"నాకు తెలియకడుగుతా! బిన్ లాడెన్ ఫేమసా? ముల్లా ఒమర్ ఫేమసా?"
"బిన్ లాడెనే భయ్యా"
"జార్జిబుష్ గొప్పా, ముషారప్ గొప్పా"
"కొద్దిలో కొద్దిగా బుష్హే బెటర్ భయ్యా..."
"కదా... ఆ మాత్రం తెలిసిన నీకు, నేను చెప్పింది చేయాలని తెలియదా?"
"అంటే అన్నానని అంటావుగానీ, నేనడిగిన డానికి, నువ్వు చెప్పిన డానికి సంభందం ఏమైనా ఉందా? పోనీలే... నా వీపు రాత ఎలా ఉంటే, అలా జరుగుతుంది...." మ్తూ ఆ అమ్మాయి వెనగ్గా నడిచాడు.
ఆ అమ్మాయి మృదువని.
***
మృదువని పుడ్ వరల్డ్ దాటింది. ఎవరో తనని వెంబడిస్తున్నారన్న అనుమానం వచ్చింది. పోలీసులా? డిఫెన్స్ వాళ్ళా... ఆ భయంతో వెనక్కి చూసే దైర్యం కూడా చేయలేకపోయింది.
సరిగ్గా అప్పుడే రాహుల్, మృదువని చేతిలోని హ్యండ్ బ్యాగ్ లాక్కుని పరుగందుకున్నాడు. అంకిత్ వెంటనే గొంతు పెంచి, అక్కడికి పరుగెత్తి ' దొంగ... దొంగా...' అన్నాడు. జనం కాం గా ఉన్నారు.
మృదువని తేరుకుని 'దొంగా... దొంగా...' అని అరిచింది. వెంటనే నలుగురు యువకులు పరుగెత్తుకొచ్చారు. అందులో ఇద్దరు కాల్వేజీ స్టూడెంట్లు.
'ఏమైంది మేడమ్' స్టయిల్ గా క్రాఫ్ సరిచేసుకుంటూ అడిగాడు.
"దొంగా... నా హ్యండ్ బ్యాగ్ తీసుకుని పారిపోతున్నాడు" చెప్పింది మృదువని
వెంటనే నలుగురు పరుగు పందెంలో పరుగెత్తినట్లు పరుగెత్తారు. ఓ యాబై ఏళ్ల శాల్తీ కూడా.
'ఏమైందమ్మా...' అంటూ ఆసక్తిగా అడిగి,విషయం తెలుసుకుని పరుగెత్తాడు. అప్పటికే ఓ పదిమంది రాహుల్ వెనుకపడ్డారు. ఆ పదిమంది ఇరవై... ఆ ఇరవై ముప్పయి అయ్యారు. ఆ హ్యండ్ బ్యాగ్ ఓ అందమైన అమ్మయిదని తెలిసేక, వచ్చిన రియాక్షన్ అది.
నితన్ సేకన్స్ లోనే దాదాపు ముప్పై మంది రాహుల్ ని చుట్టుముట్టారు.
"కుయ్యో, మొర్రో...." అన్నా సౌండ్స్ వినిపిస్తున్నాయే తప్ప, రాహుల్ కనిపించడంలేదు. అ గుంపును ఘాట్ చేస్తున్నాడు చేతన్.
అంకిత్ ఈ రిజల్ట్ ను ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఇమ్తక్రితంలాజనం కంగా ఉంటారని అనుకున్నాడు.
రాహుల్ పరిస్తితిగుర్తొచ్చింది. వెంటనే వీరావేశంతో గుంపులో జారుకున్నాడు. 'అతడ్ని వదిలేయండి. అతను దొంగా కాదు...' గట్టిగా అరిచాడు.
ఆ అరుపుకు అందరూ అంకిత్ వైపు తిరిగారు. "అంటే నువ్వు... వాడు నీ పార్ట్ నరా?" జనం అనుమానంగా అడుగారు అంకిత్ దగ్గరుగా వస్తూ.
"అగండేహే... ఇదంతా టీవీ ఘాంటింగ్" మల్ల అరిచాడు అంటే, ఆ జనమంతా, అప్పటివరకూ నలిగిన చొక్కాలను సరిచేసుకుని, కెమెరావైపు చూడసాగారు.
"నడిరోడ్డు మీద ఓ అమ్మాయి బ్యాగు ఎత్తుకేల్తే జనం ఎలా రియాక్ట్ అవుతారో చూద్దామని చేసిన ప్రోగ్రామ్" క్లియర్ గా ఎక్స్ ప్లెయిన్ చేశాడు.
వెంటనే ఆ జనం చావుదెబ్బలు తిన్న రాహుల్ ని లేపి "సారీ సర్... ఇదేమీ మనసులో పెట్టుకోకండి... తెకిటిజీ..." అన్నారు.
"తూ... మీయబ్బ!... చావగొట్టి, చెవులు మూయడం అంటే ఇదే. ఆయింట్ మెంట్ పెట్టె చోటు లేకుండా, దెబ్బలు కొట్టి, ఇప్పుడు సెంట్ మెంట్ డైలాగ్ లు చెబుతారా?" కీచుగొంతుతో అరిచాడు రాహుల్.
అప్పటికే అతని ఒళ్ళు హూనమైమ్ది. చొక్కా చిరిగి పోయింది. ఆ హడావిడిలో బ్యాగ్ ఓ మూలకు వెళ్ళి పడింది. అక్కడికి వచ్చి, అది టీవీ ఘాంటింగ్ అని తెలిసేక, వెంటనే ఓ మూలాన పడివున్న తన హ్యండ్ బ్యాగ్ తీసుకుని, మెల్లిగా అక్కడ్నుంచి జారుకుంది మృదువని.
పావుర పాటున తనని ఇంటర్వ్యూ చేస్తే, ఆ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతే... ఆ ఆలోచనే ఆమెను భయపెట్టింది.
***
"భయ్యా... నన్నిలా అన్ పాపులర్ చేస్తానని ఎక్స్ పెక్ట్ చేయలేదు. జనం చితగ్గోట్టారు భయ్యా... ఒంట్లోని పార్ట్ లన్నీ కదిలిపోయాయి. అయినా ఇలాంటి నీచ మీనె ఐడియా నామీద ప్రయేగిస్తావా? ఎన్నిసార్లు నీ కోసం అయ్యర్ హొటల్ నుంచి ఇడ్లీ తెచ్చి పెట్టలేదు" బాదాగా అన్నాడు రాహుల్.
"సారీ రా... అయినా ఇంత వైల్డ్ గా ఎమోషన్ అవుతారని, నిన్ను చితకబాదుతారని అనుకోలేదు."
"అనుకోవు భయ్యా... నువ్వెందుకనుకుంటావు.... నా వీపు కదా... నా వీపు మీద నీకెందుకు భయ్యా ప్రేముంటుంది... పైగా ఫస్ట్ రౌద్ లోనే అపోచ్చుగా ...నాలిగైడు రౌండ్ ఉతికేవరకూ వెయిట్ చేసి వచ్చావు" ఏడుస్తూనే అన్నాడు.
"నేచురాల్టీ ఘాట్ చేద్దామని అనుకున్నవ్లె.... గానీ, ఆ అమ్మాయి మెల్లిగా జారుకుంది. ఈ ఎపిసోడ్ మీద ఒపీనియన్ అడుగుదామని అనుకోనేలోగా హ్యాండ్ బ్యాగ్ తీసుకుని జారుకుంది.ప్చ్..." అన్నాడు అంకిత్.
"అవును భయ్యా... ఇల్లు కలి ఒకడు ఏడుస్తుంటే, ఈ మంట ఉదయం వరకూ ఉంటుందా? చలికాచుకోవాలి"అన్నాడట ఇంకొకడు. ఓ పక్క నేను దెబ్బలతో ఫీలవుతుంటే, నువ్వేంటి భయ్యా ఇంత ఘేరంగా అలోచిస్తూన్నావు?"
"రాహుల్... పాత విలన్ నెల్లూరు కాంతారావు గొప్పా? కట్టుఅల్ హీరో కాంతారావు గొప్పా?"
"భయ్యా.. భయ్యావని కూడా చూడకుండా అంత్రాక్స్ పౌడర్, పాండ్స్ పౌడర్ లో కలసి చంపుతా... ఇలాంటి దిక్కు మాలిన ఎగ్జాంపుల్స్ తోనే నా వీపు కాందహార్ బాంబుల మోత చేశావ్"
అంకిత్ ఓ సారి రాహుల్ వైపు చూసి "సారి రా... నీ సత్యు ఎషణ్ ఇంత వరస్ట్ అవుతుందనుకోలేదు. పోనీలే... కష్టేపలి... అన్నారు. రాత్రి ప్యారాడేజ్ లో చికెన్ బిర్యానీ తినిపిస్తాన్లె" ఊరీడింపుగా అన్నాడు.
"ప్రామిస్" అడిగాడు రాహుల్.
"చేతన్ మీదొట్టు... వాడిని చంపుకు తిన్నంత ఇట్టు... సరేనా..." అన్నాడు అంకిత్.
చేతన్ అనుమానంగా అంకిత్ వైపు చూశాడు.
***
అంకిత్ సిన్సియర్ గా ఆ రాత్రి ప్యారడైజ్ లో చేతన్ కు, రాహుల్ కు చికెన్ బిర్యానీ తినిపించాడు.
"భయ్యా... దెబ్బలు తగిలితే తగిలాయి కానీ, ఓ నగ్నసత్యం తెలిసింది..." అన్నాడు థమ్స్ అప్ ఆర్డర్ చేసి.
యూ మీన్ నేకెడ్ ట్రూత్..." అడిగాడు చేతన్.