Previous Page Next Page 
రెక్కలు విప్పిన రివల్యూషన్ పేజి 12


    జెండాలు రెండు - ఎర్రవి, బూర్జువాలను భయపెట్టడానికి; నల్లనివి, బూర్జువాభ్రుత్యులనుఅనగా జేబులో సభ్యతపు కార్డూ, హృదయంలో పోలీసు పతకం ఉన్న కమ్యూనిస్టులను భయపెట్టడానికి.
    డెన్ఫర్ వద్ద పార్టీలూ, యూనియన్లూ ఎందుకు చెదిరిపోయిందీ కమ్యూనిస్ట్ కటాలావివరిస్తాడు. "కమిటీలనిర్ణయం అది. అంతకుమించి ముందుకు వెళ్ళడానికి కమిటీలు అనుమతించడంలేదు."
    కమ్యూనిస్టువిద్యార్ధి యూనియన్ కార్యదర్శి కటాలా.
    "పదిలక్షల మంది  ప్రజలకి అసాధ్యమనేదిలేదు. వస్తూన్నవిప్లవాన్ని వద్దంటారు మీరు. ఏమంటే కమిటీలు విప్లవాన్ని మంజూరుచెయ్యలేదంటారు" అంటాడు కాన్ బాందీ.
    ప్రదర్శనశాలలో క్రిక్కిరిసిన ప్రేక్షకులలోకోలాహలం.
    "ఔనునిజం కామ్రేడ్ ఔనునిజం"
    పాఠ్యభవనాలలో, వాటి ముందు వసారాలలో, ఒకప్పుడు నిశ్శబ్దంగా ఉన్న ఎన్నెన్నో ప్రాంగణాలలో, మీది అంతస్తులలోకివెళ్ళే మెట్లమీద, వరండాలలో, హాలుల్లో - జనం.
    సోర్భాన్ మాసిపోయిన, చల్లబడినగోడలు, ఏడు శతాబ్దాలవయస్సు.
    ప్రజలు, సరికొత్త ప్రజలు వీధి పోరాటాల వల్ల, మానసిక సంఘర్షణలవల్ల కొద్దిగా అలిసిపోయినవాళ్ళు, అందరిలోనూ ఏదో అశాంతి. ఉపన్యసించాలని ఉబలాటం.
    తటస్థపుగోడల మీద ఎడతెగనిరాతలు.
    "భావనా శక్తికే అధికారం"
    అధికారాన్ని హస్తగతం చేసుకుంటోంది భావనాశక్తి.
    సుదూరక్షితిజరేఖల్లో విజ్రుంభిస్తోంది. తిరిగి వచ్చి మనుష్యులకు జరిగిన కథ చెబుతోంది.
    తెల్లని యెర్రని, నల్లని పెయింట్లు.
    చెరువుల్లో రాళ్ళు చిన్న చిన్న కెరటాలు.
    "నా ఆశలే వాస్తవికత. ఎంచేతంటేనా ఆశల వాస్తవికతను నమ్ముతున్నాను. "(వ్రాసినవాడి పేరు లేదు.) 1968.
    1905- 1917- 1936 విప్లవాలు. మయకోవస్కీ తెలుసా?
    ఈ సాయంత్రం డిగోల్ బుఖారెస్ట్ కు వెళుతున్నాడు. అక్కడ ఉన్న మతాధికారవర్గాలలో స్నేహితులున్నారతనికి.
    నక్షత్రసమూహాల్లాగకవులు. తిరిగిపోయేతలల్లో ఆకారం ధరిస్తున్నాయిమాటలు.
    ఆకాశాల్లోదారి తప్పిన బాణాలు.
    "కళమరణించింది. తినకు దాని శవాన్ని."
    విప్లవంచరిత్ర చేసుకునేపండుగ.
    "అసంపూర్ణంగా విప్లవాన్ని వదిలేవారు తమ సమాధులనుతామే తవ్వుకుంటారు."
    గందరగోళపరిచేవ్రాతలు కొన్ని చాలా పురాతనమైనవి.
    "ప్రాకారపు నీడలో స్పష్టంగా స్వేచ్చగా ఆలోచించడం ఎలా?"
    "వినిమయవస్తువులు ప్రజలపాలిటి నల్లమందు."
    ప్రధానముఖద్వారం వద్దమే కమ్యూన్ శాసనం: "నిషేధించడాన్ని నిషేధించడం." 1968మే. ఇంకాజనం. కలిసిమెలిసి తిరగాలన్న ఆకాంక్ష. మనసు లోనిది బయటపెట్టాలన్న ఆరాటం.
    ఆరంభంలో మాట.
    మాటతో సృష్టి ప్రారంభమయిందని చెబుతోంది బైబిల్. తర్వాత తర్వాత సుదూరాలకు మాటల్నిపంపించే సాధనాలువచ్చాయి. స్ఫటికహస్తాల ఆజమాయిషీకింద. అప్పుడు ప్రజలు తమకు తామే నీడలయారు. ఇక్కడ, ఇప్పుడూ కాని అంతరిక్షంలో తేలియాడే ఆకారంలేని రూపాల ప్రతిబింబాలయారు.
    సుతారపుమాటలూ, పాటలూ, అశరీర వాణులు, సరాంతర్యాములు ఓదార్చుతూ, విసిగిస్తూ, మెత్తని అసత్యాలు గొణుగుతూ, కాలాన్ని నింపుతూ, మనస్సులోనిండుతూ.....
    "క్రూరత్వాన్నిఆరాధించుదాం" అంటుందొకగోడ.
    "ఆఖరిసర్కారుద్యోగి ప్రేవుల్తో ఆఖరి పెట్టుబడిదారుని ఉరి తీసినప్పుడు మానమజాతి సుఖపడుతుంది" అని ఇంకో గోడ జవాబిస్తుంది.
    ప్రదర్శనశాలకు ప్రవేశించేచోట, కుడితట్టు స్తంభంమీద అప్పుడే వ్రాసేశారొకసస్తి వాచకం:
    "ముందుకు పరుగెత్తు, కామ్రేడ్, పాతప్రపంచం నీ వెనకపడిపోయింది."
    రేయిచీకటి మూలల్లోకి వెనుకంజ వేసింది. ఈ రేయి, అక్కడ ఆకారాలు సేదదీరుతున్నాయి-కదలికలనూ, అలజడులనూలక్ష్యం చెయ్యకుండా. తట్టుకొని నిలిచినవాళ్ళు నూతన రూపాలు ధరించిన తమ కొట్ట సహచరులమొగాలలో జరాలు చూస్తున్నారు.
    విద్యాలయప్రాంగణంలో చర్చిపక్క ఒక పెద్ద పియానోషాపాన్ సంగీతాన్ని వాయిస్తోంది. ఉదయం వస్తోంది, మరో దారంట.
    ఉదయం మద్యాహ్నం కాబోయే వేళకి పియానో జాబ్ సంగీతం అందుకుంది. డిగోల్ రుమేనియా చేరుకున్నాడు.
    శాసనసభలో ప్రధాన మంత్రిసహకారం గురించి మాట్లాడుతున్నాడు.
    స్ప్రాస్ బర్గ్ యూనివర్శిటీ సాతంత్ర్యాన్నీ, సయంపరిపాలననూ ప్రకటించింది.
    పారిస్ ఒక పెద్ద కటాహం.
    సోర్భాన్ నాభి.
    ఎడమ పక్షపు పార్టీలు అభిశంసన తీర్మానాన్ని ప్రతిపాదించాయి.
    "శానస సభ  చెత్త కబుర్లు చెప్పుకునే చోటయినప్పుడు కబుర్లు చెప్పుకునేచోట్లన్నీ శాసనసభలవుతాయి. "గోడ మీద వ్రాత.
    బుధవారం సాయంత్రం విఫల మేధావులూ, సానుభూతి పరులూ ఓడియాన్ థియేటర్ ను ఆక్రమిస్తారు. నల్లజెండా, ఎర్రజెండా ప్రతిష్టిస్తారు. విద్యార్ధులకు, కార్మికుల కూ ఉచిత ప్రవేశమని ప్రకటిస్తారు. తక్షణ చర్చలకూ, బహిరంగప్రకటనలకూ స్థానమైన ఈ చోటికి చాలామంది బూర్జువా తరగతులవారు వస్తారు. థియేటరామతా ప్రేక్షకులు, ఇది ప్రజావిజయమని స్పష్టమే. బ్రహ్మాండమైన ప్రదర్శన కాకపోవచ్చు గాని అప్పుడప్పుడు గొప్పతనం మెరుపులా మెరుస్తోంది.
    మాట్లాడాలనే దాహానికి నీళ్ళుదొరికాయి.

 Previous Page Next Page