పారిస్ కు వెళ్ళనంటుంది. సి.ఆర్.యస్. యూనియన్ ఇరుకులో పడింది. పోలీసుశాఖకు చెందిన పదివేల మందిరిజరు దళానికి సిద్దంగా ఉండవలసిందిగా తాఖీదులు వెళ్ళాయి.
అల్లికపని నగ్నంగా తన రేఖల్ని ప్రదర్శిస్తోంది. ఆలిస్ ఫ్రాన్స్ అద్దంలోచూసుకుంటోంది - ఏళ్లతరబడిగా బూర్జువాభోజనగదుల్లో ఉంటున్న అద్దంలో. కాని మర్యాదస్తులు అద్దంలోకి చూసుకోవాలని అనుకోరు.
పతనం సుదీర్ఘమైనది, సులువైనది. ఆలోచించుకోవడానికి కావలసినంతవ్యవధి. రెనో, బెర్లియే, రోడియా సెటా, నార్త్ సౌత్ ఏవియేషన్ ప్రత్యక్ష చర్య ప్ర్రారంభించాయి.
ఇప్పుడు విమానాశ్రయాలు, షిప్ యార్డులు, రైల్వే కార్మికులు, గనిపనివారు. మనం కూడా దాదాపు అక్కడున్నట్టే.