"నేను చెప్పినట్లు విని నాతో సహకరించా వనుకో బస్, నా దోవన నేను పోతాను. అలా కాదంటే ఈ నిమిషాన నిన్ను తన్నుతూ కొడుతూ పోలీస్ స్టేషన్ దాకా లాక్కెళ్ళి ఆరునెలలు బైట ప్రపంచం చూడకుండా అత్తావారింట్లో కూలేస్తాను.
అర్ధమైంది అన్నట్టు చంద్ర బుర్ర వూపాడు.
"గుడ్ గుడ్ నీవు మంచి బాలుడివి. ఏదమ్మా ఒక్క సారి నీ వంటి మీద మొత్తం బట్టలు తొలగించి అలా నుంచో!"
ఇన్ స్పెక్టర్ అన్న దానికి చంద్ర మతి పోయింది.
"ఏంటి అలా గుడ్లప్పచెప్పి చూస్తావ్ చెప్పింది అర్ధం కాలేదా!"
"ఎందుకు?" ఎలాగో గొంతు పెగల్చుకుని చంద్ర భయపడుతూనే అడిగాడు.
"కటకటాలు లెక్క పెట్టవల్సిన రాత నీ ముఖాన వుండబట్టి ఊ....ముందు బట్టలు విప్పు" అంటూ ఇన్ స్పెక్టర్ మీదపడి అరచినంత పనిచేశాడు.
దెబ్బలంటే చంద్రకి మహాభయం. పాంటు షర్టు బనీను కట్ డ్రాయరుతో వణుకుతూ నుంచుండిపోయాడు, వీడికి పిచ్చి లేదుకదా అన్న అనుమానం వచ్చింది. దాంతో చంద్రకి అరికాళ్ళులోంచి వణుకు బైలుదేరింది.
ఇన్ స్పెక్టర్ నాలుకతో పెదవులు తడుముకుంటూ చంద్రని చూస్తూ గుటకలు మింగాడు.
ఇన్ స్పెక్టర్ ముఖం చూడగానే చంద్రకి కొత్త విషయం తెలిసింది.
ఇన్ స్పెక్టర్ హోమో సెక్స్ వల్. పురుషుణ్ణి పురుషుడే కోరే నికృష్టరోగి. అందుకే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళక యిటు తీసుకువచ్చాడు. "హే కృష్ణా, ముకుందా! మురారీ! పురుషులు సిగ్గుపడే ఈ నీచుడి నుంచి రక్షించు"లోలోపల వాపోయాడు చంద్ర.
"కళ్ళు మూసుకో ఊ....తొందరగా" ఇన్ స్పెక్టర్ తొందర చేశాడు.
"ఎ....ఎ....ఎందుకు సార్!"
"నేను డ్రస్ విప్పాలి"
"నేను అలాంటి వాడిని కాను సార్!"
"నా సహనం పరీక్ష చేయకు. నీకేం చెప్పాను. హాయిగా బతకాలని లేదా? ఆరునిమిషాలు కళ్ళు మూసుకోవటం తేలికా! ఆరు నెలలు జైలు తేలికా! ఊ...కళ్ళు మూసుకో"
చంద్రకి ఏడ్పు వచ్చింది. కాళ్ళలోంచి బైలుదేరిన వణుకు నడినెత్తి దాకా పాకింది. దైవం అంటూ వుంటే తన్ని రక్షించాలి అంతే చంద్ర కళ్ళు మూసుకొని దైవప్రార్ధనలో పడ్డాడు.
ఇన్ స్పెక్టర్ డ్రస్ విప్పినలక్కుండా వుండటానికి ఆ డ్రస్ ని జాగ్రత్తగా వంకె కొక్కానికి తగిలించాడు.
రెండు నిమిషాల తర్వాత....
చంద్రని కౌగిలించుకొని బూరెల్లాంటి బుగ్గమీద ముద్దు పెట్టుకుని "స్వీట్ చంద్రమా" అన్నాడు.
చంద్ర వక్కసారిగా బేర్ మంటూ కళ్ళు తెరిచి విదిలించుకోబోయాడు. అంతే చంద్ర కళ్ళు పెద్దవయ్యాయి. "నీవు....నీవు" ఆపై చంద్ర స్వరం మూగబోయింది.
"చంద్రని వదిలేసి ఇవతలకొచ్చాడు. ఇందర్ రెండు చేతులతో పొట్ట పట్టుకుని పడిపడి నవ్వాడు." చూడరా నాయనా చూడు నీ ఇన్ స్పెక్టర్ హేంగర్ కొంకికి వేలాడుతున్నాడు. డోంట్ వర్రీ నా వంటిమీద లుంగీ వుంది. నిన్నే, నీ చలిమిడి సుద్ద శరీరాన్ని చూడలేకుండా వున్నాను. యమర్జంట్ గా లుంగీలో దూరు" అంటూ లుంగీని చంద్ర మీదకు పడేశాడు.
ఇన్ స్పెక్టర్ డ్రస్ ని బల్లమీద నున్న పెట్టుడు మీసాలని ఇందర్ ముఖాన్ని మార్చి మార్చి చూశాడు. విషయం అర్ధమైంది చంద్రకి.
"నిన్ను కాదన్నానా? ముందు లుంగీ ధరించి మాట్లాడు" ఇందర్ నవ్వుతూ అన్నాడు.
"నన్ను పిలవ వద్దు. నాతో మాట్లాడవద్దు. నీవు మాట్లాడించినా మాట్లాడను." చంద్ర మండిపడుతూ అన్నాడు.
అది కాదురా తమాషాకి చేశాను. నీకంత కోపం వస్తుందని....నీవు ఇంతగా సీరియస్ అయిపోతావని అనుకోలేదురా! నేను ఎన్నిసార్లు నిన్ను ఆటలు పట్టించలేదు. తమాషాలు చేయలేదు. అది తమాషా అని తెలియగానే తేలిగ్గా తీసుకుని నవ్వేవాడివి. ఇప్పుడూ అలాగే తమాషాగా తీసుకుంటావనుకున్నాను."
"అనుకుంటావ్, అనుకుంటావ్, ప్రాణసంకటం ఎప్పుడూ ఎలుకకేగా! దీన్ని తమాషా అని బుర్ర వున్నవాడు ఎవడూ వప్పుకోడు. రైల్వే స్టేషనులో జనానికి అప్పనంగా బంతిలా దొరికాను నేను, వాళ్ళ శక్త్యానుసారం తలో చేయి వేశారు."
"సారీరా...."
"ఎర్ర టోపీలంటే మొదటినుంచీ నాకు ఎలర్జీ. మాలావు ఇన్ స్పెక్టర్ వేషం వేసి ఢాం ఢీం అంటూ నామీద ఎగిరిపడ్డావు. అక్కడితో ఆగావా, ఉహూ, బలవంతానా బట్టలు వూడదీయిస్తివి. ఆ కాసేపటిలో నరకం చూశాను."