Previous Page Next Page 
మ్యూజింగ్స్ -2 పేజి 14


    పాపపుణ్యాలకి, శిక్షా బహుమానాల్ని యిచ్చే నరక స్వర్గాల్లో యమ దేవేంద్రులలో నమ్మకం లేకపోయినా, జీవితంలో న్యాయం జరగడం చూడకపోయినా, ఎందుకో ఆధారం ఏమీ లేకుండానే, ఈ దొంగతనాల్లోనించి, పై పై పాతివ్రత్యాల్లోంచి, స్వార్ధధర్మాలలోంచి వెనకగా చూడగల శక్తిలో యెట్లాగో యెప్పుడో ఈ తప్త మృదు హృదయాలకు శాంతి నివ్వగల మహిమలో, దేంటోనో చెప్పలేని ఎరగలేని మాయమెరుగులో, ఎందుకో నాకు విశ్వాసం పోలేదు గనక గాని; నీచులు, కులటలు రోడ్డు పక్కన దిక్కులేక చచ్చే యీ స్త్రీలలో నేను చూసిన ఔన్నత్యం__యీ పుణ్య, పవిత్ర, ప్రతిష్ఠాపూరిత సతులలో చూసిన నీచత్వం__ నా హృదయాన్ని కాల్చివేసి వుండకపోనా? క్రైస్తువలె "ఈ లోకంమీది, ఆ లోకం వారిది" అనే విశ్వాసం లేదు. ఈ లోకంలోనైనా గట్టిగా ఒక్కరివైపు చెయ్యిజాచి "నేనున్నా" ననగలిగితే చాలు!
    నా వ్రాతలు, చాతలు అతి ఘోరాలని వాస్తవంగా విశ్వసించే వారిని చూస్తే ఏమీ కోపం వుండదు. కాని__
    'ఎంత బాగా వ్రాస్తారండీ! ఏమి style అండీ! ఏమి కవులండీ! ఏమి power అండీ?"
    "చాలా మంచిపనండీ! అట్లాంటి స్త్రీలకి, దిక్కుమాలిన వాళ్ళకి సహాయం చెయ్యవలసిందే, పాపం! ఆ పిల్లలేమైపోయేవాళ్ళో! ఈ సంఘం, అండి, యెంత మూర్ఖమండి!" అనే మిత్రుల్ని చూస్తే__ యెంత ద్వేషం కలుగుతుంది!
    Mealy mouthed cowards!
    style! style! style ని పొగిడి, style ని పోత్సహించే నా బాధని, నా బాధ వెనుక మండుతో యీ సిరాలోంచి మీ హృదయాలలోకి పలకాలని చూసే మూగ కంఠాల క్షోభ వినబడకపోతే, మూలమూలల అణిగి నలిగి నశించే ధీరవనితల ఆర్యత్వం మీకు తట్టకపోతే నేను వ్రాసి ఏంలాభం, మీరు చదివి ఏంలాభం?
    style, beauty, art __ ఎందుకివన్నీ! దొంగ విమర్శకులకి నీతివర్తనులనీ, ఆధ్యాత్మిక ప్రేమవేత్తలనీ, ఉన్నత ఆత్మరసికావతంసులనీ కీర్తినివ్వడానికి తప్ప!
    Romain Rolland వ్రాస్తున్నాడు.
    Write it simple, as simple as it's unfolding. Waste no thought upon the word & the letter, & the subtle vain researches in what the force of the artists to_day is turned to nought. you are addressingall men; use ther language of all men. There are no words noble or vulgur; thore is no style chaste or impure; there are only words & styles which say exactly what they have to say. Be soung & thorough in all you do; think just what you think__&feel just what you feel. Let the rythm of your heart prevail in your writings! The style is the soul.
    చాలా సులభంగా 'సింపిల్' గా, ఎట్లా వెలువడితే అట్లా 'సింపిల్' గా వ్రాయి. మాటమీద మనసుని వృధా చేసుకోకు. అక్షరంపైన ఆలోచన నిలపకు. ఈనాటి కవులు శక్తి నాజూకైన శబ్దాల, అర్ధంలేని మెలికల్లో, వెతుకుళ్ళలో, మెరుగుల్లో ఇంకిపోతోంది. ప్రజలందరూ చదవడానికి వ్రాస్తున్నావు. ప్రజలందరూ మాట్లాడే భాషని వ్రాయి. గొప్పమాటలనీ, నీచపు మాటలనీ; నిర్దిష్ఠమైన శైలి అనీ, మలినమైనదనీ, రెండు లేవు. చెప్పేదేదో సూటిగా, స్పష్టంగా, చెప్పగల మాటా, శైలీ ఇవే వున్నాయి. చేసేది దిట్టంగా సంపూర్ణంగా తెలిసేట్టు చెప్పెయ్యి. ఏది ఆలోచిస్తున్నావో, అది సరిగా, నిజంగా ఆలోచించు. నిజంగా నువ్వు దేన్ని అనుభవించావో, అది నిజంగా అనుభవించు. నీ హృదయంలోని లయ (రిదం) నీ పాత్రల్లో కనపడనీ ఆత్మే శైలి.
    ఆ భారతిలో బ్రాహ్మణీకాన్ని విమర్శించిన ఆయన సుందరమ్మ తన భర్తకోసం స్మశానంలో యేర్పడిందంటే, హిందూ వనిత లావని చేయ్యరన్నారు. ఏ ఇంగ్లీషు ఆవిడో చేసివుంటుందిట! అవును సాధారణ స్త్రీలు చెయ్యరు. సుందరమ్మ లాంటి వాళ్ళు చేస్తారు. ఏడ్చినవాళ్ళని నేనెరుగుదును. అంత వెర్రివాళ్ళని అంత reasonless absurd స్త్రీలనీ యెరుగుదును. సకృతు అంటాడా! ఆ విమర్శకుడు? అవును. వేయిలో ఒకరైన యీ నిర్భాగ్యుల్ని ఏరి మీకు చూపుతున్నాను. సుఖంగా, ఏ యేడ్పూ లేక భర్త చస్తూ వుంటే, తాళంచెవుల కోసం, జుట్టు కోసం, యేడ్చే తొమ్మిదివందల తొంభై తొమ్మిది మందిని గురించి కాదు నేను వ్రాసేది. వారిపాలిట సంఘం, దేవుడు, భారతి విమర్శకులు, పత్రికలు, అందరూ వున్నారు. నేనెందుకు?
    "స్త్రీ లోబడదు. స్త్రీ స్వభావం విషయం పొరబడ్డారు" అన్నారు ఆయనే యింకోపట్ల.
    అవును నిజం. స్త్రీ లోబడదు. మీరెరిగిన పుణ్యసతులెవరూ లోబడరు. లోబడ్డా కధకుడికీ, విమర్శకుడుకీ, యముడికీ, కన్ను కప్పి కిటికీలన్నీ మూసి లోబడుతుంది. పాపం, సుందరమ్మ దిక్కుమాలిన సుందరమ్మ _ లోబడింది. అదీ వీలు లేదన్నాడు విమర్శకుడు!
    ఇప్పుడైనా యీమె యీ తాయారు నిజంగా యీ దేశపు అచ్చ తెలుగు మనిషేనని నమ్ముతారా? జీవితంలో గొప్ప సమయాల్లో under stress of great emotion ఏ దేశంనారైనా, ఏ జాతి వారైనా, ప్రవర్తనలో వారి heridity ని follow అవుతారనీ, యీ పరిస్థితులు, దేశాలూ, వేషాలూ, కులాలు, విద్య, నాగరికత, పాతివ్రత్యం యివన్నీ పై పై వ్యవహారాలనీ ఒప్పుకోవడం బాధ. బ్రాహ్మణికంలో సుందరమ్మ పర పురుషుణ్ణి అంగీకరించిందంటే ప్రజలకు యిష్టంలేదు. తాయారు పర పురుషుణ్ణి నిరాకరించిందంటే ఇష్టముండదు విమర్శకులకి. బాగా మనుషుల్ని మంచివారనీ, చెడ్డవారని, పతివ్రతలనీ, కులటలనీ, విడతీసి విమర్శించడం బాగా అలవాటయింది మనిషికి. వాంగ్మయంలోనూ, జీవితంలో కూడా, పాపాత్ములకి, పుణ్యాత్ములకి కొన్ని చిన్న అలవాట్లలో తప్ప యెక్కువ భేదం లేదంటే, తమ శౌచానికి నిక్కి గర్వించి బోర్లాపడే యీ పుణ్యలోకం ఒప్పుకుంటుందా? పాపాత్ములు తమకన్న అధములనుకునే తృప్తిని విడవగలరా పుణ్యులు? ధనవంతుడు భాగ్యభోగ్యాలని తన స్వంత సామర్ధ్యంతో సంపాయించాననీ, యితరులకు పంచకుండా తనే అనుభవించడానికి సర్వహక్కులూ, న్యాయమూ వున్నాయనుకోడంలేదూ? అట్లానే యీ నీతిపరులు తమకుతప్ప యితరులకు ఆ నీతిని పంచాలంటే చాలా ఖేదపడతారు. ఖేదపడండి. అపవాదులు కల్పించండి.

 Previous Page Next Page