Previous Page Next Page 
డింగ్ డాంగ్ బెల్ పేజి 15

    రాహుల్ చేతన్ వంక ఓ సీరియస్ లుక్కేసి, తర్వాత అంకిత్ వైపు తిరిగి చెప్పాడు.

    "రోడ్డుమీద, బస్సుల్లో మన పర్సులు, మన ఇల్లూ దగ్గర పెట్టుకుని జాగ్రాత్తగా వుండాలి. కానీ లేడీస్ మాత్రం ఆ మాత్రం జాగ్రత్తగా లేకపోయారాచాలు... అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ పోతే వంద మంది వస్తారు. అబ్బాయి పర్సుపోతే ఇంటే సంగతులు."

    "నే ఎనాలిసిస్ తప్పు రాహుల్... జనం అంతా ఒకేలా వుండరు... చిన్నప్రమాదానికి కూడా స్పందించే వాళ్ళుంటారు... ప్రతీ వంద రోడ్డు ప్రమాదాల్లో. నలబై ప్రమాదాలను జనమే గమనించి, తక్షణ సహాయం అందజేస్తున్నారు. అయితే జనంలో ఇంకా చైతన్యం రావాలి... లేదా వాళ్ళలో ఉన్న చైతన్యం చితికి పోకుండా మనం చూడాలి..."

    అంకిత్ అలా చేప్పండంతావు సైలెంటయ్యాడు రాహుల్.

               
                                                                          ***

    మృదువనికి రోజులు చాలా భారంగా గడుస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రతీ క్షణం టెన్షనే... తను ఎటువైపు వెళ్తోంది? తనేం చేస్తంది? తన సమస్యకు పరిష్కారం ఉందా? ఉమ్తెన్ ఎముతడి? ఇలా భయ పడుతూనే ఎన్ని రోజులు తను రోజులు వెళ్ళదీయాలి.

    హాస్టల్ లో కూడా మెల్లిమెల్లిగా తన గురుంచి అరా తీయడం మావుదలేడుతూన్నారు. తనక్కడ ఏదో ఓ జాబ్ దొరికే అవకాశం లేదు. తన సమస్యకు తనే పరిష్కరించుకోవాలి.

    రెండు, మూడు రోజులకొకసారి శరణ్య కు ఫోన్ చేస్తూనే ఉంది. అక్కడ పరిస్థితి తనకు అనుకూలంగా లేదు. ఈ పరిస్థితి నుంచి తను సాధ్యమైనంత త్వరగా  బయటపడాలి.... ఎలా? అన్నదే ఆలోచన.

    తన దగ్గరున్న క్రెడిట్ కార్డు ద్వారా తనకు కావలసిన సమకూర్చుకోగాలగుతోంది. బ్యాంకులో డబ్బుంది. వాటిని డ్రా చేయడానికి మార్గం ఒలేదు. క్రెడిట్ కార్డ్ ఉపయోగం ఆమెకు ఇప్పుడు వచ్చింది.

    కానీ, అదే తను చేసిన పొరపాటుని మృదువనిఅప్పటికింకా తెలిసి రాలేదు.

            
                                                 ***

    న్యూఢిల్లీ.

    డిఫెన్స్ చీఫ్ డి.పి వర్మ పావులను చకచకా కదిపాడు. మృదువనిని ట్రేస్ చేయడానికి వున్న అవకాశాలు ఎప్పటికప్పుడు అన్వేషిస్తూనే ఉన్నాడు.

    మృదువనిగురుంచి ముందు దేశంలోని అన్ని టెలివిజన్ చానల్లో ప్రకటన ఇవ్వాలని అనికిన్నాడు. చివరి నిముషంలో తన నిర్ణయం మార్చుకున్నాడు. అప్పటికే తనో పొరపాటున చేశానని అర్ధమైంది.

    దిల్లీ నగరమంతా మృదువని పోస్టర్స్ వేలిసేలా చేశాడు. స్థానిక పత్రికల్లో ఆ వార్త వచ్చింది. ఆ తర్వాత తను చేసిన తప్పేమిటో అతనికి తెలిసి వచ్చింది. ఈ ఇష్యూని 'చావా కింద నేరు' లా సాల్వ్ చేసేందుకు నిర్ణయించుకున్నాడు.

    అందుకోసం, అతను హయ్యర్ ఫీశియల్స్ ని, ప్రధానమత్రిని ఇప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇది దేశ రక్షణకు సంభందించిన వ్యవహారమని, ఈ విషయం బయటకు పొక్కితే దేశద్రోహులు, మృదువని ట్రాప్ చేసే అవకాశం వుందని వారించాడు.

    అందువల్ల మృదువని గురించి, రహస్యంగా అన్వేషణ మొదలైమ్ది. అందులో భాగంగా మృదువనిని ఆర్ధికంగా దెబ్బతీయాలి. ఎక్కడికి వెళ్ళినా ఆమెను బయటకు రప్పించాలి. ఆమె బ్యాంకు ఖాతాల మీద దృష్టిని సారించాడు.

    అక్కడే అతనుకో విషయం తెలిసింది. ఆమె క్రెడిట్ కార్డ్స్ ద్వారా, డబ్బు అమెఆకోఎట్ నుంచి వెళ్ళిపోతోంది. వెంటనే ఎంక్వయిరీ మావుదలుపట్టారు. తనకు నమ్మకమైన అధికార్లును అందుకోసం నియమించారు.

    హైదరాబాదు,సికింద్రాబాదు లలో కొన్ని వస్తువులు కొనుగోలు చేసింది మృదువని. దాని తలికూ క్రెడిట్ కార్డ్ వావుచార్స్ స్వాధీనం చేస్తున్నాడు డిఫెన్స్ చీఫ్ అతనికో విషయం స్పష్టమైంది.

    మృదువని హైదరాబాదు లో వుంది. వెంటనే పోలీసులను, డిఫెన్స్ సిబ్బందిని కదిలించాడు. హైదారాబాద్ లో ఆమె కోసం వేట మొదలైంది. డిఫెన్స్ చీఫ్ చేసిన మరో పని... ఈ వేటలో మాఫియని కూడా వేటగాళ్లగా పంపించటం. ఓ వైపు పోలీసులు, మరో వైపు డిఫెన్స్ సిబ్బంది, ఇంకో వైపు మాఫియా... ఆ వుధంగా మృదువని మరోసారి చిక్కుల్లో పడింది. అయితే ఈ విషయాలు ఏవీ మృదువనికి తెలియవు!
   
                                                                              ***

    న్యూఢిల్లీ.

    శరని జేమ్స్ కు ఫోన్ చేసింది.

    జేమ్స్ లైన్ లోకి వచ్చాడు.

    "శరణ్యా... నువ్వు డేంజర్ లో పడ్డావు. ముందు ఎక్కడికైనా ఎస్కేప్ అవ్వు" జేమ్స్ గోతులో అమ్డైలన కోట్టుచ్చినట్టు కనిపిస్తూంది.

    "ఏమైంది జేమ్స్."

    "నీ ఫోన్ టాప్ చేశారు" ఒకో అక్షరం వట్టి పలికి చెప్పాడు జేమ్స్. "అంటే కాదు... మృదువని ఆ కౌంట్ వున్న బ్యాంక్ వెళ్ళి ఎంక్వయిరీ చేశారు..." అంటూ చెప్పాసాగాడు.

    "వాట్..." అదిరిపడి అడిగింది శరణ్య.

    "అవును శరణ్యా... నీ ఫోన్ టాప్ చేశారు. మరో విషయం, నువ్వు అమెరికాలో వున్న ఇండియా రాయబారి హర్షవర్దనరావు పేరును ఉపయోగించావని డిఫెన్స్ చీప్ కు తెలిసిపోయింది. నిన్ను ఎ క్షణమైనా అరెస్టు చేయొచ్చు... నేను బెయిల్ కోసం ప్రయత్నించినా?"

    "కుదరదు జేమ్స్... అయిపోయింది... అంతా అయిపోయింది... అయినా నా గురుంచి వర్రి అవ్వకు. నువ్వు నాకు ఫోన్ చేయరు. నేనే నీకు తర్వాత ఫోన్ చేస్తాను. బై జేమ్స్" అంది శరణ్య.

    "శరణ్యా... జాగ్రత్త..." అలా అంటున్నప్పుడు జేమ్స్ గొంతు  వణికింది.. మూడేళ్ళ తను పరిచయం అతని మనసును మెలిపెట్టి తిప్పింది.

    సరిగ్గా గంట క్రితమే, శరణ్య ఫోన్ టాప్ విషయం తెలిసింది. సరిగ్గా అప్పుడే అతను క్రాస్ బాక్ లో డిఫెన్స్ వాళ్ల సంభాషణ విన్నాడు. చాలా హృదయచ్చికంగా జరిగింది ఆ సంఘటన.

    "జేమ్స్.."

    "శ... ర... ణ్యా..."

    "బై... జేమ్స్.. మళ్ళా కలుస్తాను... ఆ నమ్మకం వుంది. ముందు మృదువనిని హెచ్చరిచాలి."

    అంత టెన్షన్ లోనూ జేమ్స్ విచిత్రంగా విన్నాడా మాటలు. ఓ పక్కన ప్రమాదం పొంచి ఉందని తెలిసినా, స్నేహితురాలి కోసం... తాపత్రయపడే శరణ్యను చూస్తే గర్వంగా ఉంది!

 Previous Page Next Page