` గబగబా లోనికి పరుగెత్తింది.
"రవి...రవి...."
బెడ్ రూమ్ ల్తెట్ వేసి పిల్చింది రవిచంద్రను.
మగతగా కళ్ళిప్పాడు రవిచంద్ర.
"రవి...మీ పాదర్ ని ఎవరో మర్డర్ చెసార్ట...."
ఆ మాటకు....
రవిచంద్ర, దబ్బున కూర్చున్నాడు. ముందు నమ్మలేదు.
"ఈజిట్....ట్రూ....."
"ఎస్....రవి..." తనకొచ్చిన ఫోన్ కాల్ గురించి చెప్పాడు అనిమిష పక్కనే నిల్చున్న పుష్పక్.
రవి ఏ మాత్రం ఆలస్యం చెయ్యలేదు.
ఆ న్యూస్ ను కన్ ఫర్మ్ చేసుకోవడం కోసం, ఎవరికో ఫోన్ చేసాడు
మూడు నిమిషాల తర్వాత___
రిసివర్ని ఫోన్ మీద పెట్టేస్తూ రవిచంద్ర నవ్వాడు....
"హరికృష్ణమనాయుడు మర్డర్ డ్ .... నాజివితాశయం.... నేరవేశ బోతుంది. అనూ....డియర్....గుడేడ్ స్టార్ట్ డ్ ....హియర్...ఎస్ ...." అంతులేని, ఆనందంతో రవిచంద్ర ముఖం వెలిగిపోతోంది....
"నేను అర్జంటుగా మద్రాసు వెళ్ళాలి. నువ్వు మార్నింగ్ ప్లయిట్ లో మద్రాసురా .....ఓకే " గబగబ, డ్రస్ వేసుకుంటూ అన్నాడు రవిచంద్ర
"సిస్టరూ నేనూ కల్సోస్తాం. రవి ముందు నువ్వెళ్ళు....."పక్కనే ఉన్న పుష్పక్ అన్నాడు.
మరో ఐయదు నిమిషాల్లో___
సూట్లోంచి బయటికొచ్చాడు రవిచంద్ర.
కారెక్కబోతున్న రవిచంద్ర చెవిలో___
"నా బర్త్ డే గిఫ్ట్ గురించి మర్చిపోవు కదూ...."గుస, గుసలాడింది అనిమిష.
"ఇకనుంచి కోట్ల ఆస్తిమనది డోన్ట వర్రి..." హేపిగా ఆమె బుగ్గను గిల్లుతూ అన్నాడు రవిచంద్ర.
కారేళ్ళిపోయింది.
హుషారుగా సూట్లోకొచ్చింది అనిమిష.
సోఫాలో కూర్చుని బాటిల్ ని ఓపెన్ చేస్తున్న పుష్పక్ పక్కన కూర్చుని_
"రవిచంద్ర డాడిని....ఎవరు మర్డర్ చేసుంటారంటావ్...." ఆసక్తి గా అడిగింది.
గ్లాసులో డ్రింక్ పోసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకుని, డ్రింక్ సిఫ్ చేస్తూ__
అనిమిష కళ్ళల్లోకి సూటిగా చూస్తూ__
"ఎవరో చెప్పమంటావా...." సీరియస్ గా అన్నాడు పుష్పక్ .
"నీకు తెలుసా...."ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని అడిగింది.
"ఎవర్తో....చెప్పానంటే చెప్తాను...."సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు.
"చెప్పు...."
"నేనే...."గ్లాసులోని డ్రింక్ ను ఒకేసారి తాగేస్తూఅన్నాడు పుష్పక్.
ఆ మాటకి నవ్వింది అనిమిష .
"లేకపోతే....మరేంటి....ఎలాగోలా ....రవిచంద్ర కొస్తుంది. ప్తెసలు మనకోస్తాయి. ముందు ముందు చాలా మార్పులు జరుగుతాయి. కాబట్టి రవిచంద్ర ను జాగ్రత్తగా ని గుప్పిట్లో ఉంచుకో....అండర్ స్టాండ్ ....."
"అంటే రవిచంద్రను పెళ్ళి చేసేసుకొమ్మని అడిగేమంటావా...." సీరియస్ గా అడిగింది అనిమిష.
తన వళ్ళోకి లాక్కుని, ఆమె గుండెమీద చేయస్తూ.
"అంటే....రవిచంద్రను పెళ్ళి చేసుకోవాలని ఉందా నీకు...."
"ఉందని కాదు ఉంటే అన్ని విధాలుగా నీకు పనికొస్తుందని...."
"చూడు అనూ. రవిచంద్రను ఎందుకు పట్టుకున్నానో, నిన్ను ఎరగా పెట్టి ఎందు కాడిస్తూన్నానో నీకు తెల్సు పిచ్చి, పిచ్చిగా ఆలోచించి నాకేసరు పెట్టడానికి టై చేశావనుకో మళ్ళి నువ్వు కేబరేడాన్సర్ గానేబతకాల్సి వస్తుంది. గుర్తుంచుకో...."
"నేనేపన్నానని నీకంత కోపం. పుస్జ్పడియర్....నువ్వెలా ఆడమంటే, అలా ఆడుతున్నాను కదా...." గోముగా అతని చెంపల్ని నిమురుతూ అంది.
పుష్పక్ శాంతించాడు.
అనిమిషని సిస్టర్ అని పిల్చి , తనదగ్గర కుక్కలా పడుండే పుష్పక్ నిజానికి ఎవరో రవిచంద్రకు తెలిదు అనిమిష పుష్పక్ ల మధ్య ఉన్న సంబంధం గురించి కూడా రవిచంద్రకు తెలిదు.
నాయూడూ ఎస్టేట్స్ అనే ఆరువందల కోట్లు కలిగిన ఎంప్తేర్ కు, తనే మహారాజు కావాలని రవిచంద్ర చిరకాలపుఆశ. కానీ అదే ఆశతో ఇంకొంతమంది ఉంటారని రవి చంద్ర లాంటి వాళ్ళు ఊహించలేరు. అలాంటి ఆశతో బతుకుతున్న వాడు, అందుకోసం తన ఆశయాన్ని దక్కించుకోవడం కోసం, ఏవ్తేనా చెయ్యడానికి సిద్దంగా ఉన్నావాడు పుష్పక్ !
సమయం కోసం ఎదురు చూస్తున్నాడు పుష్పక్... అందుకే అనిమిష కూడా అతనితో చేతులు కలిపింది-
కానీ__
నాయుడు ఎంప్తేర్ కి పుష్పక్ గల సంబంధం ఏమిటి? దానికి మాత్రం అనిమిష దగ్గర జవాబు లేదు.
పుష్పక్ మనసులోనే దాగున్న రహస్యం అది!
* * *
అహమ్మదాబాద్ లోని__
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ కు చెందిన లేడిస్ హాస్టల్.
ఉదయం ఏడుగంటల్తెంది.
అమ్మాయిలందరూ, బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారు వారిలో ముక్తానంద కూడా ఉంది.