Previous Page Next Page 
ఉద్యోగం పేజి 17

ఆఫీసుబృందానికి, నేను సెలవు రద్దుచేసుకోడంలోని తిరకాసు అర్ధమైంది కాదు.
బాగా పొద్దుపోయేటంత వరకూ, ఉదయం తొమ్మిదిగంటలకు లేచి ఆఫీసుకెళ్ళే కార్యక్రమం వారంరోజులుగ్గాని అలవాటు కాలేదు. కావాలనిచెప్పిపార్ధుడివిషయం మరచిపోవడానికి ప్రయత్నించడం ప్రారంభించేను.
నేనొచ్చిన ఆఫీసుపని చివర్లోపడింది. రెండు రోజుల్లో   ఈ వూరువదిలి వెళ్ళవలసివుటుంది- అనగా- దౌర్బాగ్యుడైన పార్ధుడిని  ఒదిలి నాగూట్లో నేను చేరుకుంటానన్న మాట నావూళ్ళో నా స్నేహితుల్తో సరదాల్తో కలిసిపోతానన్నమాట.
ఆరోజు పెందరాళే యించికొచ్చాను. నా గదిగుమ్మం ముందు పార్ధుడుకూర్చున్నాడు. వాడినిచూస్తూ గతుక్కుమన్నాను. నేను తలుపు తాళం తీస్తూండగా అడిగాడు.
" మి రస్సలు కనిపించడమేలేదు."
" అవునోయ్ ఆఫీసుని అలా తగలబడిందిమరి!"
" మా అమ్మకి జ్వరమొచ్చి నయమయింది!"
" అలాగా"
" అప్పుడు నేను మావూరెళ్ళిపోదామంటే అమ్మఏడ్చింది."
పార్ధుడ్ని అర్థంచేసుకున్నాను. చొక్కావిప్పుతూ అన్నాను:
" నేనీమధ్య మనవూరెళ్ళి మి తాతయ్య వాళ్ళింటికి వెళ్ళివొచ్చేను తెలుసా? మి చిన్నాన్నా, మిబామ్మా  అందరూ నిన్నడిగామని చెప్పమన్నారు."
" మరి.... మరి మా సరోజత్తయ్యా !"
"ఆహా... ఆ  అమ్మాయిగూడా అడిగింది."
" ....మరి మా శాంతపిన్ని"
" ఆవిడగూడాను"
" రంగయ్య?"
" అతనెవరు?"
" మికు తెలీదా? మా తోటమాలి."
" అవునవును, అతనూ అడిగేనని చెప్పమన్నాడు."
"బలే అయితే మిరు  అందర్నీ చూచారన్నమాట."
వీడికేంచెప్పాలో తోచిందికాదు. కాళ్ళు కడుక్కునేందుకు దొడ్లోకి వెళ్ళేను. , బాల్చీతో నీళ్ళు తోడి కాళ్ళు కడుక్కుంటూండగా నా  వెనకే నించున్న పార్ధుడు అడిగాడు.
"మళ్ళా ఎప్పుడు వెడతారు."
"ఎల్లుండి ఉదయం ఆరుగంటలకి మరింక ఇటు రాను."
" ఎప్పుడూ?"
" వూహు. "
తల దువ్వుకుంటూ అద్దంలో పార్ఢుడిని చూచాను. చొక్కాచివర్తో కళ్ళొత్తుకుంటున్నాడువాడు. జాలికలిగింది. కించిత్తు కోపమూ కలిగింది. అప్పటికప్పుడే నేనోకథ అల్లి చెప్పాను.( ఈ తప్పు  నాదే. అయినాసరే, వాడి కర్ధమయ్యేలా కధని తయారుచేసి చాలా వోపిగ్గా చెప్పాను.)
"వినుపార్ధు! నీలాగే నేనూ చిన్నప్పుడు మా అమ్మమ్మగారింటిలో ఉండేవాడిని. వాళ్లుత్త రాక్షసులు. రోజస్తమానం నన్నూ, మా అమ్మనీ తిట్టేస్తూండేవారు. నాకేమో చెడ్డ బాధగా వుండేది. మా బామ్మాగారి వూరెళ్ళిపోతే మా చిన్నన్నాన్న , మా అత్తయ్యా వాళ్లెంతో మంచి వాళ్లు కనుక నన్ను నెత్తిమిదపెట్టుకు తిరుగుతారు. నాకు బోల్డు కొనిపెడతారు."
" నిజం. మాసరోజత్తయ్య చాలా నంచిదండి."
" నన్ను చెప్పనివ్వు మరి. అయ్యిందా - అప్పుడు మా అమ్మనడిగాను.మనం మన బామ్మావాళ్ళూరువెళ్ళిపోదామని. మా బామ్మావాళ్ళూరిమనిషి కనిపిస్తే అతన్తో పాటు మాబామ్మ వాళ్ళూరిమనిషి చాలా పెద్దావాడుగా అంచేత అతన్తో కలిసి వెళ్ళిపోయాను."
"పారిపోయే రా? మికప్పడు భయం వేయలేదూ?"
" వూహూ- మనకెందుకూ భయం?  మా బామ్మ వాళ్ళూరిమనిషి చాలా పెద్దవాడుగా అంచేత అతన్తో కలిసి వెళ్ళిపోయాను."
"బలె...బలె. బాగుంది. తర్వాత?"
" తర్వాత ఏమైందంటే నేను పారిపోయినవిషయం మా అమ్మకి తెలిసి, నేను లేకపోతే తనకీ తోచదుగనుక ఆవిడ కూడా మర్నాడుపొద్దునే మా బామ్మగారి వూరొచ్చేసింది. అప్పట్నుంచీ మా అమ్మతో పాటే మా బామ్మాగారిదగ్గరేవుండి పోయింది ఎంచక్కా!"
కథ పూర్తిచేసి వాడివేపు చూశాను. వాడు కథంతా  విని నవ్వుమొహంతో అక్కడ్నుంచిలేచి వెళ్ళిపోయాడు.
ఆ  రెండురోజులూ ఆఫీసులో  అప్పగింతల్తోనే సరిపోయింది. అప్పగించవలసిన కాగితాలూ, వెంటబెట్టుకెళ్ళవల్సిన అన్నీ ముగించుకుని బయటపటేసరికి రాత్రి పదయింది. రాత్రంతా పెట్టె, బేడా సర్దుకోవడంలో మునిగిపోయాను.
తెల్లవారుజామున లేచి స్నానం ముగించి ప్రయాణం తాలూకు హడావిడిలో ఉన్న వేళకి నాగదిలోకి పార్డుడొచ్చేడు వాడిచేతిలో చిన్న సంచి ఒకటున్నది ఒచ్చి అన్నాడు.
" పదండితోరగా మితోపాటు నేనూపారిపోతున్నాను గదా. మా అమ్మ రేపుదయం వస్తుంది తొందరగా పోదాంపదండి."
ఉలిక్కిపడ్డాను. వీడిచొరవ?
"రాత్రి మా అమ్మతో పోట్లాడాను.  నేను పారిపోతానని చెప్పేన్లెండి. రండి పోదాం."
" భగవంతుడా! నువ్వు సృష్టించిన   'జైళ్లు' చాలా చిత్రమైనవి.  ఈపసిదొంగ నాజైలునుంచి పారిపోతున్నాడు. చేయూతనిస్తూన్న నన్నుక్షమించు."
ఆ క్షణంలో మరింకేం  తోచలేదు. బగబగా పార్ధుడితో బైటకొచ్చి ఆగిపోయేను.
నాముందు  కామాక్షమ్మగారూ, సత్యవతీ నించున్నారు. పార్ధుడు నావెనుక పిల్లిలా నక్కుతున్నాడు.
కామాక్షమ్మగారు చాలా అన్నారు. ఆడవాళ్ళతో క్రూరత్వం ఎంత అసహ్యంగా వుంటుందో నాకప్పుడు తెలిసింది. పార్ధుడి రెక్క పుచ్చుకుని బరబరా లాక్కుంటూ తీసుకెళ్ళారు.    
సత్యవతి నావేపు క్షణం చూసింది. ఏంమాటాడింది కాదు. తన రెండు చేతులూ జోడించింది. ఆ అభ్యర్థన ఎందునిమిత్తమో తెలీదు.
డాబామిద ముకుందరావు దంపతలూ కనిపించేరు. ఇదిగాక నీగది చుట్టూ తా కొందరు మనుషులునించున్నారు.
నా కళ్లు తిరుగుతున్నాయి. కాళ్ళు గబగబా ఒణుకు తున్నాయి. కాళ్ళమిద నించోడం అతికష్టంమిద వోపిక తెచ్చుకుని రెండడుగులు ముందుకువేశాను.
సత్యవతి వలవలా ఏడుస్తున్నట్టు పసిగట్టాను.

                                                           - ఆంధ్ర సచిత్ర వారపత్రిక 1-7-60

 Previous Page Next Page