Previous Page Next Page 
డింగ్ డాంగ్ బెల్ పేజి 13

    రాహుల్ ఓసారి మనసులో అంజనేయ దండకం చదువుకొని, ఆ యువకడి ప్యాంటు వెనుక జేబులో వున్న పర్సును లాగేసుకున్నాడు.

    అయినా ఆ యువకుడు అది గమనించకుండా, ఆ అమ్మాయితో మాట్లాడుతూనే ఉన్నాడు. రాహుల్ ఏం చేయాలో తోచక, అంకిత్ దగ్గరకి వెళ్ళి అడిగాడు.

    "మళ్ళీ ఓసారి పర్సు అతని జేబులో పెట్టి విసురుగా లాగు..." చెప్పాడు అంకిత్.
 
    "బాసూ... డేంజర్ అసైన్స్ మెంట్స్ నీ నాకు అప్పగిస్తావు" మనసులో గోణుక్కోని,  వెనక్కి వెళ్ళి అంకిత్  చెప్పినట్టే చేసాడు.
 
    అప్పుడు వచ్చింది కొద్దిపాటి స్పృహా... రాహుల్ ఆ యువకుడితో...

    "ఒరే దేభ్యపు వెధవా... నీ పర్సు తీసుకెళ్తున్నన్న్రా" అని పరుగు మొదలెట్టాడు.

    ఒక్కక్షణం ఆ శాల్తీ బిత్తరపోయాడు. ఎదురుగ ఇంతక్రితమే పరిచయమైనా గర్ల ప్రెండ్... మరోపక్క పర్సు... అసలే, అది జీతం డబ్బు... వెంటనే గుండె లబ్డబ్ అంది. ఆపై అతను లబోదిబో మన్నాడు.

    "నాపర్సు కొట్టేసి పారిపోతున్నాడు.... పట్టుకోండి... పట్టుకోండి..."

    చుట్టుపక్కల జనాలు, ఆ అరుపు విని, అతని దగ్గరకి వచ్చారు. అప్పటివరకూ, వాళ్ళిద్దర్నీ గమనిస్తూనే ఉన్నారు.

    "పర్సులో ఎంతుందేమిటి?" ఒకతను అడిగాడు.

    "మూడువేలు" చెప్పాడు అతను.

    "అనీ వందలేనా, ఫిన్ హంద్రేడ్స్ కూడా వున్నాయి, వందలు ఫైవ్ హండ్రండ్స్  మూడు."

    "బస్సు చార్జీలకు డబ్బులున్నాయా?" ఇంకెవరో అడిగాడు.

    "ఓర్నీయబ్బ... నా డబ్బులు పోయి నేనేడుస్తూంటే ఈ డిటేయిల్స్ అడుగు తారా... ముందు వాణ్ని పట్టు కొండేహే ..." అన్నాడు.

    "ఏం... పోయింది  నీ ఫర్సే కదా.... నువ్వు పరిగెత్తు... చూస్తే దిట్టంగా వున్నావు" ఎవరో సలహా ఇచ్చారు.

    అప్పటిగ్గానీ అతనికి తక్షణ కర్తవ్యం గుర్తుకు రాలేదు.

    వెంటనే రాహుల్ పారిపోతున్న వైపు పరుగు పెట్టబోయాడు.

    "అదేంటమ్మా.... నాకు మసాలా పాన్ ఇప్పిస్తానని వెళ్తున్నావెంటి?" ఆ  అమ్మాయి అతణ్ని అడిగింది గోముగా.

    "నీయమ్మా... నా టెన్షన్ లో నేనేడుస్తుంటే, నీకు మసాలా పాన్ కావాల్సి వచ్చిందా...?" అంటూ తన ఒరిజనల్ స్టోన్ నిప్పి, రాహుల్ వెళ్ళిన వైపు పరుగేత్తాడు ఆ  యువకుడు.

    చుట్టుపక్కల వున్న జనం చోద్యం చూస్తుండిపోయారు.

    వెంటనే అంకిత్ ఆ జనం దగ్గరకి వెళ్ళి 
             
    "అదేమిటండీ... తోటి మనిషి ఆపదలో వుంటే, కాస్త హీల్స్ చేయేచ్చుగా" అని అడిగాడు. అతని చొక్కా గుమ్దీకి చిన్న స్పీకర్ ఉంది.

    "ఏంటి చేసేది చికెన్ కుర్మా... అప్పట్నుంచీ వొళ్ళు తెలియకుండా, ఆ అమ్మాయితో చొంగ కారుస్తూ మాట్లాడుతున్నాడు. అమ్మాయిలు పక్కన వుంటే ప్రపంచమే తెలియకపోతే ఎలా?" ఓ వ్యక్తి కచ్చగా అన్నాడు.

    "అయినా పర్సును అందరికీ ఎగ్జిబిట్ చేస్తూ వెనక జేబులో పెట్టుకోవాలా? ఆ మాత్రం జాగ్రత్తగా లేకపోతే ఎలా?" ఇంకెవరో కామెంట్ చేశారు.

    "అయినా ఎవడికి పట్టింది... ఆ దొంగను పట్టుకుంటే, అదో పోలీస్ కేసు...లేనిపోని తలనొప్పి" మరొకరి కామెంట్.

    వాళ్ళు అలా కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఈ లోగా రాహుల్ తిరిగి తిరిగి అంకిత్ దగ్గరికే వచ్చాడు.

    "బాసూ... ఆ పిచ్చివేధవకు పరుగెత్తడం కూడా రాదు...మద్యలో ఇంకెవరో అమ్మాయి కనిపించగానే, స్లోఅయ్యాడు. కూడా నాకిక ఓపిక లేక, వెనక్కి వచ్చేశాను" చెప్పాడు.

    "కట్... కట్..." అన్నాడు అంకిత్.

    జనం బిత్తరపోయేరు ఈ లోగా ఆ యువకుడు వగరుస్తూ రాహుల్ దగ్గరకి వచ్చాడు.

    అది టీవీ ఛానల్ వారి ఏర్పాటు అని తెలిశాక, ఆ యువకుడు ఓ నిట్టూర్పూ విడిచాడు. అయితే తనికో విషయం తెలిసొచ్చింది అమ్మాయిల ' యూవ'లో పడి, పర్సును నిర్లక్ష్యం చేయేద్దు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎలర్ట్ గా ఉండాలి.

    "చూశావా బాసూ... జనం ఎలా మారిపోయారో.... నా వీపు చిట్లడం గ్యారంటీ అనుకున్నాను. కానీ గాడ్ ఈజ్ గ్రేట్ భయ్యా.... నా వుపునకు ఎ డామేజీ కాలేదు..." రాహుల్ ఓ నిట్టూర్పూ విడిచి అన్నాడు.

    "మనుష్యులంతా ఒకేలా వుండరు రాహుల్.... అద్సరే గానీ, నా బుర్రలో మరో ఐడియా ప్లాష్ అయి, ఇందాకటి ఐడియాకు క్లాష్ అవుతుందీ" అన్నాడు అంకిత్.
 
"ఏమిటి భయ్యా..." అడిగాడు రాహుల్. "ఈ సారి అమ్మాయి బ్యాగ్ ఎత్తుకెళ్ళు, లోకేషన్ మారుద్దాం. అక్కడి జనం రియాక్షన్ చూద్దాం" ఉత్సాహంగా చెప్పాడు అంకిత్.

        
                                              ***

    "భయ్య... నీ వరస చూస్తోంటే, నన్నివల ఎవ్వరితోనో తన్నిమ్చేదాక నిద్ర పోయేలా కనిపించటంలేదు" అన్నాడు రాహుల్ ఏడుపు గావుతుతావు.
 
    "జీవితంలో సాధించు ప్రెండు... సాహాసం చేయరా డింభకా" అని పాతాళబైరవిలో డైలాగ్ విన్లేదూ..."

    "భయ్యా.... బ్లాక్ అండ్ వైట్ ప్లాష్ బ్యాక్ లు చెప్పి నా బ్రతుకు ఈస్ట్ మన్ కలర్ లో బస్టాండ్ చేయువుగా" డౌట్  గా అడిగాడు రాహుల్.

    "నన్ను నమ్మి చేడిపోయిన వారెవరూ లేరు రాహుల్... ప్రోసిడ్, ఇప్పుడు లోకేషన్ పెందర్ గాస్ట్ రోడ్... పిస్ట్" అన్నాడు అంకిత్.
 
                        
                                                 ***
    పెండర్ గాస్ట్ రోడ్....

    ఓ పక్క వ్యం లో కెమెరాతో వున్నాడు చేతన్... రాహుల్ ఓసారి ఆకాశం వంక చూసి, ఓ సారి అంకిత్ వైపు దీనంగా చూశాడు.
 
    అంకిత్ కళ్ళతోనే దైర్యం చెప్పి, రోడ్డు పైకి చూశాడు. ఓ అమ్మాయి హ్యండ్ బ్యాక్ భాజానికి తగిలించుకుని వెళ్తోంది.

    "రాహుల్... ఆ అమ్మాయిని చూడు... చాలా రెక లెస్ గా హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని వెళ్తోంది. వెళ్ళు... తాపీగా హ్యాండ్ బ్యాక్ లాక్కుని పరుగెత్తు... పరుగెత్తమన్నాననిస్పీడ్ గా పరుగెత్తు.కెమేరాకు దొరికి చావు... జనం రియాక్షన్ ని బట్టి 'కట్' చెబుతాను" చెప్పాడు అంకిత్.

    "ఎంతో భయ్యా బాసూ... నా వీపుఅడే పనిగా నాన్ స్టాప్ గా  అదురుతోంది... పోనీ ఈ ఒక్కసారికి క్యారెక్టర్ చేంజ్ చేసుకుందామా?"

 Previous Page Next Page