Previous Page Next Page 
రెక్కలు విప్పిన రివల్యూషన్ పేజి 13


            
                                                    11
    
    కార్మికులనగా ఎవరు?
    తమ జీవితాన్ని తామే నిర్ణయించుకోగల శక్తిలేని వాళ్ళు.
    (సెన్సియర్)
    ఏడుదారాలథీబీస్ ను ఎవరు నిర్మించారు?
    రాజుల పేర్లను మాత్రమే గ్రంథాలు రికార్డు చేశాయి.
    అయితే రాళ్ళను పెకలించారా రాజులు?
    .....
    సామ్రాజ్య కేంద్రం రోమ్ ఆర్చీలమయం.
    వాటినెవరు కట్టేరు?
    .....
    ఎన్నోనివేదికలు
    ఎన్నోప్రశ్నలు
    (బెర్తోల్ట్ బ్రెక్ట్)
    విద్యార్ధులు యూనివర్శిటీలను సాధీనం చేసుకున్నారు.
    కార్మికులూ ఫాక్టరీలను ఆక్రమించవచ్చు.
    కాని అది అంత సులభం కాదు.
    విద్యార్ధులకూ, యువకార్మికులకూ మధ్య పార్టీ దేవదూతలు ఏర్పాటు చేసిన బొడ్డుతాడు ఏమంత గట్టిదికాదు. ఇప్పుడు సూర్యకాంతిలో వెలిగిన అరణ్యపత్రాలలోంచి కనిపించే సాలీడు దారం వంటిది. మెల్లగా ముట్టుకున్నాతెగిపోయేది.
    కార్మికసంఘాలు పటిష్టమైనవి. దశాబ్దాలుగా ఆక్రమించినకార్మిక శిబిరాలలో స్థిరపడినట్టివి.
    యూనియన్లు కార్మికుల కష్టాలు నివారించడానికీ, ఏనాడూ పుష్కలంగా దొరకనితిండి కోసం యజమానులతోబేరమాడడానికి ఏర్పడ్డాయి. ఇటీవల తిండితోబాటు వెన్న గురించి కూడామాటాడుతున్నారు. యూనియన్లు వెన్ననుకూడ తెచ్చుకోగలవు.
    తిండిచాలనప్పుడు కాస్తవెన్న కావాలనుకోవడంలో తప్పేమీ లేదు. ఎక్కడో దూరంలో కనిపించీకనిపించని కాలంలో కార్మికులు అధికారం చేజిక్కించుకుంటారనీ, బూర్జువాల కోసం కాక తమకోసమే ఉత్పత్తి సాగిస్తారనీ వాగ్దానం చేస్తాయి.
    ప్రస్తుతానికి తిండీ, పుక్కిటిపురాణాలూ కావలసినవారికి ఒక మిథ్యా భవిష్యత్తు, యూనియన్లు పటిష్ఠమైనవి. వాటికి పార్టీ (దన్ను) ఉంది. భవిష్యత్తుపూచీ పార్టీయే తీసుకుంటుంది.
    కాని యూనియన్లు నిజానికి చాలా బలహీనమైనవి. ఎంచేతనంటే కార్మికులలో, అనేకులు ఇటువంటి యూనియన్లలో చేరడం వల్ల ప్రయోజనం లేదనుకుంటారు. కొందరికి అలక్ష్యం, కొందరికి భయం. ముఖ్యంగా యూనియన్లలో చేరడంవల్ల పనిపోతుందనే బెంగగలవాళ్ళు. దీన్నిబట్టి యూనియన్లు చేయగలిగిందేమీలేదని రుజువవుతుంది.
    ఇంకోముఫ్ఫయి లక్షలమందివిదేశీ కార్మికులకూ పనిపోయేభయమూ, దేశంనుంచి వెళ్ళగొడతారనేభయమూ ఉంటాయి. ఏమనగా వాళ్ళకి ఫ్రెంచి భాషరాదు. ఫ్రెంచివారి పనుల్నివీళ్ళు తీసుకుంటారనేమనస్తాపాలు కూడా ఉంటాయి.
    కొంతమంది (వీరి సంఖ్య అంత ఎక్కువకాదు) కార్మిక సంఘాలు తమకువెలగబెట్టిందేమీ లేదనుకుంటారు. వీళ్ళు అంటరానివాళ్ళు.
    కాబట్టి, ప్రతీ అయిదుగురిలో ఒక్కడే యూనియన్ లో చేరుతాడు - అధికసంఖ్యాకులు సి.జి.టి. (కమ్యూనిస్టు) లోను, అందులో సగం మంది సి.యఫ్.జి.టి. (కేథలిక్కు వామపక్షం)లోనూ.
    కనుకయూనియన్లు పటిష్ఠమైన, బలహీనమైనవి కూడాను.
    ఎక్కడ ముఖ్యమో అక్కడే అవి అత్యంత దుర్భలం. యువ కార్మికులకు వాటిమీద అట్టే ఇష్టంలేదు. తలచగానే సమ్మెలకు పిలుపిస్తారు- పనికాలం విషయమైఒకనాడు, పైసలకోసం ఆ మరునాడు, చిరాకుల వల్లా డబ్బు చాలకపోవడంవల్లా, బ్రతుకు దుర్భరంకావడం వల్లా, ఛోటా యజమానులు దగుల్భాజీలు కావడం వల్లా కార్మికులు విజ్రుంభిస్తేయూనియన్లు వాళ్ళనిచల్లారుస్తాయి. పలుకుబడి ఉపయోగిస్తాయి. సాచివేతచర్యలు చేస్తాయి. అప్పుడప్పుడు జడిపిస్తాయి.
    యువకార్మికులకు యూనియన్ల మీద ఏమీ మోజులేదు.
    వీళ్ళంటే యూనియన్లకు భయం. ఎందువల్ల వీళ్ళకి పనులుపోతాయనే భయంలేదు. ఇదికాకపోతే ఇంకొకటి. అసలే లేకపోయినా ఫరవాలేదు. ఫాక్టరీలలోదొరికేదే తక్కువ. నేరాలు చేసినవాళ్ళమీద ఎప్పుడూ నిఘా ఉంటుంది.
    అన్నిటికన్నా "అడవి పిల్లి" సమ్మెలంటే యూనియన్లకి అసహ్యం. మంటల్లాగ ప్ర్రారంభమయ్యే సమ్మెలు. ఎప్పుడూ వీటిని యువకులే ప్ర్రారంభిస్తారు.
    యూనియన్ సభ్యులనేకులు యువకులు కారు. సమ్మెల అనుభావం బాగా ఉంది. ఫాక్టరీలలో ఏళ్ల తరబడి జీవితం గడిపి, ఒక్కొక్కప్పుడు కష్టమే అయినా యూనియన్ లో చేరవలసిన అవసరాన్ని గుర్తించినవాళ్ళు. కార్మికులకు ఒక సంస్థ అంటూ ఉండాలి. కాబట్టి సంఘంలో చేరుతారు -రోజురోజుకూ వాళ్ళని రక్షించడానికీ, సమ్మెలువస్తే (ఎప్పుడు?) సంఘటితపరచడానికీ; అందరినీ సమ్మెలోనికి చేర్చడం కష్టమనికార్మికుడికి తెలుసును. ఎప్పుడూ కొంతమంది యజమానులపక్షాన ఉంటారనీ తెలుసును. పికెటింగుకు ఐక్యత కావాలి. కొందరు సమ్మెలో చేరకపోయేసరికి యజమానులకుధైర్యం వచ్చి పోలీసులను పిలుస్తారు.
    మరికొందరుభయం వల్లజారుకుంటారు. అంతటితోనువు ఓడిపోయినట్లే. యూనియన్ అభికారులు యజమానులతో చర్చలయినా చెయ్యరు. యూనియన్ మనిషి పరాభవంతో పనిలోకి పోతాడు- అదీ సమ్మెలో మరీచురుకుగా పాల్గొన్నందుకుబర్తరపు కాకుంటే! ఇకపార్తీ మాటో? ఇతర వర్గాల నుంచి ఎక్కువ సహాయం పొందడానికి పార్టీ కృషి చేస్తుంది. ఎన్నికల్లో బలపడడానికి అడుగునుంచి (లేకమీదనుంచే) పరిస్థితులు మార్చడానికి.
    కాని ఇన్ని సంవత్సరాలుగా ఈ ఆట ఆడుతుండడంతో పార్టీలో వేడి చల్లారినట్టుంది. సోషలిజాన్ని నిర్మించిన రష్యా ఉండనే ఉంది. అది ఇంచుమించుస్వర్గంగా లేకపోయినా, అన్యాయాన్ని అరికట్టింది. ఏమైనా అక్కడ కార్మికులకు పూర్తివాటా దొరుకుతుంది. (పూర్తి? వాటా?) యూనియన్ సభ్యులు ఫాక్టరీ జీవితం వల్లమోటబారి పోయారు. సందేహాలు లేకపోలేదుగాని బ్రతుకు వెళ్ళమారిపోతోంది. రోజంతా పనితో అలిసిపోయి చేపలు పట్టడానికీ, చీట్లాటలకో, సారాకొట్లకో వెళ్ళిపోతూఉంటారు. యూనియన్లూ, పార్టీ బలిష్టమైనవేకాని బలహీనమైనవికూడా. అందులో గట్టివాళ్ళుచెయ్యవలసిందిసరిగా చెయ్యడంలేదని అకస్మాత్తుగా నిష్క్రమిస్తారు. అప్పుడు యింకా, కుర్రాళ్ళు వస్తారు-ఇంకా, ఇంకా అశాంతితో.
    వీళ్ళు వామపక్షాలకు చెందినవాళ్ళు.
    విద్యార్ధి వ్యవహారాలనే తీసుకుందాం. విద్యార్ధులు సౌకర్యాలన్నీ అమరినవాళ్ళ కొడుకులు వాళ్ళు ప్ర్రారంభించినప్పుడెవరూ అంతగా పట్టించుకోలేదు.

 Previous Page Next Page