Previous Page Next Page 
ఉద్యోగం పేజి 16

ఎంతో పరిచయమున్న మావూరి రోడ్డుమీద పరాకుగా నడుస్తున్న నన్ను చూచిన మావూరిజనం నాకు పిచ్చెత్తిందని అనుకున్నా అశ్చర్యపడక్కరలేదు.
బాగా రద్దీగా వున్చచోట నన్నెవరో  పేరుపెట్టి పిలిచారు. ఆగిపోయి వెనక్కితిరిగి చూశాను. రోడ్డుపక్కన  లక్ష్మీ పతి సిగరెట్టు కాలుస్తూ నించున్నాడు. అతనివేపు నడిచేను.
" ఎప్పుడొచ్చేరు?"
చెప్పేను.
" ఇక్క డెన్నాళ్లుంటారేమిటి?"
" రేపెళ్ళిపోతున్నాను. ఈ నెలాఖర్లో ఒచ్చేస్తాను గూడా!"
" రండి! ఓతడవ మాయింటికెళ్ళి ఒద్దాం."
అతన్తో వాళ్ళింటికి వెళ్ళా లనిపించింది. అతన్ని అనుసరించాను. పది గజాలు దూరంలో వాళ్ళ కారొకటి ఆగివుంది. తలుపుతీసి ఎక్కమన్నాడు. కారెక్కాను. అతను స్టీరింగ్ దగ్గర కూచుని కారుని స్టార్టు చేసి అన్నాడు.
"మా  పారుడెలా వున్నాడు?"
"క్షేమం"
అతనికేం మాట్లాడలేదు. కారు బాణంలా దూసుకుపోయింది. లక్ష్మీపతి వాళ్ళింటిదగ్గి రాగింది(అందమైన ఒక భవన విశేషాన్ని ఇల్లనిచెప్పడం పొరపాటే) లక్ష్మీపతి విసురుగా నడిచేడు. హల్లోకూచున్న నలుగురూ మమ్మల్ని చూచిలేచి నుంచున్నారు. గుమ్మందగ్గిరే ఆగిపోయి గోడలవేపు చూస్తూండిపోయేను. లోపల లక్ష్మీపతి మాటలు వినిపించాయి.
" నేను చెప్పేను రావ్ గారని- వారొచ్చేరు."
క్షణమాగి నన్ను పేరుతో పిలిచాడు. లోపలికి వెళ్ళాను. పేరుపేరునా ఆనలుగుర్నీ నాకు పరిచయం చేశాడు. లక్ష్మీపతి తల్లి తండ్రులూ అతనిభార్య అతని చెల్లెలూను, నమస్కారంచేసి నించుకన్నానేతప్ప వాళ్ళ మొహాల్లోకి చూచేంత చొరవ లేకపోయింది. లక్ష్మీపతి భార్య కాఫీలు పట్టుకొచ్చేంతవరకూ  హాల్లో మిగిలిపోయిన మామధ్య కేవలం పార్ధుడిగురించే సంభాషణ జరిగింది. వాడి ఆరోగ్యం వాడి చదువు,వాడి అల్లరీను. నేనిక్కడ చూచిన నిజాన్ని ఈ మనుషులదగ్గర తప్పనిసరిగా  దాచవలసిన పరిస్థితి ఎంత దారుణమైనదో నాక్కొక్కడికే తెలుసుకున్నాను. కానీ లక్ష్మీపతి నాన్నగారు నన్ను పసిగట్టిన వైనం విని అల్లాడి పోయారు. ఆయన అన్నదీ కొద్దిమాటలే-
"నీ మంచితనాన్ని నేనూ మెచ్చుకుంటాను కానీ  రావ్! మాపార్ధుడి దినచర్య నాకు తెలుసు. శివుడు లేడు. రోజ స్తమానం పుట్టెడు దిగుల్తో నేను బతికివున్నాను పార్ధుడి భవిష్యత్తు ఏమని రాసిపెట్టివుందో గాన  శివుడు పోవడం సామాన్యమైన విషయం కాదు నాయనా!"
లక్ష్మీపతి భార్య ఆవేళకి కాఫీ పట్టుకురాకపోతే  ఆయన మాటల్తో చచ్చి వూరుకుండును.
ఆ యింటినుంచి బయటపడ్డాను. లక్ష్మిపతి నన్ను కారు వేపు తీసుకెడుతూ అన్నాడు.
"రండి! కాసేపు మా తోటలో కూచుని వెళ్ళిపోదాం"
కార్లో కూచున్నతర్వాత చూసేను. మా వెనకసీట్లో లక్ష్మీపతి చెల్లెలు వున్నది ఇబ్బందిలో యిరుక్కుటున్నానేమో ననిపించింది.
రెండు మైళ్ళదూరంలో వాళ్ళతోట వుంది.ఆతోట వున్నది .  ఆతోట దగ్గిర కారాపాడు లక్మీ పతి. తోటలోకి అడుగు  పెడుతున్న ప్పుడు పూర్వం సుందరరావు మా కేర్పాటు చేసిన పార్టీ గుర్తుకొచ్చింది , బరువుగా నడిచాను.
మా కెదురుగా ఒక  చిన్న అందమైన   డాబా  ఒక టున్నది. దానిమిద బంగారు రంగులో 'సత్యనివాస్ '  అని రానున్నది, ఆడాబాని చూస్తూఅగిపోయాను. లక్ష్మీపతి ఆగలేదు.
"వదినకోసం అన్నయ్య దీన్ని కట్టించేడు" అన్నది సరోజ.
తలొంచుకున్నాను. ఆసమయానికి సత్యవతిని  ప్రేమించిన మాసత్యం గుర్తుకొచ్చాడు.
"నాకు బాగాగురు!  ఆ సాయంత్రం వదినపాట పాడింది. ఆమె చాలా చక్కగా పాడుతుంది. మేమంతా గూడా అప్పుడు అక్కడే ఉన్నాం పాట మధ్యలో  అన్నయ్య బాధగా వెనక్కి ఒరిగాడు.  వదిన పాట ఆపేసింది. మేమందరం ఆత్రంగా  అన్నయ్యదగ్గర చేరాము. మా అందరివేపూ అన్నయ్య భయంగా చూచాడు. అన్నయ్యలా చుడటం అదే మొదటి సారి అంతే రావ్ గారూ! మరింక అన్నయ్యలేడు." సరోజ కనుకొలకుల్లో నీళ్లు నిలిచినయి.
"మీరు ఏడుస్తున్నారు" హెచ్చరించాను ఓదార్చే ఓర్పులేక.
సరోజ పమిటచెంగుతో కళ్ళొత్తుకుని ' రండి వెడదాం అన్నది.'
మేమిద్దరం డాబాదగ్గిరకెళ్ళాము. హాల్లో మేము కుర్చీలో కూర్చున్న లక్ష్మీ పతి మా రాకని గమనించలేదు గాబోలు- అతనిచూపు మామిడిచెట్టమిదుగా అక్కడెక్కడో ఒరిగిపోయిన ఆకాశపుటంచుమిద వున్నది. అక్కడున్న కుర్చీలో మేమిద్దరం కూర్చున్నాం. క్షణం గడిచినతర్వాత లక్ష్మీపతి అన్నాడు:
" చెట్టులాంటి అన్నయ్య పోయాడన్న దిగులుతో పాటు శ్రీధరరావుగారి లౌక్యం మా  పార్ధుడ్నీ మాకు దూరం చేసింది  రావ్ గారు! మిరోసాయం చేయగలరా?"
నే నతనివేపు చూశాను.
" మా కళ్ళముందు మా  పార్ధుడు తిరుగుతూంటే వాడిలో మా అన్నయ్యను చూచుకుంటూ కొంత బాధ నైనా మరిచిపోగలం మాకు వాడు కావాలి.  ఆ  ఇంటి నుంచి మా వదినా, పార్దుడూ ఇద్దరిక్కడి కొచ్చేయాలి. అందుకేదైనా మార్గముంటే చెబ్తారా?"
"నేనేం చెప్పగలను? నిజమే- పార్ధుడిక్కడికొస్తే కేవలం బంగారం భోంచేయవచ్చు పార్దుడి అక్కడి దుస్థితికి  పరాయి వాడిని నేనూ బాధపడిపోతున్నాను.
కానీ నేను లక్ష్మీపతికి యేమార్గమూ బోధించలేదు.  బాగా చీకటి పడుతున్నవేళ మేం ముగ్గురం ఆ తోటనుంచి బయటపడ్డాం.

                               *    *    *    *
సెలవు పూర్తికాకుండానే నే  నావూరు  వెళ్ళేందుకు నిశ్చయించుకున్నాను. ఈ  విడ్డూరానికి మావాళ్ళంతా ఆశ్చర్యపోయేరు.  వదినమాత్రం నన్ను అడిగిందిగూడాను.
" ఏమిటయ్యా! ఏమిటీవింత నువ్వుమెచ్చుకుంటూన్న మీ సొంతవూరొదిలి రెండురోజులు గడపకుండానే వెళ్ళి పోతావా ఏమిటిచోద్యం. బడాయిపోవద్దు మి ఆవిడేమైనా అంటే నేచెప్తాను. సరేనా?"
నేనెవరిమాటా వినలేదు. నామనసు వీళ్ళెవరికీ తెలియదు నాకెందుకో భయంగా వున్నది.   ఈజీవితం, ఈ సంసారం పిల్లూ బాంధవ్యాలూ వ ఇవన్నీ తలచుకోని ఘడియలేదు. సుందరశివరావు, సత్యవతీ, పార్ధుడూ- వీళ్ళల్లో ఎవరు గుర్తుకొచ్చినా బ్రతుకుట్ల వైరాగ్యం కలిగేప్రమాదం జరగొచ్చని భయంగానూవుంది. పిచ్చెత్తుతూన్న ట్టుంది. మొండిగా మావాళ్ళ ముచ్చటనిగూడా గమనించకుండా మావూరొదిలి వెళ్ళిపోయేరు.

 Previous Page Next Page