Previous Page Next Page 
సక్స్ స్ పేజి 13



    హల్లో ఒక పక్కగా టి.వీ, న్యూస్ సిగ్నేచర్ ట్యూన్ వచ్చింది- ఆ వెంటనే ఎనౌన్సర్ ప్రత్యేక్షమైంది.

    ఉదయం వార్తల్లో ముఖ్యాంశాలు

    "నిన్న మధ్యాహ్నం....ప్రమాణ స్వకారోత్సవంలో పాల్గోని, హొం మంత్రిగా పదవి  బాధ్యతలు  స్వీకరించిన, ఆంద్రప్రదేశ్ కు  చెందిన  ప్రముఖ పారిశ్రామిక వేత్త...."అని  వినబడిగానే తలెత్తి చూసింది ముక్తానంద.

    "శ్రీ హరికృష్ణమనాయుడు దారుణమైన హత్యకు గురయ్యారు." వార్త వినగానే  తను వింటున్నదేమిటో తనకే అర్ధంగాని స్ధితిలో కొద్ది క్షణలుండిపోయింది. అర్ధంకాగానే  నమ్మలేనట్లుగా దిఫ్  షాక్  గురయింది.. టివిలో వార్తలు కోవసాగుతూనే ఉన్నాయి....అవేమి ఆమె చెవులకు  ఎక్కటంలేదు ఆ రోజు  ఏప్రియల్ ఫస్టమో...కాదు.... ఆ రోజు  ఏప్రియల్ పస్టుకాదు మరి.....ఎందుకిలా   జరిగిందా? అసలు జరిగిందా....? జరిగుండదు. ఎవరి పేరో చెప్పబోయి....తన తండ్రి పేరు చెప్పారేమో .... అక్కడున్న స్టూడెంట్స్  కి నాయుడు ఆమె తండ్రిని  తెలిదు. మరికొద్ది క్షణాలకు ఆమె పూర్తి స్పృహలోకి వచ్చింది.

    అంతే  ఆమె ఒక్క క్షణం  ఒణికిపోతూ__"డాడి" అని కెవ్వున అరిచింది. ఆమె మెదడు  మొద్దుబారిపోయినట్టుగా అయిపోయింది కేక వేస్తూనే స్పృహ తప్పి పడిపోయింది.

    హొంమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం శ్రీ హరికృష్ణమనాయుడు కొంతమంది  పార్టి ప్రముఖులతో  జైపూర్లో అభినందన సభలో పాల్గొనడానికి  అని టివి వార్తలు వస్తున్న సమయంలో  వార్డెన్ తో  సహా, హాస్టల్ స్టూడెంట్స్ అందరూ ఒక్కోమ్మడిగా ఆమెను చుట్టూ ముట్టేసారు.....జరిగిందేమిటో .....ఎందుకలా ఆమె  స్పృహతప్పిపోయిందో అర్ధంకాక.

    అదే సమయంలో వార్డెన్ ఆఫీసురూంలోని ఫోన్ మోగింది.

    మద్రాసులోని___

    అడయారు ప్రాంతంలోని, మర్ర్తి చెట్టుకు వందగజాల దూరంలో ఉన్న విశాలమ్తెన భవనం ముందు__

    వందలాది  క్ర్లు బారులు తిరున్నాయి.

    అక్కడ__

    లాన్ లో, బయటా, గుంపులు గుంపులుగా ఉన్న జనం ప్రతి ఒక్కరూ , విషాదం లో  మునిగిపోయారు.

    ఎక్కడ చూసినా వందలాది మంది పోలిసులు.

    నిలువెత్తు గోడలు... తర్వాత విశాలమ్తెన గార్డెన్....పోర్టికో ...ఆ  తర్వాత....పెద్దాహాలు.

    ఆ హాలు మధ్యభాగంలో హరికృష్ణమనాయుడు శావాన్నుంచారు. రాష్ట గవర్నర్ , ఆ  తర్వాత ముఖ్యమంత్రి కొద్ది నిమిషాల ముందేవచ్చి, శవంమీద దండలు వేసి, తమ శ్రద్దాంజాలి ఘటించి వెళ్ళిపోయారు. వరసగా పురప్రముఖులు, పార్టినేతలు , పారిశ్రామిక వేత్తలు, విషాదహృదయాలతో వచ్చి  శ్రద్దాంజలి ఘటిస్తున్నారు.

    శవానికి కొంచెం దూరంలో, విషాదాన్ని అభినయిస్తూ నిలుచున్నా రవిచంద్రను ఓదారుస్తున్నారు.

    హరికృష్ణమనాయుడికి ,దాదాపు శిష్యుడులాంటి వాడ్తేన హ్తెద్రబాగ్ కు చెందిన ఓ పారిశ్రామిక వేత్త , తన గురువు గారికి శ్రద్దాంజలి ఘటించి రవిచంద్రవేపు నడిచాడు.

    "రవి....ఏంటిలా అయిపోయింది. అందుకే నేను, నెత్తి నోరూ  కొట్టుకున్నాను....ఆ డర్టి పాలిటిక్స్ లోకి  వాళ్ళోద్దని....ఎంత  చెప్పిన  వినలేదు...హంతకుల్ని సులభంగా  వదలకు....నీకు, నా పూర్తి సహకారం ఉంటుంది....."

    ఆ పారిశ్రామిక వేత్త పేరు రఘునాద్.

    :అంకుల్ మీతో  కొంచెం సేపు  మాట్లాడాలి. పక్క కోస్తారా..." రఘునాద్ , ఒకప్పుడు హరికృష్ణమనాయుడు దగ్గరే పని చేసేవాడు.హరికృష్ణమనాయుడు ఎక్స్ పోర్ట్  కంపెనిలో జనరల్ మేనేజర్ పోస్టులో ఉండే వాడు తన అదినంలోని కంపెనీల్లో ఓ కంపెనీకి రఘునాద్ ని మేనేజింగ్ డ్తె రెక్టర్  ని చెయ్యాలని హరికృష్ణమనాయుడు కోరిక.

    కానీ రఘునాద్ ఆలోచనలు అందుకు  విరుద్దంగా  ఉన్నాయి నాయుడు  కంపెని నుంచి  రెగ్యులర్ గా ఎక్స్ పోర్ట్  అవుతున్న సరుకుని జపాన్ లోని నాయుడు చెప్పిన కంపెనీకి  కాకుండా  తనకు కమిషన్ ని ఎక్కువగా ఇచ్చే కంపెనీకి ఇచ్చాడు.

    తద్వారా కోటి రూపాయలు సంపాదించాడు    రఘునాద్.

    రెండు నెలల తర్వాత . నాయుడికి  ఆ విషయం, తెల్సింది అంతఅ వరకూ హరికృష్ణమనాయుడు, రఘునాద్ ని అనుమానించలేదు.

    ఒక ప్తెన్ మార్నింగ్, తన కాబిన్లోకి పిలిచి, ఆఫిసులోంచి పంపించేసాడు.

    రఘునాద్  కల్లావెళ్ళా బడ్డాడు.

    తప్పను క్షమిస్తాడు హరికృష్ణమనాయుడు-కానీ నమ్మక ద్రోహాన్ని క్షమించలేడు.

    అప్పటి నుంచి రఘునాద్ శత్రువు హరికృష్ణమనాయుడు-అందుకే రావిచంద్రతో సాన్నిహిత్యాన్ని పెంచుకొన్నాడు.

    రఘునాద్ కి, నలబ్తే అయిదేళ్ళుంతాయి.

    "చూడండి....అంకుల్....ఎంతటి ఘేరం జరిగిపోయిందో నిన్నటి మా డాడి ఎనిమిస్....ఇవాల్టినుంచి  నా ఎనిమిస్... వాళ్ళని సులభంగా  నేను  వదిలిపెట్టాను....కానీ మీలాంటి వాళ్ళ కోపరేషన్ నాకు కావాలి...."నెమ్మదిగా అన్నాడు రవిచంద్ర ఆస్తి తన హేండోవర్ లోకి రావాలంటే రఘునాద్  లాంటి వ్యక్తుల  సహకారం తనకు అవసరం- అర్ధబలం సాధించాలంటే అంగబలం చాలా ముఖ్యం.

    "నా గురించి నీకు తెలుసు....మీ డాడి దగ్గర ఎంత  నమ్మకంగా ఉన్నానో నీకు తేలింది కాదు....నాయుడు ఎస్టేట్  లో సేంకేండ్ సీటు  నాది.... కానీ....నా శత్రువులు మీ డాడిని నమ్మించగలిగారు. నన్ను అన్యాయంగా బయటకు గెంటేసాడు మీ డాడి....అయినా మీ డాడిని నేను మర్చిపోలేదు.. పిలవకపోయినా ఎలక్షన్లలో వర్క్ చేసాను....చెప్పు...నీకేం హెల్ప్  కావాలన్నా చెప్పు.... బయటి వ్యక్తిన్తెనా, చేయడానికి , రెడిగా ఉన్నాను" సిగరెట్ వెలిగించుకుంటూ అన్నాడు రఘునాద్ రఘునాద్ క్కూడా ఇదొక అవకాశం-అందుకే బయటివ్యక్తి గా అన్న  పదాన్ని  వాడాడు.

 Previous Page Next Page