విద్యార్ధులు ఫాక్టరీల్లోకి వచ్చి కరపత్రాలు పంచినప్పుడు కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఈ కరపత్రాలేమీ తెలివితక్కువగా లేవు. యూనియన్లకిది ఇష్టం లేదు. కరపత్రాలు తీవ్ర చర్యలను కోరుతున్నాయి. బహుశా అది తప్పేమో కాని యూనియన్లకు కావలసింది ఐక్యత.
కాని యువ కార్మికులకు సందేశం అందింది -మరికొందరికికూడా వీళ్ళందరిదీ తప్పనడానికి వీల్లేదు.
విద్యార్ధులు యూనివర్శిటీలు తమవన్నారు. అందుకోసం పోరాడారు. వాటిని ఆక్రమించారు. కార్మికులకు సోర్భావ్ లో ప్రవేశం ఉచితం అంటున్నారు. కార్మికులలాగే మేమూపరిపీడితులం అంటారు విద్యార్ధులు. ఈ పీడనతుదముట్టించడానికి మాతో చేతులుకలపండి, ఫాక్టరీలను సాధీనం చేసుకోండి అంటారు. "ఇప్పుడు విద్యార్ధులు లేత చేతులనుంచి కాగడాను కార్మికుల గట్టిచేతులు తీసుకోవాలి" (మావోయిస్టు బేనర్)
12
మేం అడగం.
డిమాండ్ చెయ్యం.
తీసుకుంటాం. ఆక్రమిస్తాం.
(సోర్బాన్ ప్రదర్శన శాల)
విమానాలు నిర్మించేఫాక్టరీ. నాంటే వద్ద, కొన్ని డజన్ల యువకార్మికులు తమ యంత్రాలనువదలి పెట్టి, మిగిలిన వాళ్ళని తమతో కలువమన్నారు. మిగిలిన వాళ్ళంతా అలాగే చేశారు.
రెండువేలమంది కార్మికులిప్పుడు ఫాక్టరీని ఆక్రమించారు. హెడ్ మేనేజరూ, అతనిసహాయకులూ ఇప్పుడువాళ్ళ గదుల్లో బందీలు, నాన్ టెస్ నుండి డజన్లకొద్దీ విద్యార్ధులు వచ్చి రాత్రంతా అక్కడే ఉండిపోయారు.
అంత సులభమన్నమాట.
సోర్బాన్ కి వార్త అందుతుంది. సమావేశాలు ఆపి ఈ ప్రకటన చేస్తారు.
సోర్బాన్ ఆనందోత్సాహాలకి అంతులేదు.
కొంతమందిపార్టీ దేవతలు ఏడ్చారట కూడా.
క్లియాన్ సీన్ మారిటైమ రెనో ఫాక్టరీ; గేర్ బాక్సులు.
రెండువందల మందికార్మికులు (యువకులు) షిఫ్టు తర్వాత ఫాక్టరీని వదిలి పెట్టడానికి బదులు హెడ్ మేనేజరును అతని ఆఫీసులో తాళం వేసి బంధిస్తారు. రాత్రంతా అక్కడే ఉండిపోతారు.
అంతసులభమన్నమాట.
ఫ్లిన్స్, పారిస్ కి కొంచెం దూరంలో రెనో ఫాక్టరీ, వాళ్ళూవున్నారు వార్త. ఫాక్తరీని ఆక్రమించారు.
ఇదిగురువారం ఉదయమప్పుడు. ప్రదర్శనశాల సోమవారంతర్వాత.
జార్జిసెగీ (సి.జి.టి.) యుజీన్ డెస్కాంసీ (సి.యఫ్.టి.డి.) కి టెలిఫోన్ చేస్తాడు.
మంచుబంతి హిమప్రవాహమవుతోంది.
తిరుగుబాటు ఎవరు నేర్పారు వీళ్ళకి?
యూనియనలుకాదు, వాళ్ళ పరిస్థితి ఏమిటి?
చర్యకుదిగండని చెప్పిందెవరు?
యూనియన్లు కాదు, అవి యిస్తున్న ఉదాహరణ.
గురువారం అపరాహ్ణం. బులాయిన్ బిలాంకూ పారిస్ పొలిమేరల్లో రెనో ప్రధాన (మాతృ) కర్మాగారం (కార్మికుల సోర్భాన్ ఇదేనా?)
వర్కుషాపు 70 ఒక యువ కార్మికుడు" చాలురా బాబూ" అంటూ తన యంత్రాన్నివదలి వస్తాడు. అంత సులభమన్నమాట.
"చాలా? నువ్వు పిచ్చాడి" వంటాడుసహచరుడు. "రా బైటకి రా" అంటాడు. యువకుడు. తతిమ్మా వాళ్ళను కూడా పిలుస్తాడు. అరగంటలో 70 నంబరువర్కుషాపు ఖాళీ.
ఫాక్టరీ అంతటా ఈ వార్త పొక్కిపోతుంది. అప్పుడు మరో వర్కుషాపు 72 వ నెంబరుధి ఆగిపోతుంది. ఆ తర్వాత 73 నంబరువర్కుషాపు.
వాళ్ళకన్న వయస్సులో పెద్దవాళ్ళయినవర్కర్లు, యూనియన్ మెంబర్లు, యూనియన్ నుంచి "ఉత్తరువులు" వచ్చేదాకా ఆగుదామంటారు.
కానివాళ్ళ నెవరూ లక్ష్యపెట్టరు. ఒక గంటలో వెయ్యి మందిపని నిలిపేశారు. "బాధ్యతాయుతులు" వచ్చేదాకా ఆగుదామంటారు.
మరి యూనియన్లు మాత్రం? ముగ్గులోకి దిగక తప్పదు. జడిసిపోయి, బాగా హడలిపోయిందిగా చెయ్యవలసింది ఒకే ఒక్క పని చేస్తారు. పరిగెత్తుతూన్న బండిలోకి దూకడం. బిలాంకూ కూడా ఆక్రమించబడింది. కాని యూనియాన్ మెంబర్లు మాత్రమే - అధిక సంఖ్యాకులు సి.జి.టి.కి చెందిన వాళ్ళు- అజమాయిషీ తీసుకుంటారు- సమ్మెదారులచేతినుండి. వీళ్ళే ఆక్రమణవివరాలను నిర్ణయిస్తారు. డిమాండ్ల జాబితాలుతయారు చేస్తారు. అవి యూనియను ప్రధానకార్యాలయం నిర్దేశించినవి.
అపరాహ్ణానికిముందు, శుక్రవారం నాడు సోర్భాన్ లో, జనరల్ అసెంబలీ బిలాంకూకి ప్రతినిధి వర్గాన్ని పంపడానికి విద్యార్ధులు నిర్ణయిస్తారు.
అయిదుగంటలకి సి.జి.టి. కరపత్రాలు సోర్బాన్ లోను, పరిసరాలలోను వెదజల్లబడతాయి. వాటిలో "చాలాముదావహం.... తొందరపాటు పనులకిమాత్రం మేమవ్యతిరేకులం. వెలుపలివారి జోక్యాన్ని నిరాకరిస్తాం........"
సి.జి.టి. (కమ్యూనిస్ట్ వర్కర్లయూనియన్!) కార్మికవర్గపు పోలీసు ఆఖరికోట. అడ్డంకి. సరత్రా బెదిరించబడినబూర్జువా వ్యవస్థకు ఆఖరి రక్షకులు. రెండు వేలమంది సోర్భాన్ ను వదిలి, ఓడియాన్ వద్ద జనాన్ని కూడగట్టుకుని, నైరుతిదిక్కుగా కదుల్తారు.
వీరుదేవదూతలు, సోర్భాన్ - బిలాంకులమధ్య ఈ సాలీడుదారం బొడ్డుతాడు కావాలి. మైళ్ళ పొడవునాకదిలారు పట్టణపు అంచులవైపు, పారిస్ ఎర్రవలయం వైపు! కునుకుపాట్లు పడుతున్న చరిత్ర మంత్రసాని, ఏళ్ల తరబడిగా కలత కలలుకంటూ ఇప్పుడకస్మాత్తుగా మేలుకుంది.
"ప్రజా" నివాసస్థలాలు, బిస్ట్రోలు బౌలింగు పాటుపడ్డంవల్లరాటుతేలిననీతి విధానాలు, ఐకమత్యపుబంధాలు, కుటుంబాలు ఎవరిపని వాళ్ళది. మార్పులేని వశం. ఇక చీకటి పడింది. మురికి వాదాలు. పారిశ్రామికపు మట్టికి పనికొచ్చేఎరుపు. భూలోకపుభ్రష్ట జీవులు. విందుకు ఆఖరున వచ్చినవాళ్ళు. ఇతర శతాబ్దాల చెత్తాచెదారపు తీరాలనుండి, ఫాసిస్టు స్పెయిన్ నుండి, పోర్చుగల్ నుండి, దిక్కుమాలిన తెగించిన ఉత్తరాఫ్రికానుండి, బాల్కన్ ల నుండి.
ఫాక్టరీ సీన్ నదిమధ్య ఒకదీపం.
ఆఖరి నూరు గజాలు.
రోడ్డుకడ్డుగా, దారి బందుచేస్తూ ఒక లారీ. లౌడ్ స్పీకర్ లారీ మీద: ఒక సి.జి.టి అధికారి.
ఆఖరి తెర. అయోమయపు వలయం.