Previous Page Next Page 
డింగ్ డాంగ్ బెల్ పేజి 16

        "కానీ.. ముందు నువ్వు..."

    "నాకేమీ కాదు జేమ్స్.. బై జేమ్స్.." అలా అంటున్నప్పుడు శరణ్య కంఠం వణికింది.

    ఇది జరగాతానికి గంట ముందే... డిఫెన్స్ చీఫ్ తన పావులను చకచకా కదిపాడు. శరణ్య భారత రాయబారి హర్శవర్దనరావు కూతురు కాదని తెలిసింది. అంటే ఆ అమ్మాయి తమని బ్లాష్ చేసింది.

    శరణ్య అరెస్ట్ చేస్తే, మృదువని డిటేయిల్స్ తెలుస్తాయి. వెంటనే శరణ్యను అరెస్ట్ చేయటానికి రంగం సిద్దం చేశాడు.

    కానీ... ఆ.. న.. ఫీ.. షి.. య... ల్.. గా..

           
                                                                      ***

    శరణ్య తన హ్యండ్ భ్యాగ్ లో వున్న హర్షవర్దనరావు విజిటింగ్ కార్డు తీసింది.

    "ఐఎస్ డి చేసుకోవాలి" టెలీఫోన్ బూతు అతనితో చెప్పింది.

    అతను సరేనన్నకా, క్యాబిన్ లోపలకి వెళ్ళింది.

    ఆమె చేతి వెళ్ళు వణుకుతున్నాయి టెలీఫోన్  నెంబర్లు కుదుపుతుంటే....

    మొహమంతా చెమట పట్టేసింది... ఒకటి... రెండు... మూడు... క్షణాలు దొర్లుతున్నాయి. అటువైపు లైన్లు బాగా లేనట్టున్నాయి.

    ఎప్పుడు అమెరుకా కు ఫోన్ చేసినా క్షణాల్లో కలిసే నెంబరు ఇప్పుడు కలవక పోవడమేమిటి... షిట్... తల విదిల్చింది శరణ్య.

    మళ్ళా...

    మళ్ళా...

    మళ్ళా... ఫోన్ చేసింది.

    అయిదు... పది... పదిహేను నిమిషాలు.. లైన్లు బాగాలేవనే రికార్డుడ్ వాయిస్ వినిపించింది.

    వెంటనే మృదువని ఫోన్ చేసంది.

                                                ***

    "హాలో... నేను మృదువని... ఏమైంది శరణ్యా...ఎనీ ప్రాబ్లం" శరణ్య గొంతులోని అందోళన గమనించి అడిగింది మృదువని.

    "మృదువనీ... నువ్వు వెంటనే అక్కడ్నుంచి మకాం మార్చితే మంచిది."

    "ఏమైంది శరణ్యా..."

    "డిఫెన్స్ కు నేను హర్షవర్దనరావు  కూతురునని అబద్దం చెప్పిన విషయం తెలిసింది. అంతేకాదు... నీ అకౌంట్ వున్న బ్యాంక్ కు వెళ్ళారు. మీ ఇంటికి ఫోస్ట్ లో వచ్చిన క్రెడిట్ కార్డు ఒచర్ల ద్వారా నువ్వు సికిందరాబాదు లో వున్నావన్న విషయం త్రిప్ చేశారు. ఎలాగైనా వెంటనే పారిపో... బికర్ పుల్..." నువ్వేంటి?"

    "నాకేమీ కాదు మృదువనీ... ఈ లోగా నేను హర్షవర్దనరావును కాంటాక్ట్ లో వుండకు... నా ఫోన్ కూడా టాప్ చేశారు..."

    "అయామ్ సారీ శరణ్యా... నా వల్లనే ఈ ఇబ్బందులన్నీ..." బాదాగా అంది మృదువని.

    "ఛ..ఛ.. ముందు నువ్వు సేఫ్ గా ఉండే ప్రయత్నం చెయ్... అల్ డ బెస్ట్ ప్రెండ్..." ఫోన్ పెట్టేసింది శరణ్య.

                                               ***
    ఆటోలో వెంటనే ఇంటికి వెళ్ళింది. ఓ సూట్  కేసులో నాలుగైదు జతల బట్టలు పెట్టుకుంది. ఎ క్షణమైనా తనని డిఫెన్స్ వాళ్ళు అరెస్టు చేయకముందే, సురక్షత ప్రాంతానికి వెళ్ళాలి. ఆ తరవాత హర్షవర్దనరావుకు ఫోన్ చేసి పరిస్థితి వివరించాలి.

    శరణ్య బట్టలు తేసి చకచకా సర్దేసింది.

    సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. ఒక్క క్షణం ఫోన్ లిప్ట్ చేయాలా? వద్దా... అనే సందిగ్థంలో పడింది. ఫోన్ ని చూస్తూనే భయంగా ఉంది.

    ఫోన్ రింగవుతూనే ఉంది...

    వెంటనే ఫోన్ లిప్ట్ చేయ బోతుంది... కానీ, అ ప్రయత్నం విరమించుకుంది . ఆ ఫోన్ కచ్చితంగా జేమ్స్ డే అయి  ఉంటుంది.

    తనను రక్షించే ప్రయత్నం చేస్తూ వుంటాడు. జేమ్స్ గురించి డిఫెన్స్ కు తెలిస్తే అతడ్డ్ని అరెస్ట్ చేయొచ్చు.

    అనవసంగా జేమ్స్ ఇమ్డిలో ఇరికిమ్చటం ఇష్టంలేదు.

    వెంటనే టెలిఫోన్ కనెక్షన్ పీకేసిమ్ది. తర్వాత సూత కేసు చేతిలోకి తీసుకుని బయటకు నడిచింది.

    కానీ, అప్పటికే డిఫెన్స్ ఆ ప్లాట్ ని చుట్టుముట్టారన్న విషయం శరణ్య కు తెలియదు.

    శరణ్య లిస్టులో నుంచి బయటకు వచ్చి గబగబా అటుగా వేలొన్న ఆటోని పీలిచింది.

    అప్పటికే ఆమెను ఆరెంజ్ చుట్టుముట్టుంది ఓ సాయుధ వ్యక్తులు వాళ్ళు.

          
                                                    ***

    "మిస్ శరణ్యా... యూ ఆర్ అండర్ అరెస్ట్... మిమ్మల్ని మా కస్టడీలోకి తీసుకుంటున్నాం."

    దేరీజ్ నో వే. శరణ్య మాట్లాడకుండా వాళ్ళతోపాటు నడిచింది.శరణ్యను ప్రైవేటు వెహికల్ లో తీసుకెళ్ళారు. ఆ వెహికల్ వీధి మలుపు తిరిగిన అయిదు నిమిషాలకు, జేమ్స్ అక్కడికి వచ్చాడు.

    శరణ్య తన ప్లాటులో లేకపోవడం చూసి, గూర్జని అడిగాడు. పది నిమిషాల క్రితమే సూట్ కేస్ తో శరణ్య బయటకు వెళ్ళిపోయిందని చెప్పాడు గూర్జా.

    శరణ్యను డిఫెన్స్ వాళ్ళు తెసుకువెళ్ళిన విషయం గూర్జా కు కూడా తెలియదు.

                                                                                 ***

    ఒక్కక్షణం కాళ్ళ ముందు చీకటి వలయాలు కనిపించాయి. మెదడు మొద్దుబారిన పీలింగ్... ఆలోచనలు బ్లాంక్ గా మారాయి. శరణ్య నుంచి ఫోన్ రిసీవ్ చేసేక ఏం చేయాలో తోచలేదు. ప్రమాదం అంచున తను నిలబడి ఉంది.

    ఎ క్షణమైనా ఫోలీసులు, డిఫెన్స్ తనని వెతుక్కుంటూ వస్తారు. అప్పుడు తనేంచేయాలి? ఎడతెగని ఆలోచనలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

    గదిలో ఒంటరిగా ఉంది. కనీసం లైటు కూడా వేసుకోవాలన్న స్పృహలో లేదు. యమునా వచ్చి లైటు వేసింది.

    "ఏమిటది ఐశ్వర్యా... చీకటిలో కూచున్నావు?" అడిగింది యమునా.

 Previous Page Next Page