Previous Page Next Page 
సక్స్ స్ పేజి 14


    "మీరు బయటివ్యక్తి ఏంటి అంకుల్...నిన్నటి నుంచి మీకు బయటి వ్యక్తి కావచ్చు....కానీ రేపట్నించి కారు....డాడి ఎంపయిర్ ని  నేను స్వాధీనం చేసుకోవడానికి , నాకు అండగా నా వేపు  నిలవండి...నేను  చ్తేర్మన్ గా చార్జ్ తీసుకున్న  మరుక్షణం....మిమ్మల్ని  మేనేజింగ్ డ్తెర్తేక్టర్ ని చేస్తాను...."

    కాగలకార్యం గంధర్వుల చెయ్యడమంటే అదే! రఘునాద్ క్కూడా  కావలసింది అదే!

    "నువ్వు చ్తేర్మన్ వీ కావాలి.... ఈ కోట్లాది  రూపాయలకు నువ్వు  అఫిషియల్ గా వారసుడివి కావాలి....అవుతావు...పోస్టులెందుకయ్య...నీకేం సహాయం కావాలో చెప్పు" చనువుగా భుజమ్మీద చెయ్యివెస్తూ అన్నాడు రఘునాద్.

    "అన్ని విషయాలూ.....మీకు స్పష్టంగా చెప్పాల్సిన  అవసరంలేదు. డాడికి నాకు మధ్యనున్న మనస్పర్దల విషయం....ఈ ఆస్తిని నా స్వంతం కావాలంటే, నేను చ్తేర్మాన్ని కావలి. డాడి వీలునామా  రాసుంటే, నాకు అనుకుఅలంగా రాయరు....మొదట్నించి మా చేల్లెలంటే మా డాడికిష్టం....అదే ఆలోచిస్తున్నాను....మీ సలహా చెప్పండి...."

    "పిచ్చి ...రవి ...ఎంత  శత్రుత్వమున్నా...తండ్రి,కొడుకుని కాదనకోడయ్య...నాకు తెల్సు ...మీనాన్న స్తేకాలజి ...ఇక మీ చెల్లి.... కోట్ల ఆస్తిని ఆడపిల్లకు అప్పగిస్తాడని నేననుకోను....అప్పగించినా....అమ్మాయి మేంటైన్ చెయ్యగలదా...లేదు  గాక లేదు...."

    "దానికేం చేతకాదని నాకు తెలుసు...కానీ వీలునామాలో గనక రాస్తే ...." మళ్ళి రెట్టించాడు రవిచంద్ర.

    ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు రఘునాద్ .

    "ఒక వేళ మీ  డాడి వీలునామా రాసే జాగ్రత్త తీసుకొని ఉంటే..... ఆ విషయం ...ఓకే ఒక వ్యక్తికి తెలుస్తుంది____ఆ వ్యక్తి మీ ఫామిలి లాయర్....సూర్యసాగర్ ....ముందుగా  కనుక్కో.....విషయం తెలుసుకో .....సూర్యసాగర్  ని మేనేజ్ చేసుకో .....మీడాడి, మీ చెల్లికి  అనుకూలంగా వీలునామా రాసాడనుకో.... మార్చెయ్ ...సింపిల్ ...." ఉచిత సలహా ఇచ్చాడు రఘునాద్.

    రవిచంద్ర పేలవంగా నవ్వాడు.

    "మిరన్నంత సులభం కాదు అంకుల్."

    "వీలునామా మార్చడమా..సూర్యసాగర్ ని మేనేజ్ చెయ్యడమా..."

    "సూర్య సాగర్  మేనేజ్ చేయడం...." చెప్పాడు రవిచంద్ర.

    "డబ్బు ఎ పన్తేనా  చేస్తుందని నీకు తెలుసు....నాకు తెలుసు....తెలివ్తేన ప్రతివాడికి తెల్సు.

    లక్ష దగ్గర అయిదు లక్షలు పడయ్....పని కాకపోతే...చెప్పు... ఇంకో ప్లాన్ వేద్దాం,"

    "అంతేనంటారా...." ఉత్సాహంగా అడిగాడు రవిచంద్ర.

    "నేనున్నాను కదా....పాచిక నాది....పని నిది.....పద...పద....ఈ  సమయంలో ఎక్కువ సేపు మంతానాలు మంచిది కాదు."

    కుర్చీలోంచి లేస్తూ అన్నాడు రఘునాద్.

    ఇద్దరూ కిందకోచ్చారు.

    సరిగ్గా అదే సమయంలో______


    పోర్టికోలో కొచ్చి టాక్సి ఆగింది___అందులోంచి ముక్తానంద దిగింది. విసురుగా, సుడిగాలిలా లోనికొచ్చి, భోరున  ఏడుస్తూ తండ్రి మీద పడిపోయింది. ఆమెను చూసి అక్కడున్న అందరికి హృదయం ద్రవించి పోయింది__ఆ కూతురు __ఆ తండ్రితో ఎంతటి అనుబంధాన్ని  పెంచుకుంటే__అంతగా గుండెలు పగిలేలా ఏడుస్తుంది....?

    దగ్గర్లోనే  ఉన్న మేనత్త వసుంధర, ముక్తని పొదివి పట్టుకుంది. ఆ ఇంటికి ఓకే ఒక పెద్దదిక్కు అరవ్తే ఏళ్ళ  వసుంధరాదేవి. పిల్లలు లేక పోవడం వల్ల, భర్త పోయిందగ్గర్నించి, తమ్ముడు హరికృష్ణమనాయుడుని ఆశ్రయించింది.

    ఆక్కడే ఉంటోంది.

    నెమ్మదిగా ముక్తని అనునయింఛడం ప్రారంభించిందామె.

    దూరంగా నుంచున్న లాయర్ సూర్యసాగర్ ముక్త దగ్గర కొచ్చాడు.

    "బాదపడకు....ని కోసమే ఎదురు చూస్తున్నాం జరగాల్సిన కర్మ కాండ ప్రారంభించమంటావా...." నెమ్మదిగా  అడిగాడాయన. ఆయనకు  సయితం శవం మీదపడి బాధ తీరేదాకా  ఎడవాలనే  ఉంది. తానే అలా చేస్తే రవిచంద్ర ముక్తానంద తట్టుకోలేరాని__మరింతగా బెంబేలెత్తి  పోతారని కంట్రోల్ చేసుకుంటున్నాడు.

    "ఈ టైమ్ లో అమ్మాయినేమి అడక్కండి లాయరుగారూ.... అన్ని తెల్సిన పెద్దవారు  మీరు  జరగాల్సిన కార్యక్రమం చూడండి....." ముక్త పక్కనే కూర్చిన్న వసుధారాదేవి అంది  కళ్ళు తుడుచుకుంటూ.

    సూర్య సాగర్ ముక్తానంద వేపు చూసి, పోర్టికో వేపు  నడిచాడు.

    ఆతతంగాన్నంతా దూరం  నుంచే  గమనిస్తున్నాడు రవిచంద్ర.

    గబగబా సూర్యసాగర్  వేపు నడిచాడు. తనని  ఎ విషయంలోనూ ఎవరూ సంప్రదించడంలేదు. అదే కోపంగా ఉందతనికి.

    ఆఖరికి తండ్రి కార్మకాండ గురించి, ముక్తా వచ్చేవరకు ఎదురు చూసి, ముక్తాతోనే మాట్లాడి నిర్ణయించడంతో చిర్రెత్తు కొచ్చింది  రవి చంద్రకు.

    "ఒక్క నిమిష మీతో మాట్లాడొచ్చా...." సూర్యసాగర్ కళ్ళ వేపు సూటిగా చూస్తూ అడిగాడు రవిచంద్ర. 

 Previous Page Next Page