Previous Page Next Page 
డింగ్ డాంగ్ బెల్ పేజి 12

    మృదువనిలో ఇంకా అందోళన తగ్గలేదు. ఎప్పుడు, ఎవరు తనని గమనిస్తారేమోనన్న భయం.. భుజాన హ్యండ్ బ్యాగ్ తో నడుస్తోంది. డిఫెన్స్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలోబట్టలు ఏమీ తెచ్చుకోలేదు. అల జనరల్ బజార వైపు వెళ్ళి చిదేదార్లు తెచ్చుకోవాలనుకుంది.

    సరిగ్గా అప్పుడే...

                                                                                       ***

    ప్యారడైజ్ ముందు నిలబడి తీ తగి ఐడియా ఏమైనా నీ బ్రెయిన్ లో ప్లాష్ అయిందా?" రాహుల్ అడిగాడు.

    చేతన నీరసంగా అంకిత్ వైపు చూశాడు.

    "చూడండి సార్... తోజూ మీ వెంటే ఈ కెమెరా పట్టుకుని తిరగడం నా వల్ల కాదు. నాకిప్పుడే ఐడియా ప్లాష్ అవుతుందో... అని చెప్పి, మీరు నేన్ను ట్వంటీ ఫోర్ అవర్స్ మీదగ్గరే అట్టిపెట్టుకున్నారు..." దీనంగా అన్నాడు చేతన.
 
    "జీవితంలో ఏదైనా సాదించాలనుకుంటే, ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదు... అయినా శవాలకు ఫోటోలు తీసే నిన్ను కెమెరామెన్ ని చేశాను. ఆ మాత్రం కృతజ్ఞతా లేకపోతే ఎలా... ఇప్పుడు నాకో బ్రిలియంట్ ఐడియా వచ్చింది..." ఉత్సాహంగా అన్నాడు అంకిత్.

    "ఏమిటి సార్ అది?" నీరసంగానే అడిగాడు చేతన్ .

    అంకిత్ రాహుల్ వైపు చూసి..."ఒరే రహువూ... నువ్విప్పుడు ఎదురుగా, స్టయిల్ గా గర్ల్ ప్రెండ్ తో మాట్లాడుతూ,ఒళ్లూ,సయీ తెలియకుండా చొంగ కారుస్తున్న ఆ మానవుడి వెనక జేబులో రెక లెస్ గా వున్న పర్సును తీసుకుని పరుగెత్తు."

    "ఆ.. పరిగెత్తే?" అనిమనంగా అడిగాడు రాహుల్.

    "జనం రియాక్షన్ ఎలా ఉమ్తుమ్దావు చూద్దాం జనంలో ఎవర వేస ని అబ్జర్వ్ చేద్దాం.. అదీకాక, గర్ల్ ప్రెండ్ వుంది కదానని... కనీసం పర్సును జాగ్రత్తగా దాచుకోకుండా వుండే అతని ఫీలింగ్ తెలుస్తుంది. జనం రియాక్షన్ తెలుస్తుంది... చేతన నువ్వు కెమెరామెన్ తో రెడీగా వుండు..."

    "బాసూ... చిన్న చేంజ్..." అన్నాడు రాహుల్.

    "ఏమిటి... పర్సు కాకుండా, అతని మేడలో గొలుసు కజేస్తావా? నీ ఇష్టం చాయిస్ నీదే..." ఉత్సాహంగా అన్నాడు అంకిత్.

    "నువ్వు పర్సు లాగేసుకొని పారిపో... నేను ఆ దృశ్యాన్ని పిక్చరైజ్ చేస్తా ఆశగా అడిగాడు రాహుల్.

    సీరుయాస్ గా చూశాడు అంకిత్.

    "అలా చూడమకు బాసూ... నేను పర్సు లాక్కొని పారిపోతుంటే, జనం నన్ను చితగ్గొట్టి?" డౌట్ గా అడిగాడు.

    "అప్పుడు ఇది మాటీవి ఛానల్ ప్రొగ్రం అని చెబుతాలే."

    "నిజంగా ఏమీ కాదంటావా బాసూ?"

    "హండ్రెడ్ పర్సెంట్... అయినా సాహసం చేయల్రా... లేకపోతే జీవితంలో పైకి రాలేవు."

    "హూ... సాహసం చేసేది నేను కదా... భయం నకుమ్తుమ్ది కానీ, నీకెందుకుంటుంది" అన్నాడు రాహుల.

    "నథింగ్ టు వర్రీ... నేనున్నానుగా" అంటూ అభయ హస్త మిచ్చ్హాడు అంకిత్. చేతన కెమెరా రెడ్ చేసుకుంటున్నాడు.

                                                           ***

    అతని వయసు పాతిక, ముప్పయి మధ్య ఉంటుంది. అతని ఎదురుగా అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి గర్ల్ ప్రెండ్ కూడా కాదు. గంట క్రితమే బస్టాప్ లో పరిచయమైంది.

    'హాలో' అంటే 'హలో' అనుకున్నారు.

    ఆ అమ్మాయి గోముగా "తీ తగిస్తావా?"  అని అడిగింది.

    అతను ఏకంగా చికెన్ బిర్యానీయే తినిపించాడు. ఉదయమే అతని భార్య సాయంత్రం వచ్చేపుడు కూరగాయులు తీసుకురంమంటే  ' నాకింకా వేరే పనీ లేదనుకున్నవా?' అని కసురుకున్నాడా జీవుడు.

    పావురుగంతి పుల్లకూరాలా, గర్ల్ ప్రెండ్ అనే 'పిల్లకూర' రుచి చూసి లొట్టలు వేస్తున్నాడు. స్టయిల్ గా క్రాప్ సరిచేసుకుంటున్నాడు. ఓవర్ ఎమోషన్ అవుతున్నాడు. సిగిరెట్ పొగను రిగులు రింగులుగా వదులుతున్నాడు. సకల పైత్యలూ అభినయిస్తున్నాడు. దూరంగా వ్యాన్ లో నుంచి ఆ ఫీలింగ్స్ నీ, అతని వేషాలను చేతన ఘాట్ చేస్తున్నాడు.

    అంకిత్, రాహుల్ వైపు చూసి, బోటనివేలిని థమ్స్ అప్ సైన్ లా చూపించి 'ప్రోసిడ్' అన్నాడు.

 Previous Page Next Page